Sun TV Network
-
ఎన్టీపీసీ- సన్ టీవీ.. వెలుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించడంతో ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగిది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ఎంటర్టైన్మెంట్, మీడియా రంగ సంస్థ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవున్‌ల అమలు నేపథ్యంలోనూ ఈ రెండు కంపెనీలూ పటిష్ట ఫలితాలు సాధించినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో ఎన్టీపీసీ లిమిటెడ్ నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 2,949 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 3 శాతం నీరసించి రూ. 26,195 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 16 శాతం పెరిగి రూ. 4,280 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. సన్ టీవీ నెట్వర్క్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో సన్ టీవీ నెట్వర్క్ నికర లాభం దాదాపు 34 శాతం క్షీణించి రూ. 257 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 715 కోట్లకు చేరింది. పన్నుకుముందు లాభం 40 శాతం వెనకడుగుతో రూ. 352 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 442 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో సన్ టీవీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 424 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
సన్‌టీవీకి ఐపీఎల్ జోష్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లోని మీడియా సెక్టార్‌కు ఐపీఎల్ బూస్ట్ లభించింది. ముఖ్యంగా ఐపీఎల్ టెలికాస్టింగ్( టెలివిజన్, డిజిటల్ మీడియా) హక్కులను స్టార్ గ్రూప్ దక్కించుకోవడంతో మంగళవారం నాటి మార్కెట్లలో మీడియా షేర్లు మరింత వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో వరుసగా అయిదో రోజు కూడా మీడియా స్టాక్స్ అన్నీ లాభాల్లో జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా నసన్టీవీ నెటవర్క్ లిమిటెడ్ 3.3శాతం లాభంతో దూసుకుపోతోంది. బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టులు పాజిటివ్ ధోరణిని వ్యక్తం చేయడంతో కొనుగోళ్ల ఒత్తిడి నెలకొంది. క్రెడిట్ సూస్, సీఎల్ఎస్ఏ బై కాల్ పిలుపునిచ్చాయి. కాగా ఐసీఎల్ లంలో.. స్టార్ గ్రూప్ రూ.15 వేల కోట్లకు మించిన భారీ మొత్తాన్ని చెల్లించి.. రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధిక ఆదాయంలో సన్ రైజర్స్ హైద్రాబాద్ వాటాలు పొందనుండంతో.. సన్ టీవీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. -
సన్ టీవీకి రూ.233 కోట్ల లాభం
న్యూఢిల్లీ: సన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.233 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం(రూ.233 కోట్లు) తో పోల్చితే 19 శాతం వృద్ధి సాధించామని సన్ టీవీ నెట్వర్క్ తెలిపింది. గత క్యూ1లో రూ.690 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 10 శాతం వృద్ధితో రూ.781 కోట్లకు ఎగసిందని పేర్కొంది. ఈ క్యూ1లో చందా ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.232కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ టీవీ నెట్వర్క్ షేర్ 0.4 శాతం క్షీణించి రూ.482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.491ను తాకింది. -
సన్ టీవీ లాభం 19 శాతం అప్
4 రోజుల్లో 23 శాతం ఎగసిన షేర్ న్యూఢిల్లీ : సన్ టీవీ నెట్వర్క్ సంస్థ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 19 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.197 కోట్లకు ఎగసిందని సంస్థ తెలియజేసింది. ఆదాయం రూ.634 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.691కు వృద్ధి చెందింది. కాగా ఈ షేర్ నాలుగు రోజుల్లో 23 శాతం ఎగసింది. ఈ నెల 28న రూ.274గా ఉన్న ఈ షేర్ శుక్రవారం నాటికిరూ.337కు ఎగసింది. సన్ గ్రూప్‌కు చెందిన రెడ్ ఎఫ్ఎంను మూడో దశ ఎఫ్ఎం స్టేషన్ల వేలంలో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించడంతో గత మూడు రోజుల్లో(గురువారం వరకూ) ఈ షేర్ 14 శాతం పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే షేర్ ధర 9 శాతం పెరిగింది. -
సమష్టి నిర్ణయంతో సన్‌టీవీకి అనుమతులు
న్యూఢిల్లీ: కళానిధి మారన్ ఆధ్వర్యంలో నడుస్తున్న 33 టీవీ చానళ్ల సన్ టీవీ నెట్వర్క్ ప్రసారాలకు అనుమతులు మంజూరు చేయాలంటే కేంద్రంలోని సంబంధిత శాఖలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సోమవారం కేంద్రం తెలిపింది. ఈ అంశంపై కీలకమైన కేంద్ర హోం , కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కళానిధి, అతడి సోదరుడు కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్‌లపై ఉన్న పెండింగ్ కేసులను సన్‌టీవీ చానళ్లను నిర్వహిస్తున్న ఆయా కంపెనీలు ప్రభావితం చేసే అవకాశముందని హోం శాఖ భావిస్తోంది. దీంతో సన్‌టీవీ నెట్‌వర్క్‌కు భద్రతాపరమైన అనుమతులను నిరాకరిస్తోంది. -
సన్ టీవీ చానళ్ల భవిష్యత్ ఏంటి?
భద్రత అనుమతి నిరాకరణతో సందేహాలు న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన సన్ టీవీ నెట్‌వర్క్‌లోని 33 చానళ్లకు కేంద్ర హోం శాఖ భద్రతాపరమైన అనుమతి నిరాకరించడంతో వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీటికి ఢోకా లేదని సన్ టీవీ చెబుతోంది. అనుమతి నిరాకరణకు సంబంధించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి లేఖా రాలేదని గ్రూప్ సీఎఫ్ఓ సీఎల్ నారాయణన్ చెప్పారు. అనుమతుల నిరాకరణకు ఎలాంటి ప్రాతిపదికా లేదని, తమ లెసైన్సులను రద్దు చేస్తే న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. తమ నెట్‌వర్క్‌లోని చాలా చానళ్లకు 2021 వరకు అనుమతులు ఉన్నాయన్నారు. సన్ టీవీపై, దాని ప్రమోటర్ అయిన కళానిధి మారన్, ఆయన సోదరుడైన కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌లపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్న నేపథ్యంలో హోం శాఖ ఈ చానళ్లకు భద్రతాపర అనుమతి నిరాకరించినట్లు వార్తలొస్తున్నాయి. వీరు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు, అక్రమ టెలిఫోన్ లైన్ల ఏర్పాటు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా, సన్ టీవీ యాజమాన్యాన్ని వేరే వారికి అప్పగించడమో, లేకపోతే డెరైక్టర్లను మార్చడమో చేస్తే ఆ చానళ్లకు అనుమతుల నిరాకరణపై పునస్సమీక్షిస్తామని హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు. టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్లకు పదేళ్ల వ్యవధితో హోం శాఖ అనుమతిస్తుంటుంది. ప్రధానంగా దక్షిణ భారతంలో విస్తరించిన సన్ టీవీ నెట్‌వర్క్‌లో జెమినీ టీవీ, జెమినీ మూవీస్ తదితర తెలుగు చానళ్లు ఉన్నాయి. మొత్తం 9. 5 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు.