somashila
-
26 నుంచి సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం
కొల్లాపూర్: సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీ లాంచీలో ప్రయాణానికి చిన్నపిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ల ధరలను నిర్ణయించారు. వన్‌వే ప్రయాణానికి పెద్దలకు రూ.2,000, చిన్నపిల్లలకు రూ.1,600, వెళ్లి రావడానికి (అప్ అండ్ డౌన్) ప్రయాణానికి పెద్దలకు రూ.3,000, చిన్నపిల్లలకు రూ.2,400గా టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రయాణికులకు భోజన వసతులు కల్పించనున్నారు. ఈ నెల 26 నుంచి ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని లాంచీ మేనేజర్ శివకృష్ణ తెలిపారు. లాంచీ ప్రయాణ వివరాలు, టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు మొబైల్ నంబర్ 7731854994కు సంప్రదించవచ్చు. -
మర్యాదగా చెబితే అర్థం కాదా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఆత్మకూరు/ దర్గామిట్ట(నెల్లూరు): ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోసారి వారిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత ప్రజావేదికలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మైక్ పనిచేయకపోవడంతో ఉద్యోగులపై నిప్పులు చెరిగారు. ‘డిప్యూటీ కమిషనర్ జిల్లాలో ఉన్నాడా.. ఏం చేస్తున్నాడు.. వెరీ క్లియర్.. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోంది.. 95 నాటి సీఎంను అని చెప్పాను.. ఇంకా అర్థం కాలేదా.. మర్యాదగా చెబితే అర్థం కాలేదు.. అందుకే యాక్షన్‌లోకి దిగి వస్తున్నా.. మర్యాద అయిపోయింది.. ఇక యాక్షన్ ఉంటుంది. బీ కేర్‌పుల్.. నీవేం ప్రేక్షకుడివి కాదు.. ఇవన్నీ నీవే సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇలాగే తయారయ్యారు.. అడ్మినిస్ట్రేషన్‌ను భ్రష్టు పట్టించారు.. మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు’ అంటూ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావుపై తీవ్రంగా మండిపడ్డారు.ఇరిగేషన్ ఎస్ఈకి పాఠాలు..సోమశిల జలాశయ పర్యటనలో ఎస్ఈ బసిరెడ్డి వెంకట రమణారెడ్డిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న సమయంలో ఆయన మాటలను పరిగణనలోనికి తీసుకోకుండా ప్రతి పాయింట్‌కు నీరు ఎంత వస్తుందనే అంశాన్ని పట్టించుకోవాలని, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా అన్నీ మీకు ముందే తెలిసి ఉండాలంటూ మండిపడ్డారు.దీంతో అక్కడి అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలిపేందుకు అవకాశం లేకుండా ఆయనను మళ్లీ అన్నీ తెలుసుకుని రావాలని, మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కదా.. అంటూ ఎద్దేవా చేస్తూ చంద్రబాబు ముందుకు సాగిపోయారు. సోమశిల జలాశయానికి నీటి నిల్వ పెరిగే కొది -
సోమశిల నిర్వసితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది
-
సోమశిల వద్ద తాగుబోతుల వీరంగం
సాక్షి, నెల్లూరు: సోమశిల వరద నీటిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. పెన్నా నదికి వస్తున్న వరద ఉదృతితో సోమశిల రిజర్వాయర్ పది గేట్లు ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల రిజర్వాయర్ ముందు మందు బాబులు చిందులేశారు. ప్రవాహ వేగం తీవ్రంగా ఉన్న చోట ముగ్గురు తాగుబోతులు నీటి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా మరింత ముందుకు వెళ్ళివుంటే ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. -
సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశకు టెండర్లు
సోమశిల హైలెవల్ కెనాల్.. మెట్టవాసుల ఆశాదీపం. మొక్క కూడా మొలవని ఈ ప్రాంతాన్నిసస్యశ్యామలం చేసేందుకు దీనికి శ్రీకారం చుట్టారు. సాగు, తాగునీటిని అందించేందుకు దశాబ్దం క్రితం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన జరిగింది. దివంగత సీఎం వైఎస్సార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనా, అవి నత్తను తలపించాయి.జరిగిన పనుల్లోనూ ఎక్కువ శాతం నాసిరకంగానే జరిగాయి. భూ సేకరణలో సైతం జాప్యం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి సారించింది. తొలిదశ పనులనువేగవంతం చేశారు. రెండో దశ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.67.9 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అయింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకుమంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సాక్షి, నెల్లూరు: ఏటా కరువు కాటకాలతో బతుకు కష్టమై వలసలకు వేదికగా మారిన ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చి మెట్టవాసులను ఆదుకోవాలని ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. 2009లో సోమశిల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు సోమశిల జలాశయం నుంచి ఐదు టీఎంసీలను ఎత్తిపోతల పథకం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం, మర్రిపాడు మండలాలు, ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లోని దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీటితో పాటు 58 రెవెన్యూ గ్రామాల్లో 2.36 లక్షల మందికి తాగునీరందించేలా రూ.1,560 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఐదు మండలాల్లోని 5,320 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తొలి దశలో సోమశిల జలాశయం నుంచి కాలువ తీసి మర్రిపాడు మండలంలోనిపొంగూరులో, ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లి, పెగళ్లపాడులో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ ఉంచి సాగు, తాగునీరందించేలా ఏర్పాటు చేశారు. తొలి విడతగా రూ.840 కోట్లకు టెండర్‌ను ఆహ్వానించగా మెగా కంపెనీ దక్కించుకొని పనులను ప్రారంభించింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినానేటికి ఆయా పనులను 57 శాతం మేరే పూర్తి చేశారు. కేవలం పొంగూరు రిజర్వాయర్ వరకే పూర్తి చేశారు. ఇస్కపల్లి, పడమటినాయుడుపల్లిలో భూసేకరణ కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో అక్రమాలే సోమశిల హైలెవల్ కెనాల్ భూసేకరణలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. తొలిదశలో మర్రిపాడు మండలంలోని పొంగూరులో టీఎంసీ నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్ పనులు చేశారు. ఆ గ్రామంలో 1,200 ఎకరాల భూసేకరణ చేశారు. అందులో 270 ఎకరాలకు మాత్రమే పరిహారమిచ్చారు. మిగిలినవి చుక్కలు భూములు, ప్రభుత్వ భూములు ఉండటంతో 930 ఎకరాలకు పరిహారాన్ని పెండింగ్‌లో ఉంచారు. పొంగూరు రెవెన్యూలో మాత్రం ఎకరా బీడు భూమికి రూ.ఐదు లక్షలు, బోరు, మోటార్ ఉన్న భూమికి రూ.5.5 లక్షల వంతున పరిహారమిచ్చారు. పొంగూరు కండ్రిక సమీపంలో నేషనల్ హైవేకు అనుకున్న భూములకు మాత్రం రూ.ఏడు లక్షల వంతున పరిహారం చెల్లించారు. ఒకే రెవెన్యూ పరి«ధిలో పరిహారం తేడాలు ఉన్న వెనుక భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక టీడీపీ నేతలు, రెవెన్యూ, తెలుగుగంగ భూసేకరణ అధికారులకు ఎకరాకు రూ.రెండు లక్షల వంతున పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడు, రాజులపాడు రిజర్వాయర్ల కోసం చేస్తున్న భూసేకరణలో కూడా భారీగానే చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. పెగళ్లపాడులో రిజర్వాయర్‌కు దాదాపు 600 ఎకరాలను సేకరిస్తున్నారు. ఆ గ్రామంలో ఎకరాకు రూ.3.5 లక్షల మేర నిర్ణయించి భూసేకరణ చేస్తున్నారు. రాజులపాడు రిజర్వాయర్ కోసం దాదాపు 400 ఎకరాల భూసేకరణ కోసం ఎకరాకు రూ.4.5 లక్షలు నిర్ణయించారు. దీంతో కొందరు అక్రమార్కులు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను వెబ్ అడంగల్‌లో పేర్లు నమోదు చేసుకొని నకిలీ డీ ఫారం పట్టాలను సృష్టించి పరిహారం పొందారనే ఆరోపణలున్నాయి. గత టీడీపీ హయాంలో ఓ తహసీల్దారు ఎకరా ప్రభుత్వ భూమికి రేట్ ఫిక్స్ చేసి వెబ్ అడంగల్‌లో పేర్లు నమోదు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పడమటినాయుడుపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు నిర్మించారు. స్థానికంగా ఉన్న కేతామన్నేరు వాగునే అక్రమించి అక్రమ కట్టడం చేపట్టారు. గామంలో దాదాపు 200 అక్రమ ఇళ్ల నిర్మాణాలు జరిగాయని సమాచారం. నాసిరకంగా నిర్మాణాలు సోమశిల జలాశయం నుంచి జరిగిన హైలెవల్ కెనాల్ పనులు నాసిరకంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. పొంగూరు రిజర్వాయర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో కట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్థానికంగానే చెరువులో ఉన్న మట్టినే తీసి కట్టకు వేశారు. ఆ మట్టిని వాడకూడదని నిపుణులు చెప్తున్నా నిర్మాణదారులు పట్టించుకోలేదు. పదికాలాల పాటు ఉండాల్సిన కట్ట పూర్తికాకముందే పగుళ్లు ఏర్పడటంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. గతంలో టీడీపీ నేతలకు మెగా కంపెనీ సబ్ కాంట్రాక్ట్‌కు ఇవ్వడంతో పనుల్లో నాణ్యత తగ్గిందనే ఆరోపణలు ఉన్నాయి. పనులను నాసిరకంగా చేసి బిల్లులు తినేశారనే ఆరోపణలు ఉన్నాయి. మెట్టకు జీవం:అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆనం, మేకపాటి మెట్టప్రజలకు సాగు, తాగునీటిని అందించాలని 2009లోనే దివంగత సీఎం వైఎస్సార్‌ను కోరాం. అయన స్పందించి సోమశిల హైలెవల్ కెనాల్‌కు అంకురార్పణ చేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన కెనాల్ పనులు నాసిరకంగా జరిగాయి. భూసేకరణలో అక్రమాలు జరగడంతో కెనాల్ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. ఐదేళ్ల పాటు 57 శాతం కూడా పనులను పూర్తి చేయలేకపోయారు. తొలి దశ పనులనే పూర్తి చేయలేకపోయారు. రాజకీయ అవసరాల కోసం రెండో దశ టెండర్లను ఎన్నికలకు ముందు ఆహ్వానించి గత ప్రభుత్వం మోసం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది. హైలెవల్ కెనాల్‌ను పూర్తి చేస్తే మెట్ట ప్రజలు జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు.మా హయాంలోనే పూర్తిచేస్తాం –అసెంబ్లీలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సోమశిల హైలెవల్ కెనాల్ పనులను తమ హయాంలోనే పూర్తి చేస్తాం. రైతు భరోసా పథకం ప్రారంభానికి నెల్లూరు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన చొరవతోనే రెండో దశకు కూడా టెండర్లు ఆహ్వానించి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.67.9 లాభం చేకూర్చాం. గత టీడీపీ తొలి దశ పనులను 57 శాతమే పూర్తి చేసింది. ఆ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. రెండో దశపూర్తయితే.. సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గం సగభాగం సస్యశ్యామలమవుతుంది. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మండలాల్లోని 46,453 ఎకరాలకు సాగునీరందుతుంది. రూ.503.37 కోట్ల వ్యయంతో రెండో దశ పనులకు ప్రస్తుత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా, రివర్స్ టెండరింగ్‌తో బీవీఎస్సార్ కన్స్ట్రక్షన్ చేజిక్కించుకుంది. 36 నెలల్లో ఆయా పనులను పూర్తి చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. పనులు పూర్తి చేస్తే ఆ మూడు మండలాల్లోని బీడు భూములు సిరులు కురిíపించే అవకాశం ఉంది. -
సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ అందుకే అలస్యం
-
ప్రభుత్వ పారదర్శకతకు ఇదే నిదర్శనం
సాక్షి, అమరావతి: సోమశిల హై లెవల్ కెనాల్‌కు సంబంధించి 2013లో రూ.1500 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని రాష్ట్ర నీటిపారుతల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు కేవలం 2,690 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగిందన్నారు. ఫస్ట్ ఫేజ్ కింద రూ. 840 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమశిలపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని అనిల్ చెప్పారు. గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పట్టించుకోలేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆదా అయిందని సభలో వివరించారు. తమ సొంత పార్టీకి చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహిస్తున్న కాంట్రాక్టుపై కూడా రివర్స్ టెండరింగ్ చేపట్టామని మంత్రి తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 1100 కోట్ల రూపాయలు ఆదా చేశామని వెల్లడించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని స్పష్టం చేశారు. -
అటు జలకళ..ఇటు విలవిల
అట్లూరు: సోమశిల రిజర్వాయర్ పూర్తి జలకళతో ఉట్టిపడుతోంది. బుధవారం సాయంత్రానికి దీని నీటిమట్టం 78 టీఎంసీలకు చేరుకుంది. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టమిది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆనందం వ్యక్తమవుతుంటే మన జిల్లాలో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కారణం ఈ రిజర్వాయరును నెల్లూరు జిల్లా సోమశిల దగ్గర నిర్మించినా దీని వెనుక జలాలతో మన జిల్లాలోని కొన్ని మండలాలకు ముంపునకు గురవుతున్నాయి. తాజాగా రిజర్వాయరు నిండిపోవడంతో అట్లూరు, ఒంటిమిట్ట, నందలూరు, గోపవరం మండలాలలోని వందకు పైగా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంట పొలాలు కూడా ముంపు బారిన పడ్డాయి. ముంపు బాధితులను ఆదుకుంటాం:ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి ఒంటిమిట్ట: సోమశిల ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటాంమని ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం పెన్నపేరూరు, గంగపేరూరు, తప్పెటవారిపల్లె, వెంకటాయపల్లె, ఇబ్రహీంపేట, చిన్నకొత్తపల్లె గ్రామాలను ఆయన పరిశీలించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయికి చేరడంతో తప్పెటవారిపల్లె, పెన్నపేరూరులలో ఇళ్లలోకి నీరు చేరింది. అక్కడి ప్రజలు చాలా యాతన పడుతున్నారు. నరసన్నగారిపల్లెలో 40 ఎకరాల్లో వెనుక జలాలు వచ్చాయని బాధిత రైతులు తహసీల్దార్ విజయకుమారి దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెళ్లి ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సోమశిల ఇరిగేషన్ ఇంజనీర్ల అభ్యర్థన మేరకు గురువారం సోమశిల స్పెషల్ కలెక్టరు పరిశీలించనున్నారన్నారు. పరిహారం అందని భూముల్లో పంటలకు, పంట వేసిన భూములకు పరిహారం అందిస్తామన్నారు. పరిహారం తీసుకున్న ముంపు భూముల్లో దెబ్బతిన్న పంటలకు మానవత్వదృక్పథంతో నష్టపరిహారం చెల్లించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. బాధితులకు రేషన్ సహాయం అందిస్తామన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, మేకపాటి నందకిషోర్‌రెడ్డి, ముమ్మడి నారాయణరెడ్డిలతోపాటు అధికారులు పాల్గొన్నారు. పరిహారానికి నోచుకోని పలుగ్రామాలు సోమశిల జలాశయం ముంపు జలాలతో (బ్యాక్‌వాటర్) బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు బాధ ఓపక్క వీరిని వెంటాడుతుంటే కనీసం పరిహారం చెల్లించలేదని ఆగ్రహం చెందుతున్నారు. పరిహారం చెల్లింపు విషయంలో గత ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదు. కనీస చర్యలు కూడా తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. భూములు, ఇళ్లకు నష్టపరిహారం కొంతమేర చెల్లించినప్పటికీ అట్లూరు మండలంలోని ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లి, వరికుంట ఎస్సీ కాలనీ, రంగంపల్లి, గొల్లపల్లి గ్రామాలకు ఇంతవరకూ నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. బుధవారం సాయంత్రం ఈ మండల గ్రామాలను బ్యాక్‌వాటర్ చుట్టుముట్టింది. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామాలను ముంచారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వచ్చి తమ గ్రామాలను పరిశీలించి త్వరితగతిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముంపు బాధిత గ్రామాలైన ఆకుతోటపల్లి, చింతువాండ్లపల్లిలను మంగళవారంఎమ్మెల్యే డాక్టరు వెంకటసుబ్బయ్య పరిశీలించారు. తమ ప్రభుత్వం ఆయా గ్రామాల బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కలేనా!
సాక్షి, నాగర్‌కర్నూల్: సోమశిల–సిద్దేశ్వరం వంతెన నిర్మాణంపై అడుగు ముందుకు పడడం లేదు. పదేళ్ల క్రితం అప్పటి సీఎం వైఎస్సార్ చేసిన శంకుస్థాపన చేయగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2007లో మంచాల కట్ట వద్ద మరబోటు మునిగి 61మంది జలసమాధి అయిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వంతెన నిర్మించడంలో పాలకులు నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ప్రతి రోజూ జిల్లాలోని కృష్ణానది తీర గ్రామాల నుంచి నిత్యం అవతలి ఒడ్డున ఉన్న రాయలసీమ ప్రాంత గ్రామాలకు పుట్టీలు, పడవల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే పుట్టీ నిర్వాహకులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గోధావరి ఘటనతోనైనా అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో రాకపోకలు కృష్ణానదికి ఇవతలి వైపునాగర్కర్నూల్ జిల్లా అటువైపు కర్నూలు జిల్లా ఉన్నాయి. ఇరు జిల్లాల పరిధిలోని నదీతీర గ్రామాల ప్రజల మధ్య బంధుత్వాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రయాణికులు బోటులో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ ప్రయాణిస్తుంటారు. జిల్లాలోని పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ప్రాంతాల నుంచి బోటు, పుట్టి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు బోట్లు, పుట్టీలలో ప్రయాణిస్తూ ఉంటారు. అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడం, బోట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రజలు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. పర్యవేక్షణ కరువు.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ సందర్భంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఉదయం 9గంటల నుంచి సాయంకాలం 5గంటల వరకు ఆయా ప్రాంతాల నుంచి బోట్లు రాకపోకలు సాగుతూనే ఉంటాయి. బోటు నిర్వాహకులు మాత్రం ప్రయాణికుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లైఫ్ జాకెట్లు కచ్చితంగా ప్రయాణికులకు ఇవ్వాల్సి ఉన్నా ఒక పర్యాటక బోటులో తప్పా, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే బోట్లలో ఇవ్వడం లేదు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కృష్ణానది ఉధృతంగా ప్రహిస్తున్న నేపథ్యంలో బోటు ప్రయాణం అంత సురక్షితం కాదు. రోడ్డు మార్గంలో కర్నూలు జిల్లా నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాలకు వెళ్లాలంటే ఆరు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బోట్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగోటం బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే బోటు ప్రయాణాలపై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది తప్పా మిగతా రోజుల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2009లో శంకుస్థాపన 2007 జనవరి 18న కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నెహ్రూనగర్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని సింగోటం లక్ష్మి నరసింహ్మాస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తున్న మరబోటు మంచాలకట్ట వద్ద నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 61మంది మృతి చెందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. సోమశిల–సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇవ్వడంతో పాటు రూ.149.40కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 2009 ఫిబ్రవరి 13న కొల్లాపూర్‌లో శంకుస్థాపన కూడా చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తర్వాత వచ్చి న పాలకులు బ్రిడ్జి నిర్మాణంపై పాలకులు పట్టించుకోలేదు. అయి తే గత నెల 29న పాలమూరు–రంగారెడ్డి ప నుల పరిశీలనకు కొల్లాపూర్‌కు వచ్చిన సీఎం కే సీఆర్ బ్రిడ్జి నిర్మానంపై మాట్లాడతారని స్థానిక ప్రజలు ఆశించినప్పటికీ ఆ ప్రస్తావనే తేలేదు. వంతెన నిర్మించాలి సోమశిలలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది. కానీ పనులు మాత్రం చేపట్టడం లేదు. వంతెన నిర్మాణం జరిగితే కొల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నదీ ప్రయాణాలు కూడా సులభతరంగా మారుతాయి. వంతెన నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలి. – లక్ష్మీనర్సింహ, సోమశిల -
నీటి సమస్యకు పరిష్కారం.. వాటర్ గ్రిడ్
జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో ఇటు ప్రజలు.. అటు రైతాంగం అల్లాడుతోంది. గత పాలకులు ముందు చూపు కొరవడి, ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. శాశ్వతంగా నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. వాటర్ గ్రిడ్ ఏర్పాటే దీనికి పరిష్కార మార్గంగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లా వాసులకు నీటి కష్టాలకు చెక్ పెట్టినట్టే. సాక్షి , నెల్లూరు : జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ఏకైక రిజర్వారుగా సోమశిల ప్రాజెక్ట్ ఉంది. ఏటా ఈ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి కండలేరు, కనిగిరి, తెలుగుగంగతో ఇతర ప్రధాన కాల్వలకు, జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. కండలేరు ద్వారా తిరుపతికి, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరాలకు నీటిని తరలిస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో ఐదేళ్లుగా కరువు వెంటాడుతూనే ఉంది. గతేడాది కూడా జిల్లాలో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన క్రమంలో జిల్లాలో తాగునీటి అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రెండు నెలలుగా ట్యాంకర్ల ద్వారా కరువు మండలాల్లోని 436 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. సమీపంలో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతుకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తోంది. మరో నెల రోజుల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉంది. అడుగంటిన 70 శాతం బోర్లు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో జిల్లాలోని 18,500 చేతి పంపుల్లో దాదాపు 70 శాతం నీరులేక నిరుపయోగంగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నా.. జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవని పరిస్థితి. ఇదే తరహా ఇబ్బందులు ఏటా జిల్లాలో ఉంటున్నాయి. వీటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ అధికారులు, పశు సంవర్థక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు. జిల్లాలోని 46 మండలాలు, 7 మున్సిపాలిటీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పరిశ్రమలకు, పశువులకు అవసరమైన నీటి వినియోగంపై అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి అవసరాలకు కోసం వాటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి, కనెక్షన్ ఇవ్వడానికి, దానికి అవసరమైన ఏర్పాట్ల నిర్వహణకు సుమారు రూ. 4,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమశిల నుంచి తాగు, పరిశ్రమల నీటి అవసరాలకు 10 టీఎంసీలు ఏడాది పొడువునా అవసరం అవుతాయని గుర్తించారు. జిల్లాలోని అన్ని కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్‌కు సోమశిల నుంచి నీరు విడుదల కావాల్సి ఉండడంతో సోమశిల నీటి కేటాయింపులపై దృష్టి సారించి ప్రతి ఏటా పది టీఎంసీల వినియోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏటా సోమశిలకు వచ్చే ఇన్‌ఫ్లో, ఆవుట్ ఫ్లోను పరిశీలించి నీటి కేటాయింపులు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వాటర్ గ్రిడ్ ద్వారా రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నదే వాటర్ గ్రిడ్ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపారు. తక్షణ అవసరాలపైనా దృష్టి రానున్న ఆరు నెలల కాలంలో కనీనం ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సోమశిలకు నీరు చేరితే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలకు కండలేరు ద్వారా, మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాలకు సోమశిల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిని కొనసాగిస్తే డెడ్ స్టోరేజ్‌లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. -
కూతురి ఎదుటే ప్రాణం తీసిన భర్త
సాక్షి, సోమశిల (నెల్లూరు): అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో కూతురి కళ్ల ముందే గొంతు నులిమి ప్రాణం తీశాడు. పాప ఏడుస్తున్నా కనికరం చూపలేదు. ఈ సంఘటన అనంతసాగరం మండలంలోని పడమటికంభంపాడు ఎస్సీ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ పాపారావు కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉదయగిరి పెంచల నరసయ్య, విజయమ్మకు (35)కు 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి పవిత్ర, ప్రవీణ్, సిద్ధూ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. నరసయ్య కూలి పనులు చేస్తుంటాడు. కొంతకాలం క్రితం భర్తకు భర్యపై అనుమానం కలిగింది. దీంతో ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో నరసయ్య విజయమ్మ గొంతు నులిమి ఊపిరాడకుండా చేస్తుండగా కూతురు పవిత్ర చూసి ఏడుస్తూ వారించబోయింది. అతను వినకుండా భార్య తుదిశ్వాస విడిచే వరకూ గొంతు నులిమి పట్టాడు. దీంతో ఆమె మృత్యువాత పడింది. నరసయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పవిత్ర ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు విని ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో హత్య జరిగిందనే విషయం తెలుసుకుని స్థానికులు ఉలిక్కిపడ్డారు. బుధవారం ఉదయం ఆత్మకూరు డీఎస్పీ అంజనాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ పాపారావు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సమగ్ర సోమశిల.. తీరిన రైతు కల
సాక్షి, సోమశిల (నెల్లూరు): మూడు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన జిల్లా జల వరప్రదాయని సోమశిల ప్రాజెక్ట్‌కు సమగ్రతను తీసుకువచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల జలాశయంలో ప్రతిష్టాత్మకంగా 72 టీఎంసీలు నీరు నిల్వ చేశారు. గత ప్రభుత్వంలో ముంపు పరిహారంలో జాప్యం, అటవీ అనుమతి లభించక 38 టీఎంసీలకు నీటి నిల్వకు అధిగమించలేదు. 2004లో అధికారంలోకి రాగానే నిర్వాసితులతో వైఎస్సార్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పాత ప్రభుత్వాల కంటే రెట్టింపు నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం సైతం ఆయన ప్రకటించారు. రూ.260 నుంచి సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు కేటాయించటంతో నెల్లూరు జిల్లా ఎప్పిరాళ్ల, వైఎస్సార్ జిల్లా అట్లూరు, ఎగువరాచపల్లి, కొత్త, పాత మాధవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారు సంతోషంగా ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించారు. జలాశయంలో 38 టీఎంసీల సామర్థ్యం నుంచి 51 టీఎంసీలకు పెంచారు. వైఎస్సార్ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లింపులాంటి చర్యలు చేపట్టడంతో 2007 నాటికి సమగ్ర సోమశిల లక్ష్యం మేరకు 72 టీఎంసీల నీటిని సోమశిల ప్రాజెక్టు చరిత్రలో తొలి సారిగా నీటిని నిలిపారు. ప్రతిష్టాత్మకంగా 2008లో మొదటి సారిగా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇచ్చిన మాట మేరకు పలువురికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే అప్పట్లోనే ఆయన సోమశిల జలాలు మెట్ట ప్రాంతమైన కొండాపురం, వింజమూరు, కలిగిరి మండలాలతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టర్ వరకు పారుదలయ్యేందుకు రూపొందించిన ఉత్తర కాలువ పొడిగింపు పనులతో పాటు కలువాయి, చేజర్ల, పొదలకూరు మండలాలకు సాగు–తాగు నీరు అందించేందుకు దక్షిణకాలువ నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించినా ఆయన మరణాంతరం నత్త నడకన సాగుతున్నాయి. ప్రాజెక్ట్‌కు శ్రీకారం - 4 జూన్ 1975 తొలుత ప్రాజెక్ట్ అంచనా వ్యయం - రూ.553 కోట్లు ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం లక్ష్యం - 72 టీఎంసీలు 2004 నాటికి నిల్వ సామర్థ్యం - 38 టీఎంసీలు 2007 నాటికి నిల్వ సామర్థ్యం - 72 టీఎంసీలు (సమగ్ర సోమశిల) నాలుగు దశల్లో ఉత్తర కాలువ మూడు ప్రత్యేక ప్యాకేజీలు, నాలుగో చివరి దశ పనుల కోసం రూ.260 కోట్లు అప్పట్లో వైఎస్సార్ కేటాయించారు. మూడు ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా ప్యాకేజీ–11 నిర్మాణం మేరకు 0 కి.మీ నుంచి 13 కి.మీ చిలకలమర్రి వరకు రూ.34.23 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–96లో 13 కి.మీ నుంచి 73.92 కి.మీ ఏఎస్‌పేట మండలం గుడిపాడు వరకు రూ.104.72 కోట్లు మంజూరు కాగా అందులో 80 శాతం మాత్రమే పనులయ్యాయి. మిగిలిన పనులు చేసేందుకు కాంట్రాక్టర్ చేతులెత్తేయటంతో నిలిచి పోయాయి. ప్యాకేజీ–32లో భాగంగా 73.92 కి.మీ నుంచి 100వ కి.మీ కొండాపురం మండలం ఉప్పుటేరు వరకు రూ.73 కోట్లతో జరగాల్సిన పనులు 66 శాతం మాత్రమే అయ్యాయి. ఈ రెండు ప్యాకేజీల్లో పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులపై దృష్టి సారించకపోవటం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీరు కలువాయి,చేజర్ల మెట్ట మండలాలకు సరఫరా అయ్యేందుకు నిర్దేశించిన దక్షిణ కాలువ పనులు ప్యాకేజీ 95 కింద రూ.28.81 కోట్ల మంజూరు కాగా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కాలువ కింద నిర్దేశించిన 41 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించగా కాలువ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే 61.53 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ధిలోకి రానుంది. మెట్ట ప్రాంతాల దాహార్తికి హైలెవల్ కాలువ జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల్లోని మెట్ట ప్రాంత ప్రజానీకానికి తాగు, సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రణాళికలు రూపొందించారు. అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌ను కలిసి మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు జలాశయం నుంచి ఈ మూడు మండలాలతో పాటు అనంతసాగరం మండలంలోని ఉత్తర కాలువ సాగునీరు అందని ఎగువ ప్రాంతాలైన బొమ్మవరం, అగ్రహారం, చాపురాళ్లపల్లి గ్రామాల్లోని సాగునీరు సరఫరా చేసేందుకు రూపొందించిన ఈ హైలెవల్ కెనాల్ పనులకు రూ. 880 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండు దశల్లో చేయాల్సి ఉండగా నత్తనడకన సాగుతూ ఇప్పటికీ తొలి దశ నిర్మాణం పూర్తి కాకుండానే రెండో ఫేజ్ పనుల కోసం టెండర్లు పిలవడం చంద్రబాబు కమీషన్ల కోసమేనని స్థానికులు విమర్శిస్తున్నారు. నష్టపరిహారం ఆయన చలవే సోమశిల ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ జిల్లాలోని మాధవరం మండలంలో ఇళ్లు, భూములు కోల్పోయాం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అరకొరగా నష్టరిహారం ఇవ్వడంతో కోర్టుకు వెళ్లాం. వైఎస్సార్ మాతో ప్రత్యేకంగా సమావేశమై నష్ట పరిహారం విషయంలో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు చెల్లించారు. ఆయన చొరవతోనే మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఆత్మకూరులో స్థిర పడ్డాం. కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. – కొప్పోలు చిన్నపు రెడ్డి, రైతు, ఆత్మకూరు, వైఎస్సార్ జిల్లా మాధవరం మండలం నీటి కోసం ఎదురు చూపులు సోమశిల ప్రాజెక్టు నీరు ఉత్తర కాలువ ద్వారా సాగి మా గ్రామంలోని చెరువుకు వస్తాయని అప్పట్లో వైఎస్సార్ హయాంలో చెప్పారు. ఆ ప్రకారం కాలువ పనులు జరిగాయి. అయితే నాలుగు ఏళ్లుగా ఉత్తర కాలువ పొడిగింపు పనులు హసనాపురం వద్ద నిలిపి వేయటంతో మా గ్రామ చెరువుకు నీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. తీవ్ర కరువు తాండవిస్తుంది. కాలువ పనులు పూర్తి చేసి చెరువుకు సాగు నీరు ఇవ్వాలి. – చెంచులరెడ్డి, శ్రీ కొలను, ఏఎస్ పేట మండలం -
సోమశిల ఘటనకు 24ఏళ్లు..
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి రాష్ట్రంలోనే పెనుసంచలనం సృష్టించిన సోమశిల మందుపాతర దాడి ఘటనకు నేటితో 24ఏళ్లు పూర్తవుతున్నాయి. అప్పట్లో నల్లమల పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలో 14 నవంబర్ 1993న మావోయిస్టులు (అప్పటి పీపుల్స్‌వార్) కొల్లాపూర్ మండలం సోమశిలలో ఓ అతిథి గృహానికి నిప్పు పెట్టారు. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఓ ప్రైవేట్ బస్సులో అప్పటి ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశీనాయుడుతో పాటు ఎస్సైలు శివప్రసాద్, టి.కిషోర్, ఏఆర్ హెచ్‌సీ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు వై.వీ.ఎన్ ప్రసాద్, జయరాములు, షేక్ హైదర్, ఎస్.సుభాన్, జోహెబ్ ఎక్బాల్ సోమశిలకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి జిల్లా కేంద్రానికి వస్తున్న క్రమంలో కొల్లాపూర్–సోమశిల మధ్య ఘాట్ రోడ్డులో బస్సును పేల్చారు. ఈ ఘటనలో కొందరు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు కాళ్లు తెగిపోయి తీవ్రంగా గాయపడినప్పటికీ ఎస్పీ పరదేశీనాయుడు, ఇతర సిబ్బంది విరోచితంగా కాల్పులు జరిపి మావోయిస్టులను ఎదుర్కొన్నారు. దీంతో బస్సులో భారీ స్థాయిలో పోలీసు శాఖకు సంబంధించిన ఆయుధాలను వారికి చిక్కకుండా కాపాడారు. అయితే, ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత ఎస్పీ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆయనతో పాటు 9మంది వీరమరణం పొందారు. అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి మృతి చెందడం అదే తొలిసారి. నేడు వర్ధంతి సభ మావోయిస్టుల కాల్పులలో వీరమరణం పొంది న పరదేశినాయుడు వర్ధంతిని మంగళవారం నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ బి.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు పట్టణంలోని వన్‌టౌన్ చౌరస్తాలో ఉన్న పరదేశినాయుడు విగ్రహం వద్ద సాయుధ బలగాలు నివాళులర్పించే కార్యక్ర మం ఉంటుందని పేర్కొన్నారు. -
సోమశిల అందాలు అద్భుతం
కొల్లాపూర్‌రూరల్: ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే సోమశిలలోని కృష్ణానది, నల్లమల అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా బృందం సభ్యులు ఫిలిప్స్, తెలంగాణ బృందం సభ్యులు హరీశ్ అన్నారు. శనివారం మండలపరిధిలోని సోమశిల, అమరగిరి గ్రామాలను సందర్శించిన వారు కృష్ణానది, నల్లమల అందాలను వీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ మంచి అందమైన ప్రదేశాలు ఉన్నాయని, ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. కంటికి కనువిందుగా ఉన్నాయని, ఇక్కడి అందాలు చాలా అద్భుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణయ్య తదితరులు ఉన్నారు. -
ప్రకృతి అందాల సోమశిల
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చూడచక్కని చోటు.. ఘాట్లలో ఒకటిగా మాత్రమే కాకుండా ప్రకృతి అందాలతో అలరించే చక్కటి వీకెండ్ స్పాట్ సోమశిల. ఏడో శతాబ్దానికి చెందిన ఆలయాలు, రెండు నదుల సంగమం.. ఇలా అనేక ఆకర్షణలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. – ఓ మధు సోమశిల.. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ స్థలం. ఇక్కడి నుంచే ఈ రెండు నదులు నల్లమల అడవుల్లోకి ప్రవేశిస్తాయి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలు, అంతకు మించి ప్రశాంతత లభించే చోటు కావడంతో ఏడాది పొడువునా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్షించే ప్రదేశంగా మారింది సోమశిల. ఆధ్యాత్మికత.. ప్రకృతి రమణీయత ఏడో శతాబ్దానికి చెందిన లలితా సోమేశ్వర్ స్వామి ఆలయానికి సోమ, శుక్రవారాల్లో జనం అధికంగా వస్తుంటారు. శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి, కార్తిక మాసం, తొలి ఏకాదశి... ఇలా పండుగ, సెలవుల దినాల్లో సందర్శకులు పోటెత్తుతారు. ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణ జోడించే క్రమంలో సోమశిల రిజర్వాయర్‌లో బోటింగ్ సదుపాయం కూడా కల్పించారు. అమరగిరి, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం దుర్గం గుహలు.. తదితర చుట్టు పక్కల ఉన్న సందర్శనీయ ప్రదేశాలను బోట్లో వెళ్లి చూడడం చక్కని అనుభూతిని అందిస్తుంది. రిజర్వాయర్ మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని నీటి నిలువ తగ్గినప్పుడు మాత్రమే చూడొచ్చు. అదే విధంగా కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. శిల్పాలు, దైవ ప్రతిమలతో ఉన్న మ్యూజియం కూడా ఉంది. వెళ్లడం ఇలా... నగరం నుంచి 180 కి.మీ దూరంలో, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 99 కి.మీ దూరంలో ఉందీ టూరిస్ట్ స్పాట్.