sugar reserves
-
మిల్లుకు షుగరొచ్చింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి మించిపోవటంతో దేశంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి భారత్‌లో 140 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయి. 2019 అక్టోబర్–2020 సెప్టెంబరులో (ప్రస్తుత సీజన్లో) 268.5 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. వినియోగం ప్రస్తుతం ఏటా 250 లక్షల టన్నులే ఉంటోంది. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో 282 లక్షల టన్నులు వస్తు ందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గతంలో అంచనా వేసింది. వర్షాలు అతిగా పడడంతో చెరకు పంట పాడైంది. దీంతో అంచనాల కంటే దిగుబడి తగ్గింది. అయినప్పటికీ చక్కెర నిల్వలు మాత్రం తగ్గే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. మరోవైపు భారత్ నుంచి పంచదార ఎగుమతులు గత సీజన్లో 40–44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కాకపోతే ఎగుమతి ప్రోత్సాహకాల తాలూకు బకాయిలు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది ఎగుమతులపై కంపెనీలు ఆసక్తి చూప డం లేదు. 2018–19 సీజన్లో భారత్‌లో రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. బస్తాకు రూ.700–900 నష్టం.. పంచదార ఉత్పత్తి వ్యయం కిలోకు ఉత్తరాదిన రూ.36, దక్షిణాదిన రూ.38–40 అవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిల్లు వద్ద విక్రయ ధర ప్రస్తుతం కిలోకు రూ.31– 32 ఉంది. తయారీ వ్యయం కంటే అమ్మకం ధర తక్కువ. ఉత్తరాదితో పోలిస్తే కూలీలకు అయ్యే వ్యయం ఇక్కడ మూడు రెట్లు ఎక్కువ. కంపెనీలకు 100 కిలోల బస్తాపై రూ.700–900 నష్టం వాటిల్లుతోందని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆçపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకటిరెండు మిల్లులు మినహా దేశంలోని అన్ని కంపెనీలూ నష్టాలతో నడుస్తున్నాయని వెల్లడించారు. అప్పులు కట్టడానికి కంపెనీలకున్న ఆస్తులు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతి ప్రోత్సాహకాలు తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలకు రూ.150 కోట్లకు పైగా రావాలని ఆయన గుర్తు చేశారు. మూతపడుతున్న కంపెనీలు.. నష్టాలు మూటగట్టుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఒకదాని వెంట ఒకటి మూ సివేస్తున్నాయి. గతేడాది కృష్ణా జిల్లాలో డెల్టా షుగర్స్ యూనిట్, నెల్లూరులో ఎంపీ షుగర్స్, చిత్తూరులో వాణి షుగర్స్ మూతపడ్డాయి. ఈ ఏడాది గోదావరి జిల్లాలో సర్వరాయ షుగర్ గేట్లు కూడా మూసుకున్నాయి. ఇదే గోదావరి జిల్లాలో నవభారత్ గ్రూప్ ఫ్యాక్టరీలో 2020–21 సీజన్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఇక కృష్ణా జిల్లా లక్ష్మీపురం యూనిట్లో కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితం లే ఆఫ్ ప్రకటించింది. మరిన్ని ఫ్యాక్టరీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అటు రైతులకు కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది మార్చిలో రూ.85,000 కోట్లుండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు పరిమితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ బకాయిలు రూ.150 కోట్లు ఉంటాయని తెలిసింది. -
పంచదార ఎగుమతులు పెంచాలి: ప్రధాని
న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల అధికంగా ఉన్న పంచదార నిల్వలను వినియోగించటం కోసం.. ఎగుమతులను పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. చెరకు రంగ అంశాలపై సమీక్షించేందుకు ప్రధాని శనివారం మంత్రులు, అధికారులతో భేటీ నిర్వహించారు. దేశంలో పంచదార సరఫరాకు - డిమాండ్‌కు మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటూ.. పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలపటం పెంచాలని మోదీ పిలుపునిచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. పంచదార మిగులు ఉత్పత్తి వల్ల దేశీయ మార్కెట్లో పంచదార ధర తగ్గిందని.. ఫలితంగా పంచదార పరిశ్రమ రైతులకు రూ. 14,398 కోట్ల మేర బకాయిపడిందని వివరించింది. మంత్రులు రాధామోహన్, పాశ్వాన్, నిర్మలాసీతారామన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. -
చక్కెర ఫ్యాక్టరీల గొంతులోచేదు గుళిక
ధర, విక్రయాలు లేక చక్కెర పరిశ్రమలు దిగాలు భారీగా పేరుకుపోయిన పంచదార నిల్వలు మార్కెట్లో దిగుమతులే కారణం గతేడాది పంచదార ఉత్పత్తి ఆశాజనకంగా వచ్చింది. అయితే ధర లేదు. డిమాండ్ అంతకన్నా లేదు. ఫలితం విక్రయాలు నిలిచిపోయాయి. లక్షలాది పంచదార బస్తాలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లాలోని సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇది. చోడవరం : ఓవైపు పంచదారకు ధర లేక.. మరోవైపు విక్రయాలు జరగక చక్కెర కర్మాగారాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. లక్షలాది బస్తాల పంచదార నిల్వలు గోడౌన్లలో మూలుగుతున్నాయి. జిల్లా చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీల్లోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది పంచదారపై లెవీ ఎత్తేయడంతో ప్యాక్టరీలు ఆర్థికంగా బాగుపడతాయని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా పంచదార ధర ఘోరంగా పడిపోయింది. గత ఏడాది మొదట్లో క్వింటాలు రూ. 3300వరకు విక్రయించగా, తర్వాత క్రమేణా ధర తగ్గుకుంటూ వచ్చింది. ఒక దశలో క్వింటాలు రూ.2600కు పడిపోయింది. ఈ ఏడాది సీజన్ మొదట్లో అయినా ఈ ధర పెరుగుతుందని భావించినా ఆశించినమేర పెరగలేదు. జులై, ఆగస్టు నెలల్లో మాత్రం క్వింటా రూ. 3100కు వెళ్లినప్పటికీ, పరిస్థితి తారుమారై ప్రస్తుతం రూ. 2900 వద్దే ఉంది. కనీసం ఈ ధరకైనా విక్రయించాలని ఫ్యాక్టరీ అనుకున్నా మార్కెట్లో డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇదీ కారణం! ఇతర రాష్ట్రాల నుంచి పంచదార దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణంగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్ అయిపోవడం వల్ల కూడా ధర పెరగడం లేదనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో చక్కెర కొనుగోలుకు ఎప్పట్నుంచో ఉంటున్న ‘ఆ ముగ్గురే’ తప్ప, మరెవ్వరూ రాకపోవడం కూడా ధర పెరగడానికి, అమ్మకాలకు విఘాతం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ధర తగ్గినప్పుడు తప్ప ధర పెరిగినప్పుడు బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీనివల్ల గత నెలరోజులుగా జిల్లాలో అన్ని ఫ్యాక్టరీల్లోనూ పంచదార విక్రయాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం రూ.2900 ధరకైనా కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అన్ని ఫ్యాక్టరీల్లోనూ లక్షలాది క్వింటాళ్ల పంచదార నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ‘గోవాడ’కు అద్దెభారం... పాత యంత్రాలైనప్పటికీ ఆపసోపాలు పడి క్రషింగ్ చేయగా, తీరా నిల్వలు పేరుకుపోవడంతో ఫ్యాక్టరీలు దిక్కుతోచని స్థితిలో గిలగిలా కొట్టుకుంటున్నాయి. గోవాడ ఫ్యాక్టరీ అయితే పంచదార నిల్వలకు అదనంగా ప్రైవేటు గోడౌన్లను అద్దెకు కూడా తీసుకుంది. ఈ పరిస్థితుల్లో అద్దె అదనపు భారంగా మారింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ధర, డిమాండ్ కూడా పెరగొచ్చని గోవాడ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డెరైక్టర్ వి.వి.రమణారావు ఆశాభావం వ్యక్తం చేశారు.