Sivananda
-
శివానంద ‘యోగ’
-
బురిడీ బాబాకు ఐదురోజుల కస్టడీ
డబ్బులు రెండింతలు చేస్తానని నమ్మించి లైఫ్ స్టైల్ యజమాని మధుసూధన్‌రెడ్డిని బురిడీ కొట్టించిన బురిడీ బాబా శివానందను విచారణ జరిపేందుకు నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. పూజల పేరిట మధుసూధన్‌రెడ్డి వద్ద నుంచి రూ. 1.33 కోట్లతో ఉడాయించిన బుడ్డప్పగారి శివను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు శివను పోలీస్ కస్టడీకి అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. సమ్మతించిన కోర్టు బురిడీ బాబాను ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. -
అనుమానం పెనుభూతమై..
భార్యను హతమార్చిన భర్త అనాథలుగా మారిన పిల్లలు శాంతిపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానించాడు. తనకు తెలియకుండా పుట్టింటి వారితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై గొడవ పడ్డాడు. చివరకు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక సరిహద్దు గ్రామమైన బెళ్లకోగిల వద్ద గురువారం వెలుగు చూసింది. మృతురాలి పిల్లలు, బంధువులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని మడివాళకు చెందిన శివానంద(35), పక్క గ్రామమైన క్యాసంబల్లికి చెందిన అలివేలమ్మ(30) ప్రేమించుకుని 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు లోకానంద 5వ తరగతి, చిన్నకొడుకు సత్యానంద 3వ తరగతి మడివాళలోని నాన్నమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. శివానంద తాపీ మేస్త్రీగా, అలివేలమ్మ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బెళ్లకోగిలో కాపురం పెట్టారు. బెళ్లకోగిలలోని శివానంద బంధువులు గ్రామ సమీపంలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్క డ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలివేలమ్మపై శివానందకు అనుమానం వచ్చింది. దీనికితోడు తనకు తెలియకుండా ఫోన్ దాచుకుని పుట్టింటి వారితో మాట్లాడడంతో బుధవారం గొడవ పడ్డాడు. మధ్యాహ్నం ప్రాంతంలో క్యాసంబల్లికి వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకువస్తామని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు సత్యానందను ద్విచక్ర వాహనంలో మడివాళకు వెళ్లాడు. అక్కడ బాలుడిని అక్కడే వదిలి తిరిగి ఇంటికి వచ్చి భార్యతో మళ్లీ గొడవపడి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తలుపు దగ్గరగా వేసి పరారయ్యాడు. కేసు నమోదు గ్రామస్తుల సమాచారంతో కుప్పం సీఐ రాజశేఖర్, రాళ్లబూదుగూరు ఎస్ఐ గోపీ అక్కడికి చేరుకుని అలివేలమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుప్పానికి తరలించారు. మృతురాలి బంధువులు, పిల్లలను విచారించారు. అలివేలమ్మ సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు గొడవపడుతుంటారని.. బోండాలు తెస్తానని చెప్పి వెళ్లిన తండ్రి ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ గొడవ పడుతుంటారని మడివాళలో ఉన్న పిల్లలు భావించారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లోకానంద, సత్యానంద కాలి నడకన రెండు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఇంటికి చేరారు. కింద పడి ఉన్న తల్లిని లేపడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేదు. దీంతో పరుగున మళ్లీ మడివాళకు వెళ్లి నాన్నమ్మకు విషయం చెప్పారు. బుధవారం రాత్రి బంధువులు వచ్చి చూడగా అలివేలమ్మ మృతిచెందినట్టు గుర్తించారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులు అనాథలుగా మిగిలారు. -
అనుమానంతో భార్యను చంపిన భర్త
అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పెళ్లకోగిళ్ల గ్రామానికి చెందిన శివానంద, అలివేలమ్మ(30) దంపతులకు పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులున్నారు. అయితే, భార్యపై శివానంద అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను బుధవారం సాయంత్రం గొంతుపిసికి చంపేశాడు. గురువారం ఉదయం శాంతిపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వారి నివాసం గ్రామానికి దూరంగా ఉండటంతో అతడు వచ్చి చెప్పేదాకా ఈ దారుణం ఎవరికీ తెలియలేదు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
జేడీఎస్‌కు షాక్
ఉత్తర కన్నడ అభ్యర్థి శివానంద నామినేషన్ ఉపసంహరణ ఆర్థిక ఇబ్బందులతో వైదొలుగుతున్నట్లు ప్రకటన నాయక్‌పై మండిపడిన కుమారస్వామి ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ ఆదేశం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజైన శనివారం ఉత్తర కన్నడ జేడీఎస్ అభ్యర్థి శివానంద నాయక్ పార్టీ అగ్ర నాయకులను నిశ్చేష్టులను చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆయన నామినేషన్ ఉపసంహరించు కోవడంతో అక్కడ పార్టీ అభ్యర్థే లేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్లు శివానంద ప్రకటించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, వేరే అభ్యర్థిని సూచించి ఉండాల్సిందన్నారు. తానే పోటీ చేస్తానని ముందుకు రావడంతో శివానందకు టికెట్టు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు పేడి లాగా ఎన్నికల సమరం నుంచి పలాయనం చిత్తగించారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఎన్నికల ఖర్చు కోసం తీసుకున్న మొత్తాన్ని పార్టీకి తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత్ దేశ్‌పాండే, బీజేపీ అభ్యర్థిగా అనంత కుమార్ హెగ్డే పోటీ చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 28 నియోజక వర్గాలకు గాను జేడీఎస్ ఇప్పటికే కొప్పళలో అభ్యర్థిని నిలపలేదు. దక్షిణ కన్నడ స్థానాన్ని మిత్ర పక్షం ఎస్డీపీఐకి కేటాయించింది. ఉత్తర కన్నడలో అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నట్లయింది.