బెంగుళూరును రెండుగా విభజించనున్నారా ?
బెంగళూరు: బెంగుళూరు మహానగరం దీనిని రెండుగా విభజిస్తే పరిపాలనకు వీలుగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య అభిప్రాయపడ్డారు. కెంపెగౌడ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్లొన్న ఆయనపై విధంగా స్పందించారు.
దీంతో గతంలో బలమైన ప్రతిపక్షం కారణంగా ఆగిపోయిన బెంగుళూరును రెండుగా విభజించాలన్న ప్రతిపాదనకు ఊపిరిపోసినట్లయింది. అవార్డుల ప్రధానోత్సవంలో మాట్లాడుతూ.. కెంపెగౌడ దూరదృష్టిని ఆయన కొనియాడారు. ఆయన నిర్మించిన కృత్రిమ చెరువులు బెంగుళూరు ప్రజల అవసరాల తీరుస్తున్నాయని భవిష్యత్ తరాలకు కూడా అవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
నీటి కొరతను జయించడానికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మునిసిపల్ కార్పొరేషన్లో ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా సాధ్యమైనన్ని నిధులు కేటాయించానని ఆయన తెలిపారు. ఎడ్యుకేషన్, మెడిసన్, మీడియా, సోషల్ సర్వీస్, ఆర్స్ట్, కల్చర్, సినిమా తదితర రంగాల్లో కృషి చేసిన 150 మంది ప్రముఖులకు ఆయన కెంపెగౌడ అవార్డులను ప్రదానం చేశారు.