survey numbers
-
అమరావతిలో భూమాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నదిలో ఉన్న భూమి సాగు భూమి అవుతుందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే రాజధాని అమరావతిలో మాత్రం కచ్చితంగా అవుతుంది. లేని భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి, భారీగా లబ్ధి పొందుతారు. గతంలోనూ టీడీపీ హయాంలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. ఆ విషయం తెలిసిపోవడంతో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అదే తరహా కుంభకోణం ఫైలు మరొకటి ఉన్నతస్థాయి నుంచి చకచకా కదిలి రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చింది. అసలు రెవెన్యూ రికార్డుల్లో లేని నదీ ప్రవాహంలోని సర్వే నంబర్లు పేర్కొంటూ దానిని పూలింగ్‌కు తీసుకోవాలంటూ 65 మంది రైతుల పేర్లతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు రావడం.. అక్కడి నుంచి సీఆర్డీఏకి వెళ్లి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవడం వేగంగా జరిగిపోయింది. దానిని క్లియర్ చేసేయాలంటూ ఉన్నతస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లూ వస్తున్నాయి. అయితే, ఇంత దారుణమైన మాయ చేయలేమంటూ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిగో ఇది ఆ మాయాభూమి కథ.. ఇటీవల తుళ్లూరు మండలం రాయపూడి సర్వే నంబర్ 1–ఎ1, 1–ఎ2 నుంచి 1–ఎ67 వరకూ ఉన్న 104.82 ఎకరాలకు సంబంధించిన రైతుల భూమి వర్గీకరణ, భూ స్థితి, అసైన్మెంట్ జరిగిందీ లేనిదీ వెంటనే వివరాలివ్వాలంటూ సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. అందులో ఆ భూమి యజమానులుగా 65 మంది రైతుల పేర్లు ఉన్నాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ కార్యాలయం లాండ్ పూలింగ్ వివరాల కోసం ఆ రైతులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ వద్దకు వచ్చి ఆధారాలు చూపించాలని కోరుతూ రాయపూడిలో, తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా నోటీసులు అంటించింది. అయినా ఒక్క రైతూ ముందుకు రాలేదు. రెవెన్యూ అధికారులు విచారణ చేయగా.. ఆ దరఖాస్తులో ఉన్న రైతులు ఎవరూ ఆ ప్రాంతాల్లోనే లేనట్లు తేలింది. మైక్‌లో ప్రచారం చేసినా ఎవరూ రాలేదు. 19వ తేదీన ఒక్క వ్యక్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. అతని వద్ద కూడా ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.పూర్తిగా విచారణ చేయగా రైతులు తమ భూమి అని పేర్కొన్న భూమి మొత్తం కృష్ణా నదీ గర్భంలో ఉన్నట్లు తేలింది. అది నదిలో ఉన్న భూమి. రాయపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1, 1/12–2బీ2ఏ, 16–ఏ2, 16–బీ2, 71–ఏ, 15–ఏ, 15–బీ, 17–ఏ, 225–1, 72, 96లో నదీ ప్రవాహం వెళ్తుంది. వీటిలో మరికొన్ని నదిలోనే దిబ్బలుగా ఉన్నాయి. నదీ ప్రవాహంలో ఉన్న భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం.అక్రమంగా లబ్ధి పొందేందుకే..! అడంగల్‌లో ఆ సర్వే నంబర్లే లేవని, ఎవరికీ పాస్ పుస్తకాలు ఇ చ్చినట్లు కూడా లేదని రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. అయినా అమరావతి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ ప్లాట్ల విలువ కోట్లలో ఉండటంతో అక్రమంగా లబ్ధి పొందేందుకు కొందరు వ్యక్తులు రాయపూడి నదీ ప్రవాహాన్ని సాగు భూమిగా సృష్టించారు. ఇప్పుడు దాన్ని లాండ్ పూలింగ్‌కు తీసుకొమ్మని సీఆర్డీఏ అధికారులను ఒత్తిడి చేస్తున్నారు. అసలు రైతులు, భూమి లేకుండా తామేమీ చేయలేమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయితే వారికి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అడంగల్ లేని, పాసు పుస్తకాలు కూడా లేని భూమికి అనుమతులెలా ఇస్తామని అధికారులు అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ తహసీల్దార్ ఇలానే ఇరుక్కొన్నారన్న విషయాన్ని గుర్తు చేసి, ఈసారి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఇదీ పాత కథ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నదీ ప్రవాహాన్ని వారి సాగు భూములుగా రికార్డులు పుట్టించి మండల రెవెన్యూ అధికారి సహకారంతో ఆడంగల్లో చేర్చారు. 20 ఎకరాల ఈ భూముల విలువ అప్పట్లోనే రూ.30 కోట్లకు పైగా ఉండేది. తొలుత 1/12–2బీ, 2ఏ, 71–ఏ సర్వే నంబర్లలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాన్ని సాగు భూములుగా, ఆ తర్వాత 16–ఏ2, 16–బీ2, 15–ఏ, 15–బీలో ఉన్న కృష్ణా నదిని ఇద్దరి పేర్లతో ఆడంగల్లో చేర్చారు. వీటిని వేరే వారికి అమ్మేసి మ్యుటేషన్ ద్వారా వేర్వేరు రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కూడా చేయించేశారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఆ భూములు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి, నివేదిక ఇచ్చాకే రిజి్రస్టేషన్ పూర్తవుతుంది. అయితే, అప్పటి అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కవడంతో నదిని కూడా సాగు భూమిగా చూపించారు. ఈ అక్రమాన్ని సక్రమం చేసినందుకు రెవెన్యూ అధికారి కొడుకులు, కారు డ్రైవర్‌కు కొంత భూమిని పంచారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు.ఆ భూములకు రైతులే లేరు సర్వే నంబర్ 1–ఎ1 నుంచి 1–ఎ67 వరకు ఉన్న భూమిలో 65 మంది రైతులు ఉన్నారని, వారి భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారా లేదా వివరాలు కావాలని సీఆర్డీఏ నుంచి ఆదేశాలు మాకు వచ్చాయి. రైతులు వారి వద్ద ఉన్న వివరాలు అందచేయాలని నోటీసులు ఇచ్చి, మైక్ ప్రచారం చేసినా ఎవరు రాలేదు. అసలు వారు చెప్పిన సర్వే నంబర్లు మా రికార్డుల్లోనూ లేవు. – సుజాత, తహసీల్దార్, తుళ్లూరు -
సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు కనుమరుగై, వాటి స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎ) నంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ఎల్పీఎం నంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నంబర్లతోనే జరగనున్నాయి. బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారు. ఒక సర్వే నంబరులో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్పీఎం నంబరు, ప్రతి యజమానికి ఆధార్ తరహాలో ఒక ఐడీ నంబరు ఇస్తోంది. మారనున్న 1.96 కోట్ల సర్వే నంబర్లు రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఈ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్ సర్వే, అవి చేయలేని చోట డీజీపీఎస్ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు ఎల్పీఎం నంబరు, ఆధార్ మాదిరిగానే భూదార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది. సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, యజమాని ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతాయి. ఈ ఎల్ï³ఎం నంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్లు జరుగుతాయి. దీనివల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. వెబ్‌ల్యాండ్–2లో ఎల్పీఎం నంబర్లు రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్పీఎం నంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్పీఎం నంబర్లతో అప్డేట్ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వీటి ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్–2 ఆన్లైన్ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. సర్వే పూర్తయ్యే గ్రామాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతోంది. ఆ గ్రామాలను కూడా వెబ్‌ల్యాండ్–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్‌ల్యాండ్–2కి మారిపోతుంది. భవిష్యత్తులో ఎల్పీఎం నంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. -
ఇవి నిషేధితమా..!
నెల్లూరు(సెంట్రల్): అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కొన్నైతే, అన్ని పత్రాలతో కొనుగోలు చేసినవి మరికొన్ని, ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ఉన్న పలంగా ప్రభుత్వం మాత్రం ఆ సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో చేర్చి ఆయా ప్రాంతాల ప్రజలను ఆందోళనలోకి నెట్టేశాయి. అవసరాలకు ఆ స్థలాలను క్రయవిక్రయాలు చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ అధికారులు ససేమిరా అనే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే తీరుతో జాబితాను పంపగా, తిరిగి ఈ ఏడాది మూడు రోజుల క్రితం అదే విధంగా తప్పుల తడకులుగా జాబితాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపడం గమనార్హం. నిషేధిత జాబితాలో పలు సర్వేనంబర్లు జిల్లాలోని నిషేధిత భూముల, స్థలాల సర్వేనంబర్లతో కూడిన జాబితాను జిల్లాలోని అన్ని సబ్రిజిస్ట్రార్లకు రెవెన్యూ అధికారులు ప్రతి ఏడాది పంపుతారు. అదే విధంగా ఈ ఏడాది మూడు రోజుల కిత్రం కొత్త నిషేధిత సర్వేనంబర్ల జాబితాను పంపారు. కాగా ఈ నిషేధిత సర్వేనంబర్లలో నగర నడిబొడ్డున ఉన్న 1934, 35, 2022–ఏ, 2022–బి, 2010 నుంచి 2060 వరకు కొన్ని వందల సర్వేనంబర్లను నిషేధిత జాబితాలో పొందు పరచడం గమనార్హం. అధికారికంగా అన్ని ఉన్నా రెవెన్యూ పొరపాట్ల వల్ల ఆయా ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఆందోళనలో ప్రజలు జిల్లాలో రిజిస్ట్రేషన్ పరంగా నెల్లూరు, గూడూరు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. వీటిలో నెల్లూరు కింద 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు, గూడూరు కింద మరో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతి ఏడాది పంపినట్లుగానే ఈ ఏడాది కూడా నిషేధిత సర్వేనంబర్ల జాబితాలను పంపారు. మొత్తం మీద ఒక్కో సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో దాదాపుగా 1000 నుంచి 2000 వేల వరకు సర్వేనంబర్లు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో నిషేధిత సర్వేనంబర్లు ఉన్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందనే విషయం తెలుస్తోంది. వీటిని డాట్ల్యాండ్గా చూపిస్తూ నిషేధిత జాబితాలో చేర్చడంపైనా సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆన్లైన్ అగచాట్లు..!
భూమి అంటే రైతుకు ఆరోప్రాణం! పట్టాదారు పాస్‌బుక్, భూయాజమాన్య హక్కు పుస్తకం (టైటిల్‌డీడ్) వారికి ఆయువుపట్టు! తమ హక్కుకు, హోదాకు అవే చిహ్నాలు! రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నెలల క్రితం వాటికి చెల్లుచీటి చెప్పేసింది! రైతులు తమ భూమి వివరాలు చూసుకోవాలన్నా, క్రయవిక్రయాలు చేసుకోవాలన్నా, చివరకు బ్యాంకు నుంచి పంటరుణాలు పొందాలన్నా... అన్నింటికీ ఆధారం ఆన్లైన్లోని ‘మీ భూమి’ పోర్టలేనంటూ కొత్త వ్యవస్థను తెచ్చింది! అవినీతికి, అలసత్వానికి ఆస్కారం లేకుండా చూడటానికే వెబ్‌ల్యాండ్ విధానం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కాగితరహిత వ్యవహారం ఇప్పుడు రైతులకు చుక్కలు చూపిస్తోంది. అడంగల్, ఒన్–బీలో తప్పులు సరిదిద్దుంచుకోవడానికి పదేపదే దరఖాస్తు చేసుకుంటూ వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కొంతమంది రెవెన్యూ సిబ్బంది మామ్మూళ్ల కోసం వారిని ముప్పతిప్పలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క చిత్రంలోని రైతు పేరు అన్నాబత్తుల మహేశ్... రణస్థలం మండలం గరికిపాలెం రెవెన్యూ గ్రామానికి చెందిన అతనికి సర్వే నంబర్లు 35/11, 35/4, 35/5లో 2.41 ఎకరాలు జిరాయితీ భూమి ఉంది. నంబరు 22/2 కింద ప్ర భుత్వ భూమిగా నమోదు అయిఉంది. ఈ రెవెన్యూ గ్రామంలో 21 మంది రైతుల సర్వే నంబర్లు తప్పుగా పడ్డాయి. మ్యుటేషన్ చేసి సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా, మీసేవలో దరఖాస్తు చేసుకున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని ఆవేదన చెందుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబరు వేసి, రైతు జిరాయితీగా సరిచేయాలి. 1–బీ, పాస్ పుస్తకాలు అందజేయాలి. కానీ అలా జరగట్లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లావ్యాప్తంగా 5 లక్షల హెక్టార్ల భూమి ఉంది. దీనిలో రైతుల ఆధీనంలో ఉన్న సాగుభూమి సుమారుగా 3 లక్షల హెక్టార్ల వరకూ ఉంటుంది. దీనిపై ఆధారపడిన సన్నకారు, పెద్ద రైతులు దాదాపుగా 5.5 లక్షల మంది ఉన్నారు. వారివద్ద ఆ భూములపై హక్కును తెలియజేసేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు (దస్తావేజులు)తో పాటు ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు గతంలో ఉండేవి. జిల్లాలో దాదాపు 3.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లు వివిధ దశల్లో మంజూరయ్యాయి. అయితే ఈ భూముల వివరాలను ఆన్లైన్లో నమోదుచేసే ప్రక్రియ నాలుగున్నరేళ్ల క్రితమే ప్రారంభమైంది. దీనికి గత ప్రభుత్వం ‘వెబ్‌ల్యాండ్’ అని పేరుపెట్టింది. అయినప్పటికీ పాస్‌పుస్తకాలు రద్దు చేయబోమని, వాటి ఆధారంగా రుణాల మంజూరు, క్రయవిక్రయాలు నిర్వహించుకోవచ్చని చెబుతూ వచ్చింది. కేవలం భూమి వివరాలు, యాజమాన్య హక్కు వివరాలు పారదర్శకంగా ఉండాలని, రికార్డు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ చేస్తున్నట్లు రైతులకు అభయమిచ్చింది. అయితే టీడీపీ ప్రభుత్వం ‘మీ భూమి’ పోర్టల్‌ను తెరపైకి తీసుకొచ్చి ంది. రైతులు ప్రాణంగా చూసుకొనే పట్టదారు పాస్‌పుస్తకాలకు మంగళం పాడేసింది. తీరని బాలారిష్టాలు... ఏటా దాదాపు 2.50 లక్షల మంది వరకూ ఖరీఫ్‌లో, 20 వేల మంది వరకూ రబీ సీజన్లో బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. జిల్లాలోని 41 బ్యాంకులకు సంబంధించిన 302 శాఖల ద్వారా గత ఖరీఫ్‌లో రూ.1,700 కోట్లు వ్యవసాయ రుణాలుగా అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ 2.30 లక్షల మంది సుమారు రూ.1,400 కోట్ల రుణాలు మాత్రమే పొందారు. కానీ వెబ్‌ల్యాండ్ విధానం అమల్లో బాలారిష్టాలు తీరలేదు. భూసమస్యల పరిష్కారం కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దాఖలు చేసుకుంటున్న ఫిర్యాదులు లక్షల్లోనే ఉంటున్నాయి. వాటిలో ఎక్కువ మ్యూటేషన్, కరెక్షన్ కోసం దాఖలు చేసినవే. ఇవి పరిష్కారం గాకపోవడంతో బ్యాంకు రుణాలకే గాకుండా రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు తీసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతుల భూములకు అడంగల్, 1బీ చాలా ముఖ్యం. భూముల క్రయవిక్రయాలతో సర్వే నంబర్లలో తప్పులు, భూవిస్తీర్ణంలో తేడాలు సరి చేయడానికి మ్యుటేషన్, కరెక్షన్ల కోసం మీ–సేవ కేంద్రాల్లో రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. సాధారణంగా ఈ ప్రక్రియను 21 రోజుల గడువులో పూర్తి చేయాలి. కానీ ఈ సమయంలో ఏదైతే భూమికి సంబంధించి మ్యుటేషన్ లేదా కరెక్షన్ కోసం దరఖాస్తు చేశారో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబరులోని మిగతా రైతులకూ 1బీ జారీ కావట్లేదు. సర్కారు స్పందన కరువు... వెబ్‌ల్యాండ్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై తహసిల్దార్లు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర భూపరిపాలన విభాగానికి (సీసీఎల్ఏ) ఎప్పటికప్పుడు ఆన్లైన్, ఫోన్ ద్వారానే గాకుండా వీడియో కాన్ఫెరెన్స్ల్లోనూ నివేదిస్తున్నారు. వెబ్‌ల్యాండ్ అమల్లో ఎదుర్కొంటున్న సాంకేతికపరమైన సమస్యలకు పరిష్కారం చూపాలని వేడుకొంటున్నారు. కానీ ఫలితం ఉండట్లేదు. జిల్లాలో వెబ్‌ల్యాండ్ సమస్యలు నానాటికి పెరుగుతున్నాయి. ఏటా ‘రైతు సేవలో రెవెన్యూశాఖ’ పేరుతో రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించినా ఫలితం కనిపించట్లేదు. అలసత్వమూ, మామూళ్ల మత్తు... ఇటీవల పాస్ పుస్తకం కోసం ఎచ్చెర్ల డిప్యూటీ తహసిల్దారు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇద్దరు వీఆర్వోలు కూడా రూ.5 వేలు చొప్పున రైతుల నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మరోవైపు ఎన్నిసార్లు ‘మీ–సేవ’ కేంద్రాల్లో వ్యయప్రయాసలకోర్చి దరఖాస్తు చేసినా ఫలితం ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేపదే తిరస్కరణ గురవుతున్నాయని చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో రెవిన్యూ సదస్సుల్లో వినతులు కూడా పరిష్కారానికి నోచట్లేదు. దరఖాస్తుల పెండింగ్ అంశం దరఖాస్తులు పరిష్కరించినవి తిరస్కరించినవి పెండింగ్ 1. అడంగల్, 1బి సవరణలు 2,18,358 1,71,306 45,642 1410 2. మ్యుటేషన్, టైటిల్‌డీడ్, ఈపాస్ పుస్తకం కోసం (పాతవి) 1,52,498 85,652 65,602 1,244 3. మ్యుటేషన్, టైటిల్‌డీడ్, ఈపాస్ పుస్తకం (కొత్తవి) 1,594 3 – 1591 ఆన్లైన్లో వివరాల్లేక ఇబ్బందులు వెబ్‌ల్యాండ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నాకు చెందిన ఒక ఎకరా భూమి వివరాలు అందులో లేవు. అవి కన్పించేలా చర్యలు చేపట్టాలని స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి పలుసార్లు ధరఖాస్తు చేసినా ప్రయోజనం లేదు. మా గ్రామంలో నాతోపాటు యారడి అప్పారావు, యారడి చిన్నకృష్ణమూర్తి, టెంక ఆనంద్, నారాయణపురం గ్రామానికి చెందిన రత్నాల డొంబూరు తదితర రైతులది కూడా ఇదే సమస్య. –యారడి వాసుదేవు, రైతు, గోకర్ణపురం గ్రామం, కంచిలి మండలం ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నా నాకు ఖాతా నెంబర్ 192, సర్వేనంబర్లు 57–7, 55, 48–2, 44–4(ఎ), 30లలో దాదాపు 13 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి వెబ్‌ల్యాండ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏడాదిగా తిరుగుతున్నా. మీ–సేవా కేంద్రాల ద్వారా పలుమార్లు అర్జీలు చేసుకున్నా ఫలితం లేదు. అధికా రులు నికర భూమిని నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సక్రమంగా జరగకపోవటం తో నాలాంటి రైతులు ఎందరో రెవెన్యూ, మీ–సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. –కండాపు ప్రసాదరావు, రైతు, పీఆర్.రాజుపేట,పాలకొండ మండలం. తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు..... సంతకవిటి తహశీల్దార్ కార్యాలయంలో అక్రమాలు అధికమయ్యాయి. వెబ్ అడంగల్‌కు ఇబ్బందులు పడుతున్నాం. పంటపొలాల సర్వేకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సర్వేయర్లు అందుబాటులో ఉండడంలేదు. ముటేషన్లు చేయాలంటే అధికంగా చెల్లింపులు జరపాల్సి ఉంది. –ముదిలి అప్పలనాయుడు -
‘ఖాతా’కు కంప్యూటర్ చెక్!
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా రెవెన్యూ వ్యవస్థను వేధిస్తున్న కీలక సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయ, విక్రయ లావాదేవీలను మాన్యువల్‌గా రికార్డు చేస్తుండటంతో ఏర్పడిన డబుల్ ఖాతాల సమస్యకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. భూముల లావాదేవీల్లో అమ్మకందారు, కొనుగోలుదారు వివరాలతో పాటు పౌతి మార్పులను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసే ‘మార్పుల రిజిస్టర్’ను శనివారం అందుబాటులోకి తెచ్చింది. గతం.. అంతా గందరగోళం భూముల క్రయ, విక్రయ లావాదేవీల్లో ఎప్పటికప్పుడు జరిగే మార్పులను నమోదు చేసే వ్యవస్థ మొదటి నుంచీ ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఆ లావాదేవీలను మాన్యువల్‌గా నమోదు చేసేవారు. ఉదాహరణకు ‘ఏ’అనే వ్యక్తి తనకున్న రెండెకరాల భూమిలో ఎకరం భూమిని ‘బీ’ అనే వ్యక్తికి అమ్మితే, ఎకరం భూమి కొన్న ‘బీ’ అనే వ్యక్తి పేరు మీద కొత్త ఖాతా తెరిచి ఆ ఎకరం భూమిని నమోదు చేసేవారు. కానీ, ‘ఏ’ ఖాతాలో ఉన్న రెండెకరాల నుంచి ఎకరం భూమిని తొలగించే వారు కాదు. దీంతో అదే సర్వే నంబర్లోని భూమి ఇద్దరు రైతుల ఖాతాల్లో నమోదయ్యే ది. ‘ఏ’ పేరిట రెండెకరాలు, ‘బీ’ పేరిట మరో ఎకరం రికార్డయ్యేది. దీంతో రైతుల ఖాతాలతో పాటు ఆ సర్వే నంబర్లో ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి రికార్డు అయ్యేది. ఎవరైనా పట్టాదారు చనిపోయిన పక్షంలో వారసుల పేరిట భూమి మ్యుటేషన్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. చనిపోయిన వ్యక్తి ఖాతాలను అలానే ఉంచి, వారసుని పేరిట మరో ఖాతా తెరచి అదే భూమిని నమోదు చేసేవారు. లేదంటే చనిపోయిన వ్యక్తి పేరిట ఆ ఖాతాను అలాగే కొనసాగించేవారు కానీ వారసుడి పేరిట (పౌతి) మార్పు చేసేవారు కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో కుప్పలు తెప్పలుగా ఈ సమస్యలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు దాదాపు 10 లక్షల వరకు నమోదయ్యాయని ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. అయితే, ప్రక్షాళనలో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినా భవిష్యత్తు లావాదేవీలు కూడా మాన్యువల్‌గా ఉంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి జరిగే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటినీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ‘మార్పుల రిజిస్టర్’లో నమోదు చేయాలని ఆదేశించింది. ఖాతా తొలగింపు.. పేరు మార్పు ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ప్రత్యేక నమూనాలో ఆన్లైన్ రిజిస్టర్‌ను తయారు చేశారు. అందులో భూమి రిజిస్ట్రేషన్ నంబర్, తేదీతో పాటు అమ్మేవారి పేరు, తండ్రి/భర్త పేరు, కొనేవారి పేరు, తండ్రి/భర్త పేరు, లావాదేవీ స్వభావం, సర్వే, ఖాతానంబర్లు, విస్తీర్ణం, మార్పు చేసిన రికార్డు నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అదే పౌతి విషయంలో చనిపోయిన పట్టాదారు పేరు, తేదీ, వారసుల పేరు ను మార్పు చేస్తారు. దీంతో ఫలానా ఖాతాలో ఈ ఆన్లైన్ రిజిస్టర్లో మార్పులు జరిగితే దానంతట అదే ఖాతా మారిపోనుంది. దీం తో డబుల్ ఖాతాల సమస్యకు తెరపడనుంది. అలాగే వారసుల పేరిట పట్టాల మార్పు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. -
తప్పుడు రికార్డులు సృష్టించి రూ.1.80 లక్షలు స్వాహా
మామిడాల (తిప్పర్తి), న్యూస్‌లైన్: ఇద్దరు రైతులకు మాయమాటలు చెప్పి తప్పుడు రికార్డులు సృష్టించి వారి పేరున రూ.1.80 లక్షలు బ్యాంకు రుణం కాజేసిన దళారీతో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగి ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెనికి చెందిన సుంకరబోయిన సైదులు మామిడాల సీబీఐలో 2010 సెప్టెంబర్ 27న ఖాతా తెరిచాడు. అదే గ్రామానికి చెందిన పాతకొట్ల రాములు గత ఏడాది జూలైలో ఖాతా తెరిచారు. తమ వ్యక్తిగత అవసరాల కోసం ఖాతాలు తెరిచినట్లు ఆ రైతులు తెలిపారు. అయితే ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన ఓ దళారి ఆ గ్రామ రెవెన్యూ అధికారి కలిసి ఈ ఇద్దరు రైతుల పేరున ఎల్లమ్మగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 490, 491/1లలో చెరో 10ఎకరాలు ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి పట్టాదారు పాస్‌పుస్తకాలు తయారు చేశారు. అంతటితో ఆగకుండా ఆ రైతుల పేరున సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.1.80 లక్షల పంట రుణాన్ని డ్రా చేశారు. అయితే రైతులకు ఎలాంటి అనుమానం రాకుండా మాయమాటలు చెప్పి వారికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఇచ్చి బ్యాంకు పాస్‌బుక్కులను మాత్రం దళారి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ తతంగం చూస్తుంటే ఇందులో బ్యాంకు సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయట పడిందిలా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న సైదులు, రాములు ఇద్దరికి ఉపాధి పథకం ద్వారా బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వం రూ.4 వేల చొప్పున జమ చేయాల్సి ఉంది. కానీ బ్యాంకు పాస్‌బుక్‌లు వీరి వద్ద లేవు. దీంతో వీరు దళారి వద్దకు వెళ్లి తమ బ్యాంకు ఖాతా బుక్‌లు ఇవ్వాలని నిలదీశారు. ఆ దళారి వారం పదిరోజులు తిప్పించుకొని ఆ బ్యాంకు ఖాతా పాస్ బుక్కులను ఆ రైతులకు ఇచ్చాడు. పనికాగానే తిరిగి వాటిని తనకు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రాములు తనకొడుకుకు తాఖా బుక్ చూపించారు. అందులో డబ్బులు జమ అయి డ్రా అయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే రైతు.. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించగా రైతులిద్దరి పేర పంట రుణం రూ.1.80 లక్షలు ఇచ్చామని చెప్పాడు. దీంతో రైతులు దళారిని, గ్రామ రెవెన్యూ అధికారిని నిలదీశారు. దీంతో వారు బేరసారాలకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ రుణం వచ్చిందని రూ.10 వేలు ఇచ్చాడు నాకు ప్రభుత్వ రుణం రూ.10 వేలు వచ్చింది తిరిగి కట్టనవరసం లేదు మాఫీ అవుతుందని చెప్పాడు. పలు రికార్డుల్లో సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ తర్వాత రూ.10 వేలు ఇచ్చాడు. మమ్మల్ని మోసం చేశారు. - సుంకరబోయిన సైదులు, బాధితుడు బ్యాంకు అప్పు రూ.90 వేలు కట్టాలంటున్నారు నాకు మాయమాటలు చెప్పి బ్యాంకుకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకున్నారు. తరువాత రూ.10 వేలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ. 90 వేల పంట రుణం కట్టాలంటున్నారు. మమ్మల్ని మోసం చేశారు. న్యాయం చేయాలి. - పాతకోట్ల రాములు, బాధితుడు