Sourcing
-
‘సింగిల్’ రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ప్రతిపాదనల ప్రకారం.. యాపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు 200 మిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తెచ్చిన పక్షంలో ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటుకన్నా ముందు ఆన్లైన్ స్టోర్స్ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ అమ్మకాలు మొదలుపెట్టిన తర్వాత రెండేళ్లలోగా ఈ సంస్థలు ఆఫ్‌లైన్ స్టోర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు.. ఆఫ్‌లైన్ స్టోర్ ఏర్పాటు చేసిన తర్వాతే ఆన్లైన్ అమ్మకాలు జరిపేందుకు అనుమతిస్తున్నారు. మరోవైపు, పెట్టుబడి పరిమాణాన్ని బట్టి సోర్సింగ్ నిబంధనలను సడలించే అంశం కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదనల్లో ఉంది. ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న కాలవ్యవధిని 6–10 ఏళ్ల దాకా పొడిగించవచ్చు. -
మా గోడు పట్టించుకోండి
రోడ్డున పడ్డ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పదేళ్లుగా పనిచేయించుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఖాళీల భర్తీకి వినతి కొత్తపేట : బాబు వస్తే.. జాబు వస్తుందని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టాక..బాబు వస్తే జాబు రావడం మాటెలా ఉన్నా ఉన్న జాబులు ఊడిపోవడం ఖాయమనే విధంగా తయారైంది పాలన. ‘బాబుగారి మాటలకు అర్థాలే వేరులే అన్నది అక్షరాలా సత్యమని రుజువు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక్కొక్క శాఖలో ఉద్యోగాలు ఊడ పీకేస్తూ వారి పొట్ట కొడుతూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 800 మంది ఆరోగ్య మిత్రలను ఈ ప్రభుత్వం తొలగించగా వారు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో స్టే ఆర్డర్ ద్వారా కొనసాగుతున్నారు. తాజాగా అదే శాఖ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇటీవల జనరల్ ట్రాన్స్ఫర్స్ కారణంగా జిల్లాలో 5 ఆస్పత్రుల్లో పని చేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడ్డారు. వారిలో 9 మంది కొత్తపేట సీహెచ్‌సీ సిబ్బందే ఉన్నారు. వారిలో స్టాఫ్ నర్సులు ఐదుగురు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డ్రైవర్ ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అలాగే పెద్ధాపురం సీహెచ్‌సీ నుంచి ముగ్గురు, అమలాపురం, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రులు, అనపర్తి సీహెచ్‌సీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉద్యోగాలు కోల్పోయారు. జనరల్ ట్రాన్స్‌ఫర్స్‌తో రాజమహేంద్రవరం, అమలాపురం, తణుకు ఆస్పత్రుల్లో రెగ్యులర్ సిబ్బంది, పైఆస్పత్రులను కోరుకోవడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అర్ధాంతరంగా తొలగిస్తూ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో సుమారు పదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయి. జిల్లాలో వివిధ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీల్లో ఈ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ విధమైన చర్యలు తీసుకోకుండా పొట్టకొట్టింది. ఆ బాధితులు ఉద్యోగ సంఘాల ద్వారా ఈ నెల 14 న వైద్య విధాన పరిషత్ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్ కిషోర్‌ను కలిసి తమను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎక్కడో చోట ఉద్యోగం ఇప్పించి ఉపాది కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఉపాధి కల్పించాలని వారు కోరారు. షెడ్డుకు చేరిన అంబులెన్సు... ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన డ్రైవర్ చేతిలో పని చేసిన అంబులెన్స్ రెగ్యులర్ డ్రైవర్ వచ్చాక రిపేర్ల పేరుతో షెడ్డుకు చేరింది. కొత్తపేట ఆస్పత్రికి ఉన్న అంబులెన్స్ పాతదైనా సేవలందిస్తుంది. ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌తో ఈ నెల 5న కూడా అత్యవసర పరిస్థితిలో పేషెంటును రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 6న వచ్చిన రెగ్యులర్ డ్రైవర్‌కు అది పనిచేయలేదు. రిపేర్లు చేయించాలని అమలాపురం షెడ్డుకు చేర్చారు. ఎప్పటి నుంచో ఇక్కడ మరో అంబులెన్సు ఆవశ్యకత ఉంది. ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు రెగ్యులర్ డ్రైవర్ రాకతో ఉన్న అంబులెన్సు కూడా షెడ్డుకు చేరి, అసలు అంబులెన్సే లేకుండా పోయిందని పలువురు స్థానికులు వాపోయారు. మళ్లీ ఉద్యోగాలు ఇప్పించండి సుమారు పదేళ్లుగా ఈ ఉద్యోగాలను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. మరే పనీ చేసుకోలేని తమకు మళ్లీ తమ ఉద్యోగాలు ఇప్పించి ఆదుకోవాలి. జిల్లాలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెళ్లి పనిచేసుకుంటాం. ఉపాధి కల్పించండి. - ధర్నాల బూరిబాబు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, కొత్తపేట న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా ఔట్ సోర్సింగ్ పోస్టులన్నీ ఖాళీలుగా చూపించడం వల్ల రెగ్యులర్ స్టాఫ్‌తో భర్తీ చేయాల్సి వచ్చింది. ఉపాధి కోల్పోయిన సిబ్బందికి మళ్లీ పోస్టింగ్‌ల కోసం కమిషనర్‌కు లేఖ పంపించాం. అక్కడ పరిశీలనలో ఉంది. ఖాళీల్లో వారికి అవకాశం కల్పించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. - రమేష్‌కిషోర్, డీసీహెచ్ఎస్, రాజమహేంద్రవరం -
జీతమో.. రామచంద్రా!
కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఈసారి సంక్రాంతి ముంగిట్లోకి వచ్చేసినా పలు ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఇళ్లలో ఆ కళాకాంతులు కనిపించ డం లేదు. నెలల తరబడి జీతాల్లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. పప్పన్నం, పరమాన్నా లు కాదు కదా.. కనీసం సాధారణ భోజనమైనా చేయగలమా అనే దీనస్థితిలో ఉన్న ఈ కుటుంబాలు పండుగ రాకపోతే బాగుణ్ను అని భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరంతా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు కావడం.. వీరికి నెలనెలా సక్రమంగా వేతనాలు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యంతో వీరి జీవితాలు కళ తప్పాయి. ఊరం తా పండుగ సంబరాల్లో మునిగితేలితే.. ఈ కుటుంబాలు మాత్రం ఉసూరుమంటూ ఇళ్లలోనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్‌పీఎం: ఈ విభాగంలో సీఏలు 93 మంది, వీఏలు 118 మంది ఉన్నారు. సీఏలకు నెలకు రూ. 4 వేలు, వీఏలకు రూ. వెయ్యి గౌరవవేతనంగా ఇస్తారు. ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వీరి కుటుం బాల మనుగడే కష్టంగా మారింది. కాంట్రాక్టు లెక్చరర్లు: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 52 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.18 వేల వేతనం అందజేయాలి. గత ఏడు నెలలుగా జీతాలు విడుదల కాలేదు. పురపాలక సంఘం: పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, పలు ఇతర క్యాడర్లలో 100 మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. క్యాడర్‌ను బట్టి వీరికి రూ. 6 వేలు నుంచి రూ. 10 వేల వరకు జీతాలు చెల్లించాలి. నాలుగు నెలలుగా జీతాలు విడుదల కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. రిమ్స్ ఆస్పత్రి: జిల్లా పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 180 మంది వరకు పని చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీ, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో, డాటా ఎంట్రీ ఆపరేటర్ తదితర కేడర్లలో పని చేస్తున్న వీరికి రూ. ఆరు నుంచి పదివేలు వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. అయితే గత నాలుగు నెలలుగా వీరికి జీతాలు ఇవ్వలేదు. ఇక రిమ్స్‌లో పారిశుద్ధ్య కార్యకర్తల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తమకు జీతాలు చెల్లించేదెవరో కూడా తెలియని పరిస్థితుల్లో వీరున్నారు. వైద్య ఆరోగ్యశాఖ: వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆర్సీహెచ్ -3 కాంట్రాక్టు ఎఎన్ఎంలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారుగా 350 మంది ఉంటారు. వీరికి గత మూడు నెలలుగా జీతాలు లేవు. వీరికి క్యాడర్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 15వేల వరకు నెలనెలా జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. అలాగే నిరంతరం అత్యవసర సేవలు అందించే 104 విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ విభాగం: జిల్లా రెవెన్యూ శాఖ పరిధిలో కలెక్టరేట్‌తోపాటు వివిధ తహశీల్దార్ కార్యాలయాల్లో కాంట్రాక్టు విధానంలో అటెండర్లు, డాటాఎంట్రీ ఆపరేటర్లుగా 90 మంది వరకూ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ. 10 వేల వరకు జీతంగా చెల్లించాల్సి ఉండగా నాలుగు నెలలుగా ఇవ్వడం లేదు. సంక్షేమశాఖ: సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సుమారు 120 మంది అటెండర్లు, వంటపనివారికి నెలకు రూ.6వేలు చొప్పున జీతాలు ఇవ్వాలి. అయితే నాలుగు నెలలుగా జీతాలు అందడం లేవు.