sitarannayak
-
విద్యార్థుల్లో ఆలోచనా విధానాన్ని పెంపొందించాలి
చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హన్మకొండ చౌరస్తా : ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అందులో భాగంగానే రూ.50వేల కోట్లు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ లోని మిషన్ ఆస్పత్రి ఆదివారం పునఃప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ సామాజిక తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మిషన్ ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి పాటుపడతాన ని అన్నారు. ఆస్పత్రి భూముల ఆక్రమణ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పును ఇరు వర్గాలు శిరసావహించాలని సూచించారు. వివాదంలో ఉన్న భూమి ఎవరికి వచ్చినా వైద్య సేవలందించేందుకు సహకరించాలని కోరా రు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ పేదలకు సేవలందించే ఆస్పత్రి భూమిని కబ్జాచేసిన వారిని జైలుకు పంపించాలన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, ఆయనకు అందరం సహకరిస్తే త్వరలోనే బంగా రు తెలంగాణ సాకారమవుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని కేసీఆర్ వదలరని, అందుకు గురుకుల్ ట్రస్టు నిర్మాణాల కూల్చివేతే నిదర్శనమని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అంత కు ముందు సీబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థలను చేశారు. కార్యక్రమంలో త్రినగర క్రైస్తవ సహవాసం అధ్యక్షుడు కురియన్, టీసీఎఫ్ అధికార ప్రతినిధి డాక్టర్ పల్లెపాడు దామోదర్, సీబీసీ చర్చి పాస్టర్ నిరంజన్‌బాబు, ఇమ్మానియల్, సుధాకర్, జాన్సన్, యాకోబ్, టి.పాల్, జోసఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్యను క్రైస్తవ సంఘాల బాధ్యులు సన్మానించారు. రోగుల భాగోగులు తెలుసుకున్న రాజయ్య సాయంత్రం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించిన డిప్యూటీ సీఎం రాజయ్య రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నా రు. సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఆస్పత్రిని రెండు వందల పడకలకు విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు ఉన్నారు. సమగ్ర సర్వేతోనే అర్హులకు ప్రయోజనం : డిప్యూటీ సీఎం చిల్పూరుగుట్ట(స్టేషన్‌ఘన్‌పూర్) : సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే అర్హులకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని చిల్పూరు ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19న నిర్వహించే సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మొత్తం 84 లక్షల కుటంబాలున్నాయని, వీరికోసం గత పాలకులు 1996లో మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే, 2002లో బీపీఎల్ సర్వే, 2005లో సోషల్ఎకనామిక్, 2011, 2013లోనూ సర్వేలు నిర్వహించి 55లక్షల ఇండ్లు, 71లక్షల మందికి పింఛన్లు, కోటి 10లక్షల మందికి రేషన్ కార్డులిచ్చారని అన్నారు. ఆయా ప్రభుత్వాల్లో అనర్హులు లాభపడగా పేదలు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏగ్రామంలోకి వెళ్లినా ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అడుగుతుండడంతో సీఎం కేసీఆర్ సమగ్ర కుటంబ సర్వే కార్యక్రమానికి స్వీకారం చుట్టారని వివరించారు. సర్వే రోజు తానుకూడా నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. మంత్రి పదవితోపాటు ఉపముఖ్య మంత్రి పదవి ఇచ్చినందున 10 జిల్లాల్లో తిరగడం వలన నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలోనూ, మరొక రోజు నియోజకవర్గం లోని ఏదోఒక మండలంలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు. -
నేడు బంద్
కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన గిరిజనులను ముంచే చర్య సరికాదు బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు వరంగల్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ గురువారం బంద్ నిర్వహిస్తున్నట్టు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ, చంద్రబాబు, సమైక్య కోటరీ కలిసి తెలంగాణ ప్రజల గుండెల్లో బాకులు దించుతున్నారని మండిపడ్డారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ జాతీయ గిరిజన విధానానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్యతిరేకమన్నారు. 1/70 చట్టం, మీసా, అటవీ హక్కుల చట్టం, గిరిజన సలహా మండలి నిబంధనలను తుంగలో తొక్కి.. ఏడు మండలాలను ముంచేందుకు చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాజ్యంగ హక్కులు కోల్పోతుంటే రక్షించాల్సిన గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రకృతి పూజారులను పశువుల మాదిరిగా భావించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగులు ఆప్షన్లు కోరుతున్నారని.. కానీ, వందేండ్లు కలిసి ఉన్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొడుతుంటే స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమస్యపై భద్రాచలంలో ఉద్యమిస్తామన్నారు. ఆంధ్రా పాల కుల కుట్రలను వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ నగర కమిటీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్ చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడుకుంటామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్రావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఇంత హడావుడిగా ఆర్డినెన్స్‌ను తేవాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, చింతం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బంద్‌కు జేఏసీ మద్దతు వరంగల్ : పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ గురువారం జరిగే తెలంగాణ బంద్‌కు సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. గిరిజనులను ముంపునకు గురిచేసే ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, ఏడు మండలాలను కలిపే చర్యలను వెంట నే ఉపసంహరించుకోవాలని కోరారు. బంద్‌లో జేఏసీలు భాగస్వామ్యం కావాలని కోరారు. బంద్‌లో పాల్గొనాలి: వినయ్ నేటి బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ కోరారు. గిరిజనులను నిరాశ్రయులను చేస్తున్న వైఖరిని వ్యతిరేకించారు. తెలంగాణ టీడీపీ, బీజేపీ నా యకులు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. రాజ్యం గబద్ధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్డినెన్స్పేరుతో కొత్త విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. బంద్ కు సీపీఎం మద్దతు హన్మకొండ సిటీ : గురువారం జరగనున్న తెలంగాణ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని సీపీఎం జిల్లా కార్యాదర్శి జి.నాగయ్య తెలిపారు. బుధవారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జి.నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర సరిహద్దులను మార్చేముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదన్నారు. కార్యదర్శివర్గ స భ్యులు సూడి కృష్ణారెడ్డి, కె .వెంకటయ్య, ఎస్.వాసుదేవరెడ్డి, సీహెచ్.రంగయ్య, ఎం.చుక్క య్య, జి.ప్రభాకర్‌రెడ్డి, సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీపీఐ కూడా.. హన్మకొండ చౌరస్తా : పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలుపుతు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం జరిగే బంద్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జిల్లా సమితి కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. 205 గ్రామాలను ఆంధ్రాలో కలపడం దారుణమని పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. -
ప్రొఫెసర్..బరిలోనే
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇరవై నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ఏ.సీతారాంనాయక్ దాఖలు చేసిన నామినేషన్‌ను అంగీకరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసు తెలిపారు. జిల్లాతో పాటు తెంగాణవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదీ.. గొడవ వరంగల్‌లోని కాకతీయూ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఏ.సీతారాంనాయక్ తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధిగా ఉన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరగా... జేఏసీ ప్రతినిధుల కోటా కింద ఆయనను మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన చివరి రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఈనెల 10వ తేదీన నామినేషన్ల పరీశీలన క్రమంలో సీతారాంనాయక్ అభ్యర్థిత్వంపై మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కేంద్ర సహాయ మంత్రి బలరాంనాయక్ ఆర్ఓ వద్ద అభ్యంతరం లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి వేతనం పొందుతూ లాభదాయక పదవిలో ఉన్న సీతారాంనాయక్ ఆ పదవికి రాజీనామా చేయకుండా నామినేషన్ వేశారని.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయన చెల్లదని పేర్కొంటూ తిరస్కరించాలని ఫిర్యాదు చేశారు. దీంతో నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరుపక్షాలను పిలిచిన ఆర్ఓ.. ఇరువురు తమ వద్ద ఉన్న ఆధారాలతో శుక్రవారం సాయంత్రం 5గంటలకు రావాలని సూచించారు. కలెక్టరేట్‌కు హైకోర్టు న్యాయవాదులు ఎవరికి వారు తమ వాదన నెగ్గించుకునేందుకు హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపారు. బలరాం నాయక్ తరపున పట్టాభిరామారావు, సీతారాంనాయక్ తరఫున జె.రాచందర్‌రావు వాదనలు వినిపించారు. ఇలాంటి సందర్భాల్లో అభర్థులకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వారిద్దరు ఆర్ఓ ముందు ఉంచగా.. స్వతంత్య్ర ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారు ఎన్నికల్లో పోటీకి అర్హులేనని సీతారాంనాయక్ తరఫు న్యాయవాది రాంచందర్‌రావు వివరించారు. ఆయన వాదనతో ఆర్ఓ, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఏకీభవిస్తూ సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం నుంచి హైడ్రామా టీఆర్ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్‌కు సంబంధించి అభ్యర్థిత్వంపై ఫిర్యాదు చేసిందికేంద్ర మంత్రి కావడంతో జిల్లా అధికారులు కాస్త సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో గురువారం సాయంత్రం విచారణ చేపట్టకుండా శుక్రవారానికి వాయిదా వేశారు. అలాగే, విషయాన్ని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకు వెళ్లారు. అక్కడినుంచి సమాచారం వచ్చేలోగా నామినేషన్‌పై అభ్యంతరాలు లేవనెత్తిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి తోడు శుక్రవారం ఉదయం నుంచి తమ వకాలత్ నామా స్వీకరించాలని సీతారాంనాయక్‌తో పాటు ప్రత్యర్థి వర్గం వారు ఆర్ఓపై త్రీస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆర్ఓ నిరాకరించి అభ్యంతరం మాత్రమే స్వీకరిస్తామని, విచారణ తర్వాతేనిర్ణయం ప్రకటిస్తామని స్పష్టచేశారు. అలాగే, తమ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సూచించడంతో అందరూ సాయంత్రం 4గంటలవరకు ఎదరుచూశారు. ఎట్టకేలకు 4.30నుంచి సుమారు రెండు గంటల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి బసు.. సీతారాంనాయక్ నామినేషన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సీతారాంనాయక్ వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, న్యాయవాదుల జేఏసీకి చెందిన నబీ తదితరులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. న్యాయమే గెలిచింది.. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన తనను ఎన్నికల్లో ఎదుర్కోలేకే దొంగదారిలో దెబ్బ తీసేందుకు బలరాం నాయక్ యత్నించారు. అయితే, తెలంగా ణ ఉద్యమం మాదిరిగానే ఇక్కడ కూడా న్యాయమే గెలిచింది. నర్కసంపేటలో కూ డా జేఏసీ నేతకు టికెట్ ఇస్తే బలరాంనాయక్ అడ్డుకున్నారు. మంత్రి గా ఉండి భద్రాచలం ప్రాంతంలోని మండలాలు సీమాంధ్రలో కలిపేందుకు సహకరించిన బలరాంనాయక్ మళ్లీ గెలిపిస్తే పూర్తి భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయం. - సీతారాంనాయక్