ఉద్యోగులపై సీఎం చంద్రబాబు నిప్పులు
అందుకే యాక్షన్‌లోకి దిగుతున్నా
మర్యాద అయిపోయింది.. అడ్మిని్రస్టేషన్ నిద్రపోతోంది
95 నాటి సీఎంను అని చెప్పాను
ఇంకా అర్థం కాలేదా.. అందుకే యాక్షన్‌లోకి వస్తున్నా
బీ కేర్‌పుల్.. మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ ఆత్మకూరు/ దర్గామిట్ట(నెల్లూరు): ఉద్యోగులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోసారి వారిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత ప్రజావేదికలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మైక్ పనిచేయకపోవడంతో ఉద్యోగులపై నిప్పులు చెరిగారు. ‘డిప్యూటీ కమిషనర్ జిల్లాలో ఉన్నాడా.. ఏం చేస్తున్నాడు.. వెరీ క్లియర్.. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోంది..
95 నాటి సీఎంను అని చెప్పాను.. ఇంకా అర్థం కాలేదా.. మర్యాదగా చెబితే అర్థం కాలేదు.. అందుకే యాక్షన్‌లోకి దిగి వస్తున్నా.. మర్యాద అయిపోయింది.. ఇక యాక్షన్ ఉంటుంది. బీ కేర్‌పుల్.. నీవేం ప్రేక్షకుడివి కాదు.. ఇవన్నీ నీవే సూపర్‌వైజ్ చేసుకోవాలి. అందరూ ఇలాగే తయారయ్యారు.. అడ్మినిస్ట్రేషన్‌ను భ్రష్టు పట్టించారు.. మీరందరూ ఇష్టారాజ్యం అనుకుంటున్నారు’ అంటూ సమాచార, ప్రసార శాఖ డిప్యూటీ డైరెక్టర్ సదారావుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇరిగేషన్ ఎస్‌ఈకి పాఠాలు..
సోమశిల జలాశయ పర్యటనలో ఎస్‌ఈ బసిరెడ్డి వెంకట రమణారెడ్డిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న సమయంలో ఆయన మాటలను పరిగణనలోనికి తీసుకోకుండా ప్రతి పాయింట్‌కు నీరు ఎంత వస్తుందనే అంశాన్ని పట్టించుకోవాలని, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా అన్నీ మీకు ముందే తెలిసి ఉండాలంటూ మండిపడ్డారు.
దీంతో అక్కడి అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలిపేందుకు అవకాశం లేకుండా ఆయనను మళ్లీ అన్నీ తెలుసుకుని రావాలని, మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కదా.. అంటూ ఎద్దేవా చేస్తూ చంద్రబాబు ముందుకు సాగిపోయారు. సోమశిల జలాశయానికి నీటి నిల్వ పెరిగే కొది
Comments
Please login to add a commentAdd a comment