గాయని సుశీలకు కలైజ్ఞర్‌ స్మారక అవార్డు | Kalaithurai Vithakar award for P Susheela | Sakshi
Sakshi News home page

గాయని సుశీలకు కలైజ్ఞర్‌ స్మారక అవార్డు

Sep 25 2024 2:09 AM | Updated on Sep 25 2024 1:22 PM

Kalaithurai Vithakar award for P Susheela

సాక్షి, చెన్నై: ప్రముఖ గాయని గాన కోకిల పి. సుశీలకు ‘కలైజ్ఞర్‌ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్‌’ అవార్డును తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు ప్రభుత్వం తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్‌ నినైవు కళై తురై విత్తగర్‌ అవార్డుని (కలైజ్ఞర్‌ స్మారక కళా విభాగం స్పెషలిస్టు లేదా నిపుణులు) ఒకరికి ప్రదానం చేయడానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్‌ ఆరూర్దాస్‌కు దక్కింది.

గత ఏడాది మొత్తం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు జరగడంతో ఈ అవార్డుని 2023కుగాను మహిళా ప్రముఖురాలికి ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఈ అవార్డుకు పి. సుశీలను ఎంపిక చేసింది కమిటీ. అలాగే తమిళ భాషాభివృద్ధి కోసం శ్రమిస్తున్న రచయిత, కవి మహ్మద్‌ మెహతాను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 30న తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్  చేతులమీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement