spoofs
-
సరదాగా యాప్ క్రియేట్ చేసి.. జైలుపాలయ్యాడు
సాక్షి, సిటీబ్యూరో: పేటీఎంను పోలి ఉండే నకిలీ యాప్ ‘పేఏటీఎం స్ఫూఫ్’ యాప్‌ను తయారు చేసింది గుర్గావ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హితేష్ వర్మగా తేలింది. సరదాగా అతడు తయారు చేసిన ఈ యాప్ పలువురు వ్యాపారులు నష్టపోవడానికి కారణమైంది. నగరంలోని దక్షిణ మండల పరిధిలో దీన్ని వినియోగించిన మూడు ముఠాలు పలువురు వ్యాపారులకు టోకరా వేశాయి. అప్రమత్తమైన పేటీఎం సంస్థ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్ నేతృత్వంలోని బృందం హితేష్ వర్మను గుర్గావ్లో అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరు పరిచిన అధికారులు పీటీ వారెంట్‌పై సోమవారం నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు. గుర్గావ్లోని పటౌడీ ప్రాంతానికి చెందిన హితేష్ వర్మ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. తనకున్న పరిజ్ఞానంతో పేఏటీఎం స్ఫూఫ్ పేరుతో ఓ నకిలీ యాప్ సృష్టించాడు. దీన్ని కొన్నాళ్ల క్రితం వరకు గూగుల్ ప్లేస్టోర్స్‌లో ఉంచాడు. అనేక మంది ఈ స్ఫూఫ్డ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పేటీఎం యాప్ ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు లావాదేవీ పూర్తయిన తర్వాత ఆ విషయం నగదు చెల్లించిన వ్యక్తి ఫోన్ స్కీన్ర్‌పై కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లోనే నగదు పొందిన వ్యక్తి ఫోన్‌కూ సందేశం వస్తుంది. అయితే స్ఫూఫ్డ్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపినట్లు వ్యాపారుల్ని నమ్మిస్తారు. ఈ యాప్ దుకాణదారుడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయదు. డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తే ఆ వ్యాపారి పేరు, ఫోన్ నెంబర్ తెలుసుకుని వాటిని ఈ నకిలీ యాప్‌లో ఎంటర్ చేస్తాడు. ఆపై నిరీ్ణత మొత్తం పొందుపరిస్తే... నిజమైన పేటీఎం యాప్ మాదిరిగానే చెల్లించిన వ్యక్తి ఫోన్‌పై లావాదేవీ పూర్తయినట్లు డిస్ప్లే వస్తుంది. అయితే ఆ నగదు అందుకున్న వ్యక్తికి మాత్రం ఎలాంటి సందేశం రాదు. తమ ఫోన్లో వచి్చన సందేశాన్ని చూపించిన కొందరు మోసగాళ్లు క్షణం ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి జారుకునేవారు. సాంకేతిక కారణాలతో తమకు సందేశం రావడం ఆలస్యమైందని భావిస్తున్న వ్యాపారులు వేచి చూసి మోసపోయే వారు. నగరానికి చెందిన మూడు తొలుత పాతబస్తీలోని చిన్న చిన్న దుకాణాలు, జ్యూస్ సెంటర్ల వద్ద ఈ స్ఫూఫ్డ్ యాప్‌తో ‘ట్రయల్ రన్’ చేశారు. అక్కడ సక్సస్ కావడంతో పెద్ద దుకాణాలపై పడ్డారు. కంచన్‌బాగ్ పరిధిలోని ఓ వస్త్ర దుకాణంలో రూ.28 వేలు, చంద్రాయణగుట్టలోని స్పోర్ట్స్ స్టోర్‌లో రూ.8500, కిరాణా షాపులో రూ.10,700, మీర్చౌక్లో ఉన్న బంగారం దుకాణంలో రూ.28 వేలు వెచి్చంచి ఉంగరం ఖరీదు చేసి మోసం చేశాయి. వీళ్ల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేటీఎం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు హితేష్ వర్మను పట్టుకున్నారు. చదవండి: విషాదం నింపిన అమెరికా పర్యటన.. ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో.. -
వైఎస్ జగన్ పీఏ నెంబర్ స్పూఫింగ్ చేసినందుకు అరెస్ట్
సాక్షి, సిటీబ్యూరో : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్నార్) వినియోగిస్తున్న సెల్‌ఫోన్ నంబర్‌ను స్పూఫింగ్ చేసిన నలుగురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై శనివారం అరెస్ట్ చేశారు. ఈ పరిజ్ఞానం ఉపయోగించి అనేక మందికి కాల్స్ చేస్తున్న ఆగంతకులు వైఎస్ జగన్ లాగా మాట్లాడారు. ఆపై కొన్ని వాట్సాప్ నంబర్ల ద్వారా చాటింగ్ చేశారు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ పేరు, డిస్ప్లే పిక్చర్ (డీపీ) వాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే చేస్తున్న వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్ చేసిన దుండుగులు కొందరిని డబ్బు డిమాండ్ చేయగా, మరికొందరిని దూషించారు. దాదాపు పక్షం రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం సీరియస్‌గా తీసుకున్న పార్టీ కేంద్ర కార్యాలయం 2018 డిసెంబర్లో హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆదేశించారు. కేఎన్నార్ వినియోగించిన ఆ సెల్‌ఫోన్ నంబర్ హర్షవర్ధన్ రెడ్డి పేరుతో ఉంది. వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్ ఈ నంబర్ ద్వారానే వారికి కాల్స్ చేస్తుండేవారు. ఈ నంబర్ సంగ్రహించిన ఏపీ చెందిన పండరి విష్ణుమూర్తి, గంగవరపు అరుణ్‌కుమార్, పిల్ల రామకృష్ణ, మార్తాండం జగదీష్ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు చేపట్టిగా... ఇటీవల ముమ్మిడివరం పోలీసులు ఈ నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఆ నలుగురిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరు పరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండుకు తరలించారు. -
నీరవ్ మోదీ స్ఫూఫ్ యాడ్ చూశారా?
-
స్పూఫింగ్‌తో ముంచేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ ఫహీం రాయ్‌కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ ఫోన్లు చేసిన ఆగంతకుడు తొలుత వైద్యుడికే చెందిన మరో నంబర్, ఆపై ఓ రాజ్యసభ సభ్యుడు, మరో ఇద్దరు పోలీసు అధికారుల సెల్ నంబర్ల నుంచీ ఫోన్లు వస్తున్నట్లు చేయగలిగాడు. ఇంటర్నెట్లో విరివిగా లభిస్తున్న కాల్ స్పూఫింగ్ సాఫ్ట్వేర్ వల్లే ఇలాంటివి సాధ్యమని సైబర్ క్రైమ్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకూ శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకే పరిమితమైన ఈ టెక్నాలజీని ఇప్పుడు నేరగాళ్లు, మోసగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కాల్ స్పూఫింగ్‌కు మాత్రమే కాక మెయిల్ స్పూఫింగ్‌కు పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫహీం ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు లోతుగా కూపీ లాగుతూ నిందితుల కోసం గాలిస్తున్నారు. క్లోనింగ్‌ను తలదన్నుతూ.. ఒకప్పుడు సిమ్‌కార్డుల్ని క్లోనింగ్ చేసేవారు. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి వినియోగించడం. దీనిద్వారా చేసే ఫోన్ కాల్స్ మీ నంబర్ నుంచే వెళ్తాయి. ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ(ఐఎంఎస్‌ఈ) నంబర్ తెలిసి ఉండాలి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయినా అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. దీనిని తలదన్నేలా అందుబాటులోకి వచ్చిందే స్పూఫింగ్. గతంలో ఫోన్ కాల్స్‌కే పరిమితమైన ఈ విధానం ఇప్పుడు ఈ–మెయిల్స్‌కు సైతం విస్తరించింది. ఏకంగా ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) అడ్రస్‌నూ స్పూఫ్ చేయగలుగుతున్నారు. కొన్నేళ్ల క్రితం సరదా కోసం ‘సాఫ్ట్ మేధావులు’రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పాటు మోసగాళ్లుకూ వరంగా మారింది. స్పూఫింగ్ చేస్తారిలా.. నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటరైన తర్వాత సదరు వ్యక్తి ఫోన్ నంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు అతడికి సెల్ఫోన్లో ఎవరి నంబర్ డిస్ప్లే కావాలో కూడా పొందుపరుస్తారు. ఇలాగే ఈ–మెయిల్ ఐడీ స్పూఫింగ్ వెబ్సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ–మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకోవచ్చు. టోకరా వేస్తున్నారిలా సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు జారీ చేసి నిరుద్యోగుల్ని ఆకర్షిస్తున్నారు. వారి బయోడేటా తదితరాలు సేకరించిన తర్వాత ఫోన్ ఇంటర్వ్యూ దగ్గర అసలు కథ మొదలవుతోంది. సదరు కంపెనీకి చెందిన ఫోన్ నంబర్‌కు స్పూఫింగ్ చేయడం ద్వారా వారే కాల్ చేసినట్లు సృష్టిస్తున్నారు. ఉద్యోగార్థి అనుమానం వచ్చి ఆ నంబర్ ఎవరిదని ఆరా తీసినా ప్రముఖ కంపెనీకి చెందినదిగానే తేలుతుంది. ఆపై అదే కంపెనీ మెయిల్ ఐడీ, ఐపీ అడ్రస్‌ను స్పూఫ్ చేస్తున్న మోసగాళ్లు వాటి ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్, ఆఫర్ లెటర్ పంపిస్తున్నారు. ఆయా సంస్థల్లోని పెద్ద మనుషులతో తమకు సంబంధాలు ఉన్నాయని, వారి ద్వారానే బ్యాక్‌డోర్ ఎంట్రీలుగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మోసగాళ్లు చెపుతున్నారు. దీంతో ఉద్యోగార్థులు నేరుగా ఆయా కార్యాలయాలకు వెళ్లి వివరాలు సరిచూసుకునే ధైర్యం చేయట్లేదు. దీంతో సదరు నిరుద్యోగి తనకు ఉద్యోగం వచ్చిందని భావించి మోసగాడు చెప్పిన బ్యాంక్ ఖాతాలో అడిగినంత జమ చేస్తున్నారు. ఇవి కూడా బోగస్ వివరాలతో ఓపెన్ చేసినవి కావడంతో వీటి ద్వారానూ మోసగాళ్లను పట్టుకునే అవకాశం లేదు. ఈ తరహాలో ఘరానా మోసాలతో నిరుద్యోగులను, సామాన్యుల్నీ నిండా ముంచే సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
స్పూఫ్ అప్
ఇప్పుడంతా క్రికెట్ మ్యేనియా. క్లబ్, కాలేజీ, ఆఫీసు, ఇల్లు, వాకిలి... అన్నీ ఆట స్థలాలే! బౌలింగ్ యాక్షన్లు... బ్యాటింగ్ రీప్లేలు... స్కోరింగ్ టాపిక్స్... మ్యాచ్ ప్రిడిక్షన్స్... టోటల్‌గా క్రికెట్ ప్రపంచ కప్‌కు ఎడిక్ట్ అయిపోయారు సిటీవాసులు. ఇంట్లో టీవీ... లేదంటే ఇంటర్నెట్... వర్కింగ్ ప్లేస్‌లో ల్యాప్‌టాప్... ఏదీ కుదరకపోతే చేతిలో మొబైల్... మొత్తానికి ఏదో రకంగా ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా క్రికెట్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. ఈ టెంపరేచర్‌కు తగ్గట్టు టీవీలో యాడ్సూ రెడీమేడ్‌గా వచ్చేస్తున్నాయి. భారత్ మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి జట్టుపై వ్యంగాస్త్రాలతో ప్రసారమవుతున్న ఈ స్పెషల్ ప్రకటనలు ఫ్యాన్స్‌ను సూటిగా చేరి తెగ పాపులర్ అయిపోతున్నాయి. వీటి ఇన్స్పిరేషన్తో అభిమానులూ చెలరేగిపోతున్నారు. యూట్యూబ్ బేస్‌గా స్టాట్స్, సెటైర్స్ థీమ్స్‌గా కుప్పలుతెప్పలు ‘స్పూఫ్స్’ సృష్టించేసి లక్షల్లో హిట్స్ సాధించేస్తున్నారు. ..:: హనుమా గాడ్జెట్ విప్లవం ప్రభావమనుకున్నా... అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమనుకున్నా... క్రికెట్‌కు పాపులారిటీ పెరిగిందనుకున్నా... మొత్తానికి ఈసారి ప్రపంచకప్‌కు ఎప్పుడూ లేనంత క్రేజ్ వచ్చేసింది. మ్యాచ్ టైమ్‌లోనే కాదు... ముందు... తరువాత కూడా ఆట టాపిక్కే వినిపిస్తోంది. ఫ్యాన్స్‌కు మరింత కనెక్ట్ అయ్యేందుకు భారత్- పాక్ హైటెంపో మ్యాచ్ ముందే ఓ ప్రకటన సంచలనం రేపింది. వరల్డ్ కప్‌లో భారత్‌పై గెలిచిన రికార్డు పాక్‌కు లేదు. ఈ నేపథ్యంలో తీసిన యాడ్ ఇది. ఓ పాక్ అభిమాని... తమ జట్టు ఈసారన్నా విజయం సాధించకపోతుందా... సంబరాలు చేసుకోకపోతామా అని ఆశగా క్రేకర్స్ బాక్స్‌తో సహా టీవీ ముందు కూర్చుంటాడు. చివరకు పాక్‌కు పరాభవమే మిగులుతుంది. పాపం అతగాడు మళ్లీ నిరాశతో కుంగిపోతాడు. దీనికి వ్యూవర్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇక్కడి నుంచే ‘స్పూఫ్స్’ ఊపందుకున్నాయి. దీనికి కౌంటర్‌గా పాక్ అభిమానులు ఓ వీడియో రిలీజ్ చేశారు. పాక్ విజయాలన్నింటినీ ఏకరవు పెడుతూ భారత్, జట్టు సభ్యులను ఎండగడుతూ వేసిన వ్యంగాస్త్రం ఇది. రెస్పాన్స్ అదుర్స్... ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌లో ‘మౌకా మౌకా’ ప్రకటన టెంపోను తారస్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచ కప్‌లో భారత్ ఎన్నడూ దక్షిణాఫ్రికాపై గెలవలేదు. ఈ యాంగిల్లో... ప్రొటీస్ ఆటగాళ్లు భారత అభిమాని తలుపు తట్టి, ఈసారి చాన్స్ మీది కావచ్చు అంటూ క్రేకర్స్ బాక్స్ ఇచ్చి వెళతారు. సెటైరికల్‌గా ఉండే ఈ యాడ్‌కు అంతే రేంజ్లో రెస్పాన్స్ ఇచ్చారు ఇండియన్ యంగ్‌స్టర్స్. ప్రొటీస్ ఇంత వరకు కప్ గెలవలేదనే యాంగిల్లో, వారి లోటుపాట్లను తవ్వే స్టాట్స్‌తో యౌవనిక్ అనే కుర్రాడు రెస్పాన్స్ వీడియోను యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అందులో సీన్ రిపీట్! భారత ఆటగాడు టపాసుల పెట్టెను దక్షిణాఫ్రికా జట్టుకు ఇచ్చే సీన్ ఇది. ఇప్పటి వరకు రెండున్నర మిలియన్ల మంది పైగా ఈ వీడియో వీక్షించారు. మౌకాపే చౌకా... భారత్- యూఏఈ మ్యాచ్ ముందు వచ్చిన ‘మౌకా పే చౌకా’ యానిమేటెడ్ వీడియో కూడా తక్కువ గిలిగింతలేం పెట్టలేదు. టీవీ ముందున్న ప్రొటీస్ అభిమానులు ఓటమి తరువాత తమ జట్టు చొక్కా చించేస్తారు. ఈలోగా విరాట్ కొహ్లీ తలుపుతట్టి వారికి టీమిండియా జర్సీ ఇచ్చి వెళతాడు. అది ధరించిన సదరు ఫ్యాన్స్... ఇండియాకు జేజేలు కొడతారు. తలుపు చాటు నుంచి ఇదంతా చూసిన యూఏఈ కెప్టెన్ చెమటలు పట్టి కుంగిపోతాడు. మరో స్పూఫ్లో... కెప్టెన్ బతిమాలుతున్నా భారత్‌తో ఆడేందుకు యూఏఈ ఆటగాళ్లు ససేమిరా అంటారు. ఇంతలో ఇండియన్ చైల్డ్ ఫ్యాన్స్... తలుపు తట్టి వారి ముందే ఓ పాలిథిన్ బ్యాగ్‌లో గాలి ఊది ఠాప్ అని పేల్చేసి పగలబడి నవ్వుకుంటూ వెళ్లిపోతారు. ఐర్లాండ్నూ వదల్లేదు... వెస్టిండీస్‌పైనా సెటైరికల్ వీడియోలు నడిచాయి. ఇక ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ఈ వైరల్ బాగా ముదిరిపోయింది. ఓ స్పూఫ్లో... పాక్ కెప్టెన్ మిస్బా ఉల్హక్ చాయ్ కలుపుతుంటే... స్టార్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ పెరట్లో ఇండియా ఆటగాళ్ల డ్రెస్సులు ఉతుకుతుంటాడు. కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న ధోనీకి మిస్బా చాయ్ అందిస్తాడు. తరువాత ఇద్దరూ కలసి భారత్‌కు జయమంటూ జేజేలు పలుకుతారు. రాబోయే జింబాబ్వే మ్యాచ్‌కూ వ్యంగాస్త్రం మొదలైపోయింది. ఐర్లాండ్ ఆటగాడితో కలసి మ్యాచ్ చూస్తుంటాడు జింబాబ్వే కెప్టెన్. కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తీస్తే... ఇండియన్స్. మాకు రావల్సిన పార్శిల్ మీకు వచ్చిందంటూ వారి రూమ్‌లో ఉన్న క్రేకర్స్ బాక్స్‌ను చూపిస్తారు. కావాలనే తమ డ్రెస్సింగ్ రూమ్‌లో దాచుకున్న సదరు ఆటగాళ్లు.. సెలైంట్‌గా బాక్స్‌ను ఇచ్చేస్తారు. అలాగే విరాట్‌పై సెటైర్స్లో అనుష్క, ఆమిర్‌ను మిక్స్ చేసిన వీడియోలూ తెగ పేలాయి. వీటిల్లో చాలావరకు ట్యూబ్‌లో మిలియన్‌కు పైనే హిట్స్ వచ్చాయంటే... వీటికి ఏ స్థాయిలో ఆదరణ ఉందో చెప్పక్కర్లేదేమో! తెలుగువన్.కామ్ లోకూడా ‘అతడు’ పేరుతో వరల్డ్ కప్ స్పూఫ్ రిలీజ్ అయింది. స్పూఫ్స్, క్రికెట్, సిటీప్లస్,