state handloom
-
AP: ఆప్కోలో అద్భుతమైన డిజైన్లతో వస్త్రాలు
సాక్షి, అమరావతి: వస్త్ర ప్రేమికులకు అత్యాధునిక డిజైన్లతో కూడిన మరింత నాణ్యమైన వ్రస్తాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆప్కో సంస్థ ‘కన్సైన్మెంట్’ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకోసం పేరెన్నికగన్న చేనేత వ్రస్తాలను ఉత్పత్తి చేస్తున్న 50 సొసైటీలకు ఆప్కో షోరూమ్‌లలో చోటు కేటాయించనుంది. ఈ నెల 18న ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రయోగాత్మకంగా విజయవాడ పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులోని ఆప్కో మెగా షోరూంలో అమలులోకి తీసుకురానుంది. చదవండి: పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్ చేనేతలో బ్రాండ్‌గా గుర్తింపు పొందిన చీరలు, అత్యాధునిక వస్త్రాలను తొలి దశలో అందుబాటులోకి తెస్తారు. ఉప్పాడ, చీరాల కుప్పటం పట్టు, మంగళగిరి చేనేత, వెంకటగిరి శారీ, ధర్మవరం జరీ బుటా తదితర ఫ్యాన్సీ చీరలతో పాటు పెడన కలంకారీ, పొందూరు ఖద్దరు వ్రస్తాలను కూడా ఆప్కో విక్రయించనుంది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలను కూడా విక్రయించనుంది. నూతన డిజైన్ వ్రస్తాలకు మర్కెట్లో డిమాండ్ వచ్చేలా ప్రతి నెలా ‘వస్త్ర ప్రదర్శన(పాప్ ఆప్ షో)’ నిర్వహించనుంది. నేతన్నకు ఎంతో మేలు.. ‘కన్సైన్మెంట్’ విధానంతో నేతన్నకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటివరకు నేతన్నలు అత్యాధునిక డిజైన్లు, ఖరీదైన వ్రస్తాలను ప్రైవేటు క్లాత్ షోరూమ్‌లకే విక్రయించేవారు. దీంతో ప్రైవేటు వ్యాపారులు వాటిని అమ్మిన తర్వాతే డబ్బులు ఇచ్చేవారు. ఆప్కో ద్వారా అమ్మితే ఏ నెల డబ్బు ఆ నెలలోనే చెల్లిస్తుంది. చేనేత సొసైటీల ప్రతినిధుల సమక్షంలోనే విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటుంది. చేనేతకు ఊతమిచ్చేలా చర్యలు రాష్ట్రంలో చేనేత రంగానికి మేలు చేసేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు చేపట్టారు. ఏటా ‘నేతన్న నేస్తం’ అందిస్తున్నారు. సీఎం జగన్ స్ఫూర్తితో ఆప్కో ద్వారా కన్సైన్మెంట్ విధానం అమల్లోకి తెచ్చి చేనేత రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలు చేపట్టాం. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి 50 చేనేత సొసైటీల ఉత్పత్తులను విక్రయిస్తాం. ఆ సొసైటీల ప్రతినిధులనే సేల్స్‌మెన్‌గా నియమించుకునే అవకాశం కల్పిస్తాం. బిల్లులను ఏ నెలకు ఆ నెల చెల్లించేలా పటిష్ట వ్యవస్థను తెస్తాం. తద్వారా చేనేత వ్రస్తాల ఉత్పత్తి పెరిగి.. ఆ రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. లాభాపేక్ష లేకుండా ఆప్కో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. – చిల్లపల్లి మోహనరావు, ఆప్కో చైర్మన్ -
ఎత్తిపోతలతో సస్యశ్యామలం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతాంగం కల సాకారం కాబోతోం దని, పాల మూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం పూర్తయితే బీడుభూములన్నీ సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జిల్లా యంత్రాం గం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్వే పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.6.9 కోట్లు విడుదల చేసిందన్నారు. అతి త్వరలో సర్వే పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని అత్యధికశాతం సాగుభూములకు ఏడాది పొడవునా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఉప ప్రణాళికతో మరింత అభివృద్ధి ఎస్సీ, ఎస్టీల కోసం ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప ప్రణాళికను అమలు చేస్తోం దని, దీంతో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. ఎస్సీలకు మెరుగైన విద్యను అందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యాలయాలు మంజూరయ్యాయని చెప్పారు. వివిధ నియోజకవర్గాల్లో 20 కమ్యూనిటీ హాళ్లు, మర్పల్లి, తాండూరు మండలాల్లో రెండు ఐటీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రైతులు, విద్యార్థుల కోసం.. జిల్లా రైతులకు ఈ ఏడాది రూ.706 కోట్ల పంట రుణాలు ఇస్తున్నట్లు మంత్రి ప్రసాద్‌కుమార్ వివరించారు. అదేవిధంగా సూక్ష్మ నీటిపారుదల కింద రూ.20 కోట్లు, పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా 500 పశువులతో పాలప్రగతి కేంద్రాలు, 245 మినీడెయిరీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందిర జలప్రభ కింద 280 బోర్లు వేసి 1,980 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ఈ ఏడాది ఆర్వీఎం ద్వారా రూ.64కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 2.91లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ చార్జీల నిమిత్తం రూ.737కోట్లు అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.