పుకార్లపై స్పందించిన సునీతా కృష్ణన్‌ | Sunitha Krishanan Responds Of Corona Virus Admitted In Hospital | Sakshi
Sakshi News home page

'కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.. వాటి కోసం చూస్తున్నా'

Published Mon, Mar 2 2020 7:34 PM | Last Updated on Mon, Mar 2 2020 7:42 PM

Sunitha Krishanan Responds Of Corona Virus Admitted In Hospital - Sakshi

ప్రముఖ సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్‌‌కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయ్యాయని.. ఫలితాల గురించి ఎదురుచూస్తున్నట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన తాను దగ్గుతో బాధపడుతున్నానని.. ఈ మేరకు పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు వెళ్లానన్నారు. తనపై వస్తున్న ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్‌-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.

దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాకుండా ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వీరిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రోజున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. చదవండి: ఢిల్లీ, తెలంగాణలలో కరోనా కేసులు నమోదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement