sumit reddy
-
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మాళవిక బన్సోద్ మినహా మిగతా భారత క్రీడాకారులంతా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి... మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.మహిళల డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రుతూపర్ణ–శ్వేతాపర్ణ జోడీలు... మిక్స్డ్ డబుల్స్లోసిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి, సతీశ్ కుమార్–ఆద్యా జంటలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 40వ ర్యాంకర్ కిరణ్ జార్జి సంచలన విజయాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 10–21, 21–23తో ఓడిపోయాడు.నిర్ణాయక మూడో గేమ్‌లో కిరణ్ రెండు మ్యాచ్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. సామియా 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 19–21తో చియు పిన్ చెయిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 15–21, 17–21తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో... రుతూపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 21–16, 11–21తో టెంగ్ చున్ సున్–యాంగ్ చున్ యున్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డికీ ఓటమేమిక్స్డ్ డబుల్స్‌లో భారత నంబర్‌వన్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి 10–21, 16–21తో టాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో... సతీశ్–ఆద్యా ద్వయం 14–21, 11–21తో చెన్ టాంగ్ జె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
సిక్కి రెడ్డి , సుమీత్ జోడిలకు డబుల్స్ టైటిల్స్
ముంబై: సొంతగడ్డపై భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఆదివారం ముగిసిన టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ మినహా... మిగతా నాలుగు ఈవెంట్స్‌లో భారత్‌కే టైటిల్స్ లభించాయి. భారత్ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ చాంపియన్‌గా అవతరించాడు. డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గ్రాదె ద్వయం... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ జంట టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడి 21-16, 21-13తో జూ చియె తియెన్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. సుమీత్ కెరీర్లో ఇదే తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 21-19, 21-19తో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జంటపై సంచలన విజయం సాధించింది. గత నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను నెగ్గిన సిక్కి-ప్రద్న్యాల ఖాతాలో ఇది రెండో టైటిల్ కావడం విశేషం. గత ఏడాది అపర్ణ బాలన్‌తో కలిసి టాటా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సిక్కి ఈ ఏడాది టైటిల్ సాధించడం గమనార్హం. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-12, 21-17తో భారత్‌కే చెందిన హెచ్.ఎస్.ప్రణయ్‌ను ఓడించాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ప్రద్న్యా గాద్రె-అక్షయ్ దివాల్కర్ ద్వయం 21-17, 18-21, 21-18తో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (భారత్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫెబీ అంగుని (ఇండోనేసియా) 20-22, 21-14, 21-19తో అనా రోవితా (ఇండోనేసియా)పై నెగ్గింది.