చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో పదో తరగతి విద్యార్థిని దారుణహత్యకు గురైంది. పరీక్ష రాసి వెళ్తున్న విద్యార్థిని సుశీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దుండగులు చిన్నేరు ప్రాజెక్ట్లో పడిసి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సుశీల మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు.
పాత కక్షల వల్లే విద్యార్థినిని హతమార్చి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పరీక్ష రాసి వెళ్తుంటే.. ప్రాణం తీశారు
Published Mon, Apr 4 2016 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement
Advertisement