సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా రైతాంగం కల సాకారం కాబోతోం దని, పాల మూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం పూర్తయితే బీడుభూములన్నీ సస్యశ్యామలం కానున్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం 67వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జిల్లా యంత్రాం గం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్వే పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.6.9 కోట్లు విడుదల చేసిందన్నారు. అతి త్వరలో సర్వే పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని అత్యధికశాతం సాగుభూములకు ఏడాది పొడవునా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు.
ఉప ప్రణాళికతో మరింత అభివృద్ధి
ఎస్సీ, ఎస్టీల కోసం ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప ప్రణాళికను అమలు చేస్తోం దని, దీంతో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. ఎస్సీలకు మెరుగైన విద్యను అందించేందుకు జిల్లాకు ఆరు ఇందిరమ్మ విద్యాలయాలు మంజూరయ్యాయని చెప్పారు. వివిధ నియోజకవర్గాల్లో 20 కమ్యూనిటీ హాళ్లు, మర్పల్లి, తాండూరు మండలాల్లో రెండు ఐటీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
రైతులు, విద్యార్థుల కోసం..
జిల్లా రైతులకు ఈ ఏడాది రూ.706 కోట్ల పంట రుణాలు ఇస్తున్నట్లు మంత్రి ప్రసాద్‌కుమార్ వివరించారు. అదేవిధంగా సూక్ష్మ నీటిపారుదల కింద రూ.20 కోట్లు, పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా 500 పశువులతో పాలప్రగతి కేంద్రాలు, 245 మినీడెయిరీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందిర జలప్రభ కింద 280 బోర్లు వేసి 1,980 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ఈ ఏడాది ఆర్వీఎం ద్వారా రూ.64కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 2.91లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీల నిమిత్తం రూ.737కోట్లు అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఎత్తిపోతలతో సస్యశ్యామలం
Published Fri, Aug 16 2013 3:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement