‘సుభోజనం’.. సుదూరం
నిజామాబాద్ వ్యవసాయం : మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు చౌకగా అల్పాహారం, భోజనం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘సుభోజనం’ పథకం జిల్లాలో ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్లో మంత్రి హరీష్‌రావు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేయాలని జిల్లాకేంద్రాల్లోని అన్ని మార్కెట్‌యార్డు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
రైతుల కోసం మార్కెట్‌యార్డ్‌లో అతి తక్కువ ధరలకు అంటే 2 రూపాయలకు అల్పాహారం, 5 రూపాయలకు భోజనం అందించేందుకు ‘సుభోజనం’ పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు వాటికి సంబంధించిన గైడ్‌లైన్స్ రాలేవు. పథకం నిర్వహించే విధానం, దానిని ఎలా అమలు చేయాలి, ఎవరు నిర్వహించాలి అన్న అంశాలను ఇంతవరకు సంబంధిత మార్కెట్ యార్డు అధికారులకు గాని, సిబ్బందికి గాని ఆదేశాలు రాలేదు. దీంతో ఈ పథకం ఈనెల 24నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, దానిని ఇంతవరకు జిల్లా అధికార యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో ఈ పథకం ఎప్పుడు ప్రారంభం కానున్నదో ఎవరికి అర్థం కావడం లేదు.
అమలు ప్రక్రియ ఎలా ఉంటుందో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘సుభోజనం’ పథకం ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అమలు ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు మార్కెట్‌యార్డ్ సిబ్బందికి ఆదేశాలు అందలేదు. దానికి సంబంధించిన నివేదికను సైతం మార్కెట్‌యార్డ్ అధికారుల నుంచి తెప్పించలేదని తెలిసింది.
సాధ్యమయ్యేనా..
ధరలు ఆకాశాన్ని అంటిన ఈ రోజుల్లో ఈ పథకం అమలు సాధ్యమవుతుందా అనే సంశయం నెలకొంది. దీని నష్టం ఎవరు భరించాల్సి ఉంటుందో యార్డ్ సి బ్బందికి సైతం తెలియకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. ఒకవేళ ప్రారంభిస్తే నడపడం సాధ్యమవుతుం దా అని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది.
ఎవరు నిర్వహిస్తారు..
అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్ర ణాళికలు రూపొందుతున్న సుభోజనం పథకాన్ని ఎవ రు నిర్వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. దాని నిర్వహ ణ బాధ్యత మార్కెట్‌యార్డ్ సిబ్బందికి అప్పగిస్తారా లే కా ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు పిలుస్తారా అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.