sutdents
-
మాకు సెలవులు వద్దు
-
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరగనున్నాయని, హాల్ టికెట్లను విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. నెల రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్ని మంత్రి గంటా వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ : 18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2 -
బీజేపీ, టీడీపీ తీరుపై విద్యార్థుల నిరసన
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విద్యార్థులు చెవిలో పూలు పెట్టుకుని, మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ అయ్యస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ మేరకు బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదాతోనే నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. నిరసనలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, దాసరి వంశీ, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.