Special team
-
సాహితి ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాపై సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి వందల కోట్లను సాహితి ఇన్ఫ్రా వసూల్ చేసిన విషయం తెలిసిందే. సాహితి ఇన్ఫ్రా స్కామ్ మొత్తం రూ. 1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. 9 ప్రాజెక్టుల పేరుతో భారీ మోసం చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: నా భర్తను దారుణంగా కొట్టి చంపేశారు’ -
ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనా?
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? వారు ప్రయాణిస్తుంటారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ (యూఎఫ్ఓ) నిజమేనా? ఇవి మనిషిని ఎంతోకాలంగా వేధిస్తున్న ప్రశ్నలు. మనకు సంబంధించినంత వరకూ యూఎఫ్ఓలు ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంటూ వచ్చాయి. సాసర్ ఆకారంలో ఉండే ఇవి ఆకాశంలో దూసుకెళ్తుండగా చూశామని ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చాలామంది చెబుతూ వచ్చారు. అంతకుమించి వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు ఏమీ తెలియదు. ఈ నేపథ్యంలో యూఎఫ్ఓల గుట్టేమిటో తేల్చేందుకు నాసా తాజాగా ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేసింది. దీనిపై లోతుగా పరిశోధన చేసేందుకు ఏకంగా 16 మందిని బృందంలో నియమించింది. అది సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. తొమ్మిది నెలలపాటు అన్నిరకాలుగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఈ మేరకు నాసా ట్వీట్ కూడా చేసింది. -
తెలంగాణలో కమల వికాసం ఎలా ఉంది?.. అమిత్ షాకు నేరుగా రిపోర్ట్లు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, సన్నద్ధతపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం తెలంగాణలో వాస్తవ పరిస్థితులేంటీ అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు తెప్పించుకుంటోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నేరుగా నివేదికలు పంపేలా ఎలక్షన్స్ ప్రొఫెషనల్స్ బృందం ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ గత ఏడాదికి పైగా ఇక్కడి నుంచే పనిచేస్తోంది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఇక్కడి నుంచి విడిగా రిపోర్ట్లు పంపే ఏర్పాటు ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై పార్టీతో సంబంధం లేని స్వతంత్ర పరిశోధన, అధ్యయన సంస్థల ద్వారా జాతీయ నాయకత్వానికి ‘క్షేత్ర నివేదిక’లు అందుతున్నాయి. రాష్ట్ర పార్టీలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లోకి ప్రభావం చూపేలా పార్టీ ప్రచారం వెళుతోందా..? లేదా అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతోంది, సాధారణ కార్యకర్త మొదలు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు, జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు వారికి అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా లేదా వారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర పార్టీ పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎలా పని చేస్తున్నారన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ సంస్థల అధ్యయనం, పరిశీలనలతో సిద్ధం చేసిన తటస్థ రిపోర్ట్‌ల ఆధారంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు సంకేతాలు అందాయి. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా.. అంతా బాగుంది అధికారంలోకి రావడమే తరువాయన్న ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ తో రాష్ట్ర నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండేలా జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో కొత్త– పాత నేతలు, సీనియర్– జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు, కొందరు ముఖ్య నేతలతోపాటు ఇతర స్థాయిల నాయకులు వ్యవహారశైలిని మార్చుకోవా లనే సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యనేతల్లో అధిక శాతం వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సొంతంగా ప్రమోట్ చేసుకునేందుకే ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం, పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా మొగ్గుచూపుతు న్నట్టు జాతీయ నాయక త్వానికి అందిన నివేదికల్లో స్పష్టమైంది. రాష్ట్ర పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఒక సంఘటిత, ఉమ్మడి శక్తిగా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ ఆశించిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించలేదని ఈ రిపోర్ట్ల్లో వెల్లడైనట్టు ముఖ్య నేతలు చెబు తున్నారు. ఈ నివేదికల ఆధారంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొద లుకుని జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యర్శులు, రాష్ట్ర పదాధికా రులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, ఇలా యావత్ పార్టీకి నూత న దిశానిర్దే శనం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన స్పష్టమైన కార్యా చరణను రాష్ట్ర పార్టీకి నాయకత్వం ఇవ్వ బోతున్నట్టు ‘సాక్షి’కి ఓ ముఖ్యనేత వెల్లడించారు. -
పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సజ్జల బృందం
సాక్షి, పోలవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల బృందం బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను 2005లో దివంగత ముఖ్యమంత్రి డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని, అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అయితే, వైఎస్ అకాల మరణంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయని, తిరిగి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పనులు వేగవంతమయ్యాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోలవరం కేంద్ర ప్రాజెక్ట్‌గా ఆమోదించబడిందని, బాబు హయాంలో పనులు వేగంగా జరిగి ఉంటే 2018లోనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యేదని, కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైంది వెల్లడించారు. పోలవరం నిర్మాణాన్ని సీఎం జగన్ తన కర్తవ్యంగా భావించారని, అందుకే కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ కష్టకాలంలోనూ సీఎం జగన్ ప్రత్యేక పర్యవేక్షనలో తొలిసారి స్పిల్ వే నుంచి నీటిని విడుదల చేసామని, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేవలం కాపర్ డ్యామ్ కట్టి చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని ప్రస్తావించారు. అలాగే పునరావాసం పనులు కూడా వాయువేగంతో ముందుకు సాగుతున్నాయని, దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకేయని ప్రతిపక్షం, ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. పునరావసానికి ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్ట్‌ను సందర్శించిన బృందంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
సుశాంత్ కేసు : రియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్పగించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. సుశాంత్ మృతి కేసులో ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో రియాతో పాటు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్యా చక్రవర్తి, షోయిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరంద, శ్రుతి మోదీ ఇతరుల పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. జూన్ 14న ముంబైలోని బాంద్రా అపార్ట్మెంట్లో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సీబీఐ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం సుశాంత్ మృతిపై దర్యాప్తు సాగిస్తుంది. విచారణను డీఐజీ గగన్‌దీప్ గంభీర్ పర్యవేక్షిస్తారు. అనిల్ యాదవ్ దర్యాప్తు అధికారి కాగా, సీబీఐ అధికారులు ఇప్పటికే అవసరమైన పత్రాల కోసం బిహార్ పోలీసులను సంప్రదిస్తున్నారు. మరోవైపు సుశాంత్ కేసులో మనీల్యాండరింగ్ కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. రాజ్‌పుత్ ఖాతాల నుంచి ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి రూ 15 కోట్లు బదిలీ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దిశగా ఆరా తీస్తోంది. ఈడీ వర్గాలు ఇప్పటికే సుశాంత్ సీఏ సందీప్ శ్రీధర్, రియా సన్నిహితుడు శ్యామ్యూల్ మిరందాను ప్రశ్నించారు. రియాను ఈనెల 7న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. రియా ఆస్తులపైనా ఈడీ ఆరా తీస్తోంది. చదవండి : సుశాంత్ ఆత్మహత్య: వెలుగులోకి రియా కాల్‌డేటా -
పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు
సాక్షి, శ్రీకాకుళం: లాక్డౌన్ వేళ రైల్వే టికెట్లను క్యాష్ చేసుకోవాలని అడ్డదారిలో వెళ్లిన ఓ వ్యక్తి కటకటాలపాలైన సంఘటన పలాసలో చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ–టికెట్లు విక్రయిస్తున్న సెల్‌ఫోన్ విక్రయదారుడ్ని రైల్వే పోలీసులు అరెస్టు చేసి షాపును సీజ్ చేశారు. పలాస ఆర్పీఎఫ్ ఓసీ కె.కె.సాహు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన కమ్యూనికేషన్ పేరుతో సకలాబత్తుల గిరీష్‌కుమార్ అనే వ్యక్తి సెల్‌రీచార్జ్‌తో పాటు రైల్వే టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం కోవిడ్–19 సందర్భంగా రైల్వేశాఖ శ్రామిక రైళ్లను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో గిరీష్‌కుమార్ ఈ–టికెట్లను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. మొత్తం 13 టికెట్లును ఆన్లైన్లో తీసుకున్నట్లు రైల్వేశాఖ ఐఆర్సీటీసీ అధికారులు ఢిల్లీలో గుర్తించి ఖుర్దారోడ్ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఓసీ కె.కె.సాహు తన సిబ్బందితో సహా రంగంలోకి దిగి గురువారం షాపును తనిఖీ చేయగా వాస్తవమని తేలింది. చదవండి: చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్ రైల్వే నిబంధనల ప్రకారం ఇతరులు రైల్వే టిక్కెట్లు అమ్మకూడదు. ఒక వ్యక్తి తన పాస్వర్డ్ వినియోగించి తన అవసరాలకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. పెద్ద నగరాల్లో రైల్వేశాఖ అనుమతులతో నిబంధనలకు లోబడి టిక్కెట్లు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకే పాస్‌వర్డ్‌తో టికెట్లు కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. గత ఏడాది ఆగస్టులో ఇదే సెంటరుపై రైల్వేశాఖ దాడి చేసి కేసును నమోదు చేసింది. మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంతో రైల్వే అధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేయడంతో పాటు షాపును సైతం సీజ్ చేశారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే.. -
కేరళ వరదలు: మాది ప్రత్యేక బాధ్యత
వరద విపత్తుతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ముందుకు వచ్చింది. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లోని బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి సమాయత్తమవుతోంది. వారిని ఆదుకునేందుకు ఒక నేషనల్ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వరదలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలకు సహాయం అందించేందుకు జాతీయ అత్యవసర కమిటీని ఏర్పాటు చేయాలని యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా ఆదేశించారు. యుఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం మాట్లాడుతూ భారీగా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయపడేందుకు, వారికి ఆపన్నహస్తం అందివ్వాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై వుందని వ్యాఖ్యానించారు. యుఏఈ సక్సెస్ స్టోరీలో కేరళ ప్రజల భాగస్వామ్యం కీలకమైందని వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. కేరళ ప్రజలకు సాయం చేసేందుకు బిజినెస్ లీడర్లు, ప్రజా సంఘాలు, కార్యకర్తలతో ఆదివారం చర్చించనున్నట్టు భారతదేశంలో యూఏఈ రాయబారి, నవదీప్ సింగ్ సూరి చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ భారీగా విరాళాలివ్వాలని ఆయన ట్విటర్ ద్వారా కోరారు. దీంతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేరళ సీఎంవో చేసిన ట్వీట్ యుఏఈ రాయబార కార్యాలయం రీ ట్వీట్ చేసింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ లేని వరద పరిస్థితి కేరళను అతలాకుతలం చేస్తోంది. గత పదిరోజులుగా దయనీయమైన, అధ్వాన్నమై వాతావరణం అక్కడి ప్రజలను బాధిస్తోంది. దాదాపు 13జిల్లాల్లో ఇంకా రెడ్ అలర్ట్ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. దాదాపు100 డ్యాములు, రిజర్వాయర్లు, నదులు మునిగిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 26వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. సహాయక శిబిరాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికి 324 మంది మృతి చెందగా 3లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా యుఏఈలో పనిచేస్తున్న అనేకమంది ఉద్యోగులు కేరళకు చెందిన వారే. I will chair a meeting on Sunday with major community organisations, activists and business leaders to coordinate relief support from UAE. Please contribute generously during this unprecedented crisis.#KeralaFloods#HelpKerala — IndAmbUAE (@navdeepsuri) August 17, 2018 Here's how you can help those affected by the unprecedented floods in Kerala. Now you can make donations online to Chief Minister's Distress Relief Fund through the site, https://t.co/OFHTHlZ9by #KeralaFloods #StandWithKerala. pic.twitter.com/XNlBKqdCUT — CMO Kerala (@CMOKerala) August 14, 2018 -
మదన్ కోసం ఐదు పోలీస్ బృందాలు
తమిళసినిమా: వేందర్ మూవీస్ మదన్‌ను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని వారి తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాలు వసూలు చేసి ఆ మొత్తాన్ని సంస్థ నిర్వాహకులకు అప్పగించానని ఒక లేఖలో పేర్కొని పరారైన మదన్ రెండున్నర నెలలుగా చెన్నై పోలీసులను నీళ్లు తాగిస్తున్నారు.ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.మదన్ ఇద్దరు భార్యలు,తల్లి ఆయన ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించాల్సిందిగా చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు మదన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.దీంతో నేరపరిశోధనా విభాగం పోలీస్ అధికారులు మదన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.మదన్ ఎక్కడికి పారిపోయారన్నది కచ్చితంగా తెలియకపోయినా సందేహంతో కాశీ, నేపాల్ అంటూ ఉత్తరాది ప్రాంతాలతో పాటు దక్షిణాదిలోని కేరళ,తమిళనాడులోని తిరుపూర్, ఇతర ప్రాంతాలలో ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నారు.అయితే ఇప్పటికీ మదన్ జాడ తెలియలేదు. మరో పక్క హైకోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తోంది.రెండున్నర నెలల క్రితం అదృశ్యం అయిన మదన్ నాటి నుంచి నేటి వరకూ సెల్‌ఫోన్‌ను వాడటం లేదట. దీంతో ఆయన ఆచూకీ కనుగొనడం పెద్ద సమస్యగా మారిందని పోలీసులు వాపోతున్నారు.మదన్ స్నేహితులపై నిఘా పెట్టినట్లు త్వరలోనే ఆయన్ని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారివేందర్కు బెయిల్ మదన్ మోసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అధినేత పారి వేందర్కు గురువారం సాయంత్రం నిబంధనలతో కూడిన బెయిలును చెన్నై మెజిస్ట్రేట్ కోర్టు మంజూరు చేసింది. 75 కోట్ల రూపాయలను,10 లక్షలతో పాటు ఇద్దరు వ్యక్తులను పూచీకత్తును, చెన్నై,సైదాపేట 11వ న్యాయస్థానంలో జమ చేసి బెయిల్ పొందాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
ఏలూరు స్మార్ట్ సిటీ కోసం ప్రణాళిక
ఏలూరు (మెట్రో): ఏలూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.740 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వం నుండి ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ భాస్కర్‌ను సీమెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి బృందం కలుసుకున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్‌కు ప్రాజెక్టు నివేదికను సీమెన్స్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. పురాతనమైన హేలాపురి నగరాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఎందరో అభివృద్ధి చేయాలని సంకల్పించారని, నిధుల కొరతతో ఆశించిన ఫలితం సాధించలేకపోయారన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. -
ఓ ఎమ్మెల్యే.. అరడజను గూఢచారులు
అధికారపార్టీ నేత అవినీతికి పరాకాష్ట వసూళ్ల కోసం ప్రత్యేక టీం ఎవరెవరు ఎంత తింటున్నారో నిఘా పెట్టాలని ఆదేశం నివేదిక ఆధారంగా అక్రమ వసూళ్లు కాదూ కూడదంటే బదిలీ బెదిరింపులు గగ్గోలు పెడుతున్న అధికారులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆలీబాబా.. అరడజను దొంగలు. ఇదేమంత కొత్త విషయం కాకపోవచ్చు. ఓ ఎమ్మెల్యే.. అరడజను గూఢచారులు. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారిన అంశం. కొత్త సినిమాను తలపిస్తున్న ఈ వ్యవహారం కాస్తా అందరి నోళ్లలో నానుతోంది. నియోజకవర్గంలో అవినీతి పరుల చిట్టా తయారు చేయడమే ఈ గూఢచారుల పని. ఉన్నోడిని కొట్టు.. లేనోడికి పంచిపెట్టు.. ఇదీ సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించే కథ. అలాగని.. ఈ ఎమ్మెల్యే కూడా అవినీతి అధికారుల చిట్టా సేకరించి, వారి నుంచి మామూళ్లు వసూలు చేసి పేదలకు పంచుతాడనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇక్కడంతా రివర్స్. జిల్లాలో కొత్త పుంతలు తొక్కుతున్న అధికార పార్టీ నేతల వసూళ్ల బాగోతానికి ఇది పరాకాష్టగా నిలుస్తోంది. ఏకంగా గూఢచారులను నియమించుకొని ఏయే అధికారి ఎంత తింటున్నారో లెక్కలు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లెక్కల ఆధారంగా తన వాటా ఇచ్చుకోవాలని ఆ ఎమ్మెల్యే హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే బదిలీ పేరిట బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. కొద్దిమంది అధికారులు తాము ఆ స్థాయిలో అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా తన వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండటం గమనార్హం. ఈ విధంగా సదరు ఎమ్మెల్యే ఏకంగా ఆరుగురు గూఢచారులను నియమించుకొని సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. పక్కాగా అవినీతి చిట్టా తనకు నమ్మకస్తులుగా ఉన్న ఆరుగురు అనుచరులను ఈ గూఢచర్యం పనికి సదరు ఎమ్మెల్యే నియమించుకున్నట్టు తెలిసింది. వీరి రోజువారీ పనంతా ఎవరెవరు ఎంత తింటున్నారనే వివరాలను సేకరించడమే. ఈ వివరాలను ఎప్పటికప్పుడు సదరు ఎమ్మెల్యేకు చేరవేస్తే సరి. ఆ సమాచారం ఆధారంగా సదరు ఎమ్మెల్యే తన వాటాను నిర్ణయించి సంబంధిత అధికారికి కబురు పంపుతున్నారు. ఇక ఆ మేరకు ఇచ్చుకోవాల్సిందే. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రధానంగా ఏయే పోస్టుల్లో ఉండే అధికారులకు నెలకు ఎంత ఆదాయం వస్తుందనే విషయం కాస్తా గూఢచారులు ఎమ్మెల్యే చెవిన వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏయే డీల్స్ నడుస్తున్నాయి? ఫలానా డీల్ నుంచి ఏ అధికారి ఎంత తీసుకున్నారనే విషయం కాస్తా ఎమ్మెల్యేకు పూసగుచ్చినట్లు వివరిస్తున్నట్లు సమాచారం. ఆందోళనలో అధికారులు ఈ నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులు కూడా జంకుతున్నారు. ఇలాంటి రహస్య గూఢచారులను తాము ఇంత వరకు ఎక్కడా చూడాలేదని అధికారులు వాపోతున్నారు. ఒకవేళ తాము అవినీతికి పాల్పడకపోయినప్పటికీ వీరిచ్చే నివేదిక ఆధారంగా తమ నుంచి అంత మొత్తం.. ఇంత మొత్తం కావాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారని కొద్దిమంది అధికారులు వాపోతున్నారు. ఒకవేళ అడిగిన మొత్తం ఇవ్వకపోతే ఇక్కడ పనిచేయలేరనే బెదిరింపులు అధికార పార్టీ నేతల నుంచి వస్తున్నాయని సదరు అధికారులు వాపోతున్నారు. ఈ కోవలోనే తాజాగా రోడ్ల విస్తరణ పనుల్లో కొన్ని షాపుల నుంచి ఒక అధికారి రూ.10 లక్షలు వసూలు చేశారని నివేదిక ఆధారంగా సదరు ఎమ్మెల్యే రూ.4 లక్షలు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఆయన బారిన పడి అనేక మంది అధికారులు లబోదిబోమంటున్నారు. -
హాస్య నటుడి కోసం ప్రత్యేక బృందం
భువనేశ్వర్: క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలో చిక్కుకున్న ఒడియా చలన చిత్ర హాస్య నటుడు తత్వ ప్రకాష్ శత్పతి అలియాస్ పప్పూ పమ్ పమ్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. పోలీసు యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే పప్పూ పమ్ పమ్ను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తోందని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు సాగుతున్నాయి. తప్పించుకున్న తిరుగుతున్న పప్పూ పమ్ పమ్ గాలించి అరెస్టు చేసేందుకు జంట నగరాల పోలీసు కమిషనరేటు ప్రత్యేక టీమ్‌ని నియమించినట్లు కమిషనరు వై. బి. ఖురానియా బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు, మహిళా ఠాణా అధికార వర్గాలు ఈ అంశాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పప్పూ పమ్ పమ్ అరెస్టు కోసం ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ మహిళా మోర్చా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. నగరంలో పప్పూ పమ్ పమ్ ఇంటికి దగ్గర ఖండగిరి ఛక్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు బుధవారం రాస్తా రోకో, ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగా పప్పూ పమ్ పమ్ దిష్టి బొమ్మని దహనం చేశారు. -
ముగ్గురు నకిలీ పోలీసులు అరెస్టు
నకిలీ తుపాకి, నగదు, కారు స్వాధీనం పరారీలో మరో నిందితుడు జానీ వివరాలు వెల్లడించిన అర్బన్ అదనపు ఎస్పీ శ్రీనివాసులు గుంటూరు క్రైం : వ్యసనాలకు బానిసలుగా మారిన నలుగురు యువకులు సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరాలకు పాల్పడింది ఇలా... నరసరావుపేటకు చెందిన ఉయ్యాల గోపి, షేక్ నాగార్జున గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు సత్తెనపల్లి, నరసరావుపేట, ప్రకాశం జిల్లా సంతమాగలూరు, గుంటూరు రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో కారులో ప్రయాణికులను ఎక్కించుకుని ఊరు బయటకు తీసుకెళ్లి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో వారిద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు బెయిల్‌పై విడుదల అయ్యారు. అనంతరం ఉయ్యాల గోపి నేరాలకు పాల్పడడం మానేశాడు. నాగార్జున నరసరావుపేటకు చెందిన కొనికళ్ళ ప్రకాష్, రౌతు ప్రసంగి, షేక్ జానీలతో ఒక ముఠాగా ఏర్పడి ఏప్రిల్ 6న ప్రకాశం జిల్లా సంతమాగలూరు సమీపంలో ఇండికా కారులో ఇద్దరు ప్రయాణీకులను ఎక్కించుకుని ఊరి బయటకు రాగానే తాము పోలీసులమని చెప్పి నకిలీ తుపాకితో బెదిరించి వారి వద్ద ఉన్న రూ.28,500 దోచుకున్నారు. ఏప్రిల్ 12న నకరికల్లు నుంచి ఇద్దరు ప్రయాణికులను ఎ క్కించుకుని అదేవిధంగా బంగారు ఉంగరం, రూ.2వేలు నగదు దోచుకున్నారు. అదే నెల 17న నకరికల్లు నుంచి ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళుతున్న ఓ యువకుడిని ఊరి బయట అటకాయించి అతని వద్ద రూ.10 వేలు దోచుకున్నారు. ఏప్రిల్ 23 అర్ధరాత్రి సమయంలో గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద మాచర్లకు వెళ్లేందుకు వేచి ఉన్న దుర్గా భాస్కర్‌ను కారులో ఎక్కించుకుని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ వద్ద తుపాకితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ. 48,500 నగదు దోచుకొని పరారయ్యారు. స్పెషల్ టీమ్ ఏర్పాటు తుపాకీతో బెదిరించి తమ వద్ద నగదు దోచుకున్నారని మాచర్లకు చెందిన భాస్కరరావు గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న అర్బన్ జిల్లా ఎస్సీ త్రిపాఠి నిందితులను గుర్తించేందుకు సీసీఎస్ డీఎస్పీ పి.శ్రీనివాస్, సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం జంక్షన్లో గురువారం చాకచక్యంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు షేక్‌జానీ పరారయ్యాడు. నిందితుల వద్ద ఉన్న రూ.87,400 నగదు, బంగారు ఉంగరం, నకిలీ తుపాకి, లాఠీ, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు అదనపు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా స్పెషల్ టీమ్‌లోని సీఐలు అజయ్‌కుమార్, శివప్రసాద్, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి సిఫార్స్ చేస్తానని తెలిపారు. -
ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీమ్
వరంగల్: తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ టీంలు మురికివాడల్లో లే అవుట్ల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నయి. స్పెషల్ టీంలు వరంగల్ లక్ష్మిపురం, శాకర్తికుంట , గిరిప్రసాద్‌నగర్, అంబేద్కర్‌నగర్ ,జితేందర్‌నగర్, ప్రగతినగర్‌లో అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలు చేశారు. రేపు ఉదయం నుంచి రంగంలోకి దిగనున్న నాలుగు బృందాలు. ఈ బృందాలు అధ్యయనంపై రేపు సాయంత్రమే సీఎం సమీక్ష. బృందాల పర్యవేక్షణ బాధ్యత గ్రామీణాభివృద్ధిశాఖ, ముఖ్యకార్యద ర్శి రేమండ్‌పీటర్‌కు అప్పగించిన కేసీఆర్. రేపు ఉదయం నుంచి మురికివాడల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్న స్పెషల్ టీమ్ బృందాలు. -
చిక్కుల్లో మమతా బెనర్జీ
-
అత్యాచారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు
బుట్టాయగూడెం : జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఓ హాస్టల్లో చదువుతున్న అమాయక విద్యార్థినులపై అత్యాచార ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వీరికి సహకరించిన వంట మనిషిని అరెస్ట్ చేశామన్నారు. డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఉన్న హాస్టల్లోని విద్యార్థినులతో ఆసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వంట మనిషి గుడికందుల శ్యామల, అత్యాచారానికి పాల్పడిన గండ్రోతు రామకృష్ణ, బందెల మధు, కనిపాటి సునీల్‌కుమార్ (సుందరం)లపై నిర్భయ్, ఫోక్స్ యాక్ట్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, పీసా చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచారానికి సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన హాస్టల్వార్డెన్పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిని జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. అలాగే అత్యాచారం చేసిన ముగ్గురిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. డీటీసీ కేజీవీ సరిత, జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్, ఎస్సై సైదానాయక్, ఎస్సై కాంతి ప్రియ దర్యాప్తు టీమ్‌లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.