అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పెళ్లకోగిళ్ల గ్రామానికి చెందిన శివానంద, అలివేలమ్మ(30) దంపతులకు పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులున్నారు.
అయితే, భార్యపై శివానంద అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను బుధవారం సాయంత్రం గొంతుపిసికి చంపేశాడు. గురువారం ఉదయం శాంతిపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వారి నివాసం గ్రామానికి దూరంగా ఉండటంతో అతడు వచ్చి చెప్పేదాకా ఈ దారుణం ఎవరికీ తెలియలేదు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను చంపిన భర్త
Published Thu, Apr 21 2016 11:04 AM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM
Advertisement
Advertisement