దారుణహత్యకు గురైన తండ్రీకొడుకులు
దేవరనేని కొత్తపల్లిలో ఇద్దరి హత్య
* తండ్రీకుమారుడిని మట్టుబెట్టిన ప్రత్యర్థులు
* వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తుండగా దాడి
* పోలీసుల అదుపులో అనుమానితులు..?
అర్వపల్లి: అర్వపల్లి మండలం దేవరనేని కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల శ్రీను(40) ఆయన దాయాదులు గైగుళ్ల వెంకట్‌నారాయణ,అవిలయ్యల మధ్య ఏడేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. గతంలో భూమి తగాదాలుండగా రెండేళ్ల నుంచి బోరు తగాదా జరుగుతోంది.
శ్రీను-వెంకట్‌నారాయణల భూములు పక్కపక్కనే ఉండటం ఈ క్రమంలోనే బోర్లను కూడా ఒకరి పక్క ఒకరు వేసుకోవడంతో సమస్య తీవ్రమైంది. అయితే కొన్ని నెలల నుంచి శ్రీను బోరు ఆన్ చేస్తే వెంకట్‌నారాయణ, అవిలయ్యల బోరులో నీళ్లు రాకపోవడం, వీరి బోరు ఆన్‌చేస్తే శ్రీను బోరు పనిచేయకపోవడం(నీళ్లు రాకపోవడం)తో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే గురువారం రాత్రి శ్రీను తన బోరు నీళ్లు పొలానికి పారించడానికి కుమారుడు వినయ్(15)తో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. కరెంట్ లేకపోవడంతో జనరేటర్ అద్దెకు తెచ్చుకుని అర్ధరాత్రి వరకు నడిపించుకున్నాడు.
పథకం ప్రకారమే..
వ్యవసాయ బోరు వద్ద నిద్రిస్తున్న తండ్రీకుమారుడిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు తెలుస్తోంది. దుండగులు తొలుత ఆదమరచి నిద్రిస్తున్న శ్రీనుపై గొడ్డలి, గడ్డపారతో దాడి చేసి హతమార్చి అనంతరం ఆయన కుమారుడిని మట్టుబెట్టినట్టు సంఘటన స్థలాన్ని బట్టి అవగతమవుతోంది. ప్రత్యర్థులు తండ్రిపై దాడిచేస్తున్న సమయంలో వినయ్ గమనించి పత్తిచేల వైపు పరుగుతీసినట్టు తెలుస్తోంది. అయినా దుండగులు అతడిని వెంటాడి వేటాడినట్టు స్పష్టమవుతోంది.
ఈ హత్యకు నిందితులు గొడ్డలి, గడ్డపార, కర్రలను వాడారు. గ్రామ రైతులు, కూలీలు ఉదయం వ్యవసాయ బావి వద్దకు తండ్రీకుమారుడి హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మృతుల కుటంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
దాయాదులపైనే అనుమానాలు
పోలీసులు న ల్లగొండ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందులకోసం వెతికించారు. నిందితులుగా అనుమానిస్తున్న వెంకట్‌నారాయణ, అవిలయ్యల ఇళ్ల వద్దకు జాగిలం వెళ్లి అగిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. భూతగాదాల నేపథ్యంలో వెంకట్‌నారాయణ,అవిలయ్యలే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తు మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
ఏడేళ్ల కిందట ..
గైగుళ్ల శ్రీను భూతగాదాల నేపథ్యంలో ఏడేళ్ల కిందట దాయాదులు వెంకట్‌నారాయణ, అవిల య్యలపై దాడిచేసి గాయపర్చా డు. అప్పట్లో శ్రీనుపై కూడా కేసు నమోైదె ంది. అయితే ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నా రు. కాగా ఈ మధ్య వర్షాభావ పరిస్థితులతో పక్కపక్కనే ఉన్న ఇద్దరి బోర్లలో నీళ్లు అడుగంటడం, ఉన్న కొద్ది నీరును వాడుకోవాలంటే ఒకరు బోరు వేస్తే మరొకరిది పనిచేయకపోవడంతో గొడవలు మళ్లీ మొదలయ్యాయి.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ...
సూర్యాపేట డీఎస్పీ ఎంఏ. రషీద్, తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్‌లు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అవాంఛనీ య ఘటనలు జరుగకుండా అర్వపల్లి,నూతనకల్ ఎస్సైలు మోహన్‌రెడ్డి, అభిలాష్ గ్రా మం లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ బెల్లి సైదులు, ఎంపీటీసి వంగూరి రజితశ్రీనివాస్‌లు సందర్శించి మృ తుల కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్‌కు భార్య రాధ, కూతురు లిఖిత ఉన్నారు.