Sundar. c
-
దర్శకుడు మారాడా?
‘ముకుత్తి అమ్మన్ (2020)’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా సీక్వెల్ ‘ముకుత్తి అమ్మన్ 2’కు తమిళ దర్శకుడు సుందర్. సి దర్శకత్వం వహించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. నయనతార, ఆర్జే బాలాజీ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ముకుత్తి అమ్మన్’. ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ ఫ్యాంటసీ కామెడీ సినిమా 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమాకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందని, ఈ చిత్రంలో త్రిష లీడ్ రోల్లో నటిస్తారని, ఆర్జే బాలాజీ కూడా ఓ లీడ్ రోల్లో నటించి, పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం సాగింది. కానీ తొలి భాగంలో నటించిన నయనతారయే మలి భాగంలోనూ లీడ్ రోల్ చేస్తారని, వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ గత నెలలో ప్రకటించింది. అయితే దర్శకుడిని మాత్రం ప్రకటించలేదు. దీంతో ‘ముకుత్తి అమ్మన్ 2’కు ఆర్జే బాలాజీయే దర్శకత్వం వహిస్తారా? లేదా అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. అయితే తాజాగా నటుడు–దర్శకుడు సుందర్. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ఈ ఏడాది చివర్లో చిత్రీకరణనుప్రారంభించి, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోపు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
అతన్ని ప్రేమలో పడేసిన పూనంబాజ్వా
ఎంతవారుగానీ, వేదాంతులైనగానీ కాంతదాసులే అన్నారో కవి. అలా 40 ఏళ్ల బ్రహ్మచారి, రాజకీయమే జీవితంగా సాగిపోతున్న సుందర్.సీని ఒక్క చూపుతోనే ప్రేమలో పడేసింది నటి పూనంబాజ్వా. ఆమె ప్రేమ మైకంలో పడి సుందర్.సీ గిలగిలా కొట్టుకున్న వైనం చూడాలంటే ఇంకొంచెం రోజులు ఆగాల్సిందే. విషయం ఏమిటంటే దర్శకత్వం, నటన అంటూ మారి మారి రెండు విధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న దర్శకుడు సుందర్.సీ తాజాగా కథానాయకుడు,నిర్మాతగా మారి నటి పూనంబాజ్వాతో రొమాన్స్ చేస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన వెళ్లిమూంగా చిత్ర తమిళ్ రీమేక్‌లో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. దీనికి సుందర్.సీ శిష్యుడు వెంకటరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అరణ్మణై-2 చిత్రంలో పరిధి తక్కువ పాత్రలో అయినా అందాలారబోసి ఆకట్టుకున్న పూనంబాజ్వాకు సుందర్.సీ ఈ చిత్రంలో సోలో హీరోయిన్గా అవకాశం ఇవ్వడం విశేషం. ఈ చిత్రంలో తన పాత్ర గురించి పూనంబాజ్వా తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తాను పూర్తిగా డీగ్లామర్ పాత్రను పోషిస్తున్నానని చెప్పింది. అయితే తన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలిపింది. ఇది ఒక చిన్న పట్టణంలో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని చెప్పింది. ఈ చిత్రంతో తన టైమ్ బాగుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. పెళ్లికి దూరంగా రాజకీయమే జీవితంగా సాగే 40 ఏళ్ల సుందర్.సీ యుక్త వయసు విద్యార్థి పూనంబాజ్వా కంట పడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడట. ఇక ఆ తరువాత ఇటు ప్రేమ, అటు రాజకీయాలతో ఎదురయ్యే సమస్యలను వినోదాల విందుగా తెరపై ఆవిష్కరిస్తున్న చిత్రం ఇదని యూనిట్ వర్గాలు వెల్లడించారు. తిరునల్వేలి, చెన్నై, ఢిల్లీ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. దీనికి సిద్ధార్థ్విపిన్ సంగీత బాణీలు కడుతున్నారు.