Snatcher
-
టార్గెట్ సెల్‌ఫోన్స్ ! ఏటా వేల సంఖ్యలో గల్లంతు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి రోజైన గత నెల 31న మార్కెట్లలో జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆ ఒక్క రోజే రాజధాని వివిధ ప్రాంతాల్లోని జనసమర్థ ప్రాంతాల నుంచి 327 సెల్ఫోన్లను తస్కరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులూ పెద్ద సంఖ్యలో సెల్‌ఫోన్ చోరీల బాధితులుగా మారారు. చవితి నుంచి నిమజ్జనం వరకు 134 ఫోన్లు పోయినట్లు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి... ఇంకా అందుతున్నాయి. కేవలం ఈ రెండు సందర్భాలే కాదు గడిచిన కొన్నాళ్లుగా నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న పోలీసులు చోరుల కన్ను సెల్ఫోన్లపై ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ఈ నేరాలు... రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నా, రద్దీ బస్సులో ప్రయాణిస్తున్నా, మార్కెట్‌కు వెళ్లినా, సభలు/ఉత్సవాలకు హాజరైనా అక్కడ పొంచి ఉంటున్న చోరులు స్పార్ట్ ఫోన్లను స్వాహా చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వాళ్ళు సైతం ‘జాయ్ స్నాచర్లు’గా మారి పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోనే’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అధికారిక, అనధికారిక సమాచారం ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేల వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల పిక్పాకెటర్లు పర్సులు, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. కొందరైతే ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. నిషా జోరులో, సరదా కోసం రెచ్చిపోతూ.... ఇటీవల కాలంలో ‘జాయ్ సెల్‌ఫోన్ స్నాచర్లు’ పెరిగిపోతున్న పరిస్థితి నగర పోలీసులకు కొత్త సవాళ్ళను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో అయి ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులు నేరగాళ్ళను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. పెండింగ్ భయంతోనే అధికం... జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. దీంతో బాధితులు నష్టపోతున్నారు. (చదవండి: ఉదయగిరిలో బాలిక కిడ్నాప్) -
కొట్టేసిన బంగారాన్ని తన ఇంట్లోనే దాచాడు
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ఎట్టకేలకు నోరు విప్పాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే ఉందని వెల్లడించాడు. ఉద్దేశపూర్వకంగానే అహ్మదాబాద్ పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇతడిని వారం కస్టడీలోకి తీసుకుని విచారించిన పేట్ బషీరాబాద్ పోలీసులు 19 తులాల బంగారం రికవరీ చేసినట్లు బాలానగర్ డీసీపీ గోనె సందీప్ బుధవారం వెల్లడించారు. ► అహ్మదాబాద్‌లోని నారన్పురకు చెందిన ఉమేష్ విలాసవంతమైన జీవితం గడపడానికి చైన్ స్నాచింగ్స్ చేసేవాడు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చి అహ్మదాబాద్‌లో స్నాచింగ్స్ చేశాడు. డిసెంబర్లో బెంగళూరులో పంజా విసిరాడు. నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది జనవరిలో వచ్చాడు. ► అదే నెల 18న నగరంలోని నాంపల్లిలోని మెజిస్టిక్ లాడ్జిలో దిగిన ఉమేష్ అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. మరుసటి రోజు దానిపైనే సంచరిస్తూ అల్వాల్‌లో మొదలు పెట్టి మేడిపల్లి వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. ► వీటిలో రెండు యత్నాలు విఫలం కాగా.. అయిదు ప్రాంతాల్లో 19 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. కొన్ని గంటల్లోనే ఉమేష్‌ను గుర్తించడంతో పాటు అహ్మదాబాద్‌లో ఆచూకీ కనిపెట్టిన నగర పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు పట్టుకున్నారు. తమ కేసుల్లో అరెస్టు చూపించుకుని కొంత బంగారం రికవరీ చేశారు. ఆ సందర్భంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు బెంగళూరు అధికారులూ అహ్మదాబాద్ వెళ్లినా... ఉమేష్ అప్పగించమంటూ స్పష్టం చేసి, కనీసం మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వలేదు. పక్కా విచారణతో.. ► ఉమేష్‌ను అరెస్టు చూపించిన వడాజ్ పోలీసులు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. ఆ సందర్భంలో నిందితుడు తాను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నేరాలు చేశానని, తెంచిన గొలుసులన్నీ అక్కడే పడిపోయాయంటూ చెప్పాడు. నిందితుడిని పక్కాగా విచారించకపోవడంతో ఆ పోలీసులు విషయం రాబట్టలేక ఇదే రికార్డు చేసుకున్నారు. హఠాత్తుగా పోలీసు కస్టడీ నుంచి ఉమేష్ పారిపోవడంతో అహ్మదాబాద్ పోలీసుల తీరుపై సందేహాలు తలెత్తాయి. ► ఉమేష్ కోసం ముమ్మరంగా గాలించిన అక్కడి క్రైమ్ బ్రాంచ్ గత నెల్లో పట్టుకుంది. ఆపై నిందితుడిని పీటీ వారెంట్‌పై బెంగళూరు పోలీసులు తీసుకువెళ్లి అరెస్టు చేయడంతో పాటు రూ.4 లక్షల విలువైన బంగారం రికవరీ చేశారు. ► కొన్ని రోజుల క్రితం ఉమేష్‌ను పీటీ వారంట్‌పై తీసుకుచ్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం వరకు చాకచక్యంగా విచారించిన అధికారులు ఉమేష్ నోటి వెంట నిజం చెప్పించారు. ఇక్కడి అయిదు నేరాల్లో కాజేసిన 19 తులాల బంగారం నరన్పురలోని తన ఇంట్లోనే దాచి ఉంచానని బయటపెట్టాడు. దీంతో ఉమేష్‌ను తీసుకుని అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఈ బంగారం రికవరీ చేసుకువచ్చింది. ► హైదరాబాద్, రాచకొండ పోలీసులూ ఉమేష్‌ను పీటీ వారంట్‌పై అరెస్టు చేయనున్నారు. తమ రెండు కేసులకు సంబంధించిన బంగారం మినహా మిగిలింది ఆయా అధికారులకు అప్పగించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ వార్త కూడా చదవండి: ట్రావెల్స్ బస్సు.. లారీ ఢీ -
స్నాచర్ల వేటలో దిట్ట
టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ వెంకటస్వామి నేపథ్యమిది సర్వోన్నత పోలీసు పతకం పొందిన ఇద్దరిలో ఒకడు ‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే సిటీబ్యూరో: స్నాచర్ పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్‌సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు. -
మహిళ మెడలోని మంగళసూత్రం స్నాచింగ్
రెండు ఠాణాల మధ్య వివాదం పెట్టిన స్నాచర్లు చాంద్రాయణగుట్ట: ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై వెళుతున్న ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుర్తు తెలియని యువకులు తెంచుకొని ఉడాయించారు. చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ కథనం ప్రకారం.....శంషాబాద్ బహదూర్‌పురా గ్రామానికి చెందిన జగదాంబ(50) రక్షాపురానికి వచ్చింది. ఆదివారం ఉదయం 7.30కి తన ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై బహదూర్‌పురా గ్రామానికి బయల్దేరారు. ఎర్రకుంటలోని సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రానికి వెళ్లగానే వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు జగదాంబ మెడలోని మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంచుకొని ఉడాయించారు. బైక్‌పై నుంచి లాగడంతో కింద పడ్డ జగదాంబ స్వల్పగాయాలకు గురైంది. కాగా నిందితుడు వేసుకున్న టీ షర్ట్ వెనుక భాగం పసుపు రంగులో ఉన్నట్లు బాధితులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరిహద్దు లొల్లి.. చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల సరిహద్దులో మహిళ మెడలోని గొలుసు చోరీ చేసిన దుండగులు రెండు పోలీస్స్టేషన్ల మధ్య వివాదాన్ని సృష్టించారు. స్నాచింగ్ విషయం తెలుసుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రామారావు, అదనపు ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఘటనా స్థలికి చేరుకొని తమ పరిధి కాదని పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ చలపతి, ఎస్సై రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తమకు రాదంటే తమకు రాదంటూ రెండు ఠాణాల అధికారులు భీష్మించుకొని కూర్చొవడంతో చివరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ కూడా అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధి ఎక్కడి వరకు వస్తుందో పరిశీలించిన ఏసీపీ చివరకు ఘటనా స్థలం చాంద్రాయణగుట్ట పరిధిలోకి వస్తుందని అంగీకరించారు. ఈ తతంగమంతా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగడం గమనార్హం. -
స్నాచర్‌గా మారిన హోంగార్డు.. !
ఇంటి దొంగను విచారిస్తున్న పోలీసులు? 14 కేసుల్లో నిందితుడిగా అనుమానం కుత్బుల్లాపూర్: స్నాచర్ అవతారమెత్తాడో హోంగార్డు. దొంగిలించిన వాహనాలపై జల్సాలు చేయడంతో పాటు తిన్నింటికే కన్నం వేసే పనికి పూనుకున్నాడు. ఇతడి వ్యవహార శైలిపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంటే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో నేరాలు ఒప్పుకోవడంతో పోలీసులు సొత్తు రికవరీపై దృష్టిపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు(ఆఫీస్‌బాయ్) గా పని చేస్తున్న ఓ వ్యక్తి అతి ఖరీదైన ద్విచక్ర వాహనాలకు డ్యూటీకి వస్తున్నాడు. దీంతో అతడిపై పోలీసుల దృష్టి పడింది. మూడు నెలలుగా ఇతను అడపాదడపా రూ. లక్షకు పైగా విలువ చేసే వాహనాలను తీసుకువస్తుండడంతో అధికారులకు అనుమానం మరింత బలపడింది. విధులకు హాజరయ్యే సమయంలో స్నాచింగ్‌లకు పాల్పడి, నేరుగా స్టేషన్‌కు రావడం, విధులు ముగించుకొని వెళ్లే సమయంలో స్నాచింగ్‌లకు పాల్పడటం చేస్తున్నాడు. అంతే కాకుండా డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల విడి భాగాలను, ధ్రువ పత్రాలు లేని వాహనాల పార్టులను విప్పి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టు విచారణలో బయటపడినట్టు సమాచారం. మొత్తం 14 స్నాచింగ్ కేసుల్లో కీలక భూమిక వహించిన ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అందరితో కలివిడిగా ఉండే హోంగార్డు స్నాచర్‌గా తేలడంతో ఒక్కసారిగా తోటి సిబ్బంది కంగుతిన్నారు. ఉన్నతాధికారులు సైతం విస్తుపోయారు. -
విజిలెన్స్ నిల్.. అఫెన్స్ ఫుల్!
తనిఖీలు, పెట్రోలింగ్ మరచిన పోలీసులు రెచ్చిపోతున్న అసాంఘికశక్తులు సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు పెట్రోలింగ్, వాహన తనిఖీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతవారం రోజుల్లో నగరంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ . ఎన్నికలప్పుడు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదుతో పాటు మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఎన్నికలు ముగిశాక.. ఇక గస్తీ, వాహన తనిఖీలు ఎందుకనుకున్నారో ఏమో.. పోలీసులు వాటిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రౌడీషీటర్లు, దొంగలు, స్నాచర్లు రాత్రి, పగలు అనే తేడాలేకుండా రెచ్చిపోతున్నారు. నగర కొత్త పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుండగా... కింది స్థాయిలో మాత్రం అది ఆచరణకు నోచుకోకపోవడంతో అసాంఘికశక్తులు విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల్లో బేగంపేట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, హుస్సేనీఆలంలో జరిగిన ఘటనలు పోలీసుల పని తీరును వెక్కిరిస్తున్నాయి. రాత్రి గస్తీలేకే.... ఈనెల 21వ తేదీ తెల్లవారుజాము 4.30కి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నానగర్‌లో పాలవ్యాపారి తిరుపతిరా వు (29)పై శ్రీనివాస్ (ఇతనిపై వివిధ ఠా ణాలలో 30కి పైగా కేసులున్నాయి) పథకం ప్రకారం కళ్లల్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. రాత్రి పూట పోలీసుల గస్తీలేక పోవడం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గస్తీ ఉండి ఉంటే.. పోలీసులు ఘటనకు అరగంట ముందు నుంచే శ్రీనివాస్ పట్టుకొని తిరిగిన ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకొని ఉండేవారని, తిరుపతిరావు హ త్యకు గురై ఉండేవాడు కాదని స్థానికు లు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు శ్రీ నివాస్ ఆగడాలు రోజు రోజుకూ అధికమవుతున్నాయని, పోలీసులు అతడిపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కత్తులతో స్వైరవిహారం... చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలోని వాహెద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ ఖాలేద్ (20)పై పాత కక్షల నేపథ్యంలో ఈనెల 20న అదే కాలనీకి చెందిన పాతనేరస్తులు ఖాలాహిమ్నా, వాసిఫ్, అమర్లాల్ కత్తులతో దాడి చేశారు. ఖాలేద్ కడుపు, చేయి, తొడ భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. పట్టపగలే చోరీ... సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు దొంగలు తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి.. రూ.10 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చార్మినార్ సాక్షిగా.... రక్షణ శాఖ శాస్త్రవేత్త ఆర్.సత్పత్తిపై చైన్‌స్నాచర్ కత్తితో దాడి చేశాడు. చార్మినార్ సాక్షిగా.. పోలీసు స్టేషన్ ఎదుటే ఆదివా రం మధ్యాహ్నం 12.30కి ఈ ఘటన జరిగింది. నగరంలో చైన్‌స్నాచర్ల స్వైరవిహారం నిత్యకృత్యంగా మారింది. అయి నా.. పోలీసులు మాత్రం స్నాచర్లను నియంత్రించలేకపోతున్నారు. నగరంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒకపక్క ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. మరోపక్క పోలీసులు తమ విధులను మరచిపోవడం గమనార్హం. ఇప్పటికైనా గస్తీని పెంచి అసాంఘికశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రజలు కోరుతు న్నారు. -
రెచ్చిపోయిన స్నాచర్లు
=వేర్వేరు ప్రాంతాల్లో 8 గొలుసు దొంగతనాలు =మొత్తం 28.5 తులాల బంగారం చోరీ ఉప్పల్/నాచారం/కుషాయిగూడ, న్యూస్‌లైన్: నగరంలో స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. గురువారం ఉప్పల్, నాచారం, కుషాయిగూడ, కేపీహెచ్‌బీ, ఆసిఫ్‌నగర్ ఠాణాల పరిధిలో ఎనిమిది గొలుసు చోరీలకు పాల్పడ్డారు. మొ త్తం 28.5 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు 8.5 లక్షలు ఉంటుంది. కాగా, బాధితుల్లో ఒకరు ఏఎస్ఐ భార్య ఉండటం గమనార్హం. గుడికి వెళ్తుండగా... గాంధీనగర్ ఏఎస్ఐగా పనిచేస్తున్న కె.మోహన్‌లాల్ మౌలాలి హౌసింగ్‌బోర్డు వెంకటేశ్వరనగర్‌లో ఉంటున్నారు. ఇతని భార్య కల్యాణి(46) మరో ముగ్గురు మహిళలతో కలిసి గురువారం ఉదయం 10.30కి స్థానిక సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్తుండ గా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 4 తులాల మంగళసూత్రం లాక్కొనిపోయారు. రేషన్ షాపునకు వెళ్తుండగా... మౌలాలి హెచ్‌బీ కాలనీ లక్ష్మీనగర్‌లో ఉండే పెండ్యాల మాధవి(38) గురువారం ఉదయం రేషన్ షాపునకు వెళ్తుండగా గోపాల్ జ్యువెలరీస్ సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కుషాయిగూడ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాచారంలో.. నాచారం హెచ్ఎంటీ నగర్లో ఉండే దేవినేని సువర్ణ(50) గురువారం మధ్యాహ్నం తన మనుమడిని స్కూల్నుంచి తీసుకొచ్చేందుకు బాపూజీనగర్ గుండా వెళ్తున్నారు. అదే సమయంలో ఉప్పల్ కళ్యాణపురి నుంచి హెచ్ఎంటీ నగ ర్కు నల్లరంగు కరిజ్మా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని 3 తులాల గొలు సు తెంచుకుని రెప్పపాటులో పారిపోయారు. నాచారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పల్‌లో... ఉప్పల్ రాఘవేంద్రనగర్‌కు చెందిన రాధిక(35) మధ్యాహ్నం 12.45కి ఉప్పల్ బ్యాంక్ కాలనీ మీదుగా ఇంటికి వెళ్తున్నారు. ఎస్బీఐ వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇ ద్దరు రాధిక మెడపై గట్టిగా కొట్టారు. ఆమె వెన క్కి తిరిగి చూసేలోగా 4 తులాల మంగళ సూ త్రం,పుస్తెల తాడును లాక్కొని పారిపాయారు. బస్సు ఎక్కుతుండగా... ఉప్పల్ శాంతినగర్‌కు చెందిన శారద ఇదే ప్రాంతంలో బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగురాలు ఆమె మెడలోని నాలుగు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసుకుపోయింది. బాధితురాలు బస్సు హబ్సిగూడ చేరుకున్నాక తన మెడలోని గొలుసు చోరీకి గురైందన్న గుర్తించింది. వెంటనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో... మలేసియాటౌన్‌షిప్: కేపీహెచ్‌బీ ఠాణా పరిధి లో పది నిమిషాల తేడాలో రెండు చోట్ల స్నా చింగ్‌లు జరిగాయి. ఎస్సై లింగయ్య కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్ లో ఉంటున్న పిల్లారిశెట్టి రామపుష్పం (72) గురువారం మధ్యాహ్నం కన్యకాపరమేశ్వరి ఆల యం వద్ద ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా... రమ్యా సెంటర్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొ ని ఉడాయించారు. ఇదిలా ఉండగా, కేపీహెచ్ బీ కాలనీ బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లో ఉంటున్న కంతి కళావతి (56) మధ్యాహ్నం 12.45కి గుడికి వెళ్లి వస్తుండగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు రాగానే వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 4 తులాల గొలుసును తెంచుకుపోయారు. గుడి నుంచి వస్తుండగా... మెహిదీపట్నం: గుడిమల్కాపూర్‌కు చెందిన గంగమ్మ అనే మహిళ గురువారం పద్మనా భనగర్లోని సాయిబాబాగుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దిల్షాద్నగర్లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు నగలు తెంచుకుపోయారు. ఆసిఫ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.