- ∙రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో పంటల పరిశీలన
- ∙జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్ వెల్లడి
6న వైఎస్సార్ సీపీ నేతల బృందం పర్యటన
Published Tue, Oct 4 2016 12:55 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
కాజీపేట రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో ఈనెల 6వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ తెలిపారు. హన్మకొండ పార్టీ కార్యాలయంలో సోమవా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట, పరకా ల నియోజక వర్గాల్లోని ఎనిమిది మండలాల్లో రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి వేముల శేఖర్‌రెడ్డితో పాటు జిల్లా నేతలు పర్యటించి ఇటీవల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించనున్నట్లు తెలిపారు. 6వ తేదీన ఉదయం 11 గంటలకు వంచనగిరి సాయిబాబా ఆలయం వద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులకు స్వాగతం పలకనుండగా.. అక్కడి నుండి గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపే ట, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో పర్యటిస్తామని ఆయన వివరిం చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగాల ఈర్మియా మా ట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనకు నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ, అనుబంధ సంఘాల నాయకులు దోపతి సుదర్శన్ రెడ్డి, గౌరబోయిన సమ్మయ్య, అప్పం కిషన్ చల్లా అమరేందర్‌రెడ్డి, దుప్పటి ప్రకాష్, విల్సన్ రాబర్ట్, బొచ్చు రవి, నెమలిపురి రఘు, కౌటిల్‌రెడ్డి, మైలగాని కళ్యాణ్‌కుమార్, నాగవెల్లి రజినీకాం త్, గన్నెపెల్లి సైదులు, శ్రీనివాస్, జంపన్న, సురేందర్‌రెడ్డి, యాకూబ్, సాయికుమార్, బొ చ్చు భాస్కర్, ఆర్.కృష్ణ, లాలూనాయక్, రాజేష్‌రెడ్డి, సుమన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement