solution of public problems
-
శుభ్రతపై దృష్టి
- అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం - రూ.2లకే 20 లీటర్ల శుద్ధి నీరు - జిల్లా అభివృద్ధే లక్ష్యం - మంత్రులు పల్లె, సునీత సాక్షి, అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం పండుగలా నిర్వహించారు. భారీ ా్యలీలు .. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ చేపట్టారు. అనంతపురంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామిని బాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, మేయర్ మదమంచి స్వరూప లాంఛనంగా ప్రారంభించారు. మొదట తాడిపత్రి బస్టాండ్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రభాకర్‌చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. తర్వాత మంత్రులతోపాటు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప బుడ్డప్పనగర్ కాలనీలో కాలువలు, రోడ్లు శుభ్రం చేశారు. నాల్గోరోడ్డు, ఎర్నాల కొట్టాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ప్లాంట్లను ప్రారంభించారు. హామీలు నెరవేర్చుతాం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రులు సునీత, పల్లె అన్నారు. సప్తగిరి సర్కిల్లో జరిగిన సభలో వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అమలు చేస్తున్న ‘జన్మభూమి - మాఊరు’కు ఆటంకాలు కలిగించకుండా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక లోపాల కారణంగానో, అధికారుల తప్పిదాలతోనో ఎవరికైనా పింఛన్ మంజూరు కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘అనంత’ను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కోటా మేరకు హెచ్చెల్సీ నీటి విడుదలకు, హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు మంజూరు చేస్తామన్నారు. నీరు-చెట్లు ప్రాధాన్యతను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించాలని వైద్యులకు సూచించారు. అనంతపురంలో ఐదు ఎన్టీఆర్ (అన్న) క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5కు రాగి సంగటి, వేరుశనగ విత్తనాల చెట్నీ, పప్పు అందిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ ప్రసంగించారు. కార్యక్రమం చివర్లో స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యనారాయణ, సివిల్‌సప్లయీస్ డీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు..
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కమాన్‌పూర్ : తాను కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజల్లో తనను చులకన చేసేందుకే ప్రత్యర్థులు ఇలా దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మండలంలోని రొంపికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ను వదులుతాననే వార్తల్లో నిజం లేదన్నారు. తనను గిట్టనివారే పథకం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తన తండ్రి శ్రీపాదరావుతో పాటు తనను ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ప్రజలు తనను ఆదరించి ఓట్లు వేసి గెలిపించారని, ఈసారి ఓడిపోయినమాత్రాన ప్రజలకు అందుబాటులో ఉండననే అపోహలు పెట్టుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాడతానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇనగంటి జగదీశ్వరావు, కుట్కుం నారాయణ, బెల్లంకొండ విజేందర్‌రెడ్డి, గుమ్మడి వెంకన్న, కమ్మగోని మల్లయ్య, కుందారపు బాపు తదితరులున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
‘ఆన్లైన్’ ద్వారా అర్జీల స్వీకరణ
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్సైట్లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు. నూతన విధానం ఇలా.. జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్ఎంఎస్కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్ఎంఎస్లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అమలుకు ఆటంకాలు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు.