sri sri ravishankar
-
కుదుటపడుతున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: మత ఘర్షణలు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతత నెలకొంటోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ గడిచిన మూడు రోజులుగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు. వదంతులను పట్టించు కోవద్దని, అటువంటి వాటిపై తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆదివారం అల్లర్ల ప్రభావిత బ్రహ్మపురిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతోపాటు 254 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడించాలని హక్కుల కార్యకర్తలు పోలీసులను కోరారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక నిరసనలకు కేంద్ర బిందువు షహీన్‌బాగ్‌లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఖ్యాలా–రఘుబిర్ నగర్–తిలక్ నగర్ ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగనున్నాయంటూ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే అవి కేవలం వదంతులేనని ఢిల్లీ పశ్చిమ డీసీపీ దీపక్ పురోహిత్ చెప్పారు. -
శ్రీశ్రీ రవిశంకర్‌పై హీరో భార్య ట్వీట్‌తో రచ్చ!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ భార్య, ఒకప్పటి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం రచయితగా, కాలమిస్ట్‌గా ముందుకుసాగుతున్న ట్వింకిల్ సోషల్ మీడియాలో చురుకైన ఛలోక్తులు విసరడంలో దిట్టగా పేరు తెచ్చుకుంది. ఆమె చేసే వ్యంగ్య వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆనందాన్ని పంచితే.. కొన్నిసార్లు వివాదాలు రేపాయి. తాజాగా 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకుడు, శ్రీశ్రీ రవిశంకర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది. 'శ్రీశ్రీవి ఉదాత్తమైన ఆలోచనలు. కానీ యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకే వెళుతుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్లో కామెంట్ చేసింది. దీనికి 'హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్' (పవిత్ర పురుషుల వెంట్రుకల కథలు) అనే హ్యాష్‌ట్యాగ్ జోడించింది. ట్వింకిల్ ట్వీట్ రవిశంకర్ అభిమానుల్ని గాయపర్చింది. దురుద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు లక్షలాది మంది రవిశంకర్ అనుచరులను గాయపర్చాయని, కాబట్టి అక్షయ్ తాజా సినిమా 'హౌస్‌ఫుల్-3' తాము బహిష్కరిస్తారని హెచ్చరిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హథీ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌పై వివాదం రేగడంతో ఆమె వెంటనే దానిని తొలగించారు. 'ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. అది కేవలం జోక్ మాత్రమే. పొరపాటు ఏదైనా జరిగితే నేను సరిదిద్దుకోగలను' అంటూ ట్వింకిల్ వివరణ ఇచ్చారు. అదే సమయంలో అక్షయ్ సినిమాను బహిష్కరిస్తామని దర్శక్ హథీ చేసిన బెదిరింపులపై ఆమె తీవ్రంగా స్పందించారు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు ఆర్ట్ ఆఫ్ బెదిరింపులను అనుసరిస్తున్నారా? నేనే ఏమైనా అంటే నన్ను అడగండి. అంతేకానీ నా భర్తను లాగి.. సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరించడం సిగ్గుచేటు' అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు. దీంతో తమ మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను అలా స్పందించానని, నా వ్యాఖ్యలు ఏమైనా మిమ్మల్ని బాధిస్తే క్షమించండని దర్శక్ హాథీ మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. -
ఘనంగా ముగిసిన సాంస్కృతిక మేళా
దేశ ప్రతిష్ట పెంచే సభలపై రాజకీయాలు వద్దు: శ్రీశ్రీ రవిశంకర్ న్యూఢిల్లీ: దేశ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్ని పార్టీలు రాజకీయం చేయకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంపై విమర్శల సందర్భంగా మీడియా కఠినంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో యుమునా తీరంలో ఆదివారం ప్రపంచ సాంస్కృతిక సంగమం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ... వచ్చే సదస్సు కోసం ఆస్ట్రేలియా, మెక్సికో, ఇతర దేశాల నుంచి ఇప్పటికే ఆహ్వానాలు అందాయన్నారు. పార్టీలన్నీ కలసికట్టుగా తరలివస్తే ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఇంత పెద్ద సదస్సు నిర్వహించడం తేలిక కాదని, అందువల్లే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ... గందరగోళం ఉంటే నాయకత్వానికి అర్థమే లేదని, ఏకీకృత సాంఘిక విధానం కంటే వివిధ సంస్కృతుల సమ్మేళనం భారత్‌ను గొప్ప నాగరికత వైపు తీసుకెళ్తుందన్నారు. జీవవైవిధ్యంతో మన జీవితాల్ని సుసంపన్నం చేస్తున్న ప్రకృతి నుంచి ప్రజలు ఎన్నో నేర్చుకోవాలన్నారు. సంస్కృతి లేకపోతే జీవితానికి అర్థం ఉండేది కాదని, కొన్ని వివాదాలకు అది కారణమైనా క్రమంగా సమాజంలో శాంతిని తీసుకొచ్చిందని చెప్పారు. ఉన్నత ఆశయాలు, మానవత్వం సరిహద్దులు దాటాయనడానికి 160 దేశాల ప్రజలు ఒకే వేదిక పంచుకోవడమే నిదర్శనమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. నాయకత్వ విలువల పతనం, మంచి నేతలుగా ఎలా ఎదగాలో అన్న అంశాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్, నార్వే మాజీ ప్రధాని కెల్ మాగ్నే బాండ్వెక్లు సూచనలు చేశారు. నాయకుడు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని, భయపెట్టకూడదని వీకే సింగ్ అన్నారు. మూడో రోజు కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, గడ్కారీ, నిర్మలా సీతారామన్, నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానం.. రవిశంకర్‌కు ప్రపంచనేతల నుంచి ఆహ్వానాలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రసంగించాని బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఆహ్వానించారు. ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని తమ దేశంలో జరపాలని ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్ కోరారు. -
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంటే ఇదేనా?
న్యూఢిల్లీ: దారిద్య్ర నిర్మూలన, మహిళలకు సాధికారిత, విద్యాదానం, మానవ విలువలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల ప్రాతిపదికన ఏర్పడిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పొట్టలు గొట్టింది. పర్యావరణ పరిరక్షిణను తుంగలో తొక్కింది. మొన్నటి వరకు పచ్చని పంటలతో ఏపుగా కాసిన కూరగాయలతో కళకళలాడిన పొలాలను జీసీబీలతో దున్నేసి రైతులకు దు:ఖాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఎటూ పాలుపోని రైతులు తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. వారంత పనిచేస్తే ఆ పాపం ఎవరిది? కేవలం గిన్నీస్ రికార్డు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇదంతా చేసింది. ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తోంది. దానికోసం ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంది. వారు యమునా నది పక్కన ఖాళీగా ఉన్న 80 ఎకరాల మైదాన ప్రాంతాన్ని సాంస్కృతిక సమ్మేళనం కోసం వాడుకోవాల్సిందిగా సూచించారు. అందుకు సరేనన్న ఫౌండేషన్ వర్గాలు ఇప్పుడు 150-175 ఎకరాల వరకు సమ్మేళనం కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు వంద ఎకరాలు మినహా మిగతా భూమంతా పంట పొలాలు, కూరగాయల తోటలే. వాటిన్నింటిని జేసీబీలు పెట్టి దున్నించి మైదాన ప్రాంతంగా మార్చేసింది. రైతులు అడ్డం పడితే నష్ట పరిహారం చెల్లిస్తాం, పోపొమ్మంటూ తరమేసింది. అప్పటికి వినని రైతులను పోలీసుల చేత బెదిరించింది. తనది మూడున్నర ఎకరాల పొలమని, మొత్తం చదును చేశారని, కేవలం 26 వేల రూపాయలను నష్ట పరిహారంగా తన జేబులో పెట్టారని పాన్ సింగ్ అనే రైతు సోమవారం నాడు మీడియా ముందు వాపోయారు. వాస్తవానికి తాను ఈసారి పంట వేయడానికి 2.25 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అందులో ఎక్కువ భాగం బ్యాంకు నుంచి తీసుకున్న రుణమేనని ఆయన చెప్పారు. నాలుగు భీగాల భూమిలో తాను కాకరకాయ, కీర, బెండకాయ, గోబీలు పండిస్తున్నానని, తనకు 14వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చదును చేశారని ధరమ్ సింగ్ ఆరోపించారు. వాస్తవానికి తాను గోబీ విత్తనాల కోసం 26 వేల రూపాయలను ఖర్చు చేశానని వాపోయారు. పంటలను కోల్పోయిన 200 రైతు కుటుంబాల్లో వీరిద్దరు. ఈ విసయమై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారిని వివరణ కోరగా రైతులంతా భూములను అక్రమంగా ఆక్రమించిన వారేనని, తామె ఇంకా దయతలచి మానవతా హృదయంతో ఆర్థిక సహాయం చేశామని చెబుతున్నారు. ‘గ్రో మోర్ ఫుడ్’ పథకం కింద 1950లో అప్పటి ప్రభుత్వం యమున ఒడ్డునున్న ఈ పొలాలను రైతులకు ఇచ్చిందని ‘ఢిల్లీ పీజంట్ కోపరేటివ్ మల్టీ పర్పస్ సోసైటీ ప్రధాన కార్యదర్శి బల్జీత్ సింగ్ తెలిపారు. పైగా యమునా నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్ట నిబంధనలు ఉన్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ చెప్పుకునే ఫౌండేషన్ చ ట్టాన్ని ఉల్లంఘించి 35 వేల మంది కూర్చుని కచేరీలు, మంత్రోచ్ఛారణలు చేసేందుకు వీలుగా భారీ వేదికను నిర్మించింది. అక్కడక్కడా భారీ అంబారీల విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తదితరులు హాజరుకానున్నారు. ఎప్పుడూ మానవతా విలువల గురించి మాట్లాడే శ్రీశ్రీ రవిశంకర్ రైతులకు జరిగిన అన్యాయం పట్ల పెదవి విప్పడం లేదు. ఇక చేసేదేమీ లేక రైతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తికి పిటీషన్ పెట్టుకున్నారు. కొన్ని ఎన్జీవో సంస్థలు ఇప్పటికే రైతుల తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమ్మేళనం ఏర్పాట్లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, ఈ దశలో కోర్టు కూడా ఏంచేయలేదని ఫౌండేషన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
'ఆలయంలోకి మహిళలను అనుమతించండి'
ముంబయి: వివాదంగా మారిన శని షింగాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించాలని ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఈ ఆలయ ప్రధాన అర్చకులు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన శని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఇవ్వాలనే డిమాండ్వైపే మొగ్గు చూపుతానని చెప్పారు. అయితే, ఈ విషయంపై ఇప్పటికీ ఆలయ ట్రస్టీలకు, ఉద్యమకారులకు సమాభిప్రాయం లేకుండా పోయిందని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు చేస్తున్న ప్రతిపాదన తమకు ఆమోద యోగ్యం కాదని ఉద్యమకారురాలు తృప్తి దేశాయ్ అన్నారు. -
‘శని సింగ్నాపూర్’పై చర్చకు రండి!
తృప్తి దేశాయ్, ఆలయ ట్రస్టీకి శ్రీశ్రీ రవిశంకర్ ఆహ్వానం పుణే: శని సింగ్నాపూర్ గుడిలోకి మహిళల ప్రవేశంపై పోరాటం చేస్తున్న ‘భూమాత’ మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌ను.. ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ చర్చ కోసం ఆహ్వానించారు. ఆదివారం పుణేలో ఆయన్ను కలుస్తున్నాను అని తృప్తి తెలిపారు. భేటీకి రావాలని గుడి మాజీ ట్రస్టీని కూడా రవిశంకర్ కోరినట్లు తెలిసింది. శనివారం అహ్మద్‌నగర్ కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ఇరు వర్గాల చర్చలు జరిగాయి. -
విభజనయత్నం.. అహంకారపూరితం
హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ, హడావుడిగా ఆంధ్రప్రదేశ్ విభజనకు సిద్ధమవుతోందని, ఇది మంచిది కాదనీ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మొండిగా ముందుకు వెళుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా అంతర్జాతీయస్థాయిలో పేరొందిన రవిశంకర్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్రంలోని పాలకులు ఆంధ్రప్రదేశ్‌ను కురుక్షేత్రంలా మార్చేశారు. ప్రాంతాలు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేశారు. కేవలం కొందరి స్వార్థం కోసం విభజనకు పాల్పడుతుండడం విచారకరం. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలి. దీనిని తోసిపుచ్చి విభజనపై ముందుకు వెళ్ళడం సరైనది కాదు. ఈ చర్యల ద్వారా రాష్ట్రాన్నీ, దేశాన్నీ మరో 50 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళినట్టే అవుతుంది. హడావిడిగా తీసుకొనే నిర్ణయాలు ఏవైనా చివరకు వృథాగా మారతాయి. నా వ్యాఖ్యలతో వివాదాలు రేగినా వెనుకాడను. పార్లమెంటులో గురువారం ఘటన కేంద్రం తప్పిదం వల్లే జరిగింది. చివరకు సొంత మంత్రుల మాటకు కూడా విలువ లేకుండా పోయింది. కొంతకాలంగా అభివృద్ధి ఆగిపోయి ఏపీ పూర్తిగా స్తంభించి పోయింది. ప్రస్తుతం దేశంలో పాలన చచ్చుబడి పోయింది. మన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంది. ఈ పరిస్థితుల్లో సుస్థిర, దృఢ ప్రభుత్వం అవసరం. దేశాన్నీ, రాష్ట్రాన్నీ సమర్థులైన పాలకుల చేతుల్లో పెట్టాల్సి ఉంది.