సల్మాన్కు రేప్ బాధితురాలి బహిరంగ లేఖ | Rape survivor sunitha krishnan pens open letter to 'disgrace' Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్కు రేప్ బాధితురాలి బహిరంగ లేఖ

Published Wed, Jun 22 2016 6:21 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

సల్మాన్కు రేప్ బాధితురాలి బహిరంగ లేఖ - Sakshi

సల్మాన్కు రేప్ బాధితురాలి బహిరంగ లేఖ

హైదరాబాద్: 'నేను అతని పేరు పలకడానికిగానీ, రాయడానికి గానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతణ్ని ఆ మాత్రమైనా గౌరవించడం నాకు ఇష్టంలేదు. 'నేను రేప్ కు గురయ్యాను' అంటూ అతను వెకిలిగా మాట్లాడి మాటలతో అత్యాచారంపట్ల తేలిక భావాన్ని సులువుగా వెల్లడించాడు. రూపం, అతి కొద్ది టాలెంట్ తో అతను స్టార్ గా ఎదిగాడు. నిజానికి ఎంత గుర్తింపు వస్తే అంత బాధ్యత పెరుగుతుంది. కానీ అతను సమాజం పట్ల తన పాత్రను తేలికగా తీసుకుంటున్నాడు. వికృతబుద్ధి (పర్వర్ట్) ఉన్నవాళ్లే ఇలాంటివి వాగుతారు. ఇందుకు అతను సిగ్గుపడాలి. రేప్ ను ప్రోత్సహించకూడదని తెలిసి కూడా అతను.. సినిమాలో తాను అనుభవించిన బాధలు, గాయాలను రేప్ తో పోల్చడం దారుణం. మన చుట్టూరా రేప్ కల్చర్ ఉందన్నమాట పచ్చివాస్తవం. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి'

సామాజిక వేత్త సునీత కృష్ణన్.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు రాసిన బహిరంగ లేఖ ఇది. సినిమా షూటింగ్ లో తాను అనుభవించిన కష్టాన్ని రేప్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖాన్ పై మహిళాలోకం భగ్గుమంటోంది. సల్మాన్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందేననే డిమాండ్ వెల్లువెత్తింది. ఈ క్రమంలో సునీతా కృష్ణన్ బహిరంగలేఖ పలువురిని ఆలోచింపజేస్తోంది. ఇమేజ్ ఉన్న హీరోలు బాధ్యతగా ప్రవర్తించాలని గుర్తుచేస్తోంది. గ్యాంగ్ రేప్ బాధితురాలైన సునీత.. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత తనలాంటి ఎందరో మహిళలను ఆదుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రజ్వల ఎన్జీవోను ప్రారంభించి, సేవలను విస్తృతం చేశారు. ఇటీవలే భారత ప్రభుత్వం ఆమెకు నాలుగో అత్యున్నత పురస్కారం 'పద్మశ్రీ' ని అందించిన సంగంతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement