study tour
-
స్కూల్ స్టడీ టూర్లో విషాదం.. ఏడుగురు విద్యార్థినులు మృతి!
ఇంఫాల్: మణిపూర్‌లోని నోనీ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యారి్థనులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడి ఏడుగురు పిల్లలు విగత జీవులయ్యారు. 25 మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాంగ్సాయ్ సమీపంలో ఓల్డ్ చాచర్ రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. థాంబాల్ను హయ్యర్ సెకెండరీ స్కూల్ విద్యార్థినులు స్టడీ టూర్ కోసం బస్సులో ఖౌపూమ్‌కు బయలుదేరారు. మధ్యలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఇంఫాల్‌లోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ప్రకటించారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. #Breaking | Several Students Feared Dead in Massive School Bus Accident in #Manipur's #Noney District Niloy Bhattacharya shares details with @GrihaAtul pic.twitter.com/dkosTlmwV6 — News18 (@CNNnews18) December 21, 2022 -
మూసీపై మరో అధ్యయన యాత్ర
సాక్షి, సిటీబ్యూరో: మూసీ సుందరీకరణపై మరో అధ్యయన యాత్రకు మూసీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని సబర్మతి, కోల్‌కతాలోని హుగ్లీ నది తరహాలో మూసీ నదిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆయా నగరాలకు ఇటీవల వెళ్లారు. మూసీ కార్పొరేషన్ ఎండీ అశోక్‌రెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ అధికారుల బృందం ఈ అధ్యయనం నిర్వహించనుంది. త్వరలో మూసీ నది సుందరీకరణ, పరిరక్షణపై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనుంది. ఇటీవల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు.. మూసీ పరిరక్షణ, సుందరీకరణ పనులపై సర్కారు అలసత్వం వహిస్తోదంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అధ్యయన యాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగితాలపైనే మూసీ.. చారిత్రక మూసీ నది ప్రక్షాళనలో భాగంగా తొలివిడత గాపురానాపూల్ చాదర్‌ఘాట్ (3కి.మీ) మార్గంలో సుందరీకరణ చేపట్టే పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. మూసీ చుట్టూ ఆకాశమార్గాల నిర్మాణం, నదీ పరీవాహక మార్గంలో తీరైన ఉద్యానాలు ఏర్పాటు చేయడం ద్వారా సుందరీకరణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన డిజైన్లను పది స్వదేశీ, విదేశీ సంస్థలు ఆరునెలల క్రితమే సమర్పించినప్పటికీ అడుగు ముందుకుపడటంలేదు. మూసీనది పడమర భాగంలో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్లతో పాటు తూర్పున ఉన్న గౌరెల్లి (ఔటర్ రింగ్ రోడ్డు సమీపం) వరకు సుమారు 57.50 కి.మీ మార్గంలో సుందరీకరణ, పరిరక్షణ, అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికల తయారీకి.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయి డిజైన్ సంస్థలను ఆహ్వానించిన విషయం విదితమే. ప్రపంచ స్థాయి ప్రమా ణాలు, వినూత్న విధానాల ద్వారా మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టాలనే విషయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పట్టాలెక్కకపోవడంపై నగరవాసులు, పర్యావరణ వాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. డిజైన్లు ఘనం.. ఆచరణ శూన్యం.. తీరైన పట్టణ ప్రణాళిక, సుందరీకరణ అంశాల్లో పేరొందిన ప్రతిష్టాత్మక సంస్థలు పురానాపూల్– చాదర్‌ఘాట్ మార్గంలో సుందరీకరణ పనులు చేపట్టేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో డిజైన్ కాంపిటీషన్ నిర్వహించింది. దీంతో అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు తాము రూపొందించిన డిజైన్లను కార్పొరేషన్‌కు సమర్పించాయి. ఇందులో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేయడంలో ఆరునెలలుగా మూసీ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా.. సుందరీకరణ పనుల్లో భాగంగా మూసీలో ఆవరణ వ్యవస్థను పరిరక్షించడం, హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ అభివృద్ధి పనులకు తక్షణం శ్రీకారం చుట్టాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం ‘ట్రాన్స్ఫార్మింగ్ హైదరాబాద్: మూసీ రివర్ రివిటలైజేషన్’ పేరుతో నిర్వహించిన డిజైన్ కాంపిటీషన్లో వివిధ సంస్థలు సమర్పించిన డిజైన్లలో అత్యుత్తమ డిజైన్‌ను ఎంపికచేయాలని సూచిస్తున్నారు. నీరుగారుతున్న లక్ష్యం.. ఇక అత్యుత్తమ డిజైన్‌ను ఎంపిక చేసి పురానాపూల్ చాదర్‌ఘాట్ మార్గంలో డిసెంబరు నెలలో సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు ఏర్పాటుచేసే పనులను ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించారు. 2019 ఏప్రిల్ నాటికి ఈ పనులు పూర్తిచేసి ప్రజల సందర్శనకు వీలుగా ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికీ అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. అధికారులేమంటున్నారు.. మూసీ ప్రవాహ మార్గంలో 57.50 కి.మీ మార్గంలో ఈస్ట్‌వెస్ట్ కనెక్టివిటీ, సుందరీకరణ, పరిరక్షణ పనులను జనవరి 2019లో ప్రారంభించి రెండున్నరేళ్లలోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు మున్సిపల్ పరిపాలన శాఖ అధికారులు చెబుతున్నారు. మూసీ సుందరీకరణ, పరిరక్షణ చర్యల్లో భాగంగా నదీ ప్రవాహ మార్గంలోఘన, ద్రవ వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం.. సాక్షి, సిటీబ్యూరో: మూసీ రివర్‌ఫ్రంట్‌ను అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసేందుకు ఇతర నగరాల్లోని రివర్ఫ్రంట్ల అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు జీహెచ్ఎంసీతో సహా వివిధ విభాగాల అధికారులు అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు వెళ్లారు. సోమవారం అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను, అక్కడి సబర్మతి నదిని ఎంతకాలంగా, ఎలా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దింది పరిశీలించారు. మంగళవారం దాని అభిృద్ధికి సంబంధించి స్థానిక అధికారులు వీరికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. బుధవారం కోల్‌కతాలోని హుగ్లీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ను పరిశీలించిన వీరు రెండు రివర్ఫ్రంట్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి అధ్యయన నివేదిక అందజేయనున్నారు. వీటితో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అనువైన టెక్నాలజీతో మూసీ పరిసరాల్ని తీర్చిదిద్దనున్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి నేతృత్వంలో అధ్యయనానికి వెళ్లిన బృందంలో జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ జె.శంకరయ్య, చార్మినార్ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్(ప్రాజెక్ట్) సురేష్‌కుమార్, జలమండలి, ఎంఆర్‌డీసీఎల్‌ల అధికారులున్నారు. మూసీ కారిడార్ అభివృద్ధి పనులిలా.. ♦ పురానాపూల్– చాదర్‌ఘాట్ మార్గంలో 3 కి.మీ మార్గంలో మూసీ సుందరీకరణ, తీరైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్లను తీర్చిదిద్దడం ♦ రివర్‌ఫ్రంట్ సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో మూసీ ప్రవహిస్తున్న 57 కి.మీ మార్గంలో దశలవారీగా సుందరీకరణ పనులు చేపట్టడం -
మునగ సాగు–మార్కెటింగ్‌పై అధ్యయన యాత్ర
మునగ సాగు పద్ధతులు, ప్రాసెసింగ్ సదుపాయాలు, వ్యాపారావకాశాలపై తమిళనాడులో ఈ నెల 29–30 తేదీల్లో తమిళనాడు కౌన్సిల్ ఫర్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అధ్యయన యాత్ర జరగనుంది. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ పెరియకుళం, కోయంబత్తూరు క్యాంపస్‌లతో పాటు ఐదారు చోట్లకు వెళ్లి రైతులు, శాస్త్రవేత్తలు, డీలర్లు, ఎగుమతి వ్యాపారులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తి గలవారు ఈ నెల 22లోగా ప్రాజెక్టు ఆఫీసర్ డా. టి. లతను సంప్రదించి పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. 94431 59345, 94875 59345, taced1992@gmail.com -
విషాద యాత్ర
సమయం తెల్లవారుజామున 3.05 గంటలు. రోజంతా ఆనందంగా గడిపిన చిన్నారులంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. బ్రిడ్జి దాటాల్సిన బస్సు గాలిలో తేలుతూ 30 అడుగుల లోతున్న వాగులో పడింది. కేకలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. బస్సులో కిక్కిరిసి ఉన్న విద్యార్థులంతా అసలేం జరిగిందో తెలియక భీతిల్లి పోయారు. రక్తపు గాయాలతో హాహాకారాలు చేశారు. మరో రెండు గంటల వ్యవధిలో ఇంటికి చేరుతామనుకునే సమయంలో బస్సు బ్రిడ్జి గుంతలో పడింది. గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 47 మంది గాయపడ్డారు. చిమ్మ చీకట్లో కదల్లేని స్థితిలో ఒకరినొకరు పట్టుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ హృదయ విదారక ఘటన పీసీపల్లి మండలం పెద అలవలపాడు వద్ద గురువారం వేకువజామున జరిగింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తు, స్కూలు టీచర్ల నిరక్ష్యం వెరసి విద్యార్థుల విహారయాత్రను విషాదయాత్రగా మార్చింది. – కనిగిరి/పీసీపల్లి ► బ్రిడ్జి గుంతలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు ► పీసీపల్లి మండలం పెద అలవలపాడు వద్ద ప్రమాదం ► బస్సులో 88 మంది.. అందులో 78 మంది విద్యార్థులు ► 47 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం ► చిమ్మ చీకట్లో చిన్నారుల హాహాకారాలు ► డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణం కనిగిరి/పీసీపల్లి: ఉలవపాడు మండలం కరేడులోని పోతుల వెంకట సుబ్బయ్య శ్రేష్టి (పీవీఎస్ఎస్) జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 78 మంది విద్యార్థులను టీచర్లు విహారయాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. యాగంటి, మహానంది, బెలూన్ గుహలు చూసేందుకు ఈనెల 28న రాత్రి 12 గంటలకు కరేడు నుంచి ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో బయలు దేరారు. విహారయాత్ర ముగించుకుని మహానంది నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఎస్‌వీఎల్‌టీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు డ్రైవర్ కాలేషా మద్యం సేవించి వాహనం నడపడంతో పీసీపల్లి మండలం పెద అలవలపాడు బ్రిడ్జి వద్ద బస్సు 30 అడుగుల లోతులో ఉన్న వాగులో పడింది. ఈ ఘటనలో 47 మందికి గాపడగా అందులో 28 మందికి తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలైన వారిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థి వేల్పుల శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉంది. భీతిల్లిన చిన్నారులు: బస్సులో ప్రయాణిస్తున్న వారంతా చిన్నారులే కావడంతో భయంతో భీతిల్లి పోయారు. నిద్రలోనుంచి తేరుకున్న కొందరు అసలేం జరిగిందో తెలియక కొందరు.. గాయాల బాధలతో మరి కొందరు.. అమ్మా.. నాన్నా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఘనట సమయంలో బస్సులో మేల్కోనే ఉన్నా.. సుమారు 15 మంది విద్యార్థులు కళ్లముందు జరిగిన ఘటనతో కొంత సేపటి వరకు షాక్ నుంచి తేరుకోలేకపోయారు. కేసులు నమోదు..: ప్రమాద స్థలిని ఆర్డీఓ కె.మల్లికార్జునరావు, డీఎస్పీ కె.ప్రకాశరావు, డిప్యూటీ డీఈవో లక్ష్మయ్య, డీఎంహెచ్‌వో యాస్మిన్, ఆర్టీఓ వెంకటేశ్వరరావులు పరిశీలించారు. ట్రావెల్స్ యాజమాన్యం, డ్రైవర్ ఎస్కే కాలేషా, ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపినట్టు ధ్రువీకరించారు. ఉపాధ్యాయులు చేపట్టిన విహారయాత్రకు విద్యాశాఖ తరపు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని, జరిగిన ఘటనలో ఉపాధ్యాయుల తప్పుపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నట్లు డిప్యూటీ డీఈవో చెప్పారు. సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ నేతలు..: ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచారి బుర్రా మధుసూదన్‌యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. చలికి వణుకుతూ అక్కడే ఉన్న విద్యార్థులను వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరికీ పూర్తి స్థాయిలో చికిత్స అందే వరకు బుర్రాతోపాటు కందుకూరు సమన్వయర్త తుమాటి మాధవరావు దగ్గర ఉండి చూసుకున్నారు. తాగేసి డ్రైవింగ్ చేశాడయ్యా... ఒంగోలు సెంట్రల్ : నా కొడుక్కి బాగైతే చాలయ్యా.. మంచి వైద్యం చేయించండి అంటూ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ తల్లి జయమ్మ రోదించింది. తన కొడుక్కి యాక్సిడెంట్ అయిందని చుట్టాలు ఫోన్ చేస్తే తన భర్త శ్రీను తాను హుటాహుటిన బయలుదేరి రిమ్స్ ఆస్పత్రికి వచ్చిన్నట్లు చెప్పింది. పొన్నలూరు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీను, జయమ్మ దంపతులకు శ్రీకాంత్ మొదటి సంతానం. బాగా చదివించాలని స్తోమత లేకపోయినా ఎస్టీ హాస్టల్లో ఉంచి చదివించుకుంటున్నట్లు ఆ దంపతులు తెలిపారు. గత నెల 28న ఫోన్ చేసి కర్నూలు వెళుతున్నామని రూ.300 కావాలని అడిగాడని, అమ్మమ్మ, తాతయ్య వద్ద తీసుకోమని తాము సూచించిన్నట్లు తెలిపారు. అంతే అని తిరిగి వైద్యశాలలో ఇలా చూస్తున్నామని కంట తడిపెట్టారు. శ్రీకాంత్ తలకు దెబ్బ తగలడంతో ఎముక మెదడుకు గుచ్చుకుందని, దీనికి ఆపరేషన్ చేసినట్టు డాక్టర్లు చెప్పారన్నారు. తన కుమారుడిని ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు తన కుమారుడి చికిత్సకయ్యే ఖర్చును జడ్పీ నిధుల నుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. శ్రీకాంత్ వద్ద గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.వి.రమేష్ బాబు, కరేడు వసతి గృహ సంక్షేమ శాఖ అధికారి హనుమంతురావు తదితరులు ఉన్నారు. బస్సు మూడు పల్టీలు కొట్టింది..: బ్రిడ్జికి దగ్గరలో స్పీడ్ బ్రేకర్ వచ్చినా..బస్సు వేగం తగ్గలేదు. ఒక్క సారిగా బస్సు పైకి లేచింది. దీంతో బస్సులో నిలబడి ఉన్న మేం భయంతో కేకలు వేశాం. అప్పటికే బస్సు అదుపు తప్పింది. నిమిషాల వ్యవధిలో బ్రిడ్జి రాళ్లను ఢీకొని గుంతలోకి పల్టీలు కొడుతూ కింద పడింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాం. --- సాయి శివకృష్ణ, విద్యార్థి మధ్యలో కూర్చోబట్టి తప్పించుకున్నాం.: కనిగిరిలో బస్సు ఆగింది. సుమారు 2.35 కనిగిరి నుంచి బయలుదేరాం. అప్పటి నుంచి మేము మేలోకుని ఉన్నాం. బస్సు మధ్య సీట్లతో మేమిద్దరం కూర్చున్నాం. 20 నిమిషాల్లో బ్రిడ్జిలోకి దూసుకెళ్లింది. బస్సు పల్టీలు కొట్టే టప్పుడు రాడ్లను గట్టిగా పట్టుకుని కేకలు వేశాం. బస్సు మధ్యలో ఉన్నవాళ్లకి చిన్న చిన్నగాయాలయ్యాయి. కిటికీల దగ్గర కూర్చున్న వాళ్లకు పెద్ద దెబ్బలు తగిలాయి.--- శివనందిని, లావణ్య, విద్యార్థినులు మమల్ని ఆ దేవుడే కాపాడాడు...: నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. మేల్కొని చూసే సరికే బస్సు బ్రిడ్జి గుంతలోకి పోతుంది. నేను నా పక్కనే ఉన్న స్నేహితులు కలిసి బస్సులోని రాడ్లను గట్టిగా పట్టుకుని బిగ్గరగా కేకలు పెట్టాం. సుమారు 30 అడుగుల గుంతలో పడి నేలకు గుద్దుకుని పల్టీలు కొట్టింది. మమలిన ఆ దేవుడే రక్షించాడు. ------ విష్ణు, విద్యార్థి -
ప్రజాసేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి
అనంతపురం అర్బన్ : ‘‘ఐఏఎస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందించండి... అందులోనే నిజమైన సంతృప్తిని పొందుతారు.’’ అని కలెక్టర్ కోన శశిధర్ స్టడీ టూర్‌కి వచ్చిన శిక్షణ ఐఏఎస్ అధికారులకు సూచించారు. వింటర్ స్టడీ టూర్లో భాగంగా జిల్లాలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 2016 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌లు జిల్లాకు వచ్చారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి శిక్షణ ఐఏఎస్‌లతో కలెక్టర్ శశిధర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి జిల్లా భౌగోళిక స్వరూపం, నెలకొన్న కరువు, తద్వారా ఉత్పన్నమైన పరిస్థితులు, కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాల గురించి వారికి వివరించారు. గత 18 సంవత్సరాల్లో 13 ఏళ్లు కరువు బారిన పడటంతో ప్రజలు నిరంతరం సంఘర్షణతో జీవిస్తున్నారని కలెక్టర్ చెప్పారు. ఇక్కడి ప్రజలు చాలా మంచివారని, అధికార యంత్రాంగాన్ని గౌరవించడంలో ముందుంటారని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను కూడా వివరించారు. జిల్లాను కరువు బారి నుంచి గట్టెక్కించేందుకు హంద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. జిల్లా నీటి పారుదల ప్రణాళిక ద్వారా జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇక.. కర్బుజ, కళింగర, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ పంటలకు జిల్లా ప్రసిద్ధిగాంచిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చారిత్రాత్మక అంశాల గురించి ట్రైనీ కలెక్టర్ వివరించారు. నీటి సంరక్షణ, స్వచ్ఛ విద్యాలయ్ కార్యక్రమాల గురించి డ్వామా పీడీ నాగభూషణం, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈఓ రామచంద్ర, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ పనితీరు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను వాణిజ్య బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్దడం బాగుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు కితాబిచ్చారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ వార్డులో ఉన్న ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను మంగళవారం 9 జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు స్టడీటూర్‌లో వచ్చి సందర్శించారు. ఉప్పరిగూడ పీఏసీఎస్ సీఈఓ గణేష్‌ని సంఘం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా సంఘాన్ని తీర్చిదిద్దడం చాలా బాగుందన్నారు. ఎక్కడ లేనన్ని డిపాజిట్లు సేకరించి రైతుల శ్రేయస్సుకోసం పాటుపడటం అభినందనీయమని తెలిపారు. క్యాష్ కౌంటర్, ఎరువుల, విత్తనాల కేంద్రాలు, ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాన్ని తీర్చిదిద్దడం రాష్ర్టానికే గర్వకారణమని కొనియాడారు. గోల్డ్ లోన్లు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి రైతులను ఆపదలో అదుకొవడం శుభపరిణామమని అన్నారు. రోజుకు రూ.50 లక్షలు టర్నోవర్‌తో సంఘం పని చేయడం నచ్చిందని అభిప్రాయం వ్యక్తపరిచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ , మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాలో పని చేస్తున్న సంఘాలను ఉప్పరిగూడ పీఏసీఎస్‌లాగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ర్టంలోనే ఉప్పరిగూడ పీఏసీఎస్ సేవలు రైతులకు అందుబాటులో ఉన్నయని ఇదే తరహాలో ఆయా జిల్లాలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
విహరిద్దాం!
♦ త్వరలో జెడ్పీటీసీ సభ్యుల స్టడీ టూర్ ♦ ప్రభుత్వానికి లేఖ రాసిన చైర్పర్సన్ సునీత ♦ మాకూ అవకాశం కల్పించండి : ఎంపీపీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు (జెడ్పీటీసీలు) స్టడీ టూర్‌కు రెడీ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పయనమవుతున్నారు. పంచాయతీ పాలన అధ్యయనానికి కేరళను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. జెడ్పీటీసీ సభ్యుల అభ్యర్థనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సభ్యుల విజ్ఞానయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ పథకాలు, ఆయా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల బలోపేతానికి అవలంబిస్తున్న విధానాలను లోతుగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం సర్వసాధారణం. అయితే, ఈ పర్యటనలు కాస్తా విందు వినోదాలతో విహారయాత్రలుగా మారడంతో వీటి అనుమతులపై ప్రభుత్వం పరిమితులు విధించింది. స్టడీ టూర్ల పేరిట సాగే పర్యటనలపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా, ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులు గగన విహారం చేయడంతో వారి బాటలోనే మన జిల్లా సభ్యులు నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనుకున్నదే త డువుగా ప్రభుత్వ క్లియరెన్స్ కోసం లేఖ రాశారు. ఇదిలావుండగా, జెడ్పీటీసీల యాత్రలో తమకు చోటు కల్పించాలని సోమవారం మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి ఎంపీపీలు విన్నవించుకోవడం గమనార్హం. -
ఇది తీరని కడుపుకోత..
‘బియాస్’ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వైదేహి అనాథ ఆశ్రమంలో వర్ధంతి సభ రెండేళ్లయినా నివేదిక సమర్పించని కమిటీ సిటీబ్యూరో/సైదాబాద్: ‘చేతికి అందొచ్చిన మా పిల్లలు.. చేదోడువాదోడుగా ఉంటారనుకుంటే.. తిరిగి రాని లోకాలకు వెళ్లి పుట్టెడు శోకం మిగిల్చారు. ఈ అనాథ పిల్లల్లో మా పిల్లలను చూసుకుని బాధను దిగమింగుకుంటున్నాం. ఇంజినీరింగ్ చదివి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో లోకం విడిచి వెళ్లిపోయారు. పిల్లలే లోకంగా జీవిస్తున్న మాకు ఆ దేవుడు కడుపుకోత మిగిల్చాడు’.. 2014 జూన్ 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతయిన 24 మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన ఇది. ఈ ఘోర దుర్ఘటన జరిగి బుధవారానికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మృతుల తల్లిదండ్రులు సైదాబాద్‌లోని వైదేహి అనాథ ఆశ్రమ విద్యార్థులకు వారు బహుమతులు, దుస్తులు పంపిణీ చేసి అన్నదానం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు యూవీ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బియాస్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి, కె. కృష్ణారెడ్డి, సూర్యకుమార్, పద్మ, అనంతలక్ష్మి, వీరన్న, కళావతి, మిట్టపల్లి సంజయ్, మాచర్ల సుదర్శన్, ఎం. రవివర్మ, రామ్మోహన్, సుధ, వైదేహి ఆశ్రమ నిర్వాహకులు ప్రకాశరావు, రాములు, మల్లికార్జున్, విద్వాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగితాలపైనే శైలజా రామయ్యర్ కమిటీ.. బియాస్ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డిసెంబరు 2014 వరకు విచారణ చేసి దుర్ఘటనకు గల కారణాలు, స్టడీటూర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంది. కానీ ఘటన జరిగి రెండేళ్లు పూర్తయినా నివేదిక సమర్పించకపోవడం గమనార్హం. అసలు ఈ కమిటీ మనుగడలో ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీ.. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కసారి మినహా మరోదఫా పలకరించలేదు. అయితే ఈ దుర్ఘటనకు బాధ్యులు వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల, లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం నుంచి రావాల్సిన పరిహారం మినహా తెలంగాణ , ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు, లార్జీ డ్యామ్ అధికారులు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం దశలవారీగా అందడం గుడ్డిలో మెల్ల. ప్రస్తుతం వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం తమ వాటా పరిహారం చెల్లించేందుకు సుప్రీంకోర్టులో డబ్బులు డిపాజిట్ చేసినట్టు తెలిసింది. బాధను పంచుకోడానికేవచ్చాం.. బియాస్ దుర్ఘటన జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా మరచిపోలేకపోతున్నాం. మా పిల్లలు ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నారు. అసలు సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి తప్పిదం ఉందనే కోణాల్లో దర్యాప్తు చేయలేదు. - రాధాకృష్ణ మళ్లీ జరక్కుండా చూడాలి.. రెండో వర్ధంతిని ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకుంటే బాధను పంచుకునే వారుండరనే ఈ ఆశ్రమానికి వచ్చి ఇక్కడి విద్యార్థుల్లో మా పిల్లలను చూసుకుంటున్నాం. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి. నష్టపరిహారం కోసం ప్రాధేయపడ్డం లేదు. దేశంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటన జరగకూడదనే మా పోరాటం. - వెంకట్‌రెడ్డి ఏ తల్లికీ ఇంత కష్టం రాకూడదు ఈ కడుపుకోత ఏ తల్లికీరాకూడదు. విహారయాత్రకు తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యానికి విద్యార్థులను క్షేమంగా తీసుకురావల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ ఈ రోజు మాకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారు. 24 మంది విద్యార్థులు మరణించినా.. ఏ ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదు. - పద్మ ఇది మానవతప్పిదమే.. మానవతప్పిదం వల్లే బియాస్ దుర్ఘటన జరిగింది. నీళ్లను నదిలోకి వదిలే ముందు నలుగురు సిబ్బంది నది మొత్తం పర్యవేక్షించాలి. ప్రమాద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు వదలడానికి లేదు. గేట్లు ఎత్తినవారిది, తీసుకెళ్లిన వారిది తప్పే. కానీ అందరు తప్పుకోడానికే ప్రయత్నిస్తున్నారు. - బీవీ సుబ్బారావు, ఏపీ ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ -
విహారం..కారాదు విషాదం..
స్టడీ టూర్‌కు వెళ్లే విద్యార్థులకు బీమా తప్పనిసరి..! యూజీసీ తాజా మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. బియాస్ బాధితుల కేసుపై తుదితీర్పు మే 23కు వాయిదా.. నేటికీ అందని కమిటీ నివేదిక.. సిటీబ్యూరో: మొన్న బియాస్...తాజాగా నేపాల్ దుర్ఘటన...రాష్ట్రం నుంచి ఏటా విజ్ఞాన, విహార, సాహస యాత్ర లకు వెళుతున్నవారి ఆచూకీ గల్లంతవుతుండడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. గతేడాది జూన్8 వ తేదీన నగరంలోని బాచుపల్లి వీఎన్ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ డ్యామ్ వద్ద అసువులు బాసిన విషయం విదితమే. ఈ దారుణ సంఘటన నుంచి విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనకు కళాశాల యాజమాన్యం, బియాస్ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమేకారణమని వారు ఆరోపిస్తున్నారు. స్టడీటూర్‌కు ఎలాంటి ప్రాంతాలకు వెళ్లాలి అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, ప్రతి బృందానికి ఓ వైద్యుడు ఉండాలని, ప్రతి విద్యార్థికి బీమా సౌకర్యం కల్పించాల్సి బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. ఇటీవల యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని స్పష్టం చేసిందని వారు పేర్కొంటున్నారు. యూజీసీ తాజా మార్గదర్శకాలివే... స్టడీటూర్‌కు వెళ్లే విద్యార్థుల బృందంలో వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి, సందర్శనా ప్రాంతాలపై క్షుణ్ణంగా తెలిసిన ఓ గైడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ పరిస్థితులు, లోయలు, వంకలు, వాగులు, కొండలు, నదీప్రవాహాలు, డ్యామ్‌లపై విద్యార్థులకు సమాచారం అందజేయాలి. సందర్శించాల్సిన ప్రాంతాలు, అక్కడి పరిస్థితులపై వారికి ముందుగానే వివరించాలి.బృందం వెంట ప్రథమ చికిత్స కిట్ ఉంచుకోవాలి.విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అందజేసేందుకు ఆధునిక మొబైల్ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలి. స్టడీటూర్ లేదా సహాసయాత్రకు వెళ్లే వారి రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మార్గదర్శకాలను అమలు చేయని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యూజీసీ పేర్కొంది. మానని గాయం.. గతేడాది జూన్ 8న హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంకారణంగా 24 మంది విద్యార్థులు గల్లంతుకావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇందుకు సంబందించి తుదితీర్పును మే 23 వ తేదీకి వాయిదా వేసినట్లు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. తమకు ఏపీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించినా బిడ్డలను కోల్పోయిన బాధ నుంచి కోలుకోలేకపోతున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేటికీ అందని నివేదిక... బియాస్ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శైలజారామయ్యర్ కమిటీ నివేదిక అందించడంలో తాత్సారం చేస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తమ తప్పేమీ లేదని, స్టడీటూర్‌ను విద్యార్థులే ఏర్పాటు చేసుకున్నారని యాజమాన్యం బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ కమిటీ నివేదిక అందజేయడంలో జాప్యం చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రొఫెషనల్స్ టు సివిల్స్
కష్టతరమైన లక్ష్యాలు సాధించాలి తద్వారా ఇతరుకు మేలు చేయాలి ఐఏఎస్‌గా సవకు అవకాశాలు ఎక్కువ జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌ల మనోగతం వాళ్లంతా నవ యువత.. బీటెక్ కొందరు... ఎంటెక్ మరికొందరు... ఎంబీబీఎస్ ఇంకొందరు పూర్తి చేశారు. వారిలో చాలామంది నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్న వారూ ఉన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చునే సాఫ్ట్వేర్ రంగంకన్నా తాము కష్టపడుతూ ఇతరులకు చేసేసేవ దేశ భవిష్యత్‌కు పునాది వేస్తుం దని తలంచారు. అందుకే కఠోర శ్రమతో సివి ల్స్ రాసి మంచి ర్యాంకులతో ఎంపికయ్యారు. వారి శిక్షణ కాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అంతా ఐఏఎస్ హోదాతో విధుల్లో చేరుతారు. శిక్షణ చివరి అంకంలో భాగంగా భా రత్ దర్శన్ యాత్ర చేపట్టారు. అందులో భాగం గా గురువారం జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్లో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాత్ పాటిల్‌తో సమావేశమయ్యారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘హరిత కాకతీయ’ హోటల్లో విడిది చేసిన వారు తమ లక్ష్యాలు.. ఆశయాలు.. కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పాల నా వ్యవస్థ తీరు తదితర అశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లో.. - హన్మకొండ అర్బన్ ట్రైనీ ఐఏఎస్‌లకు స్వాగతం మట్టెవాడ : ముస్సోరి నుంచి గురువారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చిన 18 మంది ట్రెరుునీ ఐఏఎస్‌లకు వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు స్టడీ టూర్లో భాగంగా వారు వరంగల్‌లో ఉంటారని తహసీల్దార్ వివరించారు. 18 మంది ఐఏఎస్‌లు ఒకేసారి వరంగల్‌కు రావడంంతో స్టేషన్ కళకళలాడింది. డాక్టర్‌గానే ఉండి పొమ్మన్నారు మాది కేరళ రాష్ట్రం ఐఏ ఎస్‌కు సెలక్ట్ కాక ముందు ఎంబీబీఎస్ పూర్తి చేశా. రెండేళ్లు ప్రాక్టీస్ కూడా చేశాను. నాన్న శ్రీహరికోటలో ఐబీఆర్ఓగా పనిచేశారు. ఇంట్లో మాత్రం డాక్టర్‌గా కంటిన్యూ కమ్మన్నారు. వాళ్లను కన్విన్స్ చేసి ఇటువైపు వచ్చాను. చిన్ననాటి నుంచి ఐఏఎస్ కావాలన్నది నాకలగా ఉండేది. నాకు చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చాలా ఇష్టం. స్కూల్ స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతులు గెలిచేదానిని. ఆ తర్వాత ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ఇప్పించేవారు. అలాంటి ప్రముఖుల్లో ఎక్కువగా ఐఏఎస్ అధికారులే ఉండేవారు. అలా.. నేను కూడా ఓ ప్రముఖ స్థానంలో ఉండాలని. అందరికీ సేవ చేయాలని అనిపించేది. అందుకే ఎంబీబీఎస్ చదివినా ఐఏఎస్ లక్ష్యం మాత్రం మర్చిపోలేదు. యువత ఎవరైనా తమ ల క్ష్యాన్ని మరువొద్దు. - దివ్య అయ్యర్, కేరళ భారత్ దర్శన్ ఏన్నో నేర్పుతుంది క్లాస్ రూంలో ఉండి చదివే వాటికన్నా క్షేత్రస్థాయి పర్యటనలు చక్కని పాఠాలు నేర్పుతాయి. ప్రస్తుతం మాకు శిక్షణ కాలంలో భారత్ దర్శన్ యాత్ర చక్కటి అనుభూతిగా మిగులుతుంది. ఈ టూర్లో ఎన్నో నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశంలో అవినీతి... బాధ్యతారాహిత్యం అన్నవి అతిపెద్ద సమస్యలు.. సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఏ ఒక్కరూ పూర్తిగా రూపుమాపలేరు. ఎవరికి వారు తమవంతుగా కృషి చేయాలి. ఈ అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్ స్థాయి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకే అండమాన్, నికోబార్ వంటి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలో కొంతకాలం పనిచేశాక ఈ రూట్ ఎంచుకున్నా. ఏడేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయారు. అన్నయ్య మా బాధ్యతలు తీసకుని దిశానిర్ధేశం చేశారు. అన్ని పరిస్థితులు చూసి లక్ష్యం సాధించాలని ముందుకు సాగా. - లోకేష్, బీటెక్ కంప్యూటర్స్, మధ్యప్రదేశ్ క్యాడర్ దేశం గొప్పగా ఉంది..పేదల పరిస్థితి దారుణంగా ఉంది మన దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇతర దేశా ల్లో మనవాళ్లే ఎక్కు రంగా ల్లో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతా ల్లో.. మారుమూల పల్లెల్లో పరిస్థితులు, ప్రజల జీవన స్థితిమరీ దారుణంగా ఉంది. ఇంత తేడా ఉండటానికి బలమైన కారణం వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతోంది. ఆ లోపం సరిచేయగలిగితే అభివృద్ధి అందరికీ సమానంగా అందుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్‌ల చేతిలో చాలా వరకు ఉంటుం ది. నేను ఎంటెక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో చదివా. నాన్న రైల్వేస్‌లో పని చేసేవారు. మాది రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్నగ్రామం. అందుకే పేదలు, పేదరికం గురించి బాగా తెలుసు. మనం ఎంచుకున్న లక్ష్యం ముందు ఎలాంటి సమస్యలైనా చిన్నవే. లక్ష్యాన్ని సాధిస్తే మిగ తా సమస్యలన్నీ వాటంతటవే దూరమవుతాయి. - కులదీప్చౌదరి, రాజస్థాన్(జార్ఖండ్ క్యాడర్) గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే.. సమస్యలు ఎత్తి చూపడం కన్నా... ఒక మంచి పరిపాలన అధికారిగా ఉంటే మన మే వాటిని సరిదిద్దే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యూత్ ఎవరికివారు. సేఫ్ సైడ్ చూసుకుని వెళితే చివరికి మిగిలేది ఎవరు.. ఐఏఎస్ కన్నా ఎక్కువ సంపాదించాలంటే చాలా మార్గాలు.. రంగాలున్నాయి. కష్టపడకుండా కూడా సంపాదించే అవకాశాలు కాకుండా మనం కష్టపడుతూ సంపాదించే దాంట్లో సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా దేశ స్థితిని మార్చేందుకు తోడ్పడే మార్గాలు ఎన్నుకోవాలి. మన యూత్ ఏంటో ఇతర దేశాల వాళ్లకి కూడా తెలుసు. అలాంటిది మన దేశ దిశ మార్చాలంటే అంకిత భావంతో పనిచేసే పాలనా యంత్రాంగం అవసరం యువత అవినీతరహితంగా పని చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే ఆశించిన మార్పును కాస్త ఆల్యంగా అయినా చూడగలం. - అమిత్ కుమార్పాండే, యూపీ(రాజస్థాన్ క్యాడర్) ప్రభుత్వ పాలసీలు మారాల్సి ఉంది డాక్టర్‌గా పని చేస్తే సామాజిక సేవ ఎంత చేయాలని ఉన్నా పరిమితులుంటాయి. ముఖ్యంగా హౌస్‌సర్జన్ చేసే సమయంలో చాలామంది పేషెంట్ల పరిస్థితి చూస్తే బాధగా అనిపించేది. డాక్టర్‌కు ఇచ్చే ఫీజు ఉండదు.. మందులు కొనే స్థోమత ఉండదు. ఒక డాక్టర్‌గా నేను వారికి ఉచితంగా వైద్యం, మందులు మాత్రమే అందించగలను. కానీ అదే ఒక ఐఏఎస్ అధికారిగా అయితే అంకిత భావంతో పనిచేసేవారికి చాలా అవకాశాలుం టాయి. ప్రభుత్వాలు పేదల కోసం చాలా రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అయితే వాటిని అమలు చేసే విధానాల్లో మార్పు రావాల్సి ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పేదలకు కేటాయించిన పథకాలు, నిధులు వారిని పూర్తిగా చేరడంలేదు. పరిపాలనాపరమైన లోపాలను సరి చేస్తే.. ఆశిం చిన లక్ష్యాలు నెరవేరుతాయి.మా నాన్న బీఎస్ఎన్ఎల్ త్రివేడ్రంలో ఉద్యోగి. అమ్మ హౌస్‌వైఫ్. - డాక్టర్ విలియం, కేరళ త్రివేడ్రం(గుజరాత్ క్యాడర్) ఐపీఎస్ శిక్షణ నుంచి వచ్చా మా ఇంట్లో నాన్న ప్రొఫెసర్. అమ్మ టీచర్. చదువు విషయంలో పూర్తి ప్రోత్సాహం ఉండేది. అందుకే ఆడపిల్లనైనా.. ముందు ఐపీఎస్‌కు ప్రిపేర్ అయి ఎంపికయ్యా. కేరళ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికై కేరళలో 8 నెలలు శిక్షణ పొందా. ఇదే సమయంలో ఒకసారి ఐఏఎస్ కోసం ఇంకాస్త కష్టపడాలని నిర్ణయానికి వచ్చి ప్రయత్నించా. నా శ్రమ వృథా కాలే దు. అందుకే ఉన్నదాంతో తృప్తి పడకుండా యువత ఆశించింది సాధించే వరకు పట్టుదలతో కృషియాలి. ముఖ్యంగా సమాజానికి అందించాల్సింది విద్యా, ఆరోగ్యం ఈ రెండూ నాణ్యమైనవి అందిస్తే మిగతావాటిని ఆవే సృష్టిస్తాయి. దేశంలో పేదలకు ఆహార భద్రత అతిముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కొన్ని మెరుగైన పాలసీలు తీసుకొస్తే పేదలకు మేలు జరుగుతుంది. ప్రసుత్తం మాకు భారత్ దర్శన్ ఒక మంచి అనుభూతిగా మిగులుతుంది. - శుభం చౌదరి, ఢిల్లీ(రాజస్థాన్ క్యాడర్), ఎంఏ(ఎకనామిక్స్) భారత్ దర్శన్‌తో దేశ పరిస్థితులు తెలుస్తాయి మాది కేరళ రాష్ట్రం. నేను కేరళ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపిక కావడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నాన్న ఆరోగ్యశాఖలో అధికారి. అమ్మ టీచర్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం మా స్టడీ లో భారత్ దర్శన్ పేరుతో ప్రస్తుతం చేస్తున్న యాత్ర కేరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్యలు తెలిస్తే వాటికి పరిష్కారాలు చూడొచ్చు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం కొంత సమ్యగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేడపతున్న కార్యక్రమాల వల్ల నక్సలిజం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ దిశగా మరింత ప్రయత్నాలు జరగాలి. అందులో భాగంగా ప్రజల సమస్యపరిష్కరించేందకు మంచి వేదిక ఐఏఎస్ హోదా. అందుకే ఉన్నత లక్ష్యాలతో ప్రయత్నించి ఈ రూట్‌కు వచ్చా. అంకిత భావంతో పనిచేస్తా. - చిత్ర, కేరళ(కేరళ క్యాడర్) ఫిబ్రవరి 20 నాటికి శిక్షణ పూర్తి ఎంతో ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో ఈ రూట్ ఎంచుని కష్టపడి ముందుకు వెళుతున్నాం. మా శిక్షణ ఫిబ్రవరి 20తో పూర్తవుతుంది. ఆ సమయం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఐఏఎస్ అధికారికి పరిపాలనాపరంగా సేవకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో ఆదాయం ఉన్నా.. సమాజానికి పెద్దగా చేసేది ఉండదు. అందుకోసమే ఈ రూట్‌ను ఎంపిక చేసుకుని వచ్చా. బీటెక్ కంప్యూటర్స్ చదివా. ఉద్యోగ వేటలో కాకుండా సివిల్స్ ప్రిపేర్ అయ్యా. అనుకున్నట్లు సెల క్ట్ య్యా. ఇక చేయాల్సిందంతా ముందుంది. యువత తమకున్న లక్ష్యాలు సాధించేందుకు ఎంత కష్టాన్నయినా భరించి ముందుకు సాగాలి. అప్పుడే విక్టరీ విలువ తెలుస్తుంది. యశ్పాల్ మీనా, రాజస్థాన్ (బీమార్ క్యాడర్) -
బంగరు భవితను మింగేసిన బియాస్
ఆ ఘటనకు ఆర్నెళ్లు.... బియాస్ దుర్ఘటనకు ఆరునెలలు బాధిత కుటుంబాలను ఆదుకున్న తెలంగాణ, హిమాచల్ సర్కార్లు ఎక్స్‌గ్రేషియాకు హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం ఘటనతో సంబంధం లేదంటున్న యాజమాన్యం నేడు హిమాచల్ కోర్టు తుది తీర్పు సిమ్లాకు బాధిత కుటుంబాలు అదో పీడకల.. 24 మంది భావి ఇంజినీర్లను పొట్టన పెట్టుకున్న బియాస్ దుర్ఘటన. తలుచుకుంటేనే నగరవాసుల గుండెలు బరువెక్కుతాయి... కన్నవాళ్లకు పుట్టెడు శోకం మిగిల్చి కోరలు సాచిన బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన భావిభారత ఇంజినీర్ల కుటుంబాలకు నేటికీ సాంత్వన కలగలేదు.. ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటోంది కళాశాల యాజమాన్యం. తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ అధ్యయనం సాగుతూనే ఉంది.. ఇది జరిగి అప్పుడే ఆరు నెలలు గడచిపోయాయి.. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్టు తెలిసింది.. ఆ టూర్‌తో మాకు సంబంధం లేదు : కాలేజీ అఫిడవిట్ అందరినీ కలచివేసిన బియాస్ దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాల యాజమాన్యం పాఠాలు నేర్వలేదు. స్టడీటూర్‌కు బయలుదేరిన విద్యార్థులు తాము చెప్పినా వినకుండా లార్జీడ్యామ్ సందర్శనకు వె ళ్లారని, తమకు ఈ టూర్‌కు సంబంధమే లేదని హిమాచల్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీనికితోడు మరణించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశాలను కాలేజీ యాజ మాన్యం పరిష్కరించలేదని లార్జీ డ్యామ్ ఘటనలో మరణించిన బానోతు రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు విద్యార్థులు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విహార యాత్రకు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్‌నదిపై నున్న లార్జీ డ్యామ్ వరద ప్రవాహంలో కోట్టుకుపోయి 24 మంది విద్యార్థులు (ఒక టూర్ ఆపరేటర్ కూడా) మృత్యువాత పడ్డారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తుందని ప్రకటించారు. ఆరునెలలు గడచినా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం గమనార్హం. మరోవైపు బియాస్ దుర్ఘటన జరిగిన తీరుపై తెలంగాణ సర్కారు ఏర్పాటుచేసిన శైలజా రామయ్యర్ కమిటీ సైతం ఆరునెలలుగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించక పోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. హిమాచల్ కోర్టు ఆదేశం మేరకు లార్జీ డ్యామ్ అధికారులు, వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వేర్వేరుగా తక్షణ సహాయంగా రూ.2.50 లక్షల చొప్పున బాధితులకు పరిహారంగా అందజేశాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. ఈ దుర్ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతోనైనా సాంత్వన చేకూరుతుందని బాధిత కుటుంబాలు ఆశిస్తున్నాయి. అధ్యయనం పూర్తయ్యేనా.. దుర్ఘటనపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఓ కమిటీని ఆరు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కేవలం బియాస్ దుర్ఘటన జరిగిన తీరుకే ఈ అధ్యయనం పరిమితం కావడం గమనార్హం. దుర్ఘటన జరిగి ఆరు నెలలు గడిచినా అధ్యయనం పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది జనవరి 15 వరకు సమయం కావాలని ఆమె ప్రభుత్వాన్ని తాజాగా కోరినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పుతో న్యాయం? బియాస్ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్లు తెలిసింది. గతంలోనే లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం విదితమే. తాజా తీర్పుతో బాధిత కుటుంబాలకు ఒకింత సాంత్వన కలుగుతుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోన్న కళాశాలల నిర్లక్ష్యంపై చెంపపెట్టు అవుతుందని అందరూ అశిస్తున్నారు. ఈ తీర్పు కోసం బాధిత కుటుంబాల సభ్యులు పలువురు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. పరిహారం.. పరిహాసం.. బియాస్ దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆరునెలలుగా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టెడు దుఖాఃన్ని దిగమింగుకుంటూ కాలం వెల్లదీస్తోన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు తరఫున మాత్రం సాయం అందుతుందన్న ఆశ అడియాశే అయింది.కాగా దుర్ఘటన జరిగిన వెంటనే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు, ఉన్నతాధికార బృందం ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పంపి హడావుడి సృష్టించి డాబు ప్రదర్శించిన ఏపీ సర్కారు పెద్దలు.. ఆచరణలో చేతులెత్తేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
గోవా ఫుట్‌బాల్ పిచ్చికి బ్రెజిల్ లో ట్రీట్మెంట్
గోవాకి ఫుట్ బాల్ పిచ్చి. ఆ పిచ్చి నయం కావాలంటే బ్రెజిల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే గోవాకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు బ్రెజిల్ కి స్టడీటూర్ కి వెళ్లారు. అదీ ప్రజల డబ్బులతో. గోవాలోని మనోహర్ పరిక్కర్ ప్రభుత్వం ఈ స్టడీ టూర్ కి 89 లక్షల రూపాయలు విడుదల చేసింది. దీంతో సొమ్ము ప్రజలది, సోకు ఎమ్మెల్యేలదీ అయింది. అదేమిటంటే మేం 2017 లో అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించాలనుకుంటున్నాం. అందుకే ఈ టీమ్ ను పంపించామని గోవా ముఖ్యమంత్రి చెబుతున్నారు. వెళ్లినవారంతా మాజీ ఫుట్ బాల్ ప్లేయర్లే అని కూడా ఆయన చెబుతున్నారు. అయితే ఇంతటి టూరులో ఒక్క అధికారి, ఒక్క ఫుట్ బాల్ కోచ్ లేరు. కాంగ్రెస్ గోవా ప్రభుత్వపు 'స్టడీ టూర్' ను తప్పు పడుతోంది. ఈ సమయంలో స్టడీటూర్ అంటే మంత్రులు సాంబా నృత్యాలు, సాకర్ ఆట చూస్తే గడిపేస్తారని విమర్శిస్తోంది.