‘సక్సెస్‌’ బాయ్‌..! | Success Kid Grown Up Social Media Photo | Sakshi
Sakshi News home page

‘సక్సెస్‌’ బాయ్‌..!

Published Sun, Aug 19 2018 12:43 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Success Kid Grown Up Social Media Photo - Sakshi

‘సక్సెస్‌’ బాయ్‌ సామీ గ్రైనర్‌

ఈ ఫొటోలో ఉన్న బుజ్జి పిల్లాడిని గుర్తుపట్టారా.. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌ చేసే దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ బుడతడు తెలిసే ఉంటాడు. ఫ్రెండ్స్‌తో సరదాగా చాటింగ్‌ చేసినప్పుడు.. ఏదైనా గెలిచిన సందర్భాల్లో.. మాటలతో పంచ్‌లు ఇచ్చినప్పుడు ఈ ఫొటోను షేర్‌ చేస్తుంటారు. 2007లో తీసిన ఈ ఫొటో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్‌ అయింది. ఆ పిల్లాడి పేరు సామీ గ్రైనర్‌.. ఓ బీచ్‌లో ఇసుక తింటుండగా.. సామీ తండ్రి లానీ అనుకోకుండా తీసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. అంతే ఇక దేశదేశాల్లో ఈ ఫొటో వైరల్‌ అయింది. అయితే అందరు మాత్రం ఆ పిల్లాడు ఏదో సాధించిన సంతోషంలో ఆ స్టిల్‌ పెట్టాడనుకుని ‘సక్సెస్‌’కు చిహ్నంగా వాడేసుకున్నారు. ఇప్పుడు మనోడు పెద్దోడైపోయాడు.. చూశారుగా ఆ పక్కన ఉన్న పిల్లోడే ఆ ‘సక్సెస్‌’హీరో! మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఫొటోను షేర్‌ చేసి ఉంటారు.. గుర్తుకొచ్చిందా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement