గోవా ఫుట్బాల్ పిచ్చికి బ్రెజిల్ లో ట్రీట్మెంట్
గోవా ఫుట్బాల్ పిచ్చికి బ్రెజిల్ లో ట్రీట్మెంట్
Published Fri, Jun 13 2014 9:15 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
గోవాకి ఫుట్ బాల్ పిచ్చి. ఆ పిచ్చి నయం కావాలంటే బ్రెజిల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిందే. అందుకే గోవాకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు బ్రెజిల్ కి స్టడీటూర్ కి వెళ్లారు. అదీ ప్రజల డబ్బులతో. గోవాలోని మనోహర్ పరిక్కర్ ప్రభుత్వం ఈ స్టడీ టూర్ కి 89 లక్షల రూపాయలు విడుదల చేసింది. దీంతో సొమ్ము ప్రజలది, సోకు ఎమ్మెల్యేలదీ అయింది.
అదేమిటంటే మేం 2017 లో అండర్ 17 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించాలనుకుంటున్నాం. అందుకే ఈ టీమ్ ను పంపించామని గోవా ముఖ్యమంత్రి చెబుతున్నారు. వెళ్లినవారంతా మాజీ ఫుట్ బాల్ ప్లేయర్లే అని కూడా ఆయన చెబుతున్నారు. అయితే ఇంతటి టూరులో ఒక్క అధికారి, ఒక్క ఫుట్ బాల్ కోచ్ లేరు.
కాంగ్రెస్ గోవా ప్రభుత్వపు 'స్టడీ టూర్' ను తప్పు పడుతోంది. ఈ సమయంలో స్టడీటూర్ అంటే మంత్రులు సాంబా నృత్యాలు, సాకర్ ఆట చూస్తే గడిపేస్తారని విమర్శిస్తోంది.
Advertisement