
పాట్నా : బిహార్‌లో పలువురు బీజేపీ కార్యకర్తలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ర్ట అద్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కు సైతం కరోనా సోకింది. జైస్వాల్‌తో పాటు ఆయన భార్య, తల్లికి సైతం కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. గతవారం పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయనకు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇటీవల బీజేపీ కార్యాలయంలోని పలువురు కార్యకర్తలకు పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే జైస్వాల్‌కు కూడా కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.
బిహార్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈనెల 16 నుంచి 31 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు ప్రభుత్వ, ప్రైవేటు సహా వాణిజ్య కార్యకలాపాలకు సైతం అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే బెంగుళూరు. పూణె నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.