sri raja rajeswari
-
విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం..!
శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.ఆ పేరు ఎలా వచ్చిందంటే..దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు. ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం..."ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
వైకుంఠ మోక్షం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసి పోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శానానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో ప్రత్యేక పూజాకార్యక్రమాలతో భక్తిభావం వెల్లివిరిసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, ఆలయాలు భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. కోటి యజ్ఞాల పుణ్యఫలం ఇచ్చే ఉత్తరద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్తరద్వారంలో శ్రీలక్ష్మీ సమేత అనంతపద్మనాభస్వామి, శ్రీసీతా సమేత శ్రీరామచంద్రస్వామివారలు భక్తులకు దర్శనమిచ్చారు. నారాయణమూర్తిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్న భక్తులు కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యాన్ని మూటకట్టుకున్నామన్న సంతృప్తి పొందారు. అంబారీసేవపై ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా ప్రదక్షిణ చేయించారు. ధర్మపురిలో పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి, పరిపూర్ణానంద ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు వైకుంఠద్వార దర్శనం మొదలైంది. కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తజనసంద్రంగా మారింది. 50 వేల మంది భక్తులు స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. -
మందగమనం
వేములవాడ, న్యూస్‌లైన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ ఆవరణలో చేపడుతున్న ఫ్లోరింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. అనేక అవాంతరాల మధ్య నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా.. గత నెల 8వ తేదీకే గడువు ముగిసింది. ఇప్పటివరకు యాభై శాతం పనులు పూర్తి కాగా, ఇంకా యాభై శాతం పనులు చేపట్టాల్సి ఉంది. జరిగిన పనులకు వెంటవెంటనే బిల్లు లు చెల్లించిన అధికారులు.. మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో అధికారుల తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్న ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేసేందుకు, కోడె మొ క్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా డ్రెస్స్డ్ గ్రానైట్‌తో ఫ్లోరింగ్ నిర్మించాలని గత సంవత్సరం పాలకమండలి నిర్ణయించింది. ఆలయ ఆవరణలో 12వేల చదరపు అడుగుల్లో ఫ్లోరింగ్ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి లభించిం ది. రూ.40 లక్షల వ్యయంతో 2012 నవంబర్ చివరివారంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంలో అధికారులు జాప్యం చేశారు. తర్వాత మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం ఆషాఢమాసం రావడంతో భక్తులరద్దీ కొంత తగ్గిపోయింది. జూలై 8న కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ కొంతభాగంలో తవ్వి వదిలేశాడు. అప్పటివరకు ఉన్న రాయిని తొలగించడం కష్టంగా ఉందని సాకులు చెప్పాడు. పాలకమండలి కలగజేసుకుని ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మొట్టికాయలు వేయడంతో పనుల్లో కాస్త కదలిక వచ్చింది. తర్వాత కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరగడంతో మళ్లీ పనులను నిలిపివేశాడు. ఈ నెల 8వ తేదీతో కాంట్రాక్టర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగిసిపోయింది. ఇప్పటివరకు 12వేల చదరపు అడుగుల పనులకు 7వేల చదరపు అడుగుల పనులు పూర్తయ్యాయి. వీటికి అధికారులు రూ.14 లక్షలు చెల్లించారు. జరిగిన పనికి బిల్లులు చేతికందడంతో కాంట్రాక్టర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకున్న కాంట్రాక్టర్ మరింత గడువు కావాలని అధికారులను కోరారు. ఈ మేరకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్ధిష్ట కాలపరిమితిలో పనులు పూర్తికావడం లేదని తెలిసినా.. కాంట్రాక్టర్‌కు వెంటవెంటనే బిల్లులు చెల్లించడం గమనార్హం. రానున్నది ‘సమ్మక్క’ సీజన్.. ఫిబ్రవరిలో సమ్మక్క సారక్క జాతర జరగనుంది. ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రతిసారి జాతర సమయంలో లక్షలాది మంది వేములవాడకు వస్తుంటారు. సంక్రాంతి మరుసటి రోజునుంచి రద్దీ మొదలై నెలరోజులకు పైగా కొనసాగుతుంది. అంటే మరో 45 రోజుల తర్వాత రాజన్న ఆలయంలో కాలుమోపేంత అవకాశం కూడా ఉండదు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆలయ ఆవరణలో పనులు పూర్తి చేయాలన్న ధ్యాస అధికారులకు కలగడం లేదు. తీరా భక్తుల రద్దీ మొదలయ్యాక పనులు ప్రారంభిస్తే.. మళ్లీ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంట్రాక్టర్‌కు గడువు పొడిగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతి వచ్చేదెన్నడో.. పనులు పూర్తయ్యేదెన్నడో వేచిచూడాల్సిందే.