surjit singh barnala
-
ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించినట్టు ఆయన కార్యాలయ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 1952 నుంచి భారత్‌లో ఎన్నికలు అనే పుస్తకంపై తాను పనిచేస్తున్నానని, సీఎన్ఎన్ ఐబీఎన్‌లో తాను చేరిన డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భల్లా తెలిపారు. ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండే ఈ ఆర్థిక వేత్త ఇటీవలి జీడీపీ గణాంకాల ప్రకటన విషయంలో నీతి ఆయోగ్ పాత్రపై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ సమక్షంలో కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్ శ్రీవాస్తవ గత నెల 28న సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యుల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. -
మాజీ గవర్నర్ బర్నాలా కన్నుమూత
అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస ఉమ్మడి ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు చండీగఢ్/న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సేవలందించిన శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు సుర్జిత్‌సింగ్ బర్నాలా (91) శనివారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఇక్కడి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో గురువారం చేరిన ఆయనను మెరుగైన వైద్యం కోసం ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన సొంతూరు బర్నాలాలో ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. బర్నాలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గగన్జిత్ సింగ్, మనవడు సమరప్రతాప్‌సింగ్ ఈ తంతు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కన్నీటివీడ్కోలు పలికారు. బర్నాలాకు భార్య సుర్జిత్‌కౌర్, ఇద్దరు కుమారులు. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సుదీర్ఘ పయనం: 2003, 04 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన బర్నాలా... ఉత్తరాఖండ్‌కు తొలి గవర్నర్‌గా సేవలందించారు. వీటితోపాటు తమిళ నాడు, అండమాన్ నికోబార్ దీవులకూ గవర్నర్‌గా పనిచేశారు. అకాలీదళ్ పార్టీ నాయకుడైన బర్నాలా 1985లో పంజాబ్‌లో తీవ్రవాదం అట్టుడుకుతున్న కీలక సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 1987 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1991లో తమిళనాడు గవర్నర్‌గా (1990–91; 2004–2011) ఉన్న ఆయన... డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న నాటి ప్రధాని చంద్రశేఖర్ ప్రతిపాదనను తోసిపుచ్చడం సంచలనం రేపింది. ఈ కారణంతో వెంటనే బర్నాలాను బిహార్‌కు బదిలీ చేయగా, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 1977లో లోక్‌సభకు ఎన్నికై, కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో రసాయన–ఎరువుల మంత్రిగా ఉన్నారు. గొప్ప దేశ భక్తుడిని కోల్పోయాం: ప్రణబ్ ఉగ్రవాదం, సంఘ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపిన నాయకుడు, గొప్ప దేశ భక్తుడిని దేశం కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాప సందేశంలో బర్నాలాను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతకు ఆయన కీలక పాత్ర పోషించారని, సుదీర్ఘ కాలం సహచరుడిగా, స్నేహితుడిగా ఉన్న బర్నాలా... గొప్ప రాజనీతిజ్ఞుడు, పార్లమెంటేరియన్, పాలనాదక్షుడని శ్లాఘించారు. దేశానికి బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమంటూ ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అంకితభావం గల రాజకీయ నాయకుడు, దార్శనికుడు, మంచి రచయిత, అద్భుత మానవతావాది బర్నాలా అని, పంజాబ్‌లో ఉగ్రవాదంపై పోరాడి శాంతిని నెలకొల్పిన ఘనుడని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీర్తించారు. బర్నాలా శక్తివంతమైన నాయకుడని, భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన ఆయన పంజాబ్ అభివృద్ధికి విశేష కృషి చేశారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ సంతాపం ప్రకటించారు. వీరితో పాటు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ సంప్లా తదితరులు బర్నాలా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బర్నాలా సేవలు చిరస్మరణీయమని, ఆయన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. కేసీఆర్, బాబు సంతాపం సాక్షి,హైదరాబాద్/అమరావతి: బర్నాలా మృతికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బర్నాలా చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రాబాబు కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చారన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషించారన్నారు. -
మాజీ గవర్నర్ కన్నుమూత
-
మాజీ గవర్నర్ కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్‌లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పంజాబ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రస్తుత హరియాణాలోని అటేలి గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించిన బర్నాలా.. 1946లో లక్నో యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. కొన్నాళ్లు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన ఆయన, 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1977 సంవత్సరంలో లోక్‌సభకు ఎన్నికై, మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేసినప్పుడు బర్నాలా ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రయత్నించినా, నాటి ఉప ముఖ్యమంత్రి చౌదరి చరణ్ సింగ్ కూడా ఆ పదవి ఆశిస్తున్నారని తెలిసి చివరి నిమిషంలో ఆగిపోయారు. తర్వాతి కాలంలో బర్నాలా 2003 జనవరి 3వ తేదీ నుంచి 2004 నవంబర్ 4వ తేదీ వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేశారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గాను, అండమాన్ నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గాను ఆయన సేవలు అందించారు. సీఎం సంతాపం ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలా మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బర్నాలా ఏపీకి అందించిన సేవలు మరిచిపోలేనివని ఆయన అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పని చేయడం రాష్ట్రం చేసుకున్న అదృష్టమని చెప్పారు. Saddened by the passing of Surjit Singh Barnala Ji. My condolences to his family, friends and well wishers #RIP — Mamata Banerjee (@MamataOfficial) 14 January 2017