విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింద. విమానాల్లోని మానవ వ్యర్థాలను గృహాలపై విడిచిపెట్టడంపై మండి పడింది. దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ని ఆదేశించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో నివిసించే మాజీ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సాత్వంత్ సింగ్ దహియా దాఖలు చేసిన పిటీషన్ పై విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ ఈ ఆదేశాలిచ్చారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కి విమానయాన సంస్థ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయన్న సైనిక అధికారి వాదనలను ట్రిబ్యునల్ సమర్ధించింది.
విమానాల టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ డీజీసీఎ కి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఇలా వ్యవహరించే విమానయాన సంస్థలకు రూ .50,000 జరిమానా విధించాలని డీజీసీఏ ని కోరింది. జరిమానా ద్వారా సేకరించిన సొమ్మను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వద్ద డిపాజిట్ చేయాలని కోరింది. సంబంధిత ఫిర్యాదులకో్సం ఒక హెల్ప్ లైన్ , ఈ మెయిల్ క్రియేట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
మరోవైపు సీపీసీబీ కూడా ఎయిర్ లైన్స్ చర్యపై విస్మయం వ్యక్తంచేసింది. ఫిర్యాదు దారు ఇంటిదగ్గర సేకరించిన సాంపిల్స్ ను పరీక్షించగా, అవి మానవ వ్యర్థాలుగా తేలిందని పేర్కొన్నారు. విమానాలు ల్యాండ్ అయినపుడు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో టాయిలెట్ ట్యాంకులు ఖాళీగా ఉండడం గమనించామని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను విమాన మంత్రిత్వ శాఖ ఖండించింది. విమానం ల్యాండ్అయిన తరువాత సాధారణంగా వాటిని శుభ్రం చేస్తారని పేర్కొంది. అయితే ఏవియేషన్ అధికారులు టాయిలెట్ ట్యాంక్ లీక్ అయివుండంచ్చని తెలపడం విశేషం.