ముంబయి: వివాదంగా మారిన శని షింగాపూర్ ఆలయంలోకి మహిళలను అనుమతించాలని ప్రముఖ ఆధ్యాత్మిక, సామాజిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఈ ఆలయ ప్రధాన అర్చకులు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన శని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఇవ్వాలనే డిమాండ్వైపే మొగ్గు చూపుతానని చెప్పారు. అయితే, ఈ విషయంపై ఇప్పటికీ ఆలయ ట్రస్టీలకు, ఉద్యమకారులకు సమాభిప్రాయం లేకుండా పోయిందని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు చేస్తున్న ప్రతిపాదన తమకు ఆమోద యోగ్యం కాదని ఉద్యమకారురాలు తృప్తి దేశాయ్ అన్నారు.
'ఆలయంలోకి మహిళలను అనుమతించండి'
Published Sun, Feb 7 2016 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement