sivaji park
-
వందేళ్ల శివాజీ పార్క్: ఎన్నికల ప్రచారానికి నిబంధనల షాక్!
వందేళ్ల చరిత్ర: శివాజీపార్క్ మైదానానికి సుమారు వందేళ్ల చరిత్ర ఉంది. ముంబై నడిరోడ్డున దాదర్ ప్రాంతంలో ఉన్న శివాజీపార్క్ మైదానం 1925లో బీఎంసీ ప్రజల కోసం అందుబాటులోకి తెచి్చంది. అప్పట్లో ఈ మైదానాన్ని మాహిం పార్క్‌గా పిలిచేవారు.సుమారు లక్షా మందికిపైగా కూర్చునేందుకు వీలుంది. దీంతో వివిధ పారీ్టల రాజకీయ నాయకులు తమ ప్రచార సభలు, ర్యాలీలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక మంది ఆటగాళ్లు క్రికెట్ నేర్చుకున్నది, ప్రాక్టీస్ చేసింది ఇక్కడే. భారత్‌కు పేరు తెచ్చిన అనేక మంది క్రికెటర్లకు ఈ మైదానమే వేదికగా నిలిచింది. అంతేగాకుండా సుమారు ఆరు దశాబ్దాల కిందట దివంగత బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్ధాపించింది ఇక్కడే. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఏటా ఇక్కడే విజయ దశమి రోజున ‘దసరా మేళావ’పేరుతో బహిరంగ సభ నిర్వహించేవారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే దీన్ని కొనసాగిస్తున్నారు. బాల్ ఠాక్రే అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. అదేవిధంగా ఏటా డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానులకు ఇక్కడే బస ఏర్పాట్లు చేస్తారు. ఇలా శివాజీపార్క్ మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. మైదానంలో ఒకపక్క అశ్వాన్ని అదిరోహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహాన్ని 1956లో ఏర్పాటు చేశారు. దీనిపక్కనే సావర్కర్ స్మారకం, గణేశ్ మందిరం, శివాజీపార్క్ జింఖాన, మాహిం స్పోర్ట్స్ క్లబ్, సమర్థ్ వ్యాయామ శాల, బాల్మోహన్ విద్యా మందిర్ తదితర కట్టడాలు, సంస్ధలు ఉన్నాయి. దాదర్: ప్రముఖ శివాజీపార్క్ మైదానంలో శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఇరువురికీ బహిరంగ సభలకు ప్రధాన వేదికైన శివాజీపార్క్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పారీ్టలు ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పారీ్టల ప్రచార సభలు శివాజీపార్క్ మైదానంలో నిర్వహించే అవకాశం ఇరు పార్టీలకు లభించకుండా పోవడంతో ఆ పార్టీల పదాధికారులు, నాయకులు అయోమయంలో పడిపోయారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నందువల్లే... శివాజీపార్క్ మైదానాన్ని సంవత్సరంలో కేవలం 45 రోజులు మాత్రమే వినియోగించాలనే బీఎంసీ నియమ నిబంధనలు తెలియజేస్తున్నాయి. మిగతా రోజుల్లో ఈ మైదానంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని బీఎంసీ కఠిన నిబంధనలు విధించింది. కాగా అనుమతినిచ్చిన 45 రోజుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికే పలు సభలు, ధార్మిక జాతీయ కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి. అదేవిధంగా గత నెలలో ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వివిధ రాజకీయ పార్టీలు మైదానాన్ని బుకింగ్ చేసుకున్నాయి. దీంతో వరుసగా రాజకీయ ప్రచార సభలు జరుగుతున్నాయి. మరికొన్ని జరగనున్నాయి. దీంతో బీఎంసీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేసిన 45 రోజులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్న యూబీటీ–శివసేనకు, ఎమ్మెన్నెస్‌కు శివాజీపార్క్ మైదానాన్ని అద్దెకు ఇచ్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిరాకరించింది. కఠిన నిబంధనలు ఇందుకేఒకప్పుడు శివాజీపార్క్ మైదానం ర్యాలీలు, సాధా రణ సభలతోపాటు వివిధ ధార్మిక, ప్రవచన కార్యక్రమాలకు, రాజకీయ పార్టీల ప్రచార సభలకు వేదికగా ఉండేది. ఎలాంటి ధార్మిక, రాజకీయ ప్రచార కార్యక్రమాలైన నిర్వాహకులు ముందుగా శివాజీపార్క్ మైదానాన్ని ఎంపిక చేసుకుంటారు. దీంతో ఈ మైదానం సంవత్సర కాలంలో దాదాపు 200 రోజులకుపైగా సభలు, సమావేశాలు, ర్యాలీలతో సందడిగా ఉండేది. ఈ కారణంగా మైదానం పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రమయ్యేది. ఇదికాక ర్యాలీలు, సభల్లో ప్రజలు, కార్యకర్తల నినాదాలు లౌడ్స్పీకర్లలో ప్రముఖులు, ఇతర వక్తల ప్రసంగాల హోరుతో స్ధానికులకు కంటినిండా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో తమకు ట్రాఫిక్ జామ్, శబ్ద కాలుష్య సమస్యల నుంచి విముక్తి కలి్పంచాలని స్ధానిక రహివాసి సంఘటన దాదాపు రెండు దశాబ్దాల కింద హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సంవత్సర కాలంలో కేవలం 45 రోజులు ఈ మైదానా న్ని రిజర్వు చేసి ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైదానం పరిసరాలను సైలెన్స్ జోన్‌గా ప్రకటించింది. రిజర్వు చేసిన 45 రోజుల్లో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం (జనవరి–26), ఉగాది, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్–14), మహారాష్ట్ర అవతరణ దినోత్సవం (మే–1), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు–15), గణేశోత్సవాలు, నవరాత్రి, దసరా, ఛట్‌పూజ, దీపావళి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి (డిసెంబరు–6), డిసెంబరు 31, నూతన సంవత్సరం తదితర పండుగలు, ఉత్సవాలు, జాతీయ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ పోగా మిగిలిన రోజులను రాజకీయ పార్టీల ప్రచార సభలు, ఇతర ధార్మిక, ప్రవచన, ప్రచార కార్యక్రమాలకు కేటాయించారు. ఇలా మొత్తం 45 రోజుల రిజర్వేషన్లో ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు ఈ నెల 17వ తేదీన ప్రచార సభ నిర్వహించేందుకు అనుమతివ్వాలని అక్టోబరు 14వ తేదీన ఎమ్మెన్నెస్ దరఖాస్తు చేసుకుంది. అదే రోజున తమకూ అనుమతివ్వాలని యూబీటీ శివసేన కూడా దరఖాస్తు చేసుకుంది. కాని ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ శిందేలు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు తమ సొంత ప్రచార సభలు నిర్వహించేందుకు ఈ మైదానాన్ని బుకింగ్ చేసుకున్నారు. ముఖ్యంగా శివాజీపార్క్ మైదానం మాహిం నియోజక వర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే మొదటిసారి పోటీ చేస్తున్నారు. దీంతో అమిత్‌తోపాటు రాజ్ ఠాక్రే కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో భారీ ప్రచార సభ నిర్వహించాలని ఇటు యూబీటీ, అటు ఎమ్మెన్నెస్ భావించాయి. కాని 45 రోజుల రిజర్వేషన్ కోటా పూర్తికావడంతో నిరాశే మిగిలింది. ఇంత తక్కువ సమయంలో మరోచోట ప్రచార సభకు ఏర్పాట్లు చేయడం, జనాన్ని సమీకరించడం, వాహనాలు బుకింగ్ చేయడం సాధ్యం కాదు. దీంతో ఈ సారి శివాజీపార్క్ మైదానంలో ప్రచార సభలు లేకుండానే ఈ పారీ్టలు ఎన్నికల ముందుకు వెళ్లాల్సిన పరిస్ధితి వచ్చింది. -
మెరైన్ డ్రైవ్‌లో మువ్వన్నెల రెపరెపలు
సాక్షి, ముంబై: మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన గణతంత్ర దిన వేడుకలు అంగరంగ ైవె భవంగా జరిగాయి. గతంలో శివాజీ పార్కులో నిర్వహించిన ఈ వేడుకలు తొలిసారిగా మెరైన్ డ్రైవ్‌లో జరిగాయి. త్రివిధ దళాలు సంయుక్తంగా విన్యాసాలు ప్రదర్శించడం ముంబైకర్లను ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా తొలుత గవర్నర్ కె.శంకర్ నారాయణన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సమయంలో హెలికాప్టర్ ద్వారా వాయుసేన సిబ్బంది పూలవర్షం కురిపించింది. ఆ తర్వాత త్రివిద దళాల కవాతు ప్రారంభమైంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ముంబై ఫోర్ట్ ట్రస్టు సంస్ధకు చెందిన ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రదర్శనలతో కూడిన 25 శకటాలు ప్రభుత్వ శాఖలు ప్రదర్శించాయి. ఈ ఉత్సవాల్లో వింటేజ్ కారు ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెరైన్డ్రైవ్లోని రోడ్డుకు ఇరువైపుల కూర్చున్న ముంబైకర్లు ఈ ఉత్సవాలను ఆస్వాదించారు. రాష్ట్రానికి చెందిన శకటం, మిలీటరికి చెందిన సాయుధ వాహనాలు, నేవీ శాఖ 50 మందితో కూడిన బ్యాండ్ బృందం, మోటార్ సైకిళ్ల ర్యాలీ, వివిధ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో 150 మందికిపైగా డ్రమ్స్ (ఢోల్) వాయించేవారు. 100కుపైగా లేజిం, 40 మందికిపైగా ఇతర వాయిద్యాలు వాయించేవారు పాల్గొన్నారు. కాగా గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంత జరిగేందుకు నగర పోలీసులతోపాటు ఎస్ఆర్పీ, క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు గుర్తింపు, నిర్వీర్యం బృందం, కోస్టు గార్డులు తదితర బలగాలు సహకరించాయి. ఉత్సవాలు ప్రారంభానికి 10 రోజుల ముందే ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక బహుళ అంతస్తుల భవనాలపై నుంచి నిఘాను పర్యవేక్షించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఆదివారం ఉదయంనుంచి సాయం త్రం వరకు ఈ ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు, విమానాలు, పారాగ్లాయిడ్స్ ఎగరలేకపోయాయి. -
పులికి ఘన నివాళి
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బాలాసాహెబ్ ఠాక్రే ప్రథమ వర్ధంతిని శివసేన అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహిం చిన శివాజీపార్క్ మైదానం ‘బాల్‌ఠాక్రే అమర్ రహే’ నినాదాలతో ఆదివారం హోరెత్తింది. ఉద యం నుంచే నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చిన శివసైనికులు, తమ ప్రియతమ నాయకుడు బాల్ ఠాక్రేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన శివాజీపార్క్ మైదానంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసి పోయాయి. శివాజీపార్క్ మైదానం ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న మీనాతాయి ఠాక్రే విగ్రహాన్ని భారీగా పూలతో అలంకరిం చారు. శివసైనికులు ముందుగా మీనాతాయి విగ్రహానికి నివాళులర్పించి ఠాక్రే స్మారకం వద్దకు వెళ్లా రు. మైదానమంతా జనసంద్రంగా మారింది. 1966 లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే దానిని మహా రాష్ట్రలో బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నవంబర్ 17న మరణించారు. భారీగా ప్రముఖుల రాక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రశ్మి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్మారకం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేన సీని యర్ నాయకులు, కార్పొరేటర్లతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, కూతురు సుప్రియా సుళే, గవర్నర్ కె.శంకరనారాయణన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై ఠాక్రేకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వర్ధంతికి హాజరుకాకపోవడం గమనార్హం. అభిమానుల సందడి.. రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, ఠాక్రే అభిమానులు శనివారం సాయంత్రం నుంచి ముంబైకి తరలిరావడం మొదలుపెట్టారు. తదనంతరం బాంద్రాలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ బంగ్లాకు చేరుకున్నారు. చాలా మంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే శివాజీపార్క్ మైదానానికి చేరుకుని క్యూలో నిలబడ్డారు. నివాళులర్పించే బోర్డులు, ప్లెక్సీలు.. ఠాక్రేకు నివాళులర్పించడానికి అమర్చిన బోర్డులు, ఫ్లెక్సీలు ముంబైలో చాలాచోట్ల దర్శనమిచ్చాయి. ‘శివ్తీర్థ్’ వద్ద ఉన్న శివాజీ విగ్రహం పక్కన 20 అడుగుల వెడల్పు, 40 అడుగులు పొడవుతో ఠాక్రే స్మారకం ‘స్మృతి ఉద్యాన్’ను బీఏంసీ ఏర్పాటు చేసింది. దీనిని 15 రకాల పూలు,మొక్కలతో అలంకరించారు. భారీగా పోలీసు బందోబస్తు వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ముంబై పోలీసుశాఖ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రద్దీని నియంత్రించేందుకు శివ్తీర్థ్ వద్ద ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌రూం, రెండు వాచ్టవర్లు ఏర్పాటు చేశారు. 650 మంది కానిస్టేబుళ్లు, 225 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది పోలీసు అధికారులు, నలుగురు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లను నియమించారు. అలాగే స్టేట్ రిజర్వుడు పోలీసులకు చెందిన మూడు బెటాలియన్లు, అల్లర్ల నియంత్రణకు రెండు బెటాలియన్లు, ఐదు కంబాట్ వాహనాలతో భద్రత ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు.... వర్ధంతిని పురస్కరించుకుని శివసేన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. శివసేన సినిమా యూనియన్ ఆధ్వర్యంలో దాని సభ్యులకు రూ.రెండు లక్షల పాలసీ ఉచితంగా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్‌కార్డులు అందజేస్తామని సేవ వర్గాలు తెలిపాయి. మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : ఉద్ధవ్ శివాజీపార్క్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రమే ఉద్ధవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మేయర్ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, రాష్ట్ర పాలనలో మార్పు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలోని శివసేన, బీజేపీ, ఆర్పీఐకి అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొద్ది రోజులుగా స్వాభిమాన్ శేత్కారి సంఘటన నాయకుడు, ఎంపీ రాజుశెట్టి చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఠాక్రే చేసిన పనులు, మార్గదర్శకాలు భావితరానికి ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు.