SPAs
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 20% అప్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 20.2 శాతం పెరిగి రూ. 3,894 కోట్లకు చేరింది. అయితే చాలా ఏళ్ల తర్వాత బ్యాంకు ఎన్పీఏలు బాగా పెరిగాయి. దాంతో మొండి బకాయిలకు కేటాయింపుల్ని సైతం బ్యాంకు రెట్టింపు చేసింది. ఈ కేటాయింపులు రూ. 866 కోట్ల నుంచి రూ. 1,558 కోట్లకు చేరాయి. అనూహ్యంగా కేటాయింపులు పెరగడంతో మార్కెట్ అంచనాలకంటే బ్యాంకు ప్రకటించిన నికరలాభం తక్కువ వుంది.బ్యాంకు నికరవడ్డీ ఆదాయం కూడా 20.4 శాతం పెరుగుదలతో రూ. 9,370.7 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.4 శాతానికి ఎగిసింది. బ్యాంకు ఇతర ఆదాయం 25.3% ఎగిసి రూ. 3,516 కోట్లకు చేరింది. ఫీజు, కమీషన్ల ఆదాయం బాగా పెరగడంతో ఇతర ఆదాయంలో వృద్ధి సాధ్యపడింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ. 1,738 వద్ద ముగిసింది. వ్యవసాయ రుణాలతో... పలు రాష్ట్రాల్లో రైతు రుణాల్ని మాఫీ చేసిన నేపథ్యంలో ఆ విభాగపు చెల్లింపులు తగ్గాయని, దాంతో స్థూల ఎన్పీఏలు 1.24%కి పెరిగినట్లు బ్యాంకు తెలిపింది. దశాబ్దాలుగా రుణ నాణ్యతకు పేరుపడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎన్పీఏలు ఇంత అధికంగా నమోదుకావడం చాలా సంవత్సరాల తర్వాత ఇదే ప్రధమం. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యంగా ఇవ్వాల్సిన 18% రుణవితరణను బ్యాంకు పరిపూర్తిచేయడంతో ఈ రంగానికి ఇచ్చిన రుణాలు రూ. 28,000 కోట్లకు చేరాయి. ఫలితంగా ఎన్పీఏలు 0.13% పెరిగినట్లు బ్యాంకు వివరించింది.దాదాపు తాజాగా మొండి బకాయిలుగా మారిన రుణాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినవే 60% ఉన్నాయని బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పరేశ్ సూక్తాంకర్ సోమవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. ఆర్బీఐ సూచనల మేరకు టెలికం రంగానికి ఇచ్చిన రుణాలపై కేటాయింపుల్ని పెంచామని, అలాగే ఇనుము, ఉక్కు రంగ రుణాలపై సైతం అధిక కేటాయింపులు జరిపినట్లు ఆయన వివరించారు. -
గతవారం బిజినెస్
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు (ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను ఆదేశించింది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు ప్రైవేటు బ్యాంకులు, వాటిల్లో పనిచేసే ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ తెలిపారు. అవినీతి నిరోధక చ ట్టం 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అ ధికారులు ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటుచేసుకున్నాయి. ఓఎఫ్ఎస్ నిబంధనల్ని సడలించిన సెబీ ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) నిబంధనల్ని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సడలించింది. కంపెనీ మార్కెట్లో ఓఎఫ్ఎస్ లావాదేవీ జరిపిన తర్వాత రెండు వారాల్లోనే ఓఎఫ్ఎస్లో భాగంగా తన ఉద్యోగులకు షేర్లను విక్రయించవచ్చు. ప్రస్తుతం ఇటువంటి కొనుగోళ్లు, అమ్మకాలు 12 వారాల వరకూ ప్రమోటర్లు చేయకూడదన్న నిబంధన ఉంది. ఉద్యోగులకు ఇచ్చే ఆఫర్‌ను ఓఎఫ్ఎస్లో భాగంగానే పరిగణిస్తారని, ఓఎఫ్ఎస్ ఇష్యూ ధరకంటే డిస్కౌంట్‌తో ఉద్యోగులకు జారీచేయవచ్చని సెబీ తాజా సర్క్యులర్‌లో వివరించింది. ఎఫ్ అండ్ ఓ విభాగంలోకి మరో 5 షేర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో కొత్తగా ఐదు షేర్లను ప్రవేశపెట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించా యి. ఇటీవల లిస్టయిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు మణప్పురం ఫైనాన్స్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, శ్రేయీ ఇన్ఫ్రా, రెప్కో హోమ్ ఫైనాన్స్ షేర్లకు సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు జూన్ 30 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ భారీ అప్పుల భారంతో నెట్టుకొస్తున్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ రంగంలోని ఎయిర్ ఇండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. కాగా ఎయిర్ ఇండియా కొనుగోలుపై ఇండిగో ఆసక్తి కనబరుస్తోంది. రుణాలపై వడ్డీ భారం తగ్గించుకున్న ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 2.3 బిలియన్ డాలర్ల (రూ.15,000 కోట్లు) రుణాలను తక్కువ వడ్డీ రేటుకు రీఫైనాన్స్ చేసుకుంది. దీనివల్ల వడ్డీ రూపేణా గణనీయంగా ఆదా అవుతుందని వాటాదారులకు కంపెనీ తెలిపింది. కంపెనీ స్థూల రుణ భారం మార్చి నాటికి రూ.1,96,601 కోట్లు కాగా, ఇందులో అధిక భాగం జియో కార్యకలాపాల కోసం తీసుకున్నది కావడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,14,742 కోట్లు పెట్టుబడులు పెట్టామని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. దేశీ మార్కెట్లోకి చైనా కార్ల కంపెనీ చైనా ఆటోమొబైల్ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ తాజాగా భారత్ మార్కెట్లో అడుగుపెడుతోంది. ప్రసిద్ధ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) వాహనాలను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్ల తయారీ కోసం భారత్‌లో సొంత ప్లాంటు ఏర్పాటు చేయనుంది. తయారీ ప్లాంటుకు అనువైన ప్రదేశంపై కసరత్తు జరుగుతోందని, 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చని ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా పేరిట పూర్తి అనుబంధ సంస్థ ద్వారా భారత కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. కాగా టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది. అల్ట్రాటెక్–జేపీ డీల్ పూర్తి జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంటు టేకోవర్ చేయడంతో అతిపెద్ద మొండి బకాయి సమస్య పరిష్కారమయ్యిందని ఐసీఐ సీఐ బ్యాంక్ ప్రకటించింది. జైప్రకాశ్ అసోసియేట్స్ గ్రూప్‌నకు (జేపీ గ్రూప్) ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం భారీగా రుణాలివ్వడం, ఆ రుణాల్లో అధికభాగం ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తాజా డీల్ చరిత్రాత్మకమైనదని, దేశంలో ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద రుణ పరిష్కారమని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ వ్యాఖ్యానించారు. మౌలిక రంగం వృద్ధి డౌన్! ఎనిమిది కీలక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోలిస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. పొదుపు మొత్తాలపై తగ్గిన వడ్డీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస్ పత్రాలు, సుకన్య సమృద్ధి తదితర చిన్న మొత్తాల పొదుపు పథకాలపై జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి గాను వడ్డీ రేట్లను కేంద్రం 0.1 శాతం మేర తగ్గించింది. అయితే, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా వార్షికంగా 4% స్థాయిలోనే ఉంచింది. పెరగనున్న మొండిబకాయిల భారం! బ్యాంకింగ్ మొండిబకాయిలకు (ఎన్పీఏ) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రమాద ఘంటికలు మ్రోగిం చింది. 2017 మార్చి నాటికి 9.6%గా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి నాటికి 10.2%కి చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2016 సెప్టెంబర్‌లో ఎన్పీఏల రేటు 9.2% కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీ యోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3%గా ఉంటుందని పేర్కొంది. -
మొండి కొండ @ 7.7 లక్షల కోట్లు
♦ 2016–17లో 35 శాతం పైకి ♦ ప్రైవేటు బ్యాంకుల్లోనూ పెరిగిపోతున్న ఎన్పీఏలు ♦ 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు ♦ యాక్సిస్, యస్ బ్యాంకుల ఖాతాల్లో తేడాలు ♦ ఐవోబీ, ఐడీబీఐ బ్యాంకుల్లోనూ తార స్థాయికి ♦ సరైన స్థాయిలోలేని నిధుల కేటాయింపులు న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులు 2016–17 ఆర్థిక సంవత్సరంలోనూ మొండి బకాయిల సమస్య నుంచి బయటపడలేకపోయాయి. సరికదా గత కాలపు రుణాల సమస్యలు వాటిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. బడా కార్పొరేట్ సంస్థల నుంచి ఛోటా మోటా కంపెనీల వరకు, ఔదార్యంతో భారీగా రుణాలను మంజూరు చేసేసిన బ్యాంకులు... ఇప్పుడు వాటిని వసూలు చేసుకోలేక, రద్దు చేసి అందుకు సరిపడా నిధులు కేటాయించలేక (ప్రొవిజన్స్) ‘మింగలేక కక్కలేక’ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ మొండి బకాయిలు (వసూలు కాకుండా మొండిగా మారినవి/ఎన్పీఏలు) ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)కే ఎక్కువ శాతం పరిమితం అనుకుంటుంటే... ఇన్నాళ్లు వాటిని కప్పి పెట్టిన ప్రైవేటు రంగ బ్యాంకుల దాపరికాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్పీఏలను వాస్తవ గణాంకాల కంటే తక్కువగా చూపిస్తున్నట్టు ఇటీవలి యెస్ బ్యాంకు ఉదంతం తెలియజేస్తోంది. మొత్తానికి దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత బ్యాంకుల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.7.7 లక్షల కోట్లకు చేరి సవాల్‌గా మారాయి. ఏడాదిలోనే భారీగా పెరుగుదల మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యాంకులు ప్రకటించాయి. సిటీ యూనియన్ బ్యాంకు వెల్లడించాల్సి ఉంది. ఇటీవలే ఐదు బ్యాంకులను తనలో కలిపేసుకున్న ఎస్బీఐ సైతం కన్సాలిడేటెడ్ ఫలితాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన అన్ని బ్యాంకుల ఖాతా పుస్తకాల ప్రకారం స్థూల ఎన్పీఏలు రూ.7.7 లక్షల కోట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది. 2016 మార్చితో అంతమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్పీఏలు రూ.5.70 లక్షల కోట్లు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొండి రుణాలు 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. నికర ఎన్పీఏలు 58 శాతం పెరిగిపోవడం గమనార్హం. కానీ, బ్యాంకులు మొండి బాకీల కోసం చేస్తున్న కేటాయింపులు అరకొరగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల ప్రక్షాళన కార్యక్రమాన్ని 2015–16 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల నుంచే మొదలు పెట్టగా... ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ ప్రక్రియను గత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించాయి. దీంతో వాటి ఖాతాల్లోని మకిలి బయటకొస్తోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 70 శాతం పెరిగి రూ.85,063 కోట్లకు చేరడం దీన్నే సూచిస్తోంది. మరి అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (ఎస్బీఐలో కలిసిన బ్యాంకులను మినహాయించి చూస్తే) ఎన్పీఏల పెరుగుదల చాలా తక్కువగా 20 శాతంగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో ఒక విధంగా తమ ఖాతాల ప్రక్షాళనను భారీగానే నిర్వహించాయి. ఆర్బీఐ సమీక్షతో వెలుగులోకి పీఎస్బీల్లో మొండి బకాయిల ప్రక్షాళన కార్యక్రమం 2015–16 ద్వితీయార్ధం నుంచి ఆరంభమైంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించిన (ఏక్యూఆర్) ఆర్బీఐ... వసూలు కాకుండా ఒత్తిడిలో ఉన్న రుణాలను ఎన్‌పీలుగా ప్రకటించి వాటికి నిధులు కేటాయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఫలితం 2015 డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్థిక ఫలితాల్లో కనిపించడం ఆరంభమైంది. ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు 2015 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న స్థూల ఎన్పీఏలను విశ్లేషించి చూస్తే ఆ తర్వాతి కాలంలో పీఎస్‌బీల కంటే ప్రైవేటు బ్యాంకుల ఎన్పీఏలు అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు, యస్ బ్యాంకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల పెరుగుదల 300% మించి ఉంది. ఆస్తుల నాణ్యత సమీక్షకు ముందు ఈ రెండు బ్యాంకులు ఎన్పీఏలను తక్కువ చేసి చూపించినట్టు స్పష్టమవుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీల విషయమై ఆర్బీఐ నిర్ధారణకు, తమ అంచనాలకు మధ్య తేడా ఉన్నట్టు ఈ రెండు బ్యాంకులు ఇటీవలే ప్రకటించాయి కూడా. ఈ తేడా రూ.9,478 కోట్లు అని యాక్సిస్ బ్యాంకు వెల్లడించగా... యాక్సిస్ ఖాతాల పరంగా వెలుగు చూడని ఎన్పీఏలు రూ.4,177 కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో యునైటెడ్ బ్యాంక్, ఐడీబీఐ ఎన్పీఏలు భారీగా పెరిగాయి. పరిమితి దాటితే ఆంక్షలు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు ప్రైవేటు రంగ బ్యాంకుల కంటే అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఐఓబీ, ఐడీబీఐ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఎన్పీఏల శాతం గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సత్వర దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సి ఉంటుంది. అంటే నియమకాలు నిలుపుచేయడం, శాఖల విస్తరణకు బ్రేక్‌వేయడం వం టివి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చూస్తే... నికర ఎన్పీఏలు 6–9% ఉంటే ఆ బ్యాంకులు రిస్క్ కేటగిరీ–1 పరిధిలోకి వస్తాయి. ఎన్పీఏలు 9–12% ఉంటే రెండో రిస్క్ విభాగంలోకి, 12%పైన ఉన్న బ్యాంకులు మూడో కేటగిరీ కిందకు వస్తాయి. నికర విలువను దాటేసిన ఎన్పీఏలు: మెకిన్సే కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే అండ్ కో దేశీ బ్యాంకుల మొండి బకాయిల సంక్షోభంపై తాజాగా నివేదిక విడుదల చేసింది. దేశీయ బ్యాంకులకు చెందిన ఒత్తిడిలో ఉన్న మొత్తం రుణాలు (పునరుద్ధరించిన రుణాలు సహా) ఈ రంగం మొత్తం నెట్‌వర్త్‌ను మించిపోయాయి. ఈ రంగం నికర విలువ రూ.9.24 లక్షల కోట్లు కాగా, ఒత్తిడిలో ఉన్న రుణాల విలువ రూ.9.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు మెకిన్సే వివరించింది. ‘‘తక్కువ వడ్డీ రేట్ల వాతావరణంలోనూ రుణాల్లో వృద్ధి లేకపోవడం, ఒత్తిడితో కూడిన రుణాలు అధిక స్థాయికి చేరడం, టెక్నాలజీ, నియంత్రణల పరంగా వచ్చిన మార్పులు భారత బ్యాంకింగ్ రంగానికి తుఫాను మాదిరి వాతావరణాన్ని కల్పించాయి’’ అని మెకిన్సే పేర్కొంది. ఎన్పీఏ ఆర్డినెన్స్ పరిధిలో 15 రోజుల్లో ప్రణాళిక! న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ)ల సమస్య పరిష్కారానికి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో పక్షం రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయనుంది. ఎన్పీఏలు రూ. 8 లక్షల కోట్లు దాటిన నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశలో ఆర్బీఐకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ ఇటీవలే కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేయడం తెలిసిందే. ఎన్పీఏలకు సంబం ధించి సమస్యల గుర్తింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు, సమ స్య పరిష్కార ప్రక్రియలో సమయ కేటాయింపు, నిర్ణయం వంటి అంశాలు ఉంటాయని సంబంధిత వర్గాలు వెల్ల డించాయి. ఈ సమస్య 60 నుంచి 90 రోజులు ఉంటుందని కూడా తెలుస్తోంది. బడా మొండిబకాయిలకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ 50 కేసులను గుర్తించినట్లు సమాచారం. ఆర్డినెన్స్ అమలు పర్యవేక్షణకు కమిటీ ఎన్పీఏ ఆర్డినెన్స్‌ను ఆచరణలో పెట్టే దిశగా ఆర్బీఐ చర్యల్ని ఆరంభించింది. ఇందు కోసం తన అధికార పరిధిలో పర్యవేక్షణ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. అలాగే, సమస్య తీవ్రత దృష్ట్యా కమిటీని విస్తరించి మరింత మంది సభ్యులకు చోటు కల్పించనున్నట్టు పేర్కొంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.2,025 కోట్లు
♦ భారీగా పెరిగిన నికర ఎన్పీఏలు ♦ ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ ♦ ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు (188 శాతం) పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది. వడ్డీయేతర(ఇతర) ఆదాయం 41 శాతం క్షీణించి రూ.3,017 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభం 28 శాతం క్షీణించి రూ.5,112 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇతర ఆదాయం భారీగా వచ్చిందని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటా విక్రయం వల్ల ఆ క్వార్టర్లో భారీగా ఇతర ఆదాయం సమకూరిందని వివరించింది. కాగా, క్యూ4లో కన్సాలిటేడెడ్ నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.2,083 కోట్లకు చేరిందని బ్యాంక్ పేర్కొంది. ఎన్ఐఐ 10% అప్.. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10% వృద్ధితో రూ.5,962 కోట్లకు, రుణ వృద్ధి 7% పెరుగుదలతో రూ.4.64 లక్షల కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 3.12% నుంచి 3.57 శాతానికి పెరిగింది. దేశీయ రుణాలు 14%, మొత్తం రుణాల్లో 52%గా ఉన్న రిటైల్ రుణాలు 19% చొప్పున వృద్ది సాధించాయి. డిపాజిట్లు 16 శాతం వృద్ధితో రూ.4.9 లక్షల కోట్లకు పెరిగాయి. ఫీజు ఆదాయం 11% వృద్ధితో రూ.2,446 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. తగ్గిన కేటాయింపులు... స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏ) 12 శాతం వృద్ధితో రూ.42,552 కోట్లకు, నికర ఎన్పీఏలు 26 శాతం వృద్ధితో రూ.25,451 కోట్లకు పెరిగాయి. అంటే మొత్తం రుణాల్లో స్థూల స్థూల ఎన్పీఏలు 5.21 శాతం నుంచి 7.89 శాతానికి, నికర ఎన్పీఏలు 2.67% నుంచి 4.89%కి ఎగబాకాయి. సిమెంట్ రంగానికి చెందిన ఒక కంపెనీ రూ.5,378 కోట్ల రుణం కారణంగా మొండి బకాయిలు బాగా పెరిగాయని సమాచారం. ఎన్పీఏలకు కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7% వృద్ధితో రూ.2,898 కోట్లకు పెరిగాయని, అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 13%ట క్షీణించాయని బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో కేటాయింపులు రూ.3,600 కోట్లుగా ఉన్నాయని వివరించింది. పూర్తి ఏడాది ఇలా... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.9,726 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.9,801 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ వివరించింది. ఆదాయం రూ. 68,062 కోట్ల నుంచి రూ.73,661 కోట్లకు ఎగసిందని పేర్కొంది. 1:10 బోనస్ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 1.1 శాతం తగ్గి రూ.273 వద్ద ముగిసింది. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్ తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పైగానే సాధించగలమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు చెప్పుకోదగిన స్థాయిలో తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గతంలోని కొన్ని మొండిబకాయిలు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. –చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్ -
‘మసాజ్’పై కొరడా
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. కొన్ని సెంటర్లు కేవలం మసాజ్ వరకే పరిమితమైనా, మరికొన్ని సెంటర్లు అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి. విదేశాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతుల్ని రంగంలోకి దించి మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహించే సంస్థలు కూడా ఉన్నారుు. ఇటీవల పోలీసుల దాడుల్లో ఈ వ్యభిచార గుట్టు రట్టవుతోంది. అదే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించే మసాజ్ సెంటర్లలోనూ దాడులు జరుగుతుండడం ఆయా యాజమాన్యాల్ని కలవరంలో పడేస్తున్నాయి. తమ సెంటర్లపై తరచూ పోలీసులు దాడులు చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించి ఆ సంస్థలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ : చెన్నైలోని మసాజ్ సెంటర్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుు. తరచూ తమసెంటర్లపై పోలీసులు దాడులు చేస్తుండడం తీవ్ర నష్టా న్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వాదనల అనంతరం న్యాయమూర్తి కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో మసాజ్ సెంటర్ల నిర్వహణకు కొన్ని రకాల నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయని వివరించారు. ఈ సెంటర్ల కోసం ప్రత్యేక చట్టాలు చేశారని పేర్కొన్నారు. అలాంటి చట్టాలు భారత్‌లో ఎందుకు లేవని ప్రశ్న లేవదీశారు. మసాజ్ సెంటర్ల క్రమబద్ధీకరణ లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మసాజ్ సెంటర్లపై కొరడా ఝుళిపించడం, క్రమబద్ధీకరణ దిశగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ చట్టం తీసుకురావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేస్తూ, ఆ రోజున నివేదికను సమర్పించాలని ఆదేశించారు. -
లుక్ పర్ఫెక్ట్
‘ఖర్చెంతైనా పర్లేదు... అందంగా కనిపించాలంతే’... వెండి తెరపై వెలిగిపోయే తారలే కాదు... పెళ్లిళ్లు, పార్టీలకు అటెండయ్యే కామన్ పీపుల్ ట్రెండ్ కూడా ఇదే.. జస్ట్ లుక్ పర్ఫెక్ట్. అమ్మాయి అయినా... అబ్బాయి అయినా... ఫీల్డ్ గ్లామరైనా... కాకపోయినా... ఏజ్ ఏదైనా... గ్లామరస్‌గా కనిపించాలంతే. హైటెక్ సిటీలో ఇప్పుడు బ్యూటీ థాట్ ఎక్కువైపోయింది. అందుకు తగ్గట్టుగానే సిటీజనులను అందంగా తీర్చిదిద్దేందుకు బ్యూటీ సెలూన్లు, స్పాలు పుట్టుకొస్తున్నాయి. - వీఎస్ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల వంటివారు కూడా సినీ తారల్లా అందంగా కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. శుభకార్యాలు, ఫ్రెండ్షిప్ పార్టీలు, కాలేజీ ఫంక్షన్లు... అకేషన్ ఏదైనా... అప్పీయరెన్స్‌లో అందరి కాన్సెప్ట్ ఒక్కటే... లుక్ బ్యూటిఫుల్. ఇలాంటి వారి అభిరుచికి తగ్గట్టుగానే బ్యూటీ స్పాలు సేవలందిస్తున్నాయి. ట్రెండ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొంటూ... అవసరమైతే విదేశాలకు వెళ్లిమరీ శిక్షణ తీసుకుని మరీ విభిన్న ప్యాకేజీలు అందిస్తున్నాయి. నగరవాసులను కలర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నాయి. ఇవి అందించే సర్వీసుల్లో ముఖ్యమైనవి... హెయిర్, స్కిన్, బాడీ కేర్, బాడీ వ్యాక్సింగ్, నార్మల్ మేకప్, బ్రైడల్ మేకప్, టాటూలు... ఇలా లేటెస్ట్స్టైల్స్కు సిటీజనులను కేరాఫ్‌గా మార్చేస్తున్నాయి. స్పెషల్ మేకప్‌ల కోసం గతంలో ముంబై, ఢిల్లీల వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు... వాటిని తలదన్నేలా హైదరాబాద్‌లోనే విభిన్నమైన సెలూన్లు వెలిశాయి. సినిమా తారలు మరిన్ని వన్నెలద్దుకొనేందుకు వీటి ముందు క్యూ కడుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా... ప్రస్తుతం సిటీలో బ్యూటీ కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది. మా సెలూన్‌కు టాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వస్తుంటారు. అలాగే సామాన్యులు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు. 2000లో రెండే కుర్చీలతో మా ఇంట్లో ప్రారంభించిన సెలూన్... ఇప్పుడు పలు బ్రాంచీలతో విస్తరించింది. బయటి ప్రాంతాల నుంచి నిపుణులను తెచ్చుకోవడం కంటే... ఇక్కడున్నవారికి బ్యూటీషియన్ కోర్సులు నేర్పించాలని ఏడాదిన్నర క్రితం అకాడమీ కూడా ప్రారంభించా. ఇక్కడ శిక్షణ తీసుకున్న చాలా మంది నేడు భారీ వేతనాలు ఆర్జిస్తున్నారు. ఇటీవల స్పా కూడా నెలకొల్పాం. తద్వారా... ట్రెండ్‌కు తగ్గట్టుగా నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. - డాక్టర్ విజయలక్ష్మి గూడపాటి, మిర్రర్ సెలూన్స్ అండ్ అకాడమీ డెరైక్టర్