Success kid
-
సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో
పురుషులకే సొంతమనుకున్న క్రికెట్లో మహిళలు తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్‌గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా ఇప్పటికే స్పెటల్ ఎట్రాక్షన్. తాజాగా కావ్య మారన్ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. ఈ సక్సెస్ కిడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టూడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు, మొత్తం మ్యాచ్‌లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది. ముఖ్యంగా ఎంఐపై జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఉత్సాహంగా గెంతులు వేసింది. తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్ఆర్హెచ్ సీఈవో ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేనా 64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తిలక్ ఔటవ్వడంతో సన్‌రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్‌గా మారింది. Brilliant innings by Tilak 👌 Reaction of Kavya Maran 🙏#SRHvsMi pic.twitter.com/8zpKU6s3Fp — Cricket Uncut (@CricketUncutOG) March 27, 2024 అద్భుతమైన బ్యాటింగ్‌తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2013లో పూణే వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 263/5 రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 👉: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప -
‘సక్సెస్’ బాయ్..!
ఈ ఫొటోలో ఉన్న బుజ్జి పిల్లాడిని గుర్తుపట్టారా.. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసే దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ బుడతడు తెలిసే ఉంటాడు. ఫ్రెండ్స్‌తో సరదాగా చాటింగ్ చేసినప్పుడు.. ఏదైనా గెలిచిన సందర్భాల్లో.. మాటలతో పంచ్‌లు ఇచ్చినప్పుడు ఈ ఫొటోను షేర్ చేస్తుంటారు. 2007లో తీసిన ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఆ పిల్లాడి పేరు సామీ గ్రైనర్.. ఓ బీచ్‌లో ఇసుక తింటుండగా.. సామీ తండ్రి లానీ అనుకోకుండా తీసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. అంతే ఇక దేశదేశాల్లో ఈ ఫొటో వైరల్ అయింది. అయితే అందరు మాత్రం ఆ పిల్లాడు ఏదో సాధించిన సంతోషంలో ఆ స్టిల్ పెట్టాడనుకుని ‘సక్సెస్’కు చిహ్నంగా వాడేసుకున్నారు. ఇప్పుడు మనోడు పెద్దోడైపోయాడు.. చూశారుగా ఆ పక్కన ఉన్న పిల్లోడే ఆ ‘సక్సెస్’హీరో! మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఫొటోను షేర్ చేసి ఉంటారు.. గుర్తుకొచ్చిందా..? -
s/o జస్టిన్
ఈ పిల్లాడిని గుర్తుపట్టారా..! ఇంటర్నెట్తో పరిచయమున్న ప్రతి నెటిజన్‌కు ఈ బుడతడు సుపరిచితమే.. ఫేస్బుక్లో ఫ్రెండ్ ఫొటోకు కామెంట్ చేయాలంటే ఈ చిన్నోడి ఫొటో పెట్టాల్సిందే కదా..! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండే ఈ బుడతడి పేరు సామ్ గ్రైనర్. వీడికి 11 నెలల వయసున్నప్పుడు బీచ్‌లో ఇసుక తింటుండగా వీళ్ల మమ్మీ ఈ ఫొటో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారట.. ఎనిమిదేళ్ల వయసున్న సామ్.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి జస్టిన్ కోసం మళ్లీ నెట్ ముందుకొచ్చాడు. రూ.46.8 లక్షలు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ.23 లక్షలు విరాళం ఇచ్చారు. -
ఈ బుడతడి మరో సంచలనం
వాషింగ్టన్ : ఫేస్బుక్లో పలు రకాల కామెంట్లతో పదే పదే చక్కర్లు కొట్టే ఈ బుడతడు గుర్తున్నాడా.. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ 'సక్సెస్ కిడ్' ఫొటో సుపరిచితమే. వివిధ సందర్భాల్లో తమ సంతోషాన్ని, విజయాన్ని పంచుకోవడానికో, లేదా సరదాగానో ఈ ఫోటోను షేర్ చేయనివారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి పాపులారిటీ సంపాదించిందీ ఫొటో. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ ఫొటో అనేక హిట్లు, షేర్లు సాధిస్తూనే ఉంది. మరి అంతమంది నెటిజన్లకు కిక్ ఇచ్చిన ఈ ఫొటో ఎవరు తీశారో తెలుసా? ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేకు చెందిన లేనీ గ్రైనర్. ఆమె తన 11 నెలల కొడుకును ఫొటోను తన ఫ్లికర్ అకౌంట్లో సరదాగా 2007 ఆగస్టు 26న పోస్ట్ చేసింది. అప్పటి నుంచి.. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ా ఫొటో చక్కర్లు కొడుతూనే ఉంది. అంతేకాదు ఇంటర్నెట్లో సుదీర్ఘ కాలం ఆదరణ పొందిన ఫొటోల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఇపుడు ఎనిమిదేళ్ళ బుడతడు సామీ గ్రైనర్ మళ్లీ తెరపైకి వచ్చాడు. అయితే ఇపుడు సరదాగా కాదు.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తండ్రి జస్టిన్ గ్రైనర్కి సహాయం చేయాల్సిందిగా కోరుతూ!! తన తండ్రికి అవయవమార్పిడి చేయాల్సి ఉందని, దానికి సుమారు రూ. 47 లక్షల వరకు ఖర్చవుతుందనీ.. సహాయం చేయాలని కోరుతో సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. దీంతో విపరీతమైన స్పందన వచ్చింది. వేలాదిమంది దాతలు ముందుకు రావడంతో ఆపరేషన్‌కు అవసరమైన దానికంటే ఎక్కువ జమఅయ్యింది. టార్టెట్‌ను మించి అంటే సుమారు రూ. 50 లక్షలవరకు వసూలైంది. అంతేకాదు.. అవసరమైతే, తమ కిడ్నీకూడా దానం చేస్తామంటూ కొందరు ముందుకు వచ్చారు. ఇన్నేళ్లుగా తమ ఆనందానికి కారణమైన మీ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే అంటూ చాలామంది కామెంట్స్ పోస్ట్ చేశారు.