sreenu
-
సాయిరామ్ శంకర్ ‘వేయి దరువేయ’ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
కళ్లెదుటే తండ్రిని చంపడంతో.. కొడుకు అతడిని వెంబడించి మరీ..
సాక్షి, ఆదిలాబాద్: పాత కక్షలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పట్టణంలోని బెస్తవాడకు చెందిన బామ్మె శ్రీను(30), గుబుడె శ్రావణ్(45) హత్యలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవాడకు చెందిన బామ్నె శ్రీను కూలీ పని చేసుకుని జీవిస్తుండగా, అదే కాలనీకి చెందిన గుబుడె శ్రావణ్ చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కాలనీలో ఇద్దరి నివాసాలు దగ్గరదగ్గరే ఉన్నాయి. పాత కక్షల నేపథ్యంలో శుక్రవారం రాత్రి తాగిన మైకంలో బామ్నె శ్రీను గొడ్డలితో గుబుడె శ్రావణ్ మెడపై దాడి చేశాడు. రక్తం మడుగులో కింద పడిపోయిన శ్రావణ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన గొడ్డలి అక్కడే పడేసిన శ్రీను లొంగిపోయేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు. ఇది గమనించిన శ్రావణ్ కుమారుడు అనిల్ అక్కడి నుంచి శ్రీనును వెంబడించాడు. పట్టణంలోని గణేశ్ మందిర్ సమీపంలో రోడ్డుపై అదే గొడ్డలితో శ్రీను మెడపై నరకడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు హత్యల విషయం పట్టణంలో సంచలనం రేపింది. సమాచారం అందుకున్న ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలు తెలుసుకున్నారు. పాత కక్షలతోనే హత్యలు జరిగినట్లు భావిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మృతుడు శ్రీనుకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా, శ్రావణ్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇవి చదవండి: పాత కక్షలతో వ్యక్తిని విచక్షణారహితంగా పొడిచి.. -
నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య: ప్రభాస్ శ్రీను
-
మాది లవ్ మ్యారేజ్. నా భార్య పెద్ద డాక్టర్..!
-
పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..
పాలకుర్తిటౌన్: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్ తేజ్(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు. అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అందాల సురభామినిని ఆడించిన వాడితడే
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ హీరాలాల్ శిష్యుడు, పదిహేను వందలకు పైగా చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శ్రీను మాస్టర్ (82) చెన్నయ్‌లోని టి.నగర్ నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శ్రీను మాస్టర్ తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. ఆయనకు భార్య (ఉమాదేవి), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉన్నారు. విజయ్ శ్రీనివాస్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. శ్రీను మాస్టర్ నృత్య దర్శకులుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవలే ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలవి. ‘‘మా సొంత ఊరు కర్నూలు జిల్లా ఆదోని. 1956 అక్టోబర్‌లో మా అక్కయ్య నన్ను తనకు తోడుగా మద్రాసు తీసుకొచ్చారు. రెండు మూడురోజుల్లో పంపేస్తానన్నారు. నెలలు గడిచిపోయినా నన్ను పంపలేదు. హీరాలాల్ మాస్టారు మాకు దగ్గర్లోనే ఉండేవారు. సినిమా పాటలకు డ్యాన్స్‌లు ఇంట్లోనే రిహార్సల్స్ చేసేవారు. అవి చూస్తూ నేను ఏదో ఆడుతూ ఉండేవాడిని. నన్ను ఆయన గమనించారు. మా బావగారి మేనమామ గురు సుందర్‌ప్రసాద్ (ఢిల్లీ రవీంద్రభారతిలో కథక్ ప్రిన్సిపాల్) గారి దగ్గర నాకు కథక్ నేర్పించారు.ఆయనే నాకు ప్రథమ గురువు. ఆ తరవాత ఈశ్వర్‌లాల్ మాస్టారు దగ్గర సినిమా నాట్యం నేర్పించారు. ఒకరోజు హీరాలాల్ గారు నన్ను జెమినీ స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ పద్మిని, జెమినీ గణేశన్‌లను చూశాను. అప్పుడే నటీనటులను నేరుగా చూడటం. ఆ రోజు హీరాలాల్ మాస్టర్ డ్యాన్స్ చేసి, నా వంక వేలు చూపుతూ ‘అర్థమయ్యిందా’ అని అడిగి, వెంటనే నన్ను చేయమన్నారు. నాకు తోచినట్లుగా చేశాను. పద్మినిగారు ప్రశంసించారు. ఆ తర్వాత జెమినీ ఎస్.ఎస్.వాసన్‌గారు నాకు అవకాశం ఇచ్చారు. ‘వహ్ని కోటై్ట వాలిబన్’ చిత్రాన్ని తమిళ, హిందీ భాషలలో తీసినప్పుడు తెలుగులోకి దానిని ‘విజయకోట వీరుడు’ గా డబ్ చేశారు. 1958లో విడుదలైంది. అందులో పద్మిని, వైజయంతిమాలకు పోటీ పాట ఉంటుంది. ఆ డ్యాన్స్ నేను కంపోజ్ చేసిందే. అది ఒక సెన్సేషన్. 1968లో విడుదలైన ‘నేనంటే నేనే’ నా మొదటి సొంత నృత్య దర్శకత్వ సినిమా. డూండీగారు నన్ను డ్యాన్స్ మాస్టర్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా నా కెరియర్ 1968లో ప్రారంభమై, 2013 దాకా కొనసాగింది. ఇంత కెరీర్లో వందకు పైగా దర్శకులతో, తొమ్మిది భాషలలో పనిచేశాను. నేను చేసిన ఆఖరి చిత్రం గోపీచంద్, నయనతారలతో. ఆ సినిమా విడుదల కాలేదు. విడుదలైన సినిమాలలో ‘శ్రీరామరాజ్యం’ ఆఖరిది. ఆ చిత్రంతో లెక్కవేసుకుంటే పదిహేను వందల సినిమాల కంటే ఎక్కువ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాను. నటీనటులతో అనుభవాలు చిరంజీవి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్న నటుడు. అతను భరత నాట్యం నేర్చుకోకపోయినా ‘శివుడు శివుడు శివుడు’ సినిమాలో అద్భుతంగా నర్తించాడు. ‘అగ్నిపూలు’ సినిమాలో జయప్రద స్టేజీ మీద చేసే ‘పాము – నెమలి’ పాటను ఆరు రోజులు తీశాను. ఆ డ్యాన్స్‌లో ఒళ్లంతా కలిపి ఒకే డ్రెస్. కాని ఆ పాట కోసం ఒకేలాంటివి ఐదు కుట్టించాం. ఏ రోజుకారోజు చిరిగిపోతూ ఉండేది. ఆరు రోజులకు ఐదు కుట్టించాం. ఆవిడ ఎంత కష్టపడ్డారో పాటను చూస్తే అర్థమవుతుంది.‘యమగోల’లోని ‘ఆడవె అందాల సురభామిని’ పాటను రెండు రోజుల్లోనే తీసేశాను. స్వర్ణకమలంలోని ‘శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ’ ను మూడు రోజులలో తీశాను. ఆ పాటకు నాకు మొదటి నంది అవార్డు వచ్చింది. ‘అగ్నిపూలు’ పాటకు సితార అవార్డు వచ్చింది. 1968లో డ్యాన్స్మాస్టర్నైతే 1981లో నాకు అవార్డు వచ్చింది! ఎన్.టి.ఆర్.కి డ్యాన్సులు నేనే మొట్టమొదటగా ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో ప్రారంభించాను. ఈ సినిమాలో బెల్‌బాటమ్స్, పెద్ద పెద్ద కాలర్లు. రామారావుగారిని ఒప్పించి చేయించాను. ఆయన సంతోషపడ్డారు. నన్ను కంటిన్యూ చేయమన్నారు. ఆయన ఏ షాట్ చేసినా నేను ఓకే అంటేనే ఒప్పుకునేవారు. లేదంటే మళ్లీ చేసేవారు. నిజానికి.. డ్యాన్స్ కోసమే పుట్టిన పసుమర్తి, వెంపటి సత్యం వంటి వారున్న సందర్భంలో నన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక కొత్తదనం కావాలనుకుంటారు. అంతే. చిన్న చిన్న ఇబ్బందులు ‘నేనంటే నేనే’ చిత్రంలో కాంచనకు రెండు ఇబ్బందులు, కృష్ణకి ఒక ఇబ్బంది కలిగాయి. కారులోనే చిన్న చిన్న మూమెంట్ చేయాలి. ఆయన పొడుగుకి బెండ్ అయ్యి చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఒక దెయ్యం పాటలో కొన్ని హార్డ్ మూమెంట్స్ ఉంటాయి. చీరలో చాలా ఇబ్బంది పడుతూ చేశారు కాంచన. తప్పనిసరి కాబట్టి సహకరించారు కాంచన. గీతాంజలితో మహాబలుడులో ఒక క్లాసికల్ డ్యాన్స్ చేయించాను. మోకాళ్ల మీద కూర్చుని చేయడానికి ఇబ్బంది పడినా చెప్పింది చెప్పినట్లు చక్కగా చేశారు. ఒక్క క్లాసికల్ మాత్రమే కాదు ఫోక్, వెస్ట్రన్ అన్నీ చేశాను. ఒక గమ్మత్తయిన విషయం కృష్ణగారి కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ చిత్రాలకు నన్ను పెట్టుకోలేదు. నాకు క్లాసికల్ డ్యాన్స్‌లు రావనుకున్నారు. అప్పటికి నేను జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి వారికి క్లబ్ డ్యాన్సులు చేసేవాడిని. దానవీరశూరకర్ణకు వెంపటి గారిని, కురుక్షేత్రం చిత్రానికి పసుమర్తి, హీరాలాల్, చిన్ని సంపత్ ముగ్గురిని పెట్టుకున్నారు. మా గురువుగారు ఒక పాట చేశాక హిందీలో బిజీగా ఉండటంతో ఇంక చేయలేకపోయారు. అప్పుడు కమలాకర కామేశ్వరరావు ఇబ్బంది పడుతూనే నన్ను పెట్టుకున్నారు. డ్యాన్స్ చూశాక అందరూ మెచ్చుకున్నారు. క్లాసికల్‌కి నేను పనికిరాను అనుకున్న వారంతా నాతో క్లాసికల్ చేయించుకోవడం మొదలుపెట్టారు. సంభాషణ: వైజయంతి పురాణపండ -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తిప్పర్తి : నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన ఓ రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం పొలానికి వెళ్లిన శ్రీను(40) అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి రైతులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆయన మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
దారుణహత్యకు గురైన తండ్రీకొడుకులు
దేవరనేని కొత్తపల్లిలో ఇద్దరి హత్య * తండ్రీకుమారుడిని మట్టుబెట్టిన ప్రత్యర్థులు * వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తుండగా దాడి * పోలీసుల అదుపులో అనుమానితులు..? అర్వపల్లి: అర్వపల్లి మండలం దేవరనేని కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల శ్రీను(40) ఆయన దాయాదులు గైగుళ్ల వెంకట్‌నారాయణ,అవిలయ్యల మధ్య ఏడేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. గతంలో భూమి తగాదాలుండగా రెండేళ్ల నుంచి బోరు తగాదా జరుగుతోంది. శ్రీను-వెంకట్నారాయణల భూములు పక్కపక్కనే ఉండటం ఈ క్రమంలోనే బోర్లను కూడా ఒకరి పక్క ఒకరు వేసుకోవడంతో సమస్య తీవ్రమైంది. అయితే కొన్ని నెలల నుంచి శ్రీను బోరు ఆన్ చేస్తే వెంకట్‌నారాయణ, అవిలయ్యల బోరులో నీళ్లు రాకపోవడం, వీరి బోరు ఆన్‌చేస్తే శ్రీను బోరు పనిచేయకపోవడం(నీళ్లు రాకపోవడం)తో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే గురువారం రాత్రి శ్రీను తన బోరు నీళ్లు పొలానికి పారించడానికి కుమారుడు వినయ్(15)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. కరెంట్ లేకపోవడంతో జనరేటర్ అద్దెకు తెచ్చుకుని అర్ధరాత్రి వరకు నడిపించుకున్నాడు. పథకం ప్రకారమే.. వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తున్న తండ్రీకుమారుడిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది. దుండగులు తొలుత ఆదమరచి నిద్రిస్తున్న శ్రీనుపై గొడ్డలి, గడ్డపారతో దాడి చేసి హతమార్చి అనంతరం ఆయన కుమారుడిని మట్టుబెట్టినట్టు సంఘటన స్థలాన్ని బట్టి అవగతమవుతోంది. ప్రత్యర్థులు తండ్రిపై దాడిచేస్తున్న సమయంలో వినయ్ గమనించి పత్తిచేల వైపు పరుగుతీసినట్టు తెలుస్తోంది. అయినా దుండగులు అతడిని వెంటాడి వేటాడినట్టు స్పష్టమవుతోంది. ఈ హత్యకు నిందితులు గొడ్డలి, గడ్డపార, కర్రలను వాడారు. గ్రామ రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ బావి వద్దకు తండ్రీకుమారుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మృతుల కుటంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది. దాయాదులపైనే అనుమానాలు పోలీసులు న ల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందులకోసం వెతికించారు. నిందితులుగా అనుమానిస్తున్న వెంకట్‌నారాయణ, అవిలయ్యల ఇళ్ల వద్దకు జాగిలం వెళ్లి అగిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. భూతగాదాల నేపథ్యంలో వెంకట్‌నారాయణ,అవిలయ్యలే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఏడేళ్ల కిందట .. గైగుళ్ల శ్రీను భూతగాదాల నేపథ్యంలో ఏడేళ్ల కిందట దాయాదులు వెంకట్‌నారాయణ, అవిల య్యలపై దాడిచేసి గాయపర్చా డు. అప్పట్లో శ్రీనుపై కూడా కేసు నమోైదె ంది. అయితే ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నా రు. కాగా ఈ మధ్య వర్షాభావ పరిస్థితులతో పక్కపక్కనే ఉన్న ఇద్దరి బోర్లలో నీళ్లు అడుగంటడం, ఉన్న కొద్ది నీరును వాడుకోవాలంటే ఒకరు బోరు వేస్తే మరొకరిది పనిచేయకపోవడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ... సూర్యాపేట డీఎస్పీ ఎంఏ. రషీద్, తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీ య ఘటనలు జరుగకుండా అర్వపల్లి,నూతనకల్ ఎస్సైలు మోహన్‌రెడ్డి, అభిలాష్ గ్రా మం లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ బెల్లి సైదులు, ఎంపీటీసి వంగూరి రజితశ్రీనివాస్లు సందర్శించి మృ తుల కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్‌కు భార్య రాధ, కూతురు లిఖిత ఉన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
అక్కయ్యపాలెం: విద్యుధ్ఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానిక సంఘం ఆఫీస్ జంక్షన్లో ఉన్న అక్కయ్యపాలెం బార్ అండ్ రెస్టారెంట్లో పని చేస్తున్న శ్రీను(30) అనే యువకుడు రెస్టారెంట్ పై భాగంలో ఉన్న ఫ్లెక్సీని తొలగిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకి విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'రాయితో కొట్టి భార్యను చంపేశాడు'
ముదిగొండ (ఖమ్మం): అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన రాపోలు శ్రీను, కృష్ణవేణి (24) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయితే, శ్రీను తరచూ భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. గత నెల 26న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా భార్యను రాయితో బలంగా మోదటంతో ఆమె తలపై గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే శ్రీను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు భార్యను వరంగల్ ఎంజీఎంకు తరలించాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తరచూ తన కుమార్తెను అనుమానించేవాడని, అదే కారణంతో ఆమెను కొట్టి చంపాడని శ్రీనుపై కృష్ణవేణి తండ్రి సంపంగి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాములుది నల్లగొండ జిల్లా అనుముల గ్రామం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.