Sunitha Krishnan
-
Sunitha Krishnan: దయచేసి మారండి!
మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. సునీతాకృష్ణన్ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్ టచ్‌రివర్. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది. ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ. నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. ఎక్కడ ఉన్నా పోరాటమే! ‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు. నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్’ వినిపించగానే ‘టికెట్ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్ హోమ్ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్ సెంటర్లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు. ఈ ఫౌండేషన్ అవసరం ఉండకూడదు! ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. – సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి మగవాళ్లకు చెప్పాలి! నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్ అగెనెస్ట్ డిమాండ్ (మ్యాడ్)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను. ‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. – వాకా మంజులారెడ్డి -
ఓ మై గాడ్.. కోవిడ్.. ఆస్పత్రిలో సునితా
ప్రపంచ దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండావిజృంభిస్తున్న కోవిడ్ వైరస్ తెలంగాణలోనూ ప్రవేశించింది.విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ టెస్ట్లడొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ దుబాయ్ నుంచి బెంగళూరుకు..అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి చేరింది. నగరంలోని మహేంద్రహిల్స్‌కు చెందిన యువకునికి (24) కోవిడ్–19 వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడం, గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్సలు అందిస్తున్నారని కేంద్ర వైద్యశాఖ సోమవారం మధ్యాహ్నం ప్రకటించడంతో గ్రేటర్‌వాసుల్లో ఆందోళనమొదలైంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: గతకొద్ది కాలంగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్–19(కరోనా వైరస్) ప్రభావం గ్రేటర్ హైదరాబాద్‌పై పడింది. 2019 నవంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ప్రమాదకరమైన ఈ వైరస్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాలకుపైగా విస్తరించింది. వేలాది మంది మృత్యువాతకు కారణమైంది. మన దేశంలోని కేరళలోనూ మూడు కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ సహా హైదరాబాద్‌లోనూ కేసులు నమోదవడంపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాల రిత్యా కేవలం నగరం నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చైనా సహా సమీప దేశాలకు వెళ్లిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. (చదవండి: రాష్ట్రంలో కోవిడ్ కలకలం) వారందరినీ స్వస్థలాలకు తిరిగి రావాల్సిందిగా బంధువులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావడంతో ఆయా దేశాల నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు 16982 మందికిపైగా ప్రయాణికులు చేరుకున్నారు. వీరికి ఎయిర్‌పోర్ట్‌లోనే స్క్రీనింగ్ చేశారు. ఆ తర్వాత వీరిలో కొంత మంది జలుబు, జ్వరం, శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కరోనాగా అనుమానించి చికిత్స కోసం గాంధీ, ఫీవర్, ఛాతి, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లోని నోడల్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇలా ఇప్పటి వరకు గాంధీ వైరాలజీల్యాబ్‌లో 350 మందికి కరోనా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ రిపోర్టు రావడంతో ప్రభుత్వంతో పాటు వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వీరికి వైద్యులు కీలక సూచనలు చేశారు. బాధితులు 20 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానిత బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఎన్–90 మాస్కులు ధరించాల్సిందిగా సూచించారు. మరోసారి బయటపడిన డొల్లతనం సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌కు చెందిన (బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి)యువకుడు ఫిబ్రవరి 17న దుబాయ్ వెళ్లాడు. ఆయన అక్కడ హాంకాంగ్‌కు చెందిన వారితో కలిసి నాలుగు రోజుల పాటు పని చేసి ఇటీవల ఇండియాకు చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించినప్పటికీ..వైరస్‌ను గుర్తించకపోవడాన్ని పరిశీలిస్తే ఎయిర్‌పోర్టుల్లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ డొల్లతనం మరోసారి బయటపడింది. బాధితుడు తొలుత బెంగళూర్‌కు వెళ్లి, అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే బస్సులో ఆయనతో కలిసి మరో 27 మంది ప్రయాణించారు. ఇటీవల జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గాంధీ ఆస్పత్రికి చేరుకోగా, వైద్యులు వెంటనే ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, గాంధీ వైరాలజీ ల్యాబ్‌లోని ప్రాథమిక పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యులు మరింత అప్రమత్తమై రెండో శాంపిల్‌ను పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు బాధితునితో పాటు బస్సులో ప్రయాణించిన మరో 27 మందిని ట్రేస్ చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమైంది. గాంధీకి 8 మంది కాగా కోవిడ్ పాజిటివ్ అని తేలిన యువకుడి కుటుంబ సభ్యులు ఎనిమిది మందిని కూడా గాంధీ ఐసోలేషన్ వార్డులో చేర్చారు. సోమవారం వీరిని అనుమానిత రోగులుగా భావించి పరీక్షిస్తున్నారు. వైద్యులకు సెలవులు రద్దు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ సహా ఫీవర్, ఛాతి ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో వంద పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనంలోని ఏడవ అంతస్తులో 20 పడకలతో రెండు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశాం. వీఐపీల కోసం ఏడు పేయింగ్ రూమ్స్‌లు ఏర్పాటు చేశాం. అత్యవసర విభాగంలో ఎక్యూట్ మెడికల్ కోవిడ్ ఐసీయులో పది పడకలను సిద్ధం చేశాం. ఓపీ, ఇన్‌పేషేంట్ విభాగాల్లో కోవిడ్ అనుమానితుల కోసం ప్రత్యేక లిఫ్ట్‌లు, ప్రధాన భవనంలో హెల్ప్‌డెస్క్‌ను కేటాయించాం. కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో సోమవారం సాయంత్రం గాంధీ వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాం. వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేశాం. మరికొంత మంది వైద్య సిబ్బందిని ఇతర ఆస్పత్రుల నుంచి డెప్యుటేషన్‌పై గాంధీకి కేటాయించాం. పర్సనల్ ఎక్విప్మెంట్ ప్రొటెక్షన్(పీఈపీ)ను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ రమేష్‌రెడ్డి, డీఎంఈ ఆస్పత్రిలో చేరిన సునితా కృష్ణన్ దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ప్రముఖ సంఘ సేవకురాలు, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్ కూడా గాంధీలో చేరారు. ఇటీవల ఆమె బ్యాంకాక్ వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం సోమవారం గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమె నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. రిపోర్టు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే అబుదాబి నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న కరీంనగర్‌కు చెందిన గర్భిణి (25)కి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా రిపోర్టు అయింది. ప్రస్తుతం ఆమె నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. (చదవండి: ఎంటర్ ద ‘వైరస్’) వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా వైరస్ పది రెట్లుప్రమాదకరం. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటిలక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యం. సాధ్యమైనంత వరకు జన సమూహాల్లోకి వెళ్లొద్దు. తుమ్మినా, దగ్గినా ముక్కుకు అడ్డంగా ఎన్–90 మాస్కులు, చేతి రుమాళ్లుపెట్టుకోవాలి. – డాక్టర్ శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి -
పుకార్లపై స్పందించిన సునీతా కృష్ణన్
ప్రముఖ సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్‌కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయ్యాయని.. ఫలితాల గురించి ఎదురుచూస్తున్నట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన తాను దగ్గుతో బాధపడుతున్నానని.. ఈ మేరకు పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. తనపై వస్తున్న ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రోజున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. చదవండి: ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు -
ఇలాంటి మనిషి మనమధ్య ఉన్నందుకు...
‘‘గాంధీజీ వంటి ఒక వ్యక్తి ఈ భూమండలంపై రక్తమాంసాలతో నడయాడారా.. అని భావితరాల వాళ్లు విస్మయం చెందుతారు’’ అని ఐన్‌స్టీన్ అన్నారు. ఇప్పుడు ఇంచుమించు అదే టోన్‌లో సునీతా కృష్ణన్ గురించి, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ గురించి అన్నారు! సునీత స్టోరీ చాలావరకు ప్రపంచానికి తెలుసు. సునీత స్వస్థలం బెంగళూరు. పదిహేనేళ్ల వయసులో ఆమెపై ఎనిమిదిమంది సామూహికంగా లైంగిక దాడి చేశారు. ఆ పీడకల నుంచి తనకు తానుగా బయటపడి, అత్యాచార బాధితుల కోసం; బాలికలు, మహిళల అక్రమ రవాణాను నివారించడం కోసం ఆమె గత ముప్పై ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 వేల మందికి పైగా బాధితుల్ని కాపాడారు. వారికి పునరావాసం కూడా కల్పించారు. అంతేనా! ప్రభుత్వాలను కదలించి చట్టాలు కచ్చితంగా అమలయ్యేలా ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్లో అమితాబ్ బచన్ సునీతను ఈ దేశానికి పరిచయం చేశారు. టీవీలో తొలిసారిగా సనీతా కృష్ణన్ చూసి, ఆమె చెప్పిన విషయాలు విన్న అనుష్క.. వెంటనే తన ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్లి, ‘‘ఇలాంటి మనిషి మనమధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఞతలు తెలియజెయ్యాలి’’ అని కామెంట్ పెట్టారు. సునీతను పరిచయం చేసినందుకు అమితాబ్‌కీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాకు చావంటే భయం లేదు. స్త్రీలకు సహాయపడేందుకే నేను నా జీవితాన్ని అంకితం చేశాను’’ అని సునీతా కృష్ణన్ అనడం కూడా అనుష్కను ఉత్తేజపరిచినట్లు కనిపిస్తోంది. ‘‘ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఒక పోరాట యోధురాలు’’ అని కూడా సునీతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు అనుష్క. -
ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్రస్ఠాయి సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సహయం చేస్తామని చెప్పి మభ్యపెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని, బాధితులను రక్షించడంలో ఎన్జీఓలతో కలిసి ముందుకు వెళ్లాలని పోలీసులకు సూచించారు. మానవ అక్రమ రవాణా ఎలా చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు.. అనే అంశాన్ని పోలీసులు ముందుగానే గుర్తించి ఇలాంటివి జరగకుండా చూడాలని, అప్పుడే చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసిన వారవుతామని డీజీపీ పేర్కొన్నారు. బాధితులను రక్షించడం, పునరావాసం కల్పించడం, ప్రాసిక్యూషన్ వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని డీజీపీ సూచించారు. మానవ అక్రమ రవాణాలో బాధితులు ఖండాతరాలు దాటి వస్తున్నారని, నిందితులకు శిక్షపడేలా ప్రాసిక్యూషన్ జరగాలని అన్నారు. అక్రమ సంపాదన కోసమే వ్యభిచారానికి అలవాటు పడుతున్నారని, కాబట్టి అక్రమ సంపాదన, ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టినప్పుడే ఈ వ్యవస్థ ఆగుతోందని ఆయన తెలిపారు. ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని, నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చూస్తున్నామని తెలిపారు. చిన్నారులను వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ, ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరుతో చాలా మంది చిన్నారులను రక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజ్వల ఫౌండేషన్ స్థాపకులు సునీత కృష్ణన్ మాట్లాడుతూ.. ముంబైలో అక్రమ రవాణా నుంచి 112 మంది అమ్మాయిలని రక్షిస్తే అందులో ఆరుగురు తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛంద సంస్థను నగరంలో ప్రారంభించారని, దేశంలో ఎక్కడ అత్యాచార ఘటనలు జరిగినా భయమేసేదని అన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మానవ అక్రమ రవాణాను తగ్గిందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక ఫేస్బుక్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు ట్రాఫికింగ్ అయిందని, ప్రస్తుతం టెక్నాలజీతో ట్రఫికింగ్ జరుగుతుందన్నారు. తెలంగాణలో జీరో ట్రాఫికింగ్ దిశగా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పోలీసు ఉన్నతాధికారులు హాజరైయ్యారు. -
సల్మాన్‌కు రేప్ బాధితురాలి బహిరంగ లేఖ
హైదరాబాద్: 'నేను అతని పేరు పలకడానికిగానీ, రాయడానికి గానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతణ్ని ఆ మాత్రమైనా గౌరవించడం నాకు ఇష్టంలేదు. 'నేను రేప్ కు గురయ్యాను' అంటూ అతను వెకిలిగా మాట్లాడి మాటలతో అత్యాచారంపట్ల తేలిక భావాన్ని సులువుగా వెల్లడించాడు. రూపం, అతి కొద్ది టాలెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు. నిజానికి ఎంత గుర్తింపు వస్తే అంత బాధ్యత పెరుగుతుంది. కానీ అతను సమాజం పట్ల తన పాత్రను తేలికగా తీసుకుంటున్నాడు. వికృతబుద్ధి (పర్వర్ట్) ఉన్నవాళ్లే ఇలాంటివి వాగుతారు. ఇందుకు అతను సిగ్గుపడాలి. రేప్ ను ప్రోత్సహించకూడదని తెలిసి కూడా అతను.. సినిమాలో తాను అనుభవించిన బాధలు, గాయాలను రేప్ తో పోల్చడం దారుణం. మన చుట్టూరా రేప్ కల్చర్ ఉందన్నమాట పచ్చివాస్తవం. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి' సామాజిక వేత్త సునీత కృష్ణన్.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు రాసిన బహిరంగ లేఖ ఇది. సినిమా షూటింగ్ లో తాను అనుభవించిన కష్టాన్ని రేప్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్ పై మహిళాలోకం భగ్గుమంటోంది. సల్మాన్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందేననే డిమాండ్ వెల్లువెత్తింది. ఈ క్రమంలో సునీతా కృష్ణన్ బహిరంగలేఖ పలువురిని ఆలోచింపజేస్తోంది. ఇమేజ్ ఉన్న హీరోలు బాధ్యతగా ప్రవర్తించాలని గుర్తుచేస్తోంది. గ్యాంగ్ రేప్ బాధితురాలైన సునీత.. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత తనలాంటి ఎందరో మహిళలను ఆదుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రజ్వల ఎన్జీవోను ప్రారంభించి, సేవలను విస్తృతం చేశారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెకు నాలుగో అత్యున్నత పురస్కారం 'పద్మశ్రీ' ని అందించిన సంగంతి తెలిసిందే. -
'ప్రజ్వల' కోసం మేము సైతం...
హైదరాబాద్: దేశంలోని ప్రతి రెడ్ లైట్ ఏరియాలో తెలుగు అమ్మాయిలు ఉన్నారని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీతా కృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీఐడీ అధికారులు దాడి చేసి 64 మందిని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యభిచార గృహాలలో దాదాపు 95 శాతం మంది తెలుగు అమ్మాయిలే ఉన్నారని చెప్పారు. ఇది అందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి వారిని రక్షించి... హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పిస్తున్న గూడు ఈ ఏడాది సెప్టెంబర్ 30 తేదీతో చెదిరిపోనుంది. దీంతో ఆ తేదీ లోపు ఆశ్రయం పొందుతున్న వారందరికి కోసం కొత్తగా ఓ భవనం నిర్మించాలని ప్రజ్వల నిర్ణయించింది. అందులోభాగంగా సెప్టెంబర్ 30 లోపు ఓ భవనం కట్టుకుని అక్కడికి వెళ్లి పోవాల్సిన ప్రజ్వల భావిస్తుంది. అందుకోసం స్వచ్ఛందంగా విరాళాలు సేకరించేందుకు ఆదివారం 'సాక్షి' టీవీలో ఏర్పాటు చేసిన లైవ్ షోలో ఆ సంస్థ ప్రతినిధులు సునీతా కృష్ణన్‌తోపాటు మల్లేశ్, అహ్మద్ అలీ పాల్గొన్నారు. అక్రమ రవాణా నుంచి తప్పించిన వారిని, వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చి... వారి కోసం ప్రజ్వల చేపడుతున్న సేవలను వారు వివరించారు. మానవత్వం మూర్తిభవించిన దాతలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి... దివ్య, రాజ్ ప్రొటెక్ట్ కంపెనీ : రూ.1,70, 000 ఇస్తున్నట్లు ప్రకటించారు. హేమంత్, హైదరాబాద్: తమ స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి.. తనతో పాటు వారు కూడా సాయం చేస్తామని చెప్పారు నవ్య, హైదరాబాద్ : రూ 30 వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు దేవి, బెంగళూరు : రూ. 5 వేలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆమె ఉద్వేగానికి లోనైంది. మనీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఈజీ అవుతుంది కానీ సునీత కృష్ణన్లా చేసే వారు ఉండరని చెప్పారు. సుమంత్, హైదరాబాద్: తన జీతం నుంచి ప్రతినెల ఎంతో కొంత నగదు ఈ స్వచ్ఛంద సంస్థకు అందజేస్తామన్నారు. భార్గవ్, హైదరాబాద్ : రూ.50 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. కృష్ణారెడ్డి, తిరుపతి : రూ. 50 వేలు ఇస్తానన్నారు. తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల పేరు చెప్పేందుకు ఇష్టపడిన ఓ వ్యక్తి రూ. 3 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. స్వరూపరాణి, గుంతకల్ : రూ. 500 ఇస్తానన్నారు. ఆమె ఉద్యోగి, తనకు వచ్చే రూ. 5 వేల జీతంలో నుంచి 500 ఇస్తున్నట్లు చెప్పారు. లత, ఖమ్మం : సునీతా కృష్ణన్ గొప్ప కార్యం చేస్తున్నారని చెప్పారు. పద్మ , సిద్ధిపేట : రూ. 5 వేలు ఇస్తున్నట్లు చెప్పారు మాళవిక, హైదరాబాద్: రూ. 25 వేలు.. సునీత కృష్ణన్ గారు సేవలను ప్రశంసించారు. రమ్య, హైదరాబాద్: రూ. 5 వేలు శ్రీనివాసులు, రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా) : రూ. వెయ్యి చైతన్య, మహబూబ్‌నగర్ : రూ. 5 వేలు వెంకటరమణ, దర్శి (ప్రకాశం జిల్లా) : రూ. 2 వేలు శ్రీనివాస్, భువనగిరి (నల్గొండ) : ప్రభుత్వం సాయం తీసుకుంటే ఈ సంస్థకు మరింత అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. విజయలక్ష్మి, హైదరాబాద్ : రూ. వెయ్యి మేఘన(6), ప్రొద్దుటూరు (వైఎస్ఆర్ జిల్లా) : తన తండ్రిని అడిగి రూ. పదివేలు ఇస్తానని చెప్పింది. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అకౌంట్ నెం 30312010131345 సిండికేట్ బ్యాంకు, శాలిబండ శాఖ, హైదరాబాద్ ఐఎఫ్ఎస్ కోడ్: SYNB0003031 -
వ్యభిచారాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టండి
సామాజిక వేత్త డాక్టర్ సునీతా కృష్ణన్ హైదరాబాద్: ప్రభుత్వాలు వ్యభిచారాన్ని సామాజిక సమస్యగా చూడకుండా అక్రమ మానవ వ్యాపారంగా పరిగణించి అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని సామాజిక వేత్త డాక్టర్ సునీతా కృష్ణన్ డిమాండ్ చేశారు. సమాజంలో బలవంతంగా వ్యభిచార కూపంలో ప్రవేశించి, బయటికి వచ్చిన మహిళల పట్ల వివక్ష చూపడం తగదని ఆమె విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో యుధ్వీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సునీతా కృష్ణన్‌కు 24వ యుధ్వీర్ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్య, ధనిక తేడా లేకుండా 90 శాతం మహిళలు వ్యభిచార వృత్తిలో బలవంతంగా ప్రవేశించిన వారేనని, కేవలం 10 శాతం మాత్రమే పొట్టకూటి కోసం ఆ వృత్తిలో దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యభిచార వృత్తిలో సమారు 30 లక్షల మంది ఉండగా అందులో ఏడు శాతం మంది మాత్రమే బయట పడగలుతున్నారని చెప్పారు. ప్రతి 10 నిమిషాలకు ఒకరు అక్రమంగా అమ్మకానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఇప్పటి వరకు సుమారు 15 వేల మంది యువతులను వ్యభిచార కూపం నుంచి విముక్తి చేసిందని వెల్లడించారు. నగరంలో తమకు రెండెకరాల భూమి చూపిస్తే.. అలాంటి వారికి పునరావాస కేంద్రంతో పాటు ప్యాక్టరీ ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఆమె వెల్లడించారు. తనకు ప్రపంచవ్యాప్తంగా 32 అవార్డులు వచ్చిన స్వంత రాష్ట్రంలో అవార్డు రావడం ఇదే ప్రథమమని అన్నారు. ఈ అవార్డు వ్యభిచార నరకకూపం నుంచి విముక్తి పొందిన, తనతో కలిసి పనిచేసే ఆడబిడ్డలకు అంకితమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యుధ్వీర్ ఫౌండేషన్ చైర్మన్ నరేంద్ర లూథర్, సామాజిక వేత్త జాహెద్ అలీఖాన్, ప్రీతమ్ సింగ్, బజరంగ్, ఖాన్ అతర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సునీత పోరాటం ఫలించింది!!
ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. రేపిస్టుల ఘాతుకాలపై అలుపెరుగని పోరాటం చేసిన.. హైదరాబాద్‌కు చెందిన సునీతా కృష్ణన్ కృషి ఎట్టకేలకు ఫలించింది. అత్యాచారం చేయడమే కాక.. ఆ వీడియోను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్న దుర్మార్గుడిని సీబీఐ వర్గాలు తమ కస్టడీలోకి తీసుకున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్‌కు చెందిన సబ్రత్ సాహు ఓ ప్రాపర్టీ డీలర్. అతడు చేసిన ఘాతుకాలపై ప్రజ్వల సంస్థ తరఫున సునీతా కృష్ణన్ రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు అతడిని అరెస్టు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. స్వయంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఈ కేసును విచారణకు స్వీకరించి, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సునీతా కృష్ణన్ కేవలం లేఖ రాసి ఊరుకోకుండా దాంతోపాటు నిందితులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోను, వాట్సప్లోను అప్లోడ్ చేసిన అసభ్య వీడియో క్లిప్పింగులున్న పెన్ డ్రైవ్‌ను కూడా పంపారు. ఈ క్లిప్పింగులను సీబీఐకి పంపాల్సిందిగా కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు సూచించింది. వీటిలోని ఓ క్లిప్పింగులో సబ్రత్ సాహు ఓ మహిళపై లైంగిక దాడి చేస్తుండగా, మరో వ్యక్తి దాన్ని చిత్రీకరిస్తున్నట్లు కూడా ఉంది. సాహును మంగళవారం నాడు భువనేశ్వర్‌లో అరెస్టుచేశారు. సాహు అరెస్టు పట్ల సునీతా కృష్ణన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇతర కేసుల్లో మరో ఆరుగురిని కూడా గుర్తించారని, వారిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇప్పటికైనా చర్యలు మొదలైనందుకు సంతోషంగా ఉందని, కానీ సమాజంలో అన్ని వర్గాలు ఇకనైనా ముందుకొచ్చి ఇలాంటి అన్యాయాలపై పోరాడాలని అన్నారు. -
కామాంధుల పైశాచిక వీడియోలపై ‘ప్రజ్వల’ లేఖ..
సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా.. ఆ దృశ్యాలతో కూడిన వీడియోలను కామాంధులు వాట్సాప్‌లో పోస్టు చే సిన ఉదంతంపై ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సుప్రీంకోర్టు శుక్రవారం సూమోటోగా విచారణకు స్వీకరించింది. పాశవికంగా అత్యాచారం చేస్తున్న దృశ్యాలతో కూడిన ఈ వీడియోలు కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఈ ఘటనలపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడంతో పాటు వాట్సాప్ రేప్ వీడియోలున్న పెన్‌డ్రైవ్, డీవీడీలను సమర్పించడంతో ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీనిపై వివరణనివ్వాలంటూ కేంద్రం, యూపీ, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ కు నోటీసులు జారీ చేసింది. సీజేఐ హెచ్ఎల్ దత్తుకు ప్రజ్వల ఎన్జీవో చీఫ్ సునీతా కృష్ణన్ రాసిన లేఖను పరిశీలించిన మీదట.. న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, యూయూ లలిత్‌లతో కూడిన సామాజిక న్యాయ ధర్మాసనం సీబీఐచే పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి సమగ్ర పిటిషన్‌ను మార్చి 9న దాఖలు చేయాలని ఎన్జీవోను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. వీడియోల్లోని వ్యక్తులు బెంగాలీ యాసలో మాట్లాడటం, ఇతర వివరాలను బట్టి.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఒడిశాలకు నోటీసులు జారీచేసింది. అయితే, ఇంటర్నెట్లో ‘షేమ్ ద రేపిస్ట్’ ప్రచారం చేపట్టిన సునీతా కృష్ణన్ కారుపై హైదరాబాద్ పాతబస్తీలో దుండగులు దాడిచేసిన ఉదంతంపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ అలసత్వాన్ని కోర్టు తప్పుపట్టింది. దీనిపై వివరణనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికీ నోటీసులిచ్చిది. కాగా, సీబీఐ దర్యాప్తుతో పాటు ఇలాంటి నేరాలను అరికట్టేందుకు యూట్యూబ్, వాట్సాప్ సంస్థలతో కేంద్ర హోం శాఖ ఒప్పందం కుదుర్చుకునేలా ఆదేశించాలని ఎన్జీవో సీజేఐకి రాసిన లేఖలో కోరింది. ఇదీ దారుణం.. వాట్సాప్‌లో షేర్ చేసిన వీడియోల్లో 4.5 నిమిషాల నిడివితో ఉన్న ఓ వీడియోలో.. ఓ వ్యక్తి బాలికపై అత్యాచారం చేస్తుండగా, మరో వ్యక్తి ఆ దారుణాన్ని వీడియో తీస్తున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయి. ఎనిమిదిన్నర నిమిషాలున్న మరో వీడియోలో.. ఐదుగురు కీచకులు ఓ బాలికను గ్యాంగ్‌రేప్ చేసిన దృశ్యాలు ఉన్నాయి. వెకిలిగా నవ్వుతూ, జోకులు వేసుకుంటూ, వీడియో తీస్తూ, ఫొటోలు తీసుకుంటూ, బాలికను లైంగికంగా బాధిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. -
ఫోర్త్ ఎస్టేట్ చర్చ : మహిళలపై దాడులు
-
రేప్ వీడియోపై స్పందించిన సుప్రీం