Stand India
-
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
ఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ రెండో ప్రకటన వ్యూహత్మకంగా ఉంది. విదేశాంగ శాఖ గురువారం వెలువరించి ప్రకటన ప్రధాని మోదీ మొదట ఇచ్చిన ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉన్నప్పటికీ తటస్థ వైఖరి కనిపిస్తోంది. మొదట ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్న భారత్.. పాలస్తీనాపై కూడా స్పందిస్తూ శాంతిని ఆకాంక్షించింది. పాలస్తీనా సార్వభౌమాధికారం, స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడంపై ప్రత్యక్ష చర్చలు జరపాలని తాము ఎల్లవేళలా కోరుకుంటున్నామని భారత్ గురువారం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత గురించి భారతదేశానికి తెలుసని అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా జీవించే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు దిశగా చర్యలు ఉండాలని భారత్ భావిస్తున్నట్లు బాగ్చీ చెప్పారు. ప్రధాని మోదీ ప్రకటన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిపిన ఆరంభంలో ప్రధాని మోదీ ప్రకటన భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ప్రకటనకు కాస్త విరుద్ధంగా ఉంది. ప్రధాని మోదీ పాలస్తీనా పేరు కూడా ఎత్తకుండా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. హమాస్ దాడులను ఉగ్రదాడులుగా పేర్కొంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అరబ్ దేశాలు నోరువిప్పడంతో భారత విదేశాంగ శాఖ, ప్రధాని మోదీ ప్రకటనలలో ఉగ్రవాదంపై వ్యతిరేక వైఖరి ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ స్వతంత్ర పాలస్తీనా అంశాన్ని కూడా జోడించి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పశ్చిమాసియాతో సంబంధాలు కోల్పోకుండా భారత్ వ్యూహంగా ముందుకు వెళుతోంది. యుద్ధం ఆరంభంలో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ-నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ వైపే ఏకపక్షంగా ఉన్నారు. గాజాలో జరుగుతున్న దాడులపై అరబ్ దేశాలు నోరువిప్పడంతో పరిస్థితి కాస్త మారింది. దీంతో వ్యూహాత్మకంగా భారత్ విదేశాంగ శాఖ పాలస్తీనా అంశంపై కూడా మాట్లాడింది. అరబ్ దేశాలతో సంబంధాలు అరబ్ దేశాలతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలను భారత్ కలిగి ఉంది. భారతదేశం చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇండియా పాలస్తీనాతో కూడా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. పాలస్తీనాకు చట్టబద్ధ గుర్తింపు కోసం 1974లో మద్దతు తెలిపిన ఏకైక అరబ్ దేశం కాని వాటిల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. 2016లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాలస్తీనాను కూడా సందర్శించారు. 2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఇండియాను సందర్శించారు. 1977లోనూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వైఖరి కూడా పాలస్తీనాకు మద్దతుగానే ఉంది. అక్రమంగా ఆక్రమించిన పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఖాలీ చేస్తేనే పశ్చిమాసియా సమస్య పరిష్కారమవుతుందని అప్పట్లో వాజ్‌పేయీ కూడా అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం -
‘స్టాండప్ ఇండియా’ స్కీమ్ రేపటి నుంచే
ఎస్సీ/ఎస్టీ మహిళా వ్యాపారులకు రూ. కోటి వరకూ రుణం ప్రారంభించనున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: దళిత, గిరిజన(ఎస్టీ/ఎస్టీ) మహిళా వ్యాపారవేత్తలకు బ్యాంకుల నుంచి రూ. కోటి వరకూ రుణాలను అందించే ‘స్టాండప్ ఇండియా’ స్కీమ్‌ను ఈ నెల 5న(రేపు) ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నోయిడాలో జరిగే కార్యక్రమంలో ఈ స్కీమ్‌తో పాటు దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ను కూడా ఆరంభిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా తదితరులు దీనికి హజరుకానున్నారు. ఏదైనా కొత్త వ్యాపార సంస్థను(వ్యవసాయేతర) ఆరంభించాలనుకునే ఎస్సీ/ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనిప్రకారం వారికి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాలను అందించేలా చూస్తారు. ప్రతి బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఇలాంటి రెండు ప్రాజెక్టులకు రుణం అందించాల్సి ఉంటుందని, ప్రతి ఎంట్రప్రెన్యూర్ కేటగిరీలో కనీసం సగటున ఒకరికి రుణం ఇస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ రుణాలు తీసుకునేవారికి డబ్బు విత్‌డ్రాయల్స్ కోసం రూపే డెబిట్ కార్డును ఇవ్వడంతోపాటు రుణానికి ముందు మార్కెటింగ్ ఇతరత్రా అంశాల్లో శిక్షణను కూడా అందిస్తారని పేర్కొంది. కాగా, ఈ స్కీమ్ కోసం సిడ్బి రూ.10,000 కోట్ల రీఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనుండగా, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్సీజీటీసీ) రూ.5,000 కోట్లతో మూల నిధి(కార్పస్)ని ఏర్పాటు చేయనుంది. కాగా, స్కీమ్ ప్రారంభం సందర్భంగా 5,100 ఈ-రిక్షాలను మోదీ పంపిణీ చేయనున్నారు. ప్రధాన మంత్రి ముద్రా యోజనలో భాగమైన మైక్రో క్రెడిట్(బీఎంసీ) ద్వారా వీటిని అందిస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ఊతం
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంకోసం కేంద్రం తాజా బడ్జెట్లో ‘స్టాండప్ ఇండియా’ పథకం కింద రూ.500 కోట్లను కేటాయించింది. దీనితోపాటు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వృత్తిపరమైన సాయం అందించడానికి వివిధ పారిశ్రామిక సంఘాల సహకారంతో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖలో జాతీయ హబ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్లో ప్రకటించారు. పరిశ్రమలు, వాణిజ్యరంగంలో ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలు మంచి ఫలితాలు కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు వ్యాపార, పారిశ్రామికరంగాల్లో రాణించడానికోసం రూ.500 కోట్లు కేటాయించడం ఆనందంగా ఉందని జైట్లీ అన్నారు. ప్రతీ బ్యాంకు బ్రాంచిల్లో ఒక్కో కేటగిరీలో కనీసం రెండు ప్రాజెక్టుల చొప్పున ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పారు. దీనిద్వారా దాదాపు 2.5 లక్షలమందికి లబ్ధికలుగుతుందని మంత్రి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సాధికారతకు ఊతం లభించాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి, గురు గోవింద్‌సింగ్ 350వ జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రూ. 100కోట్ల చొప్పున కేంద్రం బడ్జెట్ కేటాయింపులు చేసింది. కాగా, 2017లో 70వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇన్నేళ్లలో సాధించిన విజయాలను ఆ వేడుకలసందర్భంగా మననం చేసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. మైనారిటీల కోసం ‘ఉస్తాద్’ మైనారిటీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికోసం ‘ఉస్తాద్’ పేరిట పథకాన్ని అమలు చేస్తారు. ఈ పథకంద్వారా బహుళ రంగాల్లో మైనారిటీల అభివృద్ధికోసం చర్యలు చేపడతారు.