speaker dhanpal
-
ఇదేం చర్య?!
న్యాయస్థానాల హితబోధలు, మందలింపుల మాటెలా ఉన్నా దేశంలో స్పీకర్ల వ్యవస్థ పెద్దగా మారిందేమీ లేదని మరోసారి రుజువైంది. తమిళనాడులో టీటీవీ దినకరన్‌కు చెందిన అన్నా డీఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ధన్పాల్ సోమవారం తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదా స్పదమైనది. విచారకరమైనది. పళనిస్వామి ప్రభుత్వం బల పరీక్షకు రాష్ట్ర హైకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందు తీసుకున్న ఈ చర్యలోని అంతరా ర్ధమేమిటో సుస్పష్టమే. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల వేరు కుంపటి కారణంగా పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాన్ని కాపాడటం కోసమే స్పీకర్ ఈ చర్యకు ఉపక్రమించారు. నిజానికి ఇలాంటి ప్రమాదాన్ని ఊహించబట్టే తక్షణం బల పరీక్షకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. ఆయన ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటాన్ని గమనించి మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష జరపరాదని కోర్టు స్టే విధించింది. ఈ ఆదేశం వల్ల దినకరన్ వర్గానికి ఒరిగిందేమీ లేకపోగా స్పీకర్‌కు తగినంత సమయం చిక్కింది. దాన్ని వినియోగించుకుని ఆయన పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకుని తగినంత సంఖ్యాబలాన్ని సాధించు కున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అనుకోని పరిణా మాలు సంభవించి ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని బలాబలాలు తేలాల్సింది చట్టసభలోనే. అక్కడ ఎవరికీ తగినంత బలం లేదని తేలిన పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించడమే సబబు. ఎస్ఆర్ బొమ్మై కేసులో చరిత్రాత్మకమైన తీర్పునిస్తూ ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్ట సభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని సుప్రీంకోర్టు ఎన్నడో స్పష్టం చేసింది. అయినా అడపా దడపా ఏదో రకమైన సాకుతో ప్రభుత్వాలను పడగొట్టడం ఆగలేదు. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సరిదిద్దుతూనే ఉన్నాయి. ఈ దుస్సంప్రదాయాన్ని ప్రారంభించిందీ, యథేచ్ఛగా కొనసాగించిందీ కాంగ్రెసే అయినా... ఆ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూనే వచ్చాయి. తమిళనాడులో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి విచిత్రమైనది. నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ఘన విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. కానీ మూడు నెలలు గడవ కుండానే జయ అనారోగ్యం బారినపడ్డారు. గత డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆ తర్వాత నుంచి తమిళనాడు రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె తర్వాత వచ్చిన పన్నీర్‌సెల్వం చాలా త్వరలోనే రాజీనామా చేయడం, శాసనసభా పక్ష నేతగా శశికళ పేరు ప్రతిపాదించడం, ఆ తర్వాత తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన శశికళ అవినీతి కేసులో జైలుపాలు కావడంతో ఆమె ఆశీస్సులతో పళనిస్వామి సీఎం పదవి చేపట్టారు. శశికళ మేనల్లుడు దినకరన్ రంగ ప్రవేశం చేశాక పళనిస్వామి కూడా ఆమెకు దూరమయ్యారు. అప్పటినుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన శిబిరంలో 19మంది ఎమ్మెల్యేలున్నారు. పన్నీర్‌సెల్వం పళనిస్వామి వర్గాలు చేతులు కలిపాక వారి బలం 111. 234మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వానికి కావలసిన కనీస సంఖ్యాబలం 117. విపక్షాల బలం 98. వీరితో దినకరన్ వర్గం జతగూడితే పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. పరి స్థితి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు బలపరీక్షలో జాప్యం ఎందుకు జరగాలి? ఒకపక్క దినకరన్ బలవంతంగా ఎమ్మెల్యేలను తన శిబిరంలో ఉంచుకున్నారని పళనిస్వామి ఆరోపిస్తున్నారు. అలాంటపుడు ఓటింగ్‌కు ఆయన ఎందుకు సిద్ధపడలేకపోయారు? ఆయన తప్పించుకు తిరుగుతున్నారు సరే... దానికి గవర్నర్ సహకరించ డంలోని అంతరార్ధం ఏమిటి? కనీసం ఈ వ్యవహారం తన ముందుకొచ్చినప్పుడు మద్రాస్ హైకోర్టయినా వెనువెంటనే బలపరీక్షకు ఆదేశించి ఈ నాటకానికి తెరదిం చాల్సింది. లేదా బలపరీక్ష లోపు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదన్న తాత్కాలిక ఆదేశాలైనా ఇవ్వాల్సింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోను అసెం బ్లీలో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య 215. పర్యవసానంగా ప్రభుత్వానికి కావలసిన కనీస మెజారిటీ 108 అయింది. కనుక పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కడం పెద్ద కష్టం కాదు. కానీ ఇది ఆరోగ్యకరమైన పోకడేనా? అనర్హత వేటు చట్టబద్ధతను ఇప్పుడు ఎటూ దినకరన్ వర్గం న్యాయస్థానంలో సవాల్ చేస్తుంది. కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు దానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలన్న ఆత్రుత ఎవరిలోనూ లేకపోవడం విచారకరం. ఆమధ్య పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య పోటీ ఏర్పడినప్పుడు రోజుల తరబడి రెండు వర్గాలూ శిబిరాలు నడిపాయి. మళ్లీ ఇప్పుడు దినకరన్ వర్గం ఆ పనే చేసింది. ఇందువల్ల చట్టసభలపై, మొత్తంగా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. పాలన కుంటుబడుతుంది. అధికారం ఎవరికుంటుంది, ఎవరికి పోతుందన్నది ప్రధానం కాకూడదు. ఏర్పరుచుకున్న నిబంధనలు అమ లయ్యేలా చూడటం, వ్యవస్థలు నవ్వులపాలు కాకుండా చూడటం ప్రధానం. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం లేదని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కానీ రాష్ట్రంలో పాలన కుంటుబడినప్పుడు, సంక్షోభం ఎడతెగకుండా సాగుతున్నప్పుడు దాన్ని చక్క దిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఇప్పటికైనా తమిళనాట సంక్షోభానికి అర్ధవంతమైన ముగింపు పలకాలి. పళనిస్వామి సర్కారు మనుగడ కన్నా అక్కడ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండటం అవసరమన్న స్పృహ అందరిలోనూ ఏర్పడాలి. -
ఆ ఎమ్మెల్యేలపై ‘వేటు’ వాయిదా
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయాన్ని ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేక్కేందుకే తమపై కుట్రపూరితంగా వేటు వేస్తున్నారని కోర్టులో దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రాగా ఈ కేసు 20వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆరోజున కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది చేసిన సూచన మేరకు స్పీకర్ వెనక్కుతగ్గారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో కుట్రపూరితంగా నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, తాము మరలా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శుక్రవారం చెన్నైలో వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి ఆదేశాలు పొంది త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఎడపాడి ప్రభుత్వాన్ని వచ్చేవారం కూల్చివేయడం ఖాయమని డీఎంకేతో కూటమి లేకుండానే ఎడపాడిని సాగనంపుతామని పేర్కొన్నారు. ఇక మైసూరులోని రిసార్టులో ఉన్న దినకరన్‌వర్గ ఎమ్మెల్యేలకు తమిళనాడు పోలీసుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. -
దినకరన్ వర్గానికి మూడోసారి నోటీసులు
-
దినకరన్ వర్గానికి మూడోసారి నోటీసులు
సాక్షి, చెన్నై: అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనంటూ వాదిస్తున్న టీవీవీ దినకరన్ వర్గానికి పళని స్వామి ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ మూడోసారి దినకరన్ వర్గానికి నోటీసులు జారీ చేశారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటిస్తూ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం మరోసారి తన మద్ధతుదారు ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని దినకరన్ గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో స్పీకర్ మరోమారు నోటీసులు పంపించారు. సెప్టెంబర్ 14న ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ 19 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు, అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అన్న ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తన వర్గ ఎమ్మెల్యేలు చేజారకుండా దినకరన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వారిని పాండిచ్చేరి నుంచి మైసూర్ తరలించేందుకు సిద్ధమైపోతున్నాడు. ప్రస్తుతం పళని బలం 115కు చేరింది. బలపరీక్షలో గెలవాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో అరవ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. -
అక్కడ కూడా స్పీకర్‌పై అవిశ్వాసం
తమిళనాట కూడా ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే.. అక్కడి అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది ఓడిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 97 ఓట్లు, వ్యతిరేకంగా 122 ఓట్లు వచ్చాయి. దాంతో పళనిస్వామి ప్రభుత్వం మరోసారి సభలో తన బలాన్ని నిరూపించుకున్నట్లు అయ్యింది. ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించిన విశ్వాస తీర్మానంలో కూడా ప్రభుత్వానికి సరిగ్గా 122 ఓట్లే వచ్చాయి. అయితే అప్పట్లో పళనిస్వామిని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు. మాజీ డీజీపీ, మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజ్ మాత్రం అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించేముందు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను స్పీకర్‌గా చేశారని, తాను సభను నిర్వహిస్తున్న తీరును ఆమె ఎంతగానో ప్రశంసించారని ధనపాల్ చెప్పారు. తాను రెండు సార్లు చాలా బాధపడ్డానని, ఒకటి జయలలిత సంతాప సందేశం చదివేటప్పుడు, రెండోసారి ఫిబ్రవరి 18న సభలో డీఎంకే సభ్యుల ప్రవర్తన చూసి అని తెలిపారు. ధనపాల్ తన చాంబర్లోకి వెళ్లిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ సభకు అధ్యక్షత వహించి, మూజువాణీ ఓటు, ఆ తర్వాత డివిజన్ నిర్వహించారు. తీర్మానం వీగిపోయిన తర్వాత స్పీకర్ ధనపాల్ మళ్లీ తన స్థానంలోకి వచ్చారు. దాంతో అధికార పార్టీ సభ్యులు బల్లలను చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తమకు బలం లేదని తెలిసి కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ప్రతిపక్ష ఉపనేత ఎస్ దురై మురుగన్ చెప్పారు. జయలలిత అప్పుడు పొగడటం మంచిదేనని, అసెంబ్లీ పదవీకాలం మొత్తం ముగిసిన తర్వాత తమ ప్రశంసలు కూడా పొందేలా సభను నిర్వహించాలని సూచించారు. -
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
-
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సభ వాయిదా పడి, మళ్లీ మరోసారి సమావేశం అయినప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా స్పీకర్ ధనపాల్ ఆదేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా మళ్లీ పోడియం వద్దకు దూసుకెళ్లారు. స్పీకర్ స్థానం వద్ద ఎదురుగా వెళ్లి ధర్నా చేశారు. వాళ్లను ఖాళీ చేయించాలని, బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించినా.. వాళ్లు కూడా అసలు సభ్యులను బయటకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా సభ్యులెవరూ తమ తమ సీట్లలో కూర్చోకపోవడం.. సభలో అదే గందరగోళ పరిస్థితులు ఉండటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. -
డీఎంకే ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
స్పీకర్ ధనపాల్‌తో తీవ్ర వాగ్వాదం సందర్భంగా డీఎంకేకు చెందిన అత్యంత సీనియర్ ఎమ్మెల్యే దొరై మురుగన్ అస్వస్థత పాలయ్యారు. ఆయనను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన దొరై మురుగన్ వయసులో కూడా చాలా పెద్దవారు. ఆయన స్పీకర్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గట్టిగా మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే మార్షల్స్ ఆయనను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సులో వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అక్కడినుంచి ఆస్పత్రికి కూడా తరలించారు. అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ఎటూ 15 రోజుల గడువు ఇవ్వడం, తమ సభ్యుడు ఇప్పుడు ఆస్పత్రిలో ఉండటం తదితర కారణాలతో ఓటింగును, సభను కూడా వాయిదా వేయాలని డీఎంకే సభ్యులు పట్టుబడుతున్నారు. అయితే దీనిపై స్పీకర్ ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
-
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు. ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో... డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా.. డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు. -
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
► నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ ► బలపరీక్షకు ఎలాంటి పద్ధతి అనుసరిస్తారో ► పన్నీర్ సెల్వం వర్గంలోనే స్పీకర్ ధనపాల్ ► అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఎంజీఆర్ మనిషి చెన్నై నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ కనిపించింది. చివరకు ఆయన పళనిస్వామికే మొదటి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అంత సమయం అయితే లేదు గానీ.. స్పీకర్ ధనపాల్ ఏం చేస్తారనే విషయంలో కూడా అంతకు మించిన ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మృతితో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో 233 మంది సభ్యులుంటారు. మొత్తం వీళ్లందరి దృష్టి కూడా స్పీకర్ ధనపాల్ మీదే ఉంది. పన్నీర్ సెల్వం కోరినట్లుగా ఆయన రహస్య ఓటింగ్ నిర్వహిస్తారా.. లేక బహిరంగ బలపరీక్ష వైపు మొగ్గుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఎవరీ ధనపాల్? డీఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను 1972లో స్థాపించినప్పుడు ఆయన పార్టీలో చేరిన కొద్దిమందిలో ధనపాల్ కూడా ఒకరు. 1977 ఎన్నికలకు సేలం జిల్లాలోని శంకరగరి (రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. సి. పొన్నయన్, పన్రుట్టి ఎస్ రామచంద్రన్, కేఏ సెంగొట్టయన్లతో కలిసి ఆయన తొలిసారి అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గారు. ఆ తర్వాత 1980, 84లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలితకు మద్దతుగా ఉన్నారు. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో శంకరగిరి నుంచి తొలిసారి ఓడిపోయారు. 2001లో అక్కడే గెలిచిన తర్వాత శంకరగిరి జనరల్ స్థానంగా మారడంతో 2011లో ఆయన రాశిపురం నియోజకవర్గానికి మారారు. ఒక ఏడాది తర్వాత స్పీకర్ పదవికి జయకుమార్ రాజీనామా చేయడంతో సీనియర్ నాయకుడైన ధనపాల్‌ను జయలలిత స్పీకర్‌గా చేశారు. జయకుమార్ మద్దతుదారులైన ఆరుగురిని కూడా పదవుల నుంచి జయలలిత తప్పించారు. ఆ తర్వాత కూడా రెండోసారి జయలలిత వరుసగా అధికారం చేపట్టినప్పుడు ఆయనకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇలా రెండు వరుస అసెంబ్లీలలో ఒకే స్పీకర్ ఉండటం అరుదుగా జరుగుతుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్లను మార్చిన సందర్భాలున్నాయి. ఇక శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో స్పీకర్‌గా ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది ఆధారపడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బహిరంగ బలపరీక్ష నిర్వహించారు. అలాగే చేస్తారా లేక రహస్య ఓటింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
క్రమశిక్షణ చర్య
అసెంబ్లీలో డీఎండీకే ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై విచారణ వేగవంతమైంది. ఏడుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైన దృష్ట్యా, ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ లభించింది. సాక్షి, చెన్నై: అసెంబ్లీ వేదికగా డీఎండీకే ఎమ్మెల్యేలు, అధికార పక్షం సభ్యులు గత వారం ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని స్పీకర్ ధనపాల్ తీవ్రంగా పరిగణించారు. ఈ సమావేశాలకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేశారు. డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వీ.జయరామన్ ఆధ్వర్యంలో క్రమశిక్షణా సంఘం విచారణ ఆరంభించింది. వివాదం చోటుచేసుకున్న రోజున అసెంబ్లీలో జరిగిన ఘటనల వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించారు. డీఎండీకే విప్ చంద్రకుమార్, ఎమ్మెల్యేలు మోహన్‌రాజ్, దినకరన్, సీహెచ్.శేఖర్, పార్థిబన్, వెంకటేషన్‌తో పాటుగా మరో ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీలో వివాదం, మార్షల్‌పై దాడికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ నోటీసు ద్వారా ఆదేశించారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఎదుట హాజరయ్యారు. తొలుత వేర్వేరుగా తమ వివరణల్ని ఇచ్చుకున్నారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలందరూ కలసి తమ వాదనను జమాలుద్దీన్ ముందు ఉంచారు. వారి వాదనల్ని విన్న జమాలుద్దీన్ క్రమ శిక్షణా సంఘానికి పంపించారు. ఆ సంఘం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి క్రమ శిక్షణ వేటు డీఎండీకే ఎమ్మెల్యేలపై పడేనా లేదా, క్షమించేనా..? అన్నది వేచి చూడాల్సిందే. ఇద్దరికి బెయిల్ మార్షల్‌పై దాడి వ్యవహారంలో డీఎండీకే ఎమ్మెల్యే మోహన్ రాజులపై ఎలాంటి కేసుల్లేవు అని ప్రభుత్వం కోర్టులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయ స్థానం తోసి పుచ్చింది. మోహన్ రాజులుపై కేసుల్లేనప్పుడు తమ మీద కూడా ఉండదన్న ధీమా మరో ఇద్దరు ఎమ్మెల్యే శేఖర్, దినకరన్లలో నెలకొన్నాయి. ఈ ఇద్దరిపై మాత్రమే సచివాలయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్టు తేలింది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులు నమోదైన దృష్ట్యా, ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ లభించినట్టు అయింది.