state presidant
-
జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాకే, రాష్ట్ర నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ.నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డిలను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అటు నడ్డాను, ఇటు కిషన్‌రెడ్డిని తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగించిన విషయం తెలిసిందే. ఇద్దరూ కేబినెట్లో ఉండటంతో వీరిస్థానంలో అధ్యక్ష బాధ్యతలు వేరే వారికి అప్పగించనున్నారు. కర్ణాటకతోపాటు రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఏపీ, తమిళనాడు, కేరళలలో బలపడాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేతకే అవకాశం ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఒకరి అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఓసీ సామాజికవర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేఎల్పీనేతగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీ సామాజికవర్గానికే చెందిన ఇస్తారని అంటున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో సతా చాటడం అత్యవసరంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడైన నేతగా, బీసీలతోపాటు అన్నివర్గాల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిగా, ఇరవై ఏళ్ల పాటు బీఆర్ఎస్లో నంబర్ –2గా, మంత్రిగా ఈటలకున్న అనుభవం బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోంది. రాజకీయంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసినందున, సంస్థాగతంగా బలపడేలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా పార్టీని అన్నివిధాలా సంసిద్ధం చేసుకునేందుకు ఉపయోగపడే నేతలకే అధ్యక్ష పదవి దక్కుతుందదని భావిస్తున్నారు. అయితే రాష్ట్రపార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిలో ఎంపీలు అర్వింద్, డీకే.అరుణ, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌తోపాటు మరికొందరు ఉన్నారు. -
బీజేపీ రాష్ట్ర శాఖలకు కొత్త సారథులు
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. దీంతో, త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త సారథులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, ఏపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరిని నియమించింది. అదేవిధంగా, పంజాబ్ బాధ్యతలు సునీల్ జాఖడ్‌కు, జార్ఖండ్ చీఫ్‌గా బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అ ప్పగిస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బాధ్యతలను ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మార్పులు చేపట్టినట్లు భావిస్తున్నారు. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఈమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్‌కు పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో గిరిజన నేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఢీకొట్టేందుకు అదే వర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దించింది. మరాండీ తన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్)ను 2020లో బీజేపీలో విలీనం చేశారు. -
బిహార్ : బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడికి కరోనా
పాట్నా : బిహార్‌లో పలువురు బీజేపీ కార్యకర్తలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ర్ట అద్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కు సైతం కరోనా సోకింది. జైస్వాల్‌తో పాటు ఆయన భార్య, తల్లికి సైతం కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గతవారం పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయనకు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇటీవల బీజేపీ కార్యాలయంలోని పలువురు కార్యకర్తలకు పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే జైస్వాల్‌కు కూడా కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. బిహార్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈనెల 16 నుంచి 31 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు ప్రభుత్వ, ప్రైవేటు సహా వాణిజ్య కార్యకలాపాలకు సైతం అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే బెంగుళూరు. పూణె నగరాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. -
6న వైఎస్సార్ సీపీ నేతల బృందం పర్యటన
∙రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో పంటల పరిశీలన ∙జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ వెల్లడి కాజీపేట రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ఈనెల 6వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తెలిపారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో సోమవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకా ల నియోజక వర్గాల్లోని ఎనిమిది మండలాల్లో రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి వేముల శేఖర్‌రెడ్డితో పాటు జిల్లా నేతలు పర్యటించి ఇటీవల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నట్లు తెలిపారు. 6వ తేదీన ఉదయం 11 గంటలకు వంచనగిరి సాయిబాబా ఆలయం వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులకు స్వాగతం పలకనుండగా.. అక్కడి నుండి గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపే ట, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో పర్యటిస్తామని ఆయన వివరిం చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగాల ఈర్మియా మా ట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ, అనుబంధ సంఘాల నాయకులు దోపతి సుదర్శన్ రెడ్డి, గౌరబోయిన సమ్మయ్య, అప్పం కిషన్ చల్లా అమరేందర్‌రెడ్డి, దుప్పటి ప్రకాష్, విల్సన్ రాబర్ట్, బొచ్చు రవి, నెమలిపురి రఘు, కౌటిల్‌రెడ్డి, మైలగాని కళ్యాణ్‌కుమార్, నాగవెల్లి రజినీకాం త్, గన్నెపెల్లి సైదులు, శ్రీనివాస్, జంపన్న, సురేందర్‌రెడ్డి, యాకూబ్, సాయికుమార్, బొ చ్చు భాస్కర్, ఆర్.కృష్ణ, లాలూనాయక్, రాజేష్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు. -
విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోవాలి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము ఏలూరు సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేసే విధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము తెలిపారు. శనివారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఆఫీస్ బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాము మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు విద్యానిలయాలుగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు రేషనలైజేషన్ పేరుతో మూసివేయడం అత్యంత దారుణమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఫీజులు పెంచి ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా విద్యార్థి లోకం ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల అనంతరం జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వి.మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శివరాజు, మహిళా కన్వీనర్ పి.తులసి, జిల్లా సహాయ కార్యదర్శి పి.సాయికృష్ణ, టి.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.