Sripriya
-
కుర్రాడు కొత్త
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మించారు. సాయి ఎలేందర్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేయగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్వీకరించారు. రాజా నాయుడు. ఎన్ మాట్లాడుతూ– ‘‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు అండగా నిలబడి సినిమాను పూర్తి చేశారు. మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేస్తున్నా. శ్రీరామ్ చక్కగా నటించాడు’’ అన్నారు. ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పదిలం లచ్చన్న దొర. ‘‘మా నాన్నగారు థియేటర్ ఆపరేటర్. ఆయన వల్ల నాకు సినిమాలంటే ఆసక్తి కలిగింది. అదే ఉత్సాహంతో హీరోగా ఎదిగాను’’ అన్నారు శ్రీరామ్. ‘‘డైరెక్టర్ మా నాన్నగారు అయినా కూడా నన్ను ఆడిషన్‌లోనే ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు శ్రీప్రియ. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్ ముదిరాజ్. -
ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి – శ్రీకాంత్
సాయి రోనక్, అమృత అయ్యర్,ఛరిష్మా శ్రీకర్ , శ్రీప్రియ ముఖ్య పాత్రల్లో వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘అలా నేను ఇలా నువ్వు’. రాజ్ కందుకూరి సమర్పణలో వీరశంకర్ నిర్మించనున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైంది. శ్రీకాంత్ క్లాప్‌నివ్వగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా కెమెరా స్విచ్చాన్ చేశారు. బి గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘వేరు వేరు సాంప్రదాయల మధ్య పెరిగే యువతీయువకులకు వేరువేరు అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచుల వల్ల ఎలాంటి సంఘర్షణలు ఎదుర్కొన్నారన్నది ఈ సినిమా కథాంశం. ఈ కథ 80–90 మథలో జరుగుతుంది. హెటివో ద్వారా నేరుగా ఇంట్లో హోమ్ థియేటర్స్‌లో విడుదల అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రేమా,యాక్షన్‌ను ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎంటర్టైనింగ్గా చెబుతున్నాం. మా ప్రయత్నం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు విఎన్ ఆదిత్య. ‘‘ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా ఇంట్లోనే కూర్చొని చూసే చిత్రంగా చేస్తున్న ఈ ప్రయత్నం కచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీకాంత్. ‘‘వీరశంకర్ గారు చేస్తున ఈ ప్రయత్నం నచ్చి ఈ సినిమాలో భాగమైయాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ఈ సినిమాకు సంగీతం:నిహాల్. -
కుర్రాడి ప్రేమకథ
శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజానాయుడు దర్శకత్వంలో లైట్ ఆఫ్ లైఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తున్న చిత్రం ‘కొత్త కుర్రాడు’. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ –‘‘మంచి లవ్సోరీ. నైతిక విలువలతో కూడిన చిత్రమిది. రామ్, ప్రియ కొత్తవారైనప్పటికీ పోటీ పడి నటించారు. విలన్ పాత్రలో చెబ్రోలు శ్రీను ఆకట్టుకుంటాడు. సాయి ఎలెందర్ సంగీతం చిత్రానికి హైలెట్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఈ చిత్రం ఉంటుంది, ఫిబ్రవరిలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మదిరాజ్, సంగీతం: సాయి ఎలెందర్. -
అలాంటివి బుద్ధిహీనులే చూస్తారు
కోలీవుడ్‌లో ఫైర్బాంబుగా పేర్కొనే తారల్లో నటి రాధికా శరత్‌కుమార్ ఒకరని చెప్పవచ్చు. తనకు అనిపించింది నిర్భయంగా వెల్లడించే మనస్తత్వం ఆమెది. ఇటీవల కొన్ని టీవీ చానళ్లల్లో ప్రచారం అవుతున్న కార్యక్రమాల గురించి నటి రాధికా శరత్‌కుమార్, ఆమెకు స్నేహితురాలు నటి శ్రీప్రియ ఎలా విమర్శలు గుప్పించారో చూద్దాం. కొన్ని తమిళం, తెలుగు, మలయాళం చానళ్లలో సంసార జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులకు చానళ్లలో పంచారుుతీ జరుపుతున్న కార్యక్రమాలు అధికం అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో నటి కుష్బు, తెలుగులో నటి రోజా, సుమలత, గీత, మలయాళంలో నటి ఊర్వశి లాంటి తారలు ఈ కార్యక్రమాల్లో పంచారుుతీతో మనస్పర్థలతోనో, ఇతర కారణాలతోనో సరిగ్గా కాపురం చేసుకోని దంపతులను కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టీవీ కార్యక్రమాలపై నటి శ్రీప్రియ విమర్శలను గుప్పించారు. వీల్లెవరు? భార్యాభర్తల మధ్య గొడవలను తీరుస్తామని చెప్పి నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన వారి జీవితాలను బజారుకీడుస్తున్నారని విమర్శించారు. అభిమానులు సోషల్ మీడియాల్లో గగ్గోలు పెడుతున్నా సంబంధిత వ్యక్తుల గురించి చెప్పలేకపోతున్నామని, అలాంటిది సాధారణ వ్యక్తుల కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి వీళ్లెవరని ప్రశ్నించారు. నిజంగా అలాంటి వారి, కష్టాలు, సమస్యలపై అక్కర ఉంటే కెమెరా వెనుక కాకుండా ఏ న్యాయవాది వద్దకో, కౌన్సెలింగ్ ఇప్పించేవారి వద్దకో తీసుకెళ్లాలని నటి శ్రీప్రియ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చదువులేని అమాయకులే.. శ్రీప్రియ విమర్శలను సమర్థించిన నటి రాధికా శరత్‌కుమార్ చదువులేని అమాయకులే వారికి దొరుకుతారని, అదే విధంగా బుద్ధిహీనులే అలాంటి చానళ్లను చూస్తారని వ్యాఖ్యానించారు.అదే విధంగా నటి రంజిత ఈ కార్యక్రమాలపై స్పందిస్తూ ఇదంతా పెద్ద న్యూసెన్స అని వ్యాఖ్యానించారు. గుట్టుగా సాగించే సామాన్యుల సంసారాన్ని బయటకు లాగి వారి సమస్యలపై పంచారుుతీ చేసేది తారలా అంటూ విమర్శించారు. టీవీ చానళ్ల వారు కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్నారని అన్నారు. అలాంటి సమస్యలేమైనా ఉంటే సామాన్యులు అనుభవజ్ఞులైన ఎన్జీఓల సలహాలు తీసుకుని కోర్టుల ద్వారా కుటుంబాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. -
పత్తు సుందరిగళ్!
ఇక్కడున్న ఫొటోని చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదు కదూ! కేరళ సంప్రదాయ చీరలో తారలందరూ తళుక్కుమంటే చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది కదూ! ఫొటోలో మన తెలుగింటి కోడలు అమల, హైదరాబాదీ భామ టబు, తమిళింటి ఆడపడుచులు రాధిక, శ్రీప్రియ... ఇలా అందరూ కేరళ స్టైల్ చీర కట్టుకుని ఎక్కడ మెరిసినట్లు? ఆ విషయానికే వస్తున్నాం. ఇటీవల రాధిక కుమార్తె రేయాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు దక్షిణ, ఉత్తరాది చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖ తారలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైనవాళ్లలో కొంతమంది కేరళలో జరిగిన లక్ష్మి తనయుడు వరుణ్ పెళ్లికి వెళ్లారు. ఒకప్పటి ప్రముఖ తారలు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో ట్రివాంకూర్ సిస్టర్స్‌గా పేరు, ప్రతిష్ఠలు సాధించిన పద్మిణి-రాగిణి-లలితల మనవడే వరుణ్. రాగిణి కూతురు లక్ష్మి. కేరళలోని ట్రివాంకూరులో జరిగిన వరుణ్ పెళ్లికి వెళ్లిన వాళ్లల్లో రాధిక, శ్రీప్రియ, లిజి, అమల, టబు, జ్యోతిక తదితరులు ఉన్నారు. పెళ్లి కేరళలో కాబట్టి, అక్కడి సంప్రదాయానుసారంగా చీర కట్టుకుని, నగలు పెట్టుకుని.. ఇలా ఫొటో దిగారు. ఈ ‘పత్తు సుందరిగళ్’ అంటే.. పదిమంది సుందరీమణులు వివాహ వేడుకకు నిండుదనం తెచ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
సినిమారివ్యూ: 'దృశ్యం'
నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి సంగీతం: శరత్ సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్ దర్శకత్వం: శ్రీ ప్రియ పాజిటివ్ పాయింట్స్: ఆకట్టుకునే కథ, భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెగిటివ్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడంలో 'విక్టరీ' వెంకటేశ్ ది ఓ ఢిఫరెంట్ స్టైల్. రీమేక్ చిత్రాల్లో నటించి భారీ హిట్లను తన ఖాతాలో వెంకటేశ్ వేసుకున్న సంగతి తెలిసిందే. కాని ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు వెంకటేశ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే రీమేక్ చిత్రాలు నిరాశ పరిచినా.. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. అదే పేరుతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్, మీనాలు జంటగా నిర్మాత డి సురేశ్, రాజ్ కుమార్ సేతుపతిలు రూపొందించిన 'దృశ్యం' చిత్రం జూలై 11వ తేదిన విడుదలకు సిద్దమైంది. సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపులతో వచ్చిన 'దృశ్యం' ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. కథ: పోలీస్ అధికారులైన నదియా, నరేశ్ లకు వరుణ్ (రోషన్) అనే కుమారుడు ఉంటాడు. వరుణ్ కనిపించకుండా పోయాడనే విషయం నదియా, నరేశ్ లకు తెలుస్తుంది. దాంతో వరుణ్ ఆచూకీ కోసం వేట మొదలెడుతారు పోలీసులు. అయితే ఈ విచారణలో రాజావరం అనే కుగ్రామంలో ఓ కేబులు ఆపరేటర్ రాంబాబు (వెంకటేశ్) కుటుంబాన్ని అనుమానిస్తారు. వరుణ్ ఆచూకీ తెలుసుకునేందుకు రాంబాబు కుటుంబాన్ని విచారిస్తారు. అయితే రాంబాబు కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి కారణమేంటి? రాంబాబు కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? వరుణ్ కనిపించకుండా పోవడానికి రాంబాబు కుటుంబానికి సంబంధమేమిటి. సంతోషంగా భార్య, ఇద్దరు కూతుర్లతో జీవితాన్ని వెళ్లదీస్తున్న రాంబాబు కుటుంబానికే ఈ సమస్య ఎందుకు ఎదురైంది. పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి రాంబాబు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు రాంబాబు కుటుంబం సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? పోలీస్ ఆఫీసర్లకు తమ కుమారుడి ఆచూకీ దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'దృశ్యం'. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: రాంబాబుగా వెంకటేశ్ మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గా, ఓ కుటుంబ పెద్దగా వెంకటేశ్ చక్కటి ఎమోషన్స్ పలికించారు. సమస్యల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు పాత్ర ద్వారా వెంకటేశ్ సగటు ప్రేక్షకుడ్ని మరోసారి మైమరిపించారు. ఇమేజ్ కు భిన్నంగా పాత్రలను ఎంచుకోవడంలో వైవిధ్యం చూపే వెంకటేశ్ మరోమారు రాంబాబు పాత్ర ద్వారా తన సత్తాను చాటారు. గత కొద్దికాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తూన్న వెంకటేశ్... 'దృశ్యం' ద్వారా మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత మీనా మరోసారి తనదైన నటనను ప్రదర్శించారు. 'దృశ్యం' ద్వారా మీనా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించినట్టే. కాకపోతే అర్జంటుగా కొంచెం లావు తగ్గాల్సిందే. మంచి ఫెర్ఫార్మెన్స్ తో గతంలో ఆకట్టుకున్న మీనా.. మరోసారి 'దృశ్యం' ద్వారా చేరువయ్యారనే చెప్పవచ్చు. వెంకటేశ్ కూతుళ్లుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ లు మంచి మార్కులే సొంతం చేసుకున్నారు. చిన్న పాత్రైనా నరేశ్ ప్రాధాన్యత ఉన్న పాత్రతో అదరగొట్టేశారు. క్లైమాక్స్ లో నరేశ్ నటన బాగుంది. నదియా పాత్ర ఓకే అనిపించినా.. మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. నదియా క్యాస్టూమ్స్, మేకప్ విషయంలో కొత్త అశ్రద్ద చేశారా అనే ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నెగిటివ్ షేడ్స్ తో రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే నటన సూపర్ అని చెప్పవచ్చు. వెంకటేశ్ అసిస్టెంట్ గా సప్తగిరి తన హాస్యంతో పర్వాలేదనింపించారు. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్ లు తమ పాత్రల స్వభావం, పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల పనితీరు: కథ డిమాండ్ మేరకు శరత్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా సెంటిమెంట్, భావోద్వేగాలకు గురిచేసేందుకు అవసరమైన టెంపోను బ్యాక్ గ్రౌండ్ స్కోరును మెయింటెన్ చేయడంలో శరత్ సఫలమయ్యారు. ఇక డార్లింగ్ స్వామి అందించిన డైలాగ్స్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. సున్నితంగా, సహజంగా ఉండే డైలాగ్స్ అందించిన డార్లింగ్ స్వామి.. సెంటిమెంట్ సీన్లలో డైలాగ్స్ తో తన మార్క్ ను ప్రదర్శించారు. ఇక సగటు ప్రేక్షకుడిలో ఓ ఫీల్ నింపే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని రూపొందించడంలో అలనాటి నటి శ్రీప్రియ సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది. ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే 'దృశ్యం' ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం. ట్యాగ్: 'దృశ్యం' ప్రేక్షకుల్లో ఓ చక్కటి అనుభూతిని నింపే ఓ సదృశ్యం! -- రాజబాబు అనుముల Note: Preview Show at Cinemax on Wednesday Follow @sakshinews -
దృశ్యం మూవీ పోస్టర్స్, స్టిల్స్
-
అరకు లోయలో ‘దృశ్యం’
కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్ నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లే. సుందరకాండ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూర్యవంశం, సంక్రాంతి... ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దృశ్యం’, చేయబోతున్న ‘ఓ మైగాడ్’ సినిమాల్లో కూడా వెంకీ ఫ్యామిలీ మేన్గానే కనిపించబోతున్నారు. ఈ రెండూ విభిన్న కథాంశాలే కావడం విశేషం. ‘దృశ్యం’ షూటింగ్ ప్రస్తుతం అరకు లోయలో జరుగుతోంది. నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్లోనే వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరణ జరుపుతారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత డి.సురేశ్‌బాబు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఓ మధ్యతరగతి వ్యక్తి చేసిన సాహసమే ‘దృశ్యం’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఈ పాత్రను తెలుగులో వెంకటేశ్ చేస్తుండటం నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. నాటి తరం కథానాయిక శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.గోపాల్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నదియా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: వివేక్. -
అందుకే సినిమాకు కొంచెం విలువ తగ్గినట్టు అనిపిస్తోంది
అంతు లేని కథ, చిలకమ్మ చెప్పింది, పొట్టేలు పున్నమ్మ తదితర చిత్రాల్లో నటించిన శ్రీప్రియ ఒకప్పుడు యూత్‌కి హాట్ ఫేవరెట్ హీరోయిన్. దక్షిణాది భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారామె. వాటిల్లో ఒక్క రజనీకాంత్‌తోనే 28, కమల్‌హాసన్‌తో 27 సినిమాలు చేయడం విశేషం. నటిగా మాత్రమే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు శ్రీప్రియ. కొంత విరామం తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో ‘మాలిని 22’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ చిత్రం ‘22 ఫీమేల్ కొట్టా యమ్’కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ భాగ్యనగరంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీప్రియతో జరిపిన ఇంటర్వ్యూ... 300 సినిమాల్లో నటించిన మీరు.. ఆ తర్వాత కొంత కాలం వెండితెరకు దూరంగా ఉండటానికి కారణం? నాకిద్దరు పిల్లలు. ఓ పాప, ఒక బాబు. వాళ్ల కోసం నేను కొంత గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయి లండన్‌లో చదువుకుంటోంది. నాక్కావల్సినంత టైమ్ దొరుకుతుంది. అందుకే, మళ్లీ సినిమాలు చేయాలనుకున్నాను. దాదాపు ఐదేళ్ల క్రితం టీవీ సీరియల్స్‌కి దర్శకత్వం వహించి, నటించారు కూడా.. బుల్లితెర ఎలాంటి అనుభూతినిచ్చింది? టైమింగ్స్ పరంగా చూసుకుంటే టీవీకి చేయడం సౌకర్యంగానే ఉంటుంది. అందుకే చేయగలిగాను. కానీ నాకెందుకో సీరియల్స్ చేయడం మొనాటనీ అనిపించింది. అందుకే బ్రేక్ తీసుకున్నా. 1980ల్లో మీరు వెండితెరను ఓ స్థాయిలో ఏలారు. అప్పటికీ ఇప్పటికీ ‘సినిమా’పరంగా మీరు గమనించిన తేడా? చాలా మారిపోయింది. ఒకప్పుడు సినిమా ఎలా తీసేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఊహించేయగలుగుతున్నారు. అప్పట్లో స్టూడియో లోపలికి రావాలంటే పెద్ద తతంగం ఉండేది. ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా వచ్చేస్తున్నారు. షూటింగ్స్ చూస్తున్నారు. అలాగే అప్పట్లో మీడియా ఇంత లేదు. వెండితెరపై మాత్రమే మేం కనిపించేవాళ్లం. ఇప్పుడు ఏ టీవీ చానల్ పెట్టినా సినిమా స్టార్స్ కనిపిస్తున్నారు. అలాగే సినిమా తారలు పబ్లిక్‌లోకి వస్తున్నారు. అందుకని సినిమాకి కొంచెం విలువ తగ్గినట్లు అనిపిస్తోంది. అప్పట్లో సినిమా స్టార్స్‌ని దాదాపు దేవుళ్లలా చూసేవాళ్లు. అందుకే వాళ్లు ముఖ్యమంత్రులు అవ్వగలిగారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. మళ్లీ ఎన్టీఆర్, ఎమ్జీఆర్లాంటి స్టార్స్‌ని మనం క్రియేట్ చేయలేం. సినిమాకి విలువ తగ్గిందని మీరే అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరీ రంగంలో ఎలా ఇమడగలుగుతున్నారు? నేనీ పరిస్థితిని నిందించడంలేదు. సినిమా అనేది అప్పటికీ ఇప్పటికీ మంచి వినోద సాధనం. అది ఎవరూ కాదనలేని సత్యం. ఎప్పుడో 30ఏళ్ల క్రితం నేను తెలుగు సినిమాలు చేశాను. ఇప్పటికీ నేనిక్కడివారికి గుర్తున్నాను. సినిమాకి ఉన్న శక్తి అలాంటిది. కాలానుగుణంగా పరిస్థితుల్లో మార్పు రావడం సహజం. అంత మాత్రాన కళామతల్లికి దూరంగా ఉండలేం కదా. అప్పట్లో నటించిన తెలుగు సినిమాలు మీకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ మీరు యాక్ట్ చేసిన 300 చిత్రాల్లో తెలుగు సంఖ్య తక్కువ ఉండ టానికి కారణం? తెలుగు ప్రేక్షకులు ‘శంకరాభరణం’లాంటి సినిమాలూ చూస్తారు. గ్లామర్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చూస్తారు. కానీ తెలుగులో దాదాపు నాకు గ్లామర్ రోల్సే వచ్చాయి. మొనాటనీ అనిపించి, కొన్ని వదులుకున్నాను. అంతే తప్ప తెలుగులో చేయడం నచ్చక కాదు. మీ తాజా చిత్రం విషయానికొస్తే.. మీకు సొంతంగా కథలు రాసుకునే సత్తా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎందుకీ రీమేక్ చేస్తున్నారు? ‘22 ఫీమేల్ కొట్టాయమ్’ కథ నాకు బాగా నచ్చింది. సమాజంలో మనిషి రూపంలో ఉండే మగమృగాల గురించిన కథ ఇది. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి మగవాళ్లు కూడా ఉంటారని ఆడవాళ్లకు అవగాహన కల్పించే చిత్రం. తెలుగు, తమిళ సంస్కృతి దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మలయాళం పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే కథలో చాలా మార్పులు చేశాను. ఈ చిత్రం ద్వారా మీ భర్త రాజ్‌కుమార్ నిర్మాతగా మారడానికి కారణం? నా భర్త వ్యాపారవేత్త. ఆయన దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఓ మంచి చిత్రం నిర్మించాలనే ఆకాంక్షతో ఈ సినిమాని సెలక్ట్ చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు నిర్మించాలని ఉంది. -

నిత్య నటన చూసి ఆశ్చర్యపోయాను - శ్రీప్రియ
స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘22 ఫీమేల్ కొట్టాయం’. ఈ చిత్రం ‘మాలిని 22’గా తెలుగు, తమిళ భాషల్లో పునర్నిర్మాణం అవుతోంది. నిత్యామీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అలనాటి అందాల తార శ్రీప్రియ దర్శకురాలు. రాజ్‌కుమార్ సేతుపతి నిర్మాత. ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిత్యామీనన్ మాట్లాడుతూ -‘‘శ్రీప్రియ ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వాణిజ్య విలువలతో పాటు, చక్కని సందేశం కూడా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘సమాజం పోకడలకు దర్పణంలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నిత్యామీనన్ పాత్ర కొత్తగా ఉంటుంది. ఆమె నటన, హావభావాలు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇందులో నిత్య రెండు పాటలు కూడా పాడారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అని శ్రీప్రియ చెప్పారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించాలనుకుంటున్నట్లు నిర్మాత తెలిపారు. ఇందులో భిన్నమైన పాత్ర చేస్తున్నానని, శ్రీప్రియ గొప్ప నటి మాత్రమే కాదు, గొప్ప దర్శకురాలు కూడా అని నరేష్ అన్నారు. ఈ చిత్రంలో అవకాశం రావడం పట్ల కథానాయకుడు క్రిష్ సత్తార్ ఆనందం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యూరామన్, అంజలిరావ్, జానకీ, చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఉమర్జీ అనూరాధ-గౌతమ్ కశ్యప్, సంగీతం: అరవింద్ శంకర్.