ఇంఫాల్: మణిపూర్‌లోని నోనీ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యారి్థనులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడి ఏడుగురు పిల్లలు విగత జీవులయ్యారు. 25 మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాంగ్‌సాయ్ సమీపంలో ఓల్డ్ చాచర్ రోడ్డుపై ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
థాంబాల్ను హయ్యర్ సెకెండరీ స్కూల్ విద్యార్థినులు స్టడీ టూర్ కోసం బస్సులో ఖౌపూమ్‌కు బయలుదేరారు. మధ్యలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను ఇంఫాల్‌లోని ఆసుపత్రులకు తరలించారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ప్రకటించారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
#Breaking | Several Students Feared Dead in Massive School Bus Accident in #Manipur's #Noney District
— News18 (@CNNnews18) December 21, 2022
Niloy Bhattacharya shares details with @GrihaAtul pic.twitter.com/dkosTlmwV6
Comments
Please login to add a commentAdd a comment