susheela
-
గాయని సుశీలకు కలైజ్ఞర్ స్మారక అవార్డు
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయని గాన కోకిల పి. సుశీలకు ‘కలైజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్’ అవార్డును తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు ప్రభుత్వం తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్ నినైవు కళై తురై విత్తగర్ అవార్డుని (కలైజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్టు లేదా నిపుణులు) ఒకరికి ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్ ఆరూర్దాస్‌కు దక్కింది.గత ఏడాది మొత్తం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు జరగడంతో ఈ అవార్డుని 2023కుగాను మహిళా ప్రముఖురాలికి ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఈ అవార్డుకు పి. సుశీలను ఎంపిక చేసింది కమిటీ. అలాగే తమిళ భాషాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రచయిత, కవి మహ్మద్ మెహతాను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 30న తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. -
నేను పాటలు పాడాను అంటే వచ్చి గొడవ చేసేవారు ఇళయరాజా గారు
-
నేనెన్ని పాటలు పాడిన ఆయనకు ఇష్టం ఉండేది కాదు
-
అలాంటి పాటలు ఇష్టం లేకపోయినా పాడాను
-
భారతరత్న నాకు అవసరం లేదు: పి సుశీల ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళ సినిమా: గాన సరస్వతి పద్మభూషణ్ పి.సుశీల ఇప్పటికీ సంగీత ప్రియుల గుండెల్లో సరిగమల వీణ మోగిస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠీ తదితర భాషల్లో తన గానామృతాన్ని పంచిన గాయనీమణి పి.సుశీల. ఈమె 70వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌బుక్ రికార్డు, ఏ షియన్ బుక్‌లో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పత్రికా సంఘం శనివారం సాయంత్రం నిర్వహించిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పి.సుశీల, ని ర్మాత కలైపులి ఎస్.థాను, దర్శకుడు మోహన్‌రాజా, నటుడు సతీష్ తదితరులు దీపావళి సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేది పాత్రికేయులేనన్నారు. అప్పట్లో సినిమా సమాచారం ఆల్ ఇండియా రేడియో కంటే ముందే పత్రికల్లో వచ్చేవన్నారు. తాను పెద్ద గాయని కావాలన్నది తన తండ్రి కోరికని, అది తాను నెరవేర్చాననే అనుకుంటున్నానన్నారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే గాయనిగా భిక్ష పెట్టింది సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథ్ అని పేర్కొన్నారు. జనరేషన్ మారుతున్న సంగీతం ఎప్పటికీ మరవలేనిదన్నారు. అయితే తమ కాలంలో పరిశుద్ధంగా ఉండేదని, ఈ జనరేషన్లో ...అంటూ నవ్వేశారు. తనకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేసింది అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి అని తెలిపారు. చదవండి: ‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా? ఇక భారతరత్న అంటారా? అది తనకు అవసరం లేదని, గాయనిగా ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయానన్న సంతృప్తి చాలన్నారు. తాను పి.సుశీల పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా పేద సంగీత కళాకారులకు నెలనెలా పింఛన్ అందిస్తున్నానని చెప్పారు. అలాగే ఈ ట్రస్టు ద్వారా ఏటా ఒక ఉత్తమ సంగీత కళాకారులను ఎంపిక చేసి అవార్డు, రూ.లక్ష నగదును అందిస్తున్నట్లు చెప్పారు. అయితే తన పాటలకు రాయల్టీ రావడం లేదని, అది వస్తే మరికొందరికీ సాయం చేసే అవకాశం ఉంటుందని గాయని పి.సుశీల అన్నారు. కాగా ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నటుడు బోండామణికి పత్రికల సంఘం కార్యవర్గం ఆర్థిక సాయం అందజేసింది. -
బాపూజీ బాటలో...
మనసు పవిత్రం అయితే మాట కూడా పవిత్రమవుతుంది. దానికి మంత్రబలం లాంటిది వస్తుంది. బాపూజీ మాట ఎందరినో తమను తాము తెలుసుకునేలా చేసింది. తమ జీవితాన్ని కాంతి మంతమైన కొత్త బాటలోకి నడిపించుకు వెళ్లేలా చేసింది. దీనికి బలమైన ఉదాహరణ ఈ ముగ్గురు మహిళలు... మెడెలిన్ స్లెడ్ మీరాబెన్‌గా ఎలా మారింది? ‘మెడె లిన్ స్లెడ్ ఎవరు?’ అంటే టక్కున గుర్తుకురాకపోవచ్చు. అయితే ‘మీరాబెన్’ అంటే మాత్రం గాం«ధీజీ గుర్తుకు వస్తారు. బ్రిటిష్ సైనిక అధికారి సర్ ఎడ్మండ్ కుమార్తె అయిన మెడె లిన్‌కు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఒకానొక సందర్భంలో ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్ గాంధీజీ జీవితంపై రాసిన పుస్తకం చదివింది. ఈ పుస్తకం తనను ఎంత ప్రభావితం చేసిందంటే ‘సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను’ అని గాంధీజీకి లేఖ రాసింది. ‘తప్పకుండా రావచ్చు’ అని ఆహ్వానిస్తూనే ఆశ్రమ క్రమశిక్షణ వాతావరణాన్ని గుర్తు చేశారు గాంధీ. 1925లో అహ్మదాబాద్‌కు వచ్చింది మెడెలిన్. గాంధీజీలో ఒక దివ్యకాంతిని దర్శించింది. ఆ కాంతి తనను పూర్తిగా మార్చేసింది. మద్యపానం, మాంసాహారం మానేసేలా చేసింది. ‘భగవద్గీత’ అధ్యయనం ఆమె జీవితాన్ని వెలుగుమయం చేసింది. తన పేరు ‘మీరాబెన్’గా మారింది. ఉద్యమాల్లో భాగంగా గాంధీజీతో పాటు జైలుకు కూడా వెళ్లింది. ‘సేవాగ్రామ్’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. రిషికేష్‌కు సమీపంలో ‘పశులోక్ ఆశ్రమం’ ఏర్పాటు చేసింది. బాపు తనకు రాసిన ఉత్తరాలను పుస్తకంగా ప్రచురించింది. కోట దాటి పేదల పేటకు వచ్చిన రాజకుమారి అమృత్‌కౌర్ పెరిగిన వాతావరణానికి, ఆ తరువాత ఉద్యమకారిణి గా ఆమె జీవితానికి ఎక్కడా పొంతన కనిపించదు. కోటలో రాజకుమారి పేట పేటకు తిరిగి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి స్ఫూర్తి గాంధీజీ. కపూర్థలా రాజు హరినామ్సింగ్ కుమార్తె అయిన అమృత్‌కౌర్ ఇంగ్లండ్‌లో చదువుకుంది. గాంధీజీకి ఆమె ఎన్నో ఉత్తరాలు రాసేది. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆమె దిశను మార్చేసాయి. 1934లో గాంధీని కలుసుకుంది. ఆ తరువాత ఆశ్రమంలో చేరింది. తన ఖరీదైన రాచరిక జీవనశైలికి, ఆశ్రమ వాతావరణానికి బొత్తిగా సంబంధం లేదు. చాలా కష్టం కూడా అనిపించవచ్చు. కాని ఎండకన్నెరుగని రాజకుమారి సామాన్యురాలిగా మారి ఆ ఆశ్రమంలో సేవ చేసింది. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శిగా 16 సంవత్సరాలు పనిచేసింది. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. గాంధీజీ తనకు రాసిన ఉత్తరాలు ‘లెటర్స్ టు రాజకుమారి’ పేరుతో పుస్తకంగా వచ్చింది. వైద్యం నుంచి ఉద్యమం వరకు... కుంజా (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) అనే చిన్న నగరం లో జన్మించింది సుశీల నయ్యర్. ఆమెకు ప్యారేలాల్ అనే అన్న ఉండేవాడు. అన్నాచెల్లెళ్లకు గాంధీజీ తత్వం అంటే బాగా ఇష్టం. ఎప్పుడూ దాని గురించి చర్చించుకునేవారు. దిల్లీలో వైద్యవిద్యను అభ్యసించింది సుశీల. 1939లో తన సోదరుడిని ‘సేవాగ్రామ్’లో చేర్పించడానికి వచ్చింది. అలా గాంధీజీతో పరిచయం పెరిగింది. పేదలకు ఆమె చేసే వైద్యసహాయం గాంధీజీ ప్రశంసలు అందుకునేలా చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైలుకు కూడా వెళ్లింది. ఇదంతా వారి తల్లిదండ్రులకు మొదట్లో నచ్చలేదు. అయితే ఆ తరువాత కాలంలో వారి ఆలోచన విధానంలోనూ మార్పు వచ్చింది. మహత్మాగాంధీ: ఫైనల్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్, మహాత్మాగాంధీ: సాల్ట్ సత్యాగ్రహ... మొదలైన పుస్తకాలు రాసింది డా.సుశీల నయ్యర్. -
బాలును వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణంపై గాయని పీ సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారి వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదంటూ సంతాపం ప్రకటించారు. మనందరి ఆప్తుడిని తీసుకుపోయి పెద్ద అగాధంలోకి తోసేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఃఖ సముద్రంలోముంచేసిందంటూ సుశీల కంట తడిపెట్టారు. ఎస్పీ బాలు మరణం వ్యక్తిగతంగా తనకు చాలా దెబ్బ అని అన్నారు. గుండె ధైర్యం తెచ్చుకుని, విషాదం నుంచి కోలుకోవాలని, అభిమానులకు సూచించారు. ఈ మేరకు సుశీలమ్మ ఒక వీడియోను విడుదల చేశారు. (ఒక శకం ముగిసింది!) మరోవైపు నేడు (శనివారం) మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ప్రజలెవరూ రావొద్దని తిరువళ్లూరు ఎస్పీ అరవింద్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలు కుటుంబ సభ్యులు, ప్రముఖులు మినహా ఆయన మృతదేహాన్ని చూసేందుకు ఎవరికీ అనుమతి లేదన్నారు. అభిమానులు, నటులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫాంహౌజ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిసరాల్లో వాహనాలను కూడా అనుమతించేది లేదని ఎస్పీ అరవింద్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పట్నుంచి ఎక్మోతో పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. కానీ సెప్టెంబరు 24న ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. చివరకు శుక్రవారం ఉదయం తుది శ్వాస తీసుకున్న సంగతి తెలిసిందే. (బాలు స్వగ్రామంలో విషాదఛాయలు) ప్రఖ్యాత గాయనీమణి సుశీల తన సహచరుడు SPB మృతికి సంతాపం ప్రకటిస్తూ....! #RIPSPB pic.twitter.com/hRru8Q8Qwp — BARaju (@baraju_SuperHit) September 26, 2020 -
భార్య పొట్టిగా ఉందని అవమానంగా భావించి..
జీవితాంతం తోడుంటానని తాళి కట్టిన భర్తే చివరికి కడతేర్చాడు. మరదలిపై వ్యామోహంతోనేఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేసును తప్పుదోవపట్టించేందుకు జీవితంపైవిరక్తితో ఆత్మహత్యచేసుకుంటున్నానంటూ తనతోనే మరణ వాంగ్మూలం రాయించి.. ఆపై కర్కశంగా హత్య చేశాడు.తన భార్య కనిపించడం లేదనినాటకమాడాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కర్నూలు, ప్యాపిలి: భార్యను హత్య చేసిన కేసులో భర్తతో పాటు మరొక నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను సీఐ రామలింగమయ్య, రాచర్ల, ప్యాపిలి ఎస్ఐలు నగేశ్, మారుతీ శంకర్లు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలేబాదు తండాకు చెందిన రవి నాయక్‌కు బేతంచర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలా బాయితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. భార్య పొట్టిగా ఉండటంతో అవమానంగా భావించిన రవి నాయక్.. మరదలిపై(భార్య సోదరి) వ్యామోహం పెంచుకుని ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగేది. భార్య ఉండగా రెండో పెళ్లి సాధ్యం కాదని భావించిన రవి నాయక్ ఆమెను మట్టుపెట్టడానికి సమీప బంధువు రేఖా నాయక్ సాయం తీసుకున్నాడు. (సంతానం కలగడం లేదని భార్యను..) పథకం ప్రకారం రేఖా నాయక్ ద్వారా కట్టుకథ అల్లించి ‘జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ భార్యతోనే లేఖ రాయించాడు. ఈ లేఖను ఇంట్లో ఉంచి ఈ నెల 14 భార్యను తనతో పాటు జీవాలు మేపేందుకు అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే ఎంచుకున్న ప్రదేశంలో రేఖా నాయక్‌తో కలసి సుశీలాబాయిపై బండరాయితో మోది హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని లోయలోకి తోసి ఇంటికి వచ్చి తన భార్య కనిపించడం లేదని ‘ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ లేఖ రాసి ఉంచిందని బంధువులను నమ్మించాడు. సూసైడ్ నోట్లో మృతురాలి చేతిరాత, సంతకం అన్నీ తమ కుమార్తెవని ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించినప్పటికీ అల్లుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు పశువుల కాపర్లు కొండల్లోని మహిళ మృతదేహం ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ రామలింగమయ్య హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం నిందితులను అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. -
సాంకేతిక రహస్యం తెలిసిన శాస్త్రవేత్త
డాక్టర్ సోమరాజు సుశీల సైంటిస్ట్‌గా సాధించిన అపు రూపమైన అంశాలు చాలా మందికి తెలియదు. తొలి నాళ్లలో కాకినాడ, విజయ వాడలలో ఆమె విద్యా భ్యాసం సాగింది. చిన్నత నంలో విజయవాడ రేడి యోలో సుశీల ఆటలు, పాటలు సాగాయి. దాంతో చదువు సంస్కారం అబ్బాయి. పెద్దయ్యాక హైదరా బాదు ఉస్మానియా యూనివర్సిటీలో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారు. అది పాషాణం లాంటి చదువని తెలిసిన వారంటారు. ఉస్మానియా నించి తొలి డాక్టరేట్ సుశీల. కొద్దికాలం లెక్చరర్‌గా పని చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పెళ్లికొడుకుని వివా హమాడారు. గోదావరి కృష్ణ సంగమించాయి. ఇద్దరూ కలిసి ‘చల్ మోహన రంగా’ అంటూ పూనే నేషనల్ కెమికల్ లాబొరేటరీస్‌లో ఉద్యోగంలో చేరి పోయారు. కొన్నాళ్ల తర్వాత, ఎన్నాళ్లిలా నెల జీతా లమీద పని చేస్తాం, మనం తిని నలుగురికి పెడితే కదా బతుక్కి ఓ అర్థం– అనిపించింది ఆ జంటకి. పైగా ఏ మాత్రం జీవితం పట్ల భయంలేని వయస్సు. దానికి తోడు మనస్సు. తను పరిశోధన చేసి కొంత కృషి చేసిన సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అంశమైన ‘ధర్మిస్టర్స్’ తయారీ మీద పని చేద్దామనుకున్నారు. వాటి అవసరం చాలా ఉంది గానీ దేశంలో ఎక్కడా చేసే వసతి లేదు. ఇంపోర్ట్ చేసు కోవడం, ఎక్కువ ధరకి కొనడం మాత్రమే ఉంది. కొత్త కొత్త టెక్నా లజీలను రీసెర్చి ద్వారా తయారు చెయ్యడం, వాటిని కోరిన వారికి అమ్మ డం– ఆ రోజుల్లో నేషనల్ లాబ్స్ పని. డాక్టర్ సుశీల బాగా సర్వే చేసి, ధర్మిస్ట ర్స్‌కి మంచి గిరాకీ ఉందని వాటి ఫార్ములా తీసుకోవాలనుకుంది. తీరా డబ్బిచ్చి కొన్నాక ఆ సంస్థ కాగి తం మీద ఫార్ములా చెప్ప గలిగింది గానీ, ప్రత్యక్షంగా చేసి చూపించలేక పోయింది. అప్పుడే డాక్టర్ సుశీల ప్రఖ్యాత శాస్త్రవేత్త వై. నాయు డమ్మని కలిసింది. ఒక పెద్ద లాబొరేటరీస్ నిర్వాకం తెలిస్తే అప్రతిష్ట. అందుకని ఎక్కడా బయట పెట్టద్దు. ఇక్కడే మీకు కావల్సిన వసతులు ఇస్తాం. మీరే సాధించండి’ అని నాయు డమ్మ మనసారా దీవించారు. అప్పట్లో టెక్నాలజీకి ఈమె చెల్లించిన సొమ్ము ఎక్కువేమీ కాదు. పట్టు దలగా కార్యరంగంలోకి దిగారు. అంతకుముందు హేమాహేమీలవల్ల సాధ్యం కాని వ్యవహారం ఓ అర్ధరాత్రి ఎడిసన్ ఇంట కరెంటు దీపం వెలిగినట్టు, ధర్మిస్టర్ అన్ని గుణాలతో అవత రించింది. ‘లాబ్‌లో అందరికీ ఉత్కంఠగానూ, రహ స్యం కనిపెట్టాలని ఆశగానూ ఉండేది. అందుకని కిటికీ అద్దాలకు లోపల కాగితాలు అంటించి జాగ్రత్త పడేవాళ్లం’ అని చెప్పారు డాక్టర్ సుశీల. ఆమె కొన్ని శాంపిల్స్ కొంగున ముడి వేసుకుని ‘చల్ మోహన రంగా’ అంటూ రావుతో భాగ్య నగరం వచ్చేశారు. చిన్న సొంత పరిశ్రమని ‘భాగ్య ల్యాబ్స్’ పేరుతో ప్రారంభించారు డాక్టర్ సుశీల. మొట్టమొదటి పారి శ్రామికవేత్తగా ఆంధ్రలో జెండా పాతారు. ఇంతకీ ధర్మిస్టర్స్ అంటే– అవి చూడ్డానికి అగ్గిపుల్లల పరిమా ణంలో, పింగాళీ పుల్లల్లా ఉంటాయ్. వాటిని గ్యాస్ బెలూన్‌లో ఉంచి ప్రతి ఎయిర్పోర్ట్ నించి రోజూ మూడు పూటలా ఎగరవేస్తారు. అది ఎత్తుకువెళ్లి, అక్కడి టెంపరేచర్, తేమలాంటి అంశాలను రికార్డ్ చేసుకువస్తుంది. ఆ సమాచారాన్ని పైలట్స్‌కి అంది స్తారు. ఇవి కొన్ని విదేశాల్లో తయారవుతాయి. కానీ వాటిని తయారించే బట్టీలు పది పదిహేను కోట్లు ఖరీదు అవుతాయ్. డాక్టర్ సుశీల కేవలం క్యాండిల్ వెలు గులో చేసేవారు. దాదాపు నలభై ఏళ్లు పైబడి, ఒక్క భాగ్య లాబ్స్ మాత్రమే భారత ప్రభుత్వానికి సరఫరా చేసింది. ఆ పరమ రహస్యం తెలిసిన ఒకే ఒక శాస్త్రవేత్త అప్పటికీ ఇప్పటికీ డాక్టర్ సోమరాజు సుశీల మాత్రమే. ఆమె ఔననుకుంటే వాజ్‌పేయి హయాంలో భట్నాగర్ అవార్డో, పద్మశ్రీనో వచ్చేది. అనుకోలేదు. ఇది తెలుగుజాతికి, భారతావనికి గర్వం కాదా? ఆలస్యంగా రమారమి యాభై వయస్సులో కథకురాలై అద్భుతాలు సృష్టించారు. డా‘‘ సుశీల ఇల్లేరమ్మ కథలు ఆమెను చిరంజీవిని చేస్తాయి. చిన్న పరిశ్రమలు, ముగ్గురు కొలంబస్‌లు, ఇతర కథలు అన్నీ బెస్ట్ సెల్లర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. వాళ్లింట్లో, వాళ్ల ఫ్యాక్టరీలో వారే కథల్లో పాత్రలు. అందర్నీ చిరంజీవులుగా చేశారు. చెయ్యి తిరిగిన వంటగత్తె. తెలుగు, ఉత్తరాది వంటలు దివ్యంగా వండేవారు. కేవలం ఏడెనిమిది నిమిషాల్లో మైసూ ర్పాక్ కోపులు కోసేవారు. దానికి తగ్గట్టు మంచి అతిథేయురాలు. సంగీతంలో ప్రవేశం ఉంది. ఇంట్లో అత్తగారు, భర్త, పిల్లలు, కోడలు, అల్లుడు డా. సుశీల ఇష్టాయిష్టాలను అనుసరించి ప్రేమించారు. బోలెడు సత్కార్యాలు చేశారు. 55 పెళ్లిళ్లు ఆమె చేతుల మీదుగా చేసిన రికార్డు ఉంది. కొన్ని నెలల క్రితం ‘ప్రయాణం’ అంటూ ఒక వచన కవిత్వం రాశా రావిడ. రైల్లో మలిమజిలీ ముందు సామాను సద్దు కోవడంతో జీవితాన్ని పోల్చారు. ఆ రచనతో గొప్ప కవిగా నిలిచారు. తెలుగువారి ఆణిముత్యం, దేశాభి మాని డాక్టర్ సోమరాజు సుశీలకి అక్షర నివాళి. (మొన్న 26న డాక్టర్ సుశీల కన్నుమూశారు) వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
టీచర్ చేతి స్టిక్ ప్లేయర్‌ని చేసింది
తల్లికి ఊహ తెలియక ముందే ఆమె మాతమ్మ (దేవదాసీ) అయింది. తనకు ఊహ తెలిసే వయసుకు నాన్నెవరో తెలియదు. ఫలానా వ్యక్తి మీ నాన్న అని కుమార్తెకు చెప్పే పరిస్థితి ఆ అమ్మకు లేదు. ఈ సమాజంలో తనేమిటో, తన కుటుంబం ఏమిటో కూడా ఎరుగదు. అమ్మలోనే అమ్మానాన్నను చూసుకుంది. ఆరో తరగతిలో ఉండగా టీచర్ చేతిలో ఓ ‘కర్ర’ను చూసి అదేమిటని అడిగింది. ‘‘హాకీ స్టిక్ అమ్మా!’’ అని టీచర్ చెప్పింది. ‘‘నేనూ ఆ స్టిక్‌తో ఆడతాను’’ ముందుకొచ్చింది. ఆ టీచర్ సరేనంది. అలా పదేళ్ల వ్యవధిలోనే ఆ మాతమ్మ కూతురు జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి జాతీయ స్థాయి హాకీ ప్లేయర్ అయింది! చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన దేవదాసీ కొండా రేణుక కుమార్తె పద్దెనిమిదేళ్ల సుశీల అసామాన్య విజయగాథ ఇది. అన్ని అవకాశాలూ ఉన్నా క్రీడల్లో రాణించలేని వారెందరో ఉన్నారు. ఏ ఆసరా లేని సుశీల.. తన తల్లి కళ్లలో ఆనందాన్ని నింపాలన్న ఏకైక లక్ష్యంతో హాకీలో జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి అమ్మ చెప్పినట్టు ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమాగా చెబుతోంది. తోటి జోగినీ, దేవదాసీ, మాతమ్మల కుటుంబాల్లో స్ఫూర్తి నింపుతోంది. చంద్రయానం చేస్తున్న ఈ రోజుల్లోనూ దేవదాసీ దురాచారం ఇకపై కొనసాగడానికి వీల్లేదని సుశీల అంటోంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై ఇటీవల విజయవాడలో నిర్వహించిన సదస్సుకు మాతమ్మ రేణుక వెంట వచ్చిన కుమార్తె సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. అమ్మ జీతం ఆరువేలు ‘‘నాకు అన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న ఎవరో? ఎలా ఉంటారో తెలియదు. నాన్నెవరమ్మా? అని అడిగితే అమ్మ మౌనం దాల్చేది. కొన్నాళ్లకు తెలిసింది.. అమ్మ ‘మాతంగి’ అని.. మాకు నాన్న ఉండరని. అమ్మ రుయా ఆస్పత్రిలో కాంట్రాక్టు స్వీపర్. అమ్మకు వచ్చే నెల జీతం ఆరు వేలూ కుటుంబ పోషణకు చాలక పాచి పనులు కూడా చేసి ఇల్లు నడుపుతోంది. మేమూ నీకు సాయపడతామంటే.. ‘వద్దు.. మీరు బాగా చదువుకుని ప్రయోజకులవ్వండి. నాకంతే చాలు’ అంటుంది. మమ్మల్ని చదివించడానికే తను కష్టపడుతోంది. చిన్నప్పట్నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. రన్నింగ్, జూడో, త్రోబాల్, వాలీబాల్, రెజ్లింగ్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ వంటి క్రీడల్లో నాకు మంచి పేరొచ్చింది. నేను ఆరో తరగతిలో ఉండగా మా పీఈటీ ప్రసన్న మేడం చేతిలో ఉన్న కర్రను చూసి అదేమిటి టీచర్? అని అడిగా. దీన్ని హాకీ స్టిక్ అంటారని చెప్పారామె. ఈ ఆట ఆడాలని ఉంది టీచర్.. అని చెప్పడంతో ఆమె నన్ను ప్రోత్సహించారు. మిగిలిన ఆటలకంటే హాకీపై ఆసక్తి పెంచుకున్నాను. ఎనిమిదో తరగతిలో మదనపల్లెలో జరిగిన జిల్లా స్థాయి హాకీ టోర్నమెంట్లో ప్రతిభ చూపడంతో (అండర్–17) నేషనల్స్‌కు ఎంపికయ్యాను. ఇలా ఇప్పటిదాకా 23 జిల్లా స్థాయి, 5 రాష్ట్రస్థాయి, అండర్ – 17, అండర్ 19 కేటగిరీల్లో జూనియర్, సీనియర్స్ విభాగాల్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 5 జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడాను. దాతల సాయంతోనే..! అమ్మ సంపాదన కుటుంబ పోషణకే సరిపోదు. మరి నాకు హాకీ టోర్నమెంట్లకయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? ఒకసారి నేషనల్స్‌కు వెళ్లాలంటే కనీసం రూ.5–6 వేలయినా ఖర్చవుతుంది. మా కుటుంబ పరిస్థితిని చూసి మా కోచ్ లక్ష్మీ కరుణ, ప్రసన్న టీచర్, రమణ సార్ వంటి వారితో పాటు మా గ్రామస్తులు ఆర్థికంగా చేయూత నిస్తున్నారు. దాంతోనే నేషనల్స్‌కు వెళ్తున్నాను. పట్టుదలతో విజయం సాధించుకుని వస్తున్నాను. హాకీలో నేను రాణించడం వెనక అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. ఆటలో చిన్న చిన్న దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ముందుకుకెళ్లమ్మా! అని ప్రోత్సహిస్తుంది. హాకీలో బాగా రాణించి ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నాకు అమ్మా, నాన్నా అమ్మే. అన్న దినేష్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. తమ్ముడు వెంకటేష్ కబడ్డీ (జిల్లా స్థాయి)లో ప్లేయర్. చెల్లి భూమిక కూడా హాకీ (రాష్ట్ర స్థాయి)తో పాటు ఇతర క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇలా అమ్మ నాతో పాటు మిగిలిన పిల్లలనూ ఆటల్లోను, చదువులోనూ పేరు తెచ్చుకోవాలి చెబుతుంటుంది. అమ్మ సపోర్టు మాపై చాలా ప్రభావం చూపుతోంది. చంద్రయాన్‌కు చేరుకుంటున్న ఈ రోజుల్లో దేవదాసీ వ్యవస్థను ఇంకా కొనసాగించడం తగదు. మా దుస్థితి పిల్లలకు రాకూడదు నాకు ఊహ తెలియకముందే నన్ను మాతమ్మ (దేవదాసీ)ను చేసేశారు. పన్నెండేళ్ల వయసొచ్చే సరికి నన్ను మాతమ్మను చేసినట్టు తెలిసింది. నలుగురు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నా. పెద్ద కూతురు సుశీల హాకీలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు గర్వంగా ఉంది. రెండో కూతురూ హాకీతో పాటు ఇంకొన్ని ఆటలు ఆడుతోంది. చిన్నోడు కబడ్డీ బాగా ఆడతాడు. నా బతుకు ఎలా ఉన్నా మా పిల్లలకు నాలాంటి దుస్థితి రాకూడదు. ఈ దుర్వ్యవస్థ ఇకపై కొనసాగకూడదు.– కొండా రేణుక (మాతమ్మ) ఇల్లు ఉంటే బాగుంటుంది నెలకు రూ.400 చెల్లించి మా ఊళ్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు నారావారిపల్లె వచ్చినప్పుడు వెళ్లి కలిశాను. సొంత ఇల్లు మంజూరు చేయమని, హాకీ మెటీరియల్ ఇప్పించమని కోరాను. మరోసారి వచ్చి కలవాలని చెప్పి పంపేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వాల నుంచి నాకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. ఏ సపోర్టు లేదు. కొత్త సీఎం జగనన్న మనసున్న వాడని అంటున్నారు. ఆయన ఆదుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చేతులు జోడించింది సుశీల.– బొల్లం కోటేశ్వరరావు,సాక్షి, అమరావతి బ్యూరో -
మహిళ ఆత్మహత్య
ముషీరాబాద్: ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుట్టపర్తికి చెందిన బ్రహ్మాచారి, సుశీల(26) దంపతులు బతుకుదెరువు నిమిత్తం నాలుగేళ్ల నగరానికి వచ్చారు. గాంధీనగర్‌లోని పురుషోత్తం ఆపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అదే ఆపార్ట్‌మెంట్‌లోని 203 ప్లాట్‌లో ఉంటున్న ఆస్లాం కుటుంబం విజయవాడకు వెళుతూ తాళం చెవులు వారికి అప్పగించి వెళ్లారు. గురువారం సాయంత్రం సదరు ఫ్లాట్‌లోకి వెళ్లిన సుశీల ఫ్యాన్ హుక్కుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చోరీ కేసులో సుశీల అరెస్ట్
సంతోష్‌నగర్: ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి ఆమె నుంచి రూ.4,81,320 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంపాపేట్ డి–మార్ట్ ప్రాంతానికి చెందిన బుచ్చిరెడ్డి ఇంట్లో మహంకాళి తోట ప్రాంతానికి చెందిన సుశీల పని చేసేది. బుచ్చిరెడ్డి పాఠశాలలో వసూలైన ఫీజుల మొత్తాన్ని ఇంట్లోని అల్మారాలో దాస్తుండగా గుర్తించిన సుశీల దానిని కొట్టేయాలని పథకం పన్నింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మొత్తాన్ని తస్కరించింది. రెండు రోజుల అనంతరం స్కూల్లో ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు బుచ్చిరెడ్డి తన ఇంట్లోని అల్మారా తెరిచి చూడగా డబ్బులు కనిపించకపోవడంతో పని మనిషి సుశీలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
ఎయిరోపోనిక్స్తో అధిక దిగుబడి
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తున్న హైటెక్ సేద్య పద్ధతుల్లో ఎయిరోపోనిక్స్ ఒకటి. ఈ పద్ధతిలో ఫొటోలో చూపిన విధంగా పాలీహౌసుల్లో మొక్కల వేర్లు గాలిలోనే తేలియాడుతూ ఉంటాయి. ఈ వేర్లకు పోషక జలాన్ని మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా ఆటోమేటిక్ పద్ధతుల్లో నిర్ణీత సమయాల్లో తుంపరల రూపంలో పిచికారీ చేస్తుంటారు. త్రిస్సూర్‌లోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ సుశీల ఈ పద్ధతిపై శిక్షణ ఇస్తున్నారు. కాలుష్య రహిత సాగు పద్ధతి. అధిక నాణ్యతతో కూడిన ఆకుకూరలను ఏడాది పొడవునా అందించే ఈ పద్ధతిలో ఆరుబయట పొలాల్లో కన్నా సగం కన్నా తక్కువ కాలంలోనే పంట చేతికొస్తుంది. 5–10 రెట్ల అధిక దిగుబడిని, అదే స్థాయిలో రాబడిని పొందవచ్చని, కూలీల అవసరం తక్కువేనని డా. సుశీల ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. వివరాలకు.. డా. సుశీల (త్రిస్సూర్, కేరళ) – 99615 33547 -
హైటెక్ సేద్యానికి చిరునామా!
పట్టణాలు, నగరాలలో నివసించే ప్రజలకు రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను పుష్కలంగా అందుబాటులోకి తేవడానికి అత్యాధునిక పద్ధతుల్లో ఇంటిపంటలను సాగు చేసుకునే పద్ధతులను పట్టణ, నగర ప్రాంతవాసులకు నేర్పించడం తప్ప మరో మేలైన మార్గం లేదు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయి. హైటెక్ పద్ధతుల్లో తక్కువ స్థలంలో ఇంటిపంటల సాగుపై పరిశోధనల కోసం కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్రిస్సూర్‌లో ఐదేళ్ల క్రితమే ప్రత్యేక పరిశోధన, శిక్షణ స్థానాన్నే ఏర్పాటు చేయటం విశేషం. డాక్టర్ పి. సుశీల ఈ కేంద్రానికి అధిపతిగా, ప్రొఫెసర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఇటీవల డాక్టర్ పి. సుశీలను హైదరాబాద్‌కు ఆహ్వానించి ఉద్యాన అధికారులకు, ఇంటిపంటల సాగుదారులకు శిక్షణ ఇప్పించింది. డా. సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది. కొన్ని ముఖ్యాంశాలు.. ► తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకునేందుకు వీలుకల్పించే పాలీకిచెన్ గార్డెన్, చిన్న పాలీహౌస్‌లలో ఇంటిపంటల సాగు, ఓపెన్ ప్రెసిషన్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, హైటెక్ కిచెన్ గార్డెన్ టెక్నిక్స్, వర్టికల్ గార్డెనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, టైరు గార్డెన్స్, లాండ్ స్కేపింగ్ తదితర అంశాలపై డా. సుశీల పరిశోధనలు చేస్తూ వ్యక్తులకు, సంస్థలకు శిక్షణ ఇస్తున్నారు. ► అభ్యర్థుల ఆసక్తి, అవసరాలను బట్టి ఒక రోజు నుంచి నెల, ఆర్నెల్లు, ఏడాది వరకు కాలపరిమితి గల శిక్షణా శిబిరాలను డా. సుశీల నిర్వహిస్తున్నారు. ఈ ఐదేళ్లలో 200 శిక్షణా శిబిరాలను నిర్వహించడం అభినందనీయం. ఆమె ఇప్పటికి 35 పుస్తకాలు, 80 పరిశోధనా పత్రాలు, 500 పాపులర్ వ్యాసాలు రాశారు. 36 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ► ఈ కేంద్రంలో రూపొందించిన పాలీ కిచెన్ గార్డెన్ ప్రజాదరణ పొందుతున్నదని డా. సుశీల చెప్పారు. 10 చదరపు అడుగుల నుంచి 30 చదరపు అడుగుల చోటులోనే 160 నుంచి 350 మొక్కలు సాగు చేసుకోవడానికి పాలీకిచెన్ గార్డెన్లో వీలుంటుంది. 10 – 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెరట్లో లేదా టెర్రస్ మీద ఓపెన్‌గా లేదా చిన్న సైజు పాలీహౌస్ నిర్మించుకొని ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడానికి పాలీ కిచెన్ గార్డెన్ ఉపయోగపడుతుంది. ► పాలీ కిచెన్ గార్డెన్లో ఫైబర్ డ్రమ్ములకు చుట్టూ మొక్కలు పెంచుకోవటం ఒకటైతే.. ప్లాస్టిక్ గ్రోబ్యాగ్‌ను కూడా డ్రమ్ము మాదిరిగానే మల్టీ టైర్ గ్రోబ్యాగ్గా ఉపయోగించుకునే పద్ధతి మరొకటి. డ్రమ్ము వాడుతున్నప్పుడు వంటింటి వ్యర్థాలను మధ్యలోని పైపులో వేస్తూ ఉంటే.. వర్మీ కంపోస్టుతోపాటు ద్రవ రూప ఎరువు అయిన వర్మీ వాష్‌ను కూడా పొందే వీలుంటుంది. 20 చదరపు అడుగుల పాలీ కిచెన్ గార్డెన్లో నిలువెత్తు మల్టీ టైర్ గ్రోబ్యాగ్స్ రెండిటిని ఏర్పాటు చేసుకుంటే.. వాటి చుట్టూ 250–260 రకాల మొక్కలను కూరగాయ, ఆకుకూర మొక్కలను సాగు చేసుకోవచ్చు. నిలువెత్తు మల్టీ టైర్ గ్రోబ్యాగ్ మధ్యలో పీవీసీ పైపులో కంపోస్టు సదుపాయం ఏర్పాటు చేసుకుంటే, కంపోస్టు తయారు చేసుకుంటూనే దాంట్లో 35–52 మొక్కలు పెంచుకోవచ్చు. ► మల్టీ టైర్ గ్రోబ్యాగ్ / డ్రమ్ముల్లో తోటకూర, పాలకూర, లెట్యూస్, క్యాబేజి, కాళీఫ్లవర్, టమాటో, మిరప, క్యారట్, బీట్రూట్, వంగ వంటి పంటలు పండించుకోవచ్చు. ఇంటిపంటలతోపాటు మైక్రో గ్రీన్స్‌ను కూడా పెంచుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. జానెడు లోతు, వెడల్పుగా ఉండే చిన్న ట్రేలలో వీటిని పెంచుకోవచ్చు. ఈ ట్రేలను ఒక దాని కింద మరొకటి తాళ్లతో వేలాడదీస్తే.. అందులో మైక్రోగ్రీన్స్‌ను వత్తుగా నారు మాదిరిగా, గోధుమ గడ్డి మాదిరిగా పెంచుకోవచ్చు. రెండు వారాల్లో మూడు, నాలుగు అంగుళాలు పెరిగిన తర్వాత కత్తిరించి సలాడ్లలో వాడుకోవచ్చు. ► వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం రాష్ట్రమంతటా 75% సబ్సిడీపై పట్టణ ప్రాంత ప్రజలకు, రైతులకు కూడా అందిస్తున్నది. పాలీ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవటం, నిర్వహించడంపై 3 రోజుల శిక్షణా శిబిరాన్ని డాక్టర్ సుశీల నిర్వహిస్తుంటారు. ఆగ్రో సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు, స్వచ్ఛంద సంస్థలకు పది రోజులు శిక్షణ ఇస్తుంటారు. ► మట్టి లేకుండా వట్టి కొబ్బరి పొట్టుతో సాగు (సబ్‌స్ట్రేట్ కల్టివేషన్)పై ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. మట్టి లేకుండా.. నీటిలో పోషకాల ద్రవాన్ని కలుపుతూ మొక్కల వేర్లకు అందించడం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు పండించడంపై శిక్షణ ఇస్తారు. దీన్నే హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటారు. ఇందులో మూడు రకాలు. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, డీప్ వాటర్ కల్టివేషన్, డచ్ బక్కెట్ సిస్టం.. అనే 3 పద్ధతుల్లో హైడ్రోపోనిక్స్ సాగు చేపట్టడంపై డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. ► మొక్కలతోపాటు చేపలను కూడా కలిపి పెంచుకోవడమే ఆక్వాపోనిక్స్. ఇందులో మీడియా బెడ్ సిస్టం, డీప్ వాటర్ కల్చర్, న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్‌పై శిక్షణ ఇస్తారు. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో ట్రేలలో పశువుల మేత పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. విక్ ఇరిగేషన్, ఏరోపోనిక్స్, ఫాగోపోనిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తదితర పద్ధతులపై కూడా శిక్షణ ఇస్తారు. ► ఈ అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో తక్కువ చోటులో, తక్కువ శ్రమతో, తక్కువ నీటితో ఎక్కువ పరిమాణంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆరోగ్యదాయకంగా పండించుకునేందుకు ఉపయోగపడతాయి. ఇంటిపంటల సాగుదారులకు, అదేవిధంగా రైతులకు కూడా ఈ పద్ధతులు అనుకూలంగా ఉంటాయని డా. సుశీల తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికతలపై శిక్షణ పొందే ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిన చిరునామా.. డాక్టర్ పి. సుశీల, ప్రొఫెసర్ అండ్ ప్రాజెక్టు ఇన్చార్జ్, హైటెక్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ యూనిట్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కె.ఎ.యు. పోస్ట్, వెల్లనిక్కర, త్రిస్సూర్, కేరళ. మొబైల్ – 99615 33547, suseela1963palazhy@gmail.com మల్టీ టైర్ గ్రోబ్యాగ్‌లలో పాలకూర కనువిందు; వర్టికల్ ఫార్మింగ్‌లో సాగవుతున్న ఆకుకూరలు -
మరోసారి రచ్చకెక్కిన దాసరి ఆస్తి వివాదం
-
ప్రధాని మోదీ భార్య కోసం దీక్ష.. భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోదా బెన్ కోసం.. వైద్యురాలు పాలెపు సుశీల చేస్తోన్న దీక్షను మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. మోదీ.. యశోదాను భార్యగా అంగీకరించి గౌరవించాలని, లేకుంటే, జెడ్ కేటగిరి భద్రత తొలగించి ఆమెకు స్వేచ్చ ప్రసాదించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తోన్న సుశీలను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా నీరసించినపోయిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేప్రయత్నం చేశారు. అయితే తాను మాత్రం డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా దీక్ష విరమించబోనని సుశీల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎవరీ డాక్టర్ సుశీల? : అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలిగా ఉన్న డాక్టర్ పాలెపు సుశీల.. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్నారు. హైందవ జీవన విధానంలో మహిళ పూజ్యనీయురాలని, స్త్రీల గౌరవాన్ని, స్వేచ్ఛను కాపాడటం కోసమే తాను దీక్షకు దిగినట్లు సుశీల పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సుశీల.. ఎప్పటికప్పుడు దీక్ష వివరాలను పోస్ట్‌చేశారు. ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు : దీక్ష భగ్నం అనంతరం ప్రధానిని ఉద్దేశించి డాక్టర్ సుశీల ఘాటు వ్యాఖ్యలు చేశారు. యశోదా బెన్ భారతనారి అని, మోదీ బ్రిటిష్ అధికారి అని, ఇద్దరిలో తాను భారతనారివైపే ఉంటానని చెప్పుకొచ్చారు. కాగా, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉన్నందునే యశోదా బెన్‌కు భద్రత కల్పిస్తున్నారని, ఈ విషయంలో దీక్షలు అవసరం లేదని నెటిజన్లు సుశీలకు సలహాలిస్తున్నారు. బాల్యంలోనే యశోదను పెళ్లాడిన నరేంద్ర మోదీ.. అనంతరకాలంలో ఆమెకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్లోనూ భార్య గురించిన వివరాలేవీ ఆయన పొందపర్చలేదు. దీనిపై విపక్షాలు ఆందోళన చేయడంతో మోదీ వైవాహిక బంధంపై బీజేపీ నాయకులు కొన్ని ప్రకటనలు చేసిన విషయం విదితమే. డాక్టర్ సుశీల(ఫేస్బుక్ నుంచి తీసుకున్న ఫొటో) -
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి:సుశీల
-
నా భర్త ఎక్కడున్నారో చెప్పండి: కోదండరామ్ భార్య
హైదరాబాద్: తన భర్త, జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ కోదండరామ్‌ను తెల్లవారు జామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన భార్య సుశీల ప్రశ్నించారు. తన భర్త ఆచూకీ తెలపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్నారు.. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చింది కూడా సంఘ విద్రోహ శక్తులేనా’ అని ఆమె నిలదీశారు. నిరుద్యోగ ర్యాలీ నేపథ్యంలో కోదండరామ్‌ను ముందస్తు అరెస్టు చేసిన సందర్భంగా సుశీల మంగళవారం పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి వివరాలు అడిగారు. ఉదయం 6గంటలకు బయటకు వస్తానని చెప్పినా తెల్లవారు జామున 3.30గంటల ప్రాంతంలో తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు, దోపిడీ దారులు తమ వద్ద ఉన్నట్లు పోలీసులు ప్రవర్తించారని దిగులుచెందారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ ఖాళీలపై నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందేనని కోదండరామ్ భార్య సుశీల డిమాండ్ చేశారు. జేఏసీ తరుపున కోర్టులో వాదనలు చేసిన అడ్వకేట్ రచనా రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయం ఆరుగంటలకు బయటకు వస్తానని, కావాలంటే అప్పుడు అరెస్టు చేసుకోండని కోదండరామ్ చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తెల్లవారు జామున తలుపులు పగులగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? మూడుగంటల నుంచి ఇప్పటి వరకు ఆయనను ఎక్కడ ఉంచారో ఎవరికీ తెలియదు. ఆయనను వెంటనే విడుదల చేయాలి. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మరోపక్క, సీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన అనంతరం సుశీల గవర్నర్ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. సంబంధిత వార్తలకై చదవండి.. సీపీని కలిసిన కోదండరామ్ సతీమణి కోదండరాం అరెస్ట్ అప్రజాస్వామికం : ఉత్తమ్ కోదండరాం అరెస్ట్‌పై జేఏసీ నేతల ఆగ్రహం (రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్ ) -
అమ్మే గ్రాండ్‌మాస్టర్...
మా అమ్మ విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో ఇండియాకి మొదటి గ్రాండ్‌మాస్టర్. రాజీవ్ ఖేల్త్న్ర పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు. చదరంగాన్ని భారతీయులు మర్చిపోకుండా గుర్తు చేసి, పతాకస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆనంద్. ఆందుకే జాతి ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. తాను ప్రపంచస్థాయి క్రీడాకారుడిగా ఎదగడంలో తల్లి సుశీల పాత్రను అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు ఆనంద్. ‘‘మా అమ్మ నాకు మాత్రమే రోల్‌మోడల్ కాదు. అమ్మదనానికే రోల్‌మోడల్. ఆమె పిల్లలకు ఒక సంగతిని చాలా నైపుణ్యంగా చెప్పేది. పిల్లల్లోని నైపుణ్యాన్ని త్వరగా గ్రహించేది. నేను అమ్మకూచిని. ఆమె వెంటే తిరిగేవాడిని. అమ్మకు చెస్ ఆడడం హాబీ. నాతో ఆడుకునేది. ఎవరైనా ‘‘ఆనంద్‌కు ఆట నేర్పిస్తున్నావా’’ అంటే... ‘‘నేను చెస్ ఆడుకోవడానికి మంచి ప్రత్యర్థిని తయారు చేసుకుంటున్నా’’ అని నవ్వేది. నాతో చెస్ ఆడేది. చెస్ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పేది కాదు. ఆటలో భాగంగానే పావులు ఎలా కదపాలో చెప్పేది. ఒక ఎత్తు ఎందుకు వేయాలో చెప్తూ, ఆ ఎత్తు ఎప్పుడు వేయాలో చెప్పేది. తన దగ్గర పావులలో ఎన్ని రకాల ఎత్తులకు అవకాశం ఉందో వివరిస్తూ... తాను అప్పుడు ఏ స్టెప్ తీసుకోనుందో చెప్పేది. చెప్పాక తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నదో నన్ను ఊహించి చెప్పమనేది. అలా మా మధ్య బ్రెయిన్గేమ్ సాగేది. అలా పలక- బలపం కంటే ముందు చదరంగం పావులు కదిపాను. ఐదేళ్ల వయసులో మొదలైన నా చెస్ ప్రయాణంలో ప్రతి ఎత్తులోనూ అమ్మ ఉంది. ప్రముఖ క్రీడాకారులతో వేసిన అనేక ఎత్తులను అమ్మ దగ్గర వేసిన అనుభవం నాది. అమ్మ మంచి కోచ్! అమ్మ ఎంత మంచి కోచ్ అంటే... ప్రాక్టీస్‌తో బుర్ర వేడెక్కే పరిస్థితి ఎప్పుడూ రానిచ్చేది కాదు. ఎత్తు వేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నా, ఎక్కువ మథనం చేసినా ఇట్టే పట్టేసేది. ‘‘నువ్వు అలసిపోయావు’’ అని చెప్పకుండా ‘‘నాకు పనుంది నువ్వు కొంచెం సేపు బయట ఆడుకో’’ అని పంపించేసేది. క్రీడాకారుడిగా... నాలో చెస్ అనే బీజాన్ని వేసింది అమ్మేనంటే... చదరంగం బీజాలు మన జీన్స్‌లో ఉన్నాయనేదామె. తన పుట్టింటి వారసత్వాన్ని నా ద్వారా కొనసాగిస్తున్నానని చెప్పేది. అమ్మ వాళ్లింట్లో అందరూ కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుంటూ చెస్ బోర్డు తీస్తారు. నేను క్రీడాకారుడిగా పొరుగూళ్లకు వెళ్లాల్సినప్పుడు అమ్మ వెంట లేకుండా వెళ్లేవాడిని కాదు. మరీ చిన్నతనం కావడం, అమ్మను వదిలి ఉండడం తెలియకపోవడంతో అలా అలవాటైంది. నా కోసం అమ్మ రాజీ! మాది అత్యంత సంపన్న కుటుంబం కాదు. కానీ నాన్న రైల్వేలో ఉన్నతాధికారి. అమ్మ పుట్టింట్లో ఎక్కువ మంది లాయర్లు. అలా అమ్మ జీవితం సౌకర్యవంతంగా ఉండేది. అలాంటిది 1983లో అహ్మదాబాద్‌లో నేషనల్స్‌కి వెళ్లినప్పుడు మాకిచ్చిన బస చాలా అసౌకర్యంగా ఉంది. నాకప్పుడు పదమూడేళ్లు. ఆర్గనైజర్లని అడగగలిగిన వయసు కాదు. కానీ అమ్మ కూడా అడగలేదు. ఆ గదిలోనే సర్దుకుపోయింది. ఎందుకలా అని తర్వాత నేనడిగితే... ‘ఎవరితోనైనా గొడవపడినా, గొడవను చూసినా ఆ ప్రభావం మెదడు మీద చాలా గంటలసేపు అలాగే ఉంటుంది. మెదడు అలజడికి లోనయితే రేపు ఆట ఆడేటప్పుడు సరిగ్గా ఎత్తు వేయలేవు’ అన్నది. నా కెరియర్ కోసం ఆమె సౌకర్యాలను త్యాగం చేసింది, డిమాండ్ చేయగలిగిన స్థితిలో ఉండి కూడా నా చిన్న బుర్ర గందరగోళానికిలోనుకాకూడదని హుందాగా వ్యవహరించింది. అమ్మలో నేను చూసిన విజ్ఞత, పరిణతి అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా అమ్మ చాలా గ్రేట్ అనిపిస్తుంది. నా కోసం ఎయిర్‌పోర్టుకి! నేను గ్రాండ్ మాస్టర్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లు గెలిచినప్పుడు బిడ్డ ఉన్నతికి సంతోషించే అందరు అమ్మల్లాగానే మా అమ్మ కూడా సంతోషపడింది. అయితే నేను గాటాకామ్స్కీతో ఓడిపోనప్పుడు అమ్మ నాతో లేదు. ఓటమికి ఎక్కడ కుంగిపోతానేమోనని బెంగపడింది. నేను చెన్నైలో దిగేటప్పటికి ఎయిర్‌పోర్టులో నా కోసం ఎదురు చూస్తోంది. అలా కొంతకాలానికి అమ్మ జీవితం నా చదరంగమే అయింది. ఎప్పుడూ టోర్నమెంట్ల షెడ్యూళ్లు తెలుసుకోవడం, క్యాలెండర్ తయారు చేసుకోవడంలోనే కనిపించేది. అప్పట్లో ఫోన్ సౌకర్యం ఇప్పుడున్నంతగా లేదు. ఎక్కడికి ఫోన్ చేయాలన్నా ట్రంక్‌కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. ఆ కాల్ కట్ కావడం, మళ్లీ చేయడంలో చాలా డబ్బు ఖర్చయ్యేది. అప్పుడప్పుడూ ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆనంద్ ట్రంక్‌కాల్స్ కోసం ఖర్చు చేసిన డబ్బుతో సగం ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఉండవచ్చు అంటుండేది. టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్! నా సహ చెస్ క్రీడాకారులు అమ్మను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించినప్పుడు నాకు అమ్మలో అనేక కోణాలు తెలిశాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ మాన్యుయెల్ ఆరోన్ మాట్లాడుతూ ‘ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్’ అన్నాడు. కొడుకుగా నేను చూసిన అమ్మకంటే మా అమ్మ చాలా ఎక్కువ అని అప్పుడు అనిపించింది. గర్వంతో నా గుండె పొంగిపోయింది. పైగా ఆ ప్రశంసలను విన్నది అమ్మను కోల్పోయిన క్షణాల్లో కావడంతో ఉద్వేగం కన్నీళ్లుగా ఉబికింది. పేరుకు తగినట్లుగా ఆనందంగా ఉండాలని నాకు చెప్పేది. తాను కూడా పేరుకు తగ్గట్టే అత్యంత సౌశీల్యమైన వ్యక్తిత్వంతో రాణించింది. కూర్పు: వాకా మంజులారెడ్డి -
వైఫ్టైమ్ అచీవ్మెంట్
ఫస్ట్ పర్సన్ ఉద్యమాల వెనకాల ఉద్యమం ఉంటుంది. ఈ కోదండరాముడి వెనక సుశీల ఉంది. శ్రీరాముడు సీతమ్మ కోసం ఒక ఉద్యమమే నడిపాడు. ఈ సుశీలమ్మ ఉద్యమానికి తన భర్తనే ఇచ్చేసింది. ఆయనకు ‘టి’ ఉద్యమంతో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ దొరికింది. ఈమెకి ‘టీ’ టైమ్‌లో వైఫ్ టైమ్ అచీవ్మెంట్ దక్కింది. ఈ ఉద్యమ నీడను మీ కోసం వెలుగులోకి తెచ్చాం! ఆమె అతని కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇంటికి వస్తే పలకరిద్దామని, కాసేపు కబుర్లు చెబుదామని, కనీసం కలిసి టీ తాగుదామని. కాని ఆ నిరీక్షణ ముగిసేది కాదు. ప్రజలతో తిరిగే మనిషికి కుటుంబం దాదాపు అప్రధానమౌతుంది. అతని ఉద్యమంలో ఆ కుటుంబం కూడా భాగమైపోతుంది. ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస సైనికుడు. కానీ ఆయనను వెనక ఉండి నడిపించేది మాత్రం ఆయన సహచరి సుశీల. కోదండరాం తెలంగాణ ఉద్యమ సారథి కావచ్చు. కాని ఆయన జీవిత సారథి మాత్రం సుశీలే. ఆమెతో సంభాషణ... మీ జీవితంలోకి ఈ ఉద్యమకారుడెలా వచ్చారు? అనుకోకుండా. బంధువుల పెళ్ళిలో నన్ను చూసి, నచ్చానని, ఇష్టమైతే పెళ్ళి చేసుకుంటానని కబురు పంపారు. కాలేజీ లెక్చరర్ కదా జీవితం హాయిగా ఉంటుందనుకున్నాను. పెళ్ళి కుదిరింది. కానీ సంతకాల పెళ్ళి చేసుకుందామనేసరికి షాక్ అయ్యాను. ఆ రోజుల్లో అదో పెద్ద వింత. మా ఊరు ఊరంతా... ఆఖరికి పెళ్ళికి పిలవని వాళ్ళు సైతం ఈ సంతకాల పెళ్ళి ఎలా జరుగుతుందో చూడాలని నిజామాబాద్ వచ్చారు. అలా మా పెళ్లిరోజున (1983 మార్చి 30) ఈయన ఇచ్చిన షాక్ ఆ తర్వాత జీవితమంతా కొనసాగుతూనే ఉంది. పెళ్లయ్యాక ఈయన ధోరణి ఎలా ఉండేది? హైదరాబాద్‌లోని నల్లకుంటలో ఓ చిన్న ఇంట్లో కాపురం ఉండేవాళ్లం. అప్పుడాయన పౌరహక్కుల సంఘంలో పని చేసేవారు. బాలగోపాల్ గారితో ఎక్కడెక్కడికో వెళ్ళేవారు. ఈ హక్కులేమిటో, ఇంటి నిండా పోస్టర్లేమిటో, పాంప్లేట్స్ ఏమిటో అర్థమయ్యేది కాదు. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. ఆయన కాలేజీ లెక్చరర్. ఇద్దరం కలిసి ఒకేసారి కాలేజీకి బయలుదేరేవాళ్లం. నేను క్లాసు వినడానికి. ఆయన క్లాసు చెప్పడానికి. సాయంత్రం నేను ఇల్లు చేరినా ఆయన ఎప్పుడో అర్ధరాత్రికి కానీ రాకపోవడం చాలా బాధగా అనిపించేది. ఎదురుచూసి చూసి అలసిపోయేదాన్ని. ఆ తరువాత నాతో పాటు మా పిల్లలు కూడా వాళ్ళ నాన్న కోసం ఎదురుచూడటానికి అలవాటు పడిపోయారు. ఇంటి బాధ్యతల్లో కోదండరాం గారి పాలెంత? ఆయనకు ఇంటి విషయాలు పట్టించుకునే తీరికుండేది కాదు. కానీ పిల్లలన్నా, తోటపని అన్నా అమితమైన ఇష్టం. ఆయన పిల్లల్తో ఓ పది నిముషాలు గడిపితే ఇక ఆ రోజుకు నాన్న మమ్మల్ని విడిచి ఎక్కడికీ వెళ్ళరనుకునేంత భరోసా ఇచ్చేవారు. కానీ మరో పదినిముషాల్లో వాళ్ళని మాయచేసి ఇప్పుడే వస్తానని వెళ్లిపోయేవారు. అలా వెళ్ళినవారు ఏ మరునాడో తిరిగొచ్చేవారు. కోదండరాం గారి ఆదర్శాలూ, అభ్యుదయ భావాలూ మీకేమనిపిస్తాయి? వాటిని మెల్లిగా అర్థం చేసుకోగలిగాను. కానీ చిన్న చిన్న కోరికలుండేవి. కలిసి కాఫీ తాగడం లాంటివి. మా జీవి తంలో రోజులో కేవలం 15 నిముషాలు మాత్రమే మేమి ద్దరం కలిసి గడిపేది. ఆ పదిహేను నిముషాలూ మాక్కాకుండా పోయిన సందర్భాలనేకం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్లు, గుళ్ళు, గోపురాలూ... ఇవన్నీ అటెండ్ అయ్యేది నేను, నా పిల్లలే. ఆయన కవేవీ నచ్చవు. రారు. అందరం కలిసి సరాదాగా వెళ్ళగలిగింది మా జీవితంలో ఒకే ఒక్క పండగకు. అదే పుస్తకాల పండగ. యేడాదికోసారి పెట్టే బుక్ ఎగ్జిబిషన్‌కి మా కుటుంబమంతా కదలి వెళుతుంది. పిల్లలకి పుస్తకాలు తప్ప మరో బహుమతి ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. అందుకే వాళ్లిద్దరికీ బుక్ రీడింగ్ బాగా అలవాటయ్యింది. తెలంగాణ ఉద్యమంలో మీ అనుభవాలేమిటి? 2005లో ఉస్మానియా యూనివర్సిటీలో హోలి పేరుతో తెలంగాణ కళాకారుల ప్రదర్శన జరిగింది. మొదటిసారి ఆయన అరెస్టు కావడం చూశాను. వాళ్ళని విడుదల చేయాలంటూ ఆ మరునాడు అసెంబ్లీని స్తంభింపజేశారు. ఆ రోజు నేను చాలా కంగారు పడ్డాను. ఆయనకు సహనం ఎక్కువ. ఎదుటి వ్యక్తిలోని ఎంత కోపమైనా ఆయన సహనం ముందు బలాదూర్. అందుకే తెలంగాణ ఉద్యమంలో వ్యక్తుల భావావేశం గురించి ఆందోళన చెందేవారు. ప్రతిక్షణం జాగ్రత్తపడేవారు. ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడతారోనని చాలా తల్లడిల్లిపోయేవారు. ఫోన్ రావడం ఆలస్యం పరిగెత్తేవారు. అది ఏ వేళలో అయినా. ఉద్యమంలో మీరు ఇబ్బంది పడిన విషయమేదైనా వుందా? తెలంగాణ ఉద్యమకాలంలో ఆయన ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. నిజానికి ఒక పూటైనా విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకున్నారాయన. కానీ ఈ విమర్శ తరువాత నాలుగేళ్ళపాటు ఒక్కపైసా వేతనం లేకుండా మేం గడిపాం. మా పిల్లలు మైత్రీ, చేతన్ ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. మా యిద్దరికీ కారు డీజిల్ ఖర్చు తప్ప పెద్దగా ఖర్చులేవీ ఉండవు. అలా గడిపేసాం. ఉద్యమ సమయంలో మీరు ఉద్విగ్నతకు లోనైన సందర్భమేదైనా ఉందా? తెలంగాణ ఉద్యమంలో సాగరహారం అప్పుడు అనిపించింది ఎప్పుడు ఆగుతుందిది అని. చలో అసెంబ్లీ అప్పుడనిపించింది యిక ఆగాలేమో అని. సడ క్ బంద్‌లో వీళ్ళు అరెస్టయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అంతా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే ఈయన ఇక్కడి జైలు సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కడైనా సమస్యలపైనే ఆయన దృష్టి అంతా. ఇంట్లో ఇది కావాలి అని సార్ ఎప్పుడైనా అడిగేవారా? ఆయనకు తన చెప్పులు అరిగిపోయాయని కూడా తెలియదు. బట్టలు చెప్పక్కర్లేదు. మట్టిగొట్టుకుపోయినా అదేం ఆయనకు పట్టదు. నేనే చూసి వాటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఆయన నన్నెప్పుడైనా కావాలని అడిగేది కేవలం స్టేషనరీయే. పేపర్లు పెన్నులు ఉంటే చాలు. పిల్లల విషయంలో ఇది చేయమని, ఇది వద్దని ఆయనెప్పుడూ చెప్పలేదు. పిల్లలు కూడా చాలా ఇండిపెండెంట్‌గా పెరిగారు. కోదండరాం గారికి ఇష్టమైనవేవి? మా మనవడు నిశాంత్. వాడితో ఫోన్లో మాట్లాడ్డం ఆయనకి సాంత్వన. మా పిల్లలు ఎప్పుడూ నాన్నా ఫొటో దిగుదాం అని అడిగేవారు. కానీ ఆయనెప్పుడూ మనం కాదు ఫొటోలు దిగాల్సింది. ప్రకృతిని ఫొటోలు తీయాలంటూ కెమెరా చేతిలో ఉంటే ఏ పిట్టనో, చెట్టునో, పువ్వునో క్లిక్‌మనిపించేవారు. ఫొటోలు వద్దంటూ వారించే నాన్నను ఇప్పుడు న్యూస్ పేపర్లవాళ్లు ఫొటోలు తీస్తున్నారంటూ మా పిల్లలు ఆటపట్టిస్తుంటారు. మీకు మ్యూజిక్ అంటే యిష్టం అన్నారు? ఇద్దరూ కలిసి మ్యూజిక్ వింటూంటారా? పాటంటే నాకు ప్రాణం. మా అమ్మ శశికళ మంచి సింగర్. ఆయనకి కూడా పాత పాటలంటే ఇష్టం. కానీ పాట వినే లోపు ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు అనుకుంటారు. కోదండరాం గారిలో మీకు నచ్చేది? ఆయన నిబ్బరం, నిరాడంబరత, అందరినీ ఏకతాటి పైకి తేగల తెగువ, ఎవ్వరినైనా ఒప్పించగల సహనం, ఉద్యమాన్ని ఉరకలెత్తించే నాయకత్వ లక్షణాలూ అన్నీ నాకు నచ్చేవే. వాటిల్లో ఎక్కువ శాతం మా మామగారి నుంచి... అంటే వాళ్ళ నాన్న నుంచి ఆయనకు అబ్బినవే. నిజం చెప్పాలంటే ఆయన ఒక మేధావిగా, హక్కుల కార్యకర్తగా, నాయకుడిగా ఉండడమే నాకిష్టం. నా వ్యక్తిగత జీవితం, నా పిల్లలు ఆయన్ని మిస్సయి ఉండవచ్చు. కొంత నష్టపోయి ఉండవచ్చు. కానీ సమాజానికి ఎంతో చేయగల శక్తి ఆయనకుంది. వంటగదితో కోదండరాం గారికి పరిచయం వుందా? కిచిడీ, ఆమ్లెట్ ఇప్పటికీ ఆయన చేస్తేనే మా పిల్లలకిష్టం. ఆయనకి స్వీట్స్ అంటే అమితమైన ఇష్టం. ఇంట్లో వున్న కాస్త సమయంలోనే ఏదో స్వీట్ చేద్దామంటూ వంటగదికి వచ్చేస్తారు. తెలంగాణ వచ్చాక ఇప్పుడేమనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోదండరాం గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఆయన భార్యగా నేను చాలా లక్కీ. కోట్లాది మంది ఆకాంక్ష కోసం పోరాడిన వ్యక్తి సహచరిని నేనని చాలా ఆనందించాను. ఇప్పుడందరూ యింటికొచ్చి చాలా విషయాలు చెపుతుంటే ఇప్పటి వరకు జరిగింది ఒకెత్తై ఇప్పుడు జరగాల్సింది చాలా ఉందనిపిస్తోంది. జీవితంలో మూడు ‘డి’ లు ఉంటే ఎవరైనా లక్ష్యాన్ని సాధిస్తారని నేనెక్కడో చదివాను. డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇవి వుంటే డెవెలప్మెంట్ సాధ్యం అవుతుంది. అది ఈయన విషయంలో అక్షరసత్యం. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కోదండరాంరెడ్డిలోంచి రెడ్డి ఎందుకు తీసేసుకున్నారు? కారంచేడు ఘటన తరువాత కులం పేరు తన పేరు చివరన ఉండడం సరికాదనుకున్నారు. కులం పేరుతో ప్రత్యేకంగా వచ్చే గుర్తింపు నాకక్కర్లేదని తీసేశారాయన. కోదండరాం గారు బాగా బాధపడిన సందర్భమేది? జయశంకర్గారి మరణం ఆయన్ను బాగా బాధపెట్టింది. తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన వ్యక్తి తెలంగాణని చూడకుండానే వెళ్ళిపోవడం -
పరీక్ష రాసి వెళ్తుంటే.. ప్రాణం తీశారు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని దారుణహత్యకు గురైంది. పరీక్ష రాసి వెళ్తున్న విద్యార్థిని సుశీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దుండగులు చిన్నేరు ప్రాజెక్ట్‌లో పడిసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సుశీల మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. పాత కక్షల వల్లే విద్యార్థినిని హతమార్చి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
నీ బాంచెన్.. సుశీల!
♦ అదే పరమాన్నం.. పేదోళ్ల ఫుడ్డుగా పేరు ♦ వృద్ధులు, పిల్లల ఆదరువు ♦ కడుపు నింపుతోన్న సాత్విక ఆహారం ♦ పింఛన్ డబ్బులతో సుశీలతోనే జీవనం ♦ తయారీ సులువే.. ఖర్చూ తక్కువే.. ♦ ఖేడ్‌లో రుచి చూసిన అమాత్యులు ఉన్న ఊర్లో ఉపాధి దొరక్క కన్న బిడ్డలు వలస పక్షులయ్యారు.. ఈడు ముదిరి.. నెత్తురు సచ్చిపోయిన అవ్వాఅయ్యలను ఇంటికొదిలేసి ఎల్లలు దాటి వెళ్లిపోయారు. వలస వెళ్లి చేసిన రెక్కల కష్టానికి గుత్తేదారిలెక్కలు కట్టి, అసలు, అప్పు పట్టుకొని మిగిలిన పైకం చేతుల పెడి తే... అర్ధాకలితో కాలం వెళ్లబోస్తున్నారు కూలీ లు. ఈ దశలో ఇంటి దగ్గర అవ్వాఅయ్యల ఊసే మరిచారు. కన్న కొడుకు పంపుతాడని... కడుపు నిండా తింటామనే ఆశ పండుటాకుల్లో రోజురోజుకు సచ్చిపోతోంది. ఈ సమయంలో ఇక్కడి వృద్ధులను ‘సుశీల’అమ్మైఆదరిస్తోంది. వలసలతో వల్లకాడైన నారాయణఖేడ్ పల్లెల్లో సుశీలే పరమాన్నం. రూ.1,000 పింఛన్‌తో పండుటాకులు సుశీల తిని బతుకుతున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ అంటేనే వలసలు. పాల మూరు తరువాత రాష్ట్రంలోనే ఎక్కువ మంది వలసలు పోయే ప్రాంతం. ఇక్కడి నుంచి ఏటా 40 వేల మంది కూలీలు వలస పోతుంటారని అంచనా. ఏళ్లకేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో సగ టు మనుషుల జీవన ప్రమాణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. పల్లెల్లో సాగు భూమి ఉన్నా.. నీళ్లు లేక సాగు చేసుకునే పరిస్థితి లేదు. పిల్లలు డిగ్రీలు చేసినా... స్థానికంగా ఉపాధి అవకాశాలులేక పట్నం బాటపట్టారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కనీసం తాగు నీరు దొరకదు. అటు తిండిలేక, ఇటు నీళ్లు దొరక్క వలస వెళ్లాల్సిన పరిస్థితులు పల్లెల్లో కన్పించాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో యువకులు తమ ముసలి తల్లిదండ్రులను, పిల్లలను ఇంటి వద్దే వదిలేసి పోతున్నారు. కంగ్టి, కల్హేర్, మనూరు మండలాల్లోని గిరిజన తండాలు, దళిత కాలనీ లన్నీ వలసపోయాయి. చేతగాని వృద్ధులు మాత్రమే పిల్లలను పట్టుకొని ఇంటి వద్ద ఉన్నారు. పని దొరకగానే డబ్బు పంపిస్తామని చెప్పి వెళ్లిపోయిన బిడ్డలు నెలలు గడుస్తున్నా రూపాయి కూడా పంపకపోవడంతో పండుటాకులు, పసిపిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు. ఇక్కడ సుశీలే టాప్... ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రూ.వెయ్యి పింఛన్, ఈ ప్రాంతంలో ప్రాచూర్యంలో ఉన్న సరళ ఆహారం సుశీల వారి కడుపు నింపుతోంది. పండ్లూడిన బోసి నోరు నమలడానికి సులువుగా ఉండి, అత్యంత చౌకగా పేదలకు అందుబాటులో ఉంటోంది. పొయ్యి మంట కూడా వెలిగించ లేని వృద్ధులు సుశీలతోనే కాలం నెట్టుకొస్తున్నారు. మురమురాలను(బొరుగు పేలాలు) నీళ్లలో తడిపి దానికి కొంత పోసు వేస్తే సుశీల సిద్ధమవుతుంది. రూ.10 ఖర్చుతోనే రోజు గడిచిపోతోం ది. సలువుగా జీర్ణం అవుతుంది. దీనికి రూ.2 కిలో బియ్యం కూడా తోడుకావటంతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆకలి చావులు లేవని చెప్పొచ్చు. నేతల దృష్టికొచ్చిన సుశీల... ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదరరాజనర్సింహ, సునీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరులు పల్లెల్లో తిరుగుతున్నారు. నేతలు పల్లెల్లో తిరుగుతోన్న సమయంలో పల్లెజనం సుశీల తిని బతుకుతున్నాం అని చెప్పడంతో నేతలకు సుశీల మీద ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మె ల్యే రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితరులతో కలిసి నారాయణఖేడ్‌లోని శంకరప్ప కొట్టులో సుశీల రుచి చూశారు. ‘నా అనుకున్న వాళ్ల ఆదరణ లేని పండుటాకులు పింఛన్ డబ్బుతో కనీసం రెండు పూటల సుశీలైనా తింటున్నారని సంతోష పడాలో లేక కనీస మౌలిక వసతులు లేక యువత ఉపాధి వెతుక్కుంటూ వృద్ధ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి వలస పోయినందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం’ అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. -
సాక్షి పండుగ సంబరాలు
వరుణ్ మోటార్స కస్టమర్‌కు బంపర్ ప్రైజ్ {పధాన స్పాన్సర్ కళానికేతన్ కో-స్పాన్సర్స్ మిత్రాహోండా, సోనోవిజన్, మారుతీ సుజుకీ, టీవీఎస్ రింగ్‌రోడ్డు రోడ్డు వరుణ్ మోటార్స్‌లో మూడో డ్రా డ్రా తీసి విజేతను ప్రకటించిన రెండో డ్రా విజేత సుశీల ఉత్సాహంగా సాక్షి సంబరాలు సాక్షి పండుగ సంబరాలు మూడోరోజు డ్రా శుక్రవారం రింగ్‌రోడ్డులోని వరుణ్ మోటార్స షోరూమ్‌లో రెండో రోజు బంపర్ ప్రైజ్ విజేత సూరపనేని సుశీల ఈ డ్రా తీసి మూడోరోజు లక్షాధికారిని ఎంపిక చేశారు. విజయవాడ : సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండుగ సంబరాల్లో భాగంగా ఆహ్లాదభరితమైన వాతావరణంలో శుక్రవారం మూడో రోజు డ్రా నిర్వహించారు. రింగ్‌రోడ్డు సమీపంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్‌లో నిర్వహించిన ఈ డ్రాలో రెండో డ్రా విజేత సూరపనేని సుశీల లక్షాధికారి విజేతను ఎంపిక చేశారు. వరుణ్ మోటార్స్ కస్టమర్ కె.లవకుమార్(04140) బంపర్‌ప్రైజ్ విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతి గెలుచుకున్నారు. తర్వాత పలువురు కస్టమర్లు డ్రా తీసి, ఫస్ట్. సెకండ్, థర్డ్ ప్రైజ్‌ల విజేతలతో పాటు, మూడు కన్సొలేషన్ బహుమతుల విజేతలను ఎంపిక చేశారు. సాక్షి నిర్వహిస్తున్న ఈ డ్రా ఎంతో పారదర్శకంగా ఉందని పలువురు కస్టమర్లు కొనియాడారు. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ షాపింగ్ చేస్తుంటారని, అలాంటి సమయంలో డ్రా నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు. సాక్షి పండుగ సంబరాలు జనవరి 6 వరకూ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక లక్షాధికారిని ఎంపిక చేస్తుంది. పండుగ సంబరాలకు స్పాన్సర్లు వ్యవహరిస్తున్న ఒక షోరూమ్‌లో కస్టమర్ల సమక్షంలో డ్రా తీసి విజేతలను ఎంపిక చే స్తారు. సాక్షి రీజినల్ మేనేజర్ (యాడ్స్) సీహెచ్.అరుణ్‌కుమార్, సాక్షి యాడ్స్ మేనేజర్ జేఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రధాన స్పాన్సర్‌గా కళానికేతన్ వ్యవహరిస్తుండగా, కో స్పాన్సర్లుగా సోనోవిజన్, మిత్రాహోండా, వరుణ్మారుతీ, మిత్రా మారుతీ, టీవీఎస్ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. -
కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి
సంతమాగులూరు : మండలంలోని కామేపల్లి, తంగేడుమల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కత్తులతో దాడులకు తెగబడ్డారు. కామేపల్లిలో మంగళవారం సాయంత్రం గుండపనేని మోహన్‌రావు అనే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తపై ఆదే గ్రామానికి చెందిన కొల్లూరి శ్రీను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తంగేడుమల్లిలో బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ అతని సోదరుడు నాగరాజుపై ఆదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలతో ఆ రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తంగేడుమల్లిలో.. తంగేడుమల్లి సర్పంచ్ ధూళిపాళ్ల సుశీల భర్త మురళీకృష్ణ ద్విచక్ర వాహనాన్ని అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మర్లపాటి శేషయ్య తన ద్విచక్ర వాహనంతో రెండు రోజుల క్రితం ఢీకొట్టించాడు. ఆ విషయం అప్పటితో సమసిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి వచ్చిన శేషయ్య తేల్చుకుందాం రమ్మంటూ బొడ్రాయి సెంటర్‌కు ధూళిపాళ్ల మురళీకృష్ణకు ఫోన్ చేసి పిలిచాడు. మురళీకృష్ణ బొడ్రాయి వద్దకు వెళ్లగానే శేషయ్య తిట్ల పురాణం అందుకున్నాడు. మురళీకృష్ణ నిలువరించబోగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. మురళీకృష్ణ తమ్ముడు నాగేశ్వరరావు పరుగున వచ్చి అడ్డుకోబోగా అతని చేతి వేళ్లకు కత్తి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. కామేపల్లిలో.. బాధితుల కథనం ప్రకారం మండలంలోని కామేపల్లిలో గుండపనేని మోహన్‌రావు, టీడీపీ కార్యకర్త కొల్లూరి శ్రీనుకు మధ్య పొలం వద్ద ముళ్ల కంచె వేసే విషయంలో వివాదం చెలరేగింది. ముళ్లకంచె వేసేందుకు అభ్యంతరం తెలిపిన మోహన్‌రావుపై కొల్లూరి శ్రీను తన చేతిలో ఉన్న కత్తి విసరడంతో మోహన్‌రావుకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. మురళీకృష్ణ నుంచి వాంగ్మూలం నరసరావుపేట వెస్ట్: మురళీకృష్ణ నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ వన్‌టౌన్ పోలీసులకు తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. ఆయన నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. -
పి.సుశీల - స్టార్ స్టార్ సూపర్ స్టార్
-
లాహిరి లాహిరి-పీ.సుశీల
-
డా.పి.సుశీలాతో లెజెండ్స్