సోమశిల అందాలు అద్భుతం | somashila bueatiful place than australian lakes | Sakshi
Sakshi News home page

సోమశిల అందాలు అద్భుతం

Published Sun, Oct 2 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

somashila bueatiful place than australian lakes

కొల్లాపూర్‌రూరల్‌: ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే సోమశిలలోని కృష్ణానది, నల్లమల అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా బృందం సభ్యులు ఫిలిప్స్, తెలంగాణ బృందం సభ్యులు హరీశ్‌ అన్నారు. శనివారం మండలపరిధిలోని సోమశిల, అమరగిరి గ్రామాలను సందర్శించిన వారు కృష్ణానది, నల్లమల అందాలను వీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ మంచి అందమైన ప్రదేశాలు ఉన్నాయని, ఆస్ట్రేలియాలోని సరస్సుల అందాల కంటే గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు. కంటికి కనువిందుగా ఉన్నాయని, ఇక్కడి అందాలు చాలా అద్భుతమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement