srikala hasthi
-
ఆధ్యాత్మిక క్షేత్రానికి పారిశ్రామిక శోభ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతున్న తిరుపతి జిల్లా పారిశ్రామిక కాంతులతో విరాజిల్లనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత ఆలయం మహాసంప్రోక్షణ క్రతువులో పాల్గొనేందుకు గురువారం తిరుపతి జిల్లాకు వస్తున్న సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బంగారు వకుళమాత ఆలయం తిరుపతి సమీపంలోని పేరూరు కొండపై 900 ఏళ్ల చరిత్ర కలిగిన వకుళమాత ఆలయం ఉంది. సుమారు 350 ఏళ్ల క్రితం మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ చూపి దీన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చి టీటీడీని ఒప్పించి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వపరంగా సీఎం పూర్తి సహకారం అందించారు. ఆలయానికి 83.41ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి టీటీడీకి అప్పగించారు. వకుళమాత ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సంకల్పించి 42 కిలోల బంగారంతో ఆర్నెల్లలోనే ఆలయ గోపురాన్ని స్వర్ణమయం చేశారు. సొంత నిధులతో అమ్మవారికి బంగారు అభరణాలు, కనకపు కవచాలను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చేయించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా బంగారు ఆభరణాలను టీటీడీకి అందించనున్నారు. 3 భారీ పరిశ్రమలు.. 4,550 మందికి ఉపాధి తిరుపతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రేణిగుంట మండలం జీపాళ్యెం, ఏర్పేడు మండలం వికృతమాల పరిధిలో టీసీఎల్‌కి అనుబంధంగా రూ.1,702 కోట్లతో ఏర్పాటవుతున్న ప్యానల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీ సంస్థ, సెవెన్ హిల్స్ డిజిటల్ పార్కులో సన్నీ ఓపోటెక్ ఇండియా సంస్థ రూ.350 కోట్లతో నెలకొల్పే ప్రాజెక్టు, ఇదే పార్క్‌లో ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ రూ.355 కోట్లతో నెలకొల్పే భారీ ప్రాజెక్టులను సీఎం జగన్ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తంగా రూ.2,407 కోట్లతో 4,550 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా ఏర్పేడు–వెంకటగిరి రహదారిలో శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద 125 ఎకరాల్లో అపాచీ నెలకొల్పుతున్న పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఫాక్స్‌లింక్ ఇండియా ఎలక్ట్రిక్ సంస్థ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టు, డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన టీవీ యూనిట్ పనులకు కూడా సీఎం భూమి పూజ నిర్వహిస్తారు. -
శ్రీకాళహస్తి: శివనామస్మరణతో మార్మోగుతున్న దక్షిణ కైలాసం(ఫోటోలు)
-
శ్రీకాళహస్తి పట్టణంలో 10 రెడ్ జోన్ ప్రాంతాలు
-
కరోనా వైరస్: వారంతా సేఫ్
సాక్షి, తిరుపతి: దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన వారు.. వారికి తెలియకనే కరోనాను మోసుకొచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 46 మంది ఢిల్లీలో గత నెలలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొనేందుకు వెళ్లారు. వారంతా ఇటీవలే జిల్లాకు చేరుకున్నారు. అయితే వారికి కరోనా సోకింది అనే విషయం తెలియక యథావిధిగా జన సంచారంలో కలిసిపోయి తిరిగారు. తెలంగాణలో రెండు రోజుల క్రితం జరిగిన మరణాలతో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకిందని తెలుసుకుని అధికార యంత్రాంగంతో పాటు ఆ మతస్తులు షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించారు. (యువకులపై పంజా) వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఐదుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. పలమనేరుకు చెందిన ఇద్దరు, గంగవరానికి చెందిన ఒకరు, శ్రీకాళహస్తి, ఏర్పేడుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఒకేసారి ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మరి కొందరు జిల్లాకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన క్వారంటైన్లో ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో మరి కొందరి వైద్య పరీక్షల నివేదిక రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. (టిక్‌టాక్ భారీ విరాళం) వారంతా సేఫ్ ఢిల్లీ నుంచి వచ్చిన వారు మినహా... విదేశాల నుంచి వచ్చిన స్థానికులంతా సేఫ్ జోన్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు ఇటీవల లండన్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అతనికి పాజిటివ్ నమోదు కావడంతో అతన్ని తిరుపతిలోని పాత ప్రసూతి ఆస్పత్రిలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వారి బంధువులందరిని శ్రీపద్మావతి నిలయంలో ఉంచారు. వారందరికీ నెగటివ్ రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే. అయినా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరిని హోం క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.(మద్యం..మంట) -
శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డుప్రమాదం
చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కర్ణాటకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 30 మందికి గాయాలు అయినట్టు తెలిసింది. వినాయక ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రమత్తులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో బస్సును నడపడంతో అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మృతులంతా కావాలికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. మృతుల్లో మోహన్ (45), శ్రీనివాసులు (43), మరో యువతి ఉన్నారు. వినాయక ట్రావెల్స్ బస్సు నంబర్ కెఏ 01 ఎఎఫ్ 4433 గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముక్కంటి సేవలో నటుడు ప్రభుదేవా
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానానిక గురువారం సినీనటుడు ప్రభుదేవా విచ్చేశారు.ఆయనకు ఆలయాధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. రూ.2500 టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.