swachh Sarvekshan
-
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్‌లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్‌గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్‌గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్‌లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్‌ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
16 పురపాలికలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్–22 అవార్డులను సాధించాయి. జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్ రేటింగ్ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిట్టర్ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు. అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. ఆదిభట్ల, బడంగ్పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ. సంస్కరణల ఫలితమే ఈ అవార్డులు: మంత్రి కేటీఆర్ ఈ ఏడాది కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపట్ల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన 16 పురపాలికల్లోని మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. పాలనాపరమైన సంస్కరణలు చేపట్టి వదిలేయకుండా, పట్టణాలకు ప్రతినెలా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రాథమిక సేవలకు వీలు కలిగిందన్నారు. ఈ అవార్డుల ద్వారా పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డుల్లో తెలంగాణలోని 16 పట్టణాలు అవార్డులు గెలుచుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి దర్పణంగా నిలిచిందన్నారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతో పాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని సీఎం వివరించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్‌ను పెంచడం, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్‌ల దిశగా కృషితో పాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశా నికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. -
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్‌పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్‌గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
ఏపీకి అవార్డులు రావడం సంతోషకరం: వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులను గురువారం ప్రకటించింది. 10 లక్షలకు పైగా జనాభా కలిగి పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల జాబితాలో నాలుగవ స్థానంలో విజయవాడ, ఆరవ స్థానంలో తిరుపతి, తొమ్మిదవ స్థానంలో విశాఖపట్నంలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు సంపాధించడం ఆనందదాయకమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు. దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2016 సంవత్సరం నుంచి ప్రకటిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్ -2020 అవార్డుల్లో 10 లక్షల పైన జనాభా గల నగరాల జాబితాలో 4వ స్థానంలో విజయవాడ, 9వ స్థానంలో విశాఖ నిలవడం ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి అభినందనలు.#SwachhSurvekshanAwards2020 #SwachhBharat — Vice President of India (@VPSecretariat) August 20, 2020 -
ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్చ సర్వేక్షణ ర్యాంకులు
-
స్వచ్ఛ ఓటుకు చివరి అవకాశం
విశ్వ నగరి విశాఖను స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం.. ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోటీపడి దూసుకుపోతోంది. నేటితో స్వచ్ఛ సర్వేక్షణ్ ముగియనుండటంతో చివరిరోజు ఉన్న అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ని ఓ క్రతువులా నిర్వహిస్తుండటంతో ప్రజల్లో యాప్ డౌన్లోడ్ విషయంలో చైతన్యం వెల్లివిరుస్తున్నప్పటికీ యాప్ వినియోగించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే నగరం కచ్చితంగా టాప్–10లో నిలుస్తుంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహా నగరం స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ గతేడాది మాత్రం ఒక్కసారిగా చతికలపడిపోయింది. ఈసారి మాత్రం టాప్–10లో ఉండేందుకు జీవీఎంసీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ర్యాంకు విషయంలో ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది. నేడే చివరి రోజు ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించినా ఈ నెల 4 నుంచి 31 వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రధానమైన భాగం. ఈ సమయంలోనే దేశంలో ఉన్న అన్ని నగరాల్లో స్వచ్ఛ బృందం పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. విశాఖ నగరంలో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే గార్బేజ్ ఫ్రీసిటీ(జీఎఫ్‌సీ) స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు పరిశీలన బృందం కూడా నగరంలో ఉంది. శుక్రవారం సాయంత్రంతో ఈ రేటింగ్ పరిశీలన కూడా పూర్తి కానుంది. గతేడాది 2 స్టార్ రేటింగ్‌లో ఉన్న నగరం ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుంది. మరోవైపు శుక్రవారం చివరి రోజు కావడంతో నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్ 1969కి పౌరులు ఫోన్ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్–2020 పోర్టల్ ద్వారా గానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేసేందుకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకే సమయం ఉంది. ఈ కొద్ది గంటల పాటు ప్రజలు నగర గౌరవం కోసం శ్రమిస్తే.. స్వచ్ఛతలో టాప్–10లో చోటు దక్కించుకోవచ్చు. ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం.. స్వచ్ఛ సర్వేక్షణ్–2020 నిబంధనల్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిచ్చాం. చెత్త ప్రొసెసింగ్ దినచర్యగా మారుతోంది. ఇప్పటి వరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రొసెసింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్ ప్లస్ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. చివరి రోజున ప్రజలంతా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సహకరించాలి.– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ ప్రజలే వారధులు స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం చివరి రోజూ అదే స్థాయిలో అందిస్తే టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
స్వచ్ఛమేవ జయతే!
మహా నగరాలతో పోటీపడిన తిరుపతి నగరం గట్టి పోటీ ఇచ్చి జాతీయస్థాయిలో పరపతిని మరోసారి చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తిరుపతి నగరం గత ఏడాది జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ర్యాంక్‌తో పోల్చి చూస్తే రెండడుగులు వెనక్కి వెళ్లినా జాతీయ స్థాయిలో మరింతగా మెరిసిందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి పెద్ద నగరాలు ఈసారి టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్–10 జాతీయ ర్యాంక్‌ల్లో 8వ ర్యాంక్‌తో తిరుపతి నగరం ఒక్కటే సత్తా చాటుకుంది. చిత్తూరు, తిరుపతి తుడా: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పోటీల్లో తిరుపతి నగరం మరోసారి తన సత్తా చాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఈసారి పోటీలను గత రెండేళ్లతో పోలిస్తే మరింత కఠినతరం చేసింది. దీంతో ఆయా నగరాల ర్యాంకులపై ప్రభావం పడింది. అయితే నగరాల సామర్థ్యం మేరకు కచ్చితమైన ర్యాంకులు వచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా బుధవారం కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ వి.విజయ్‌రామరాజు ఈ అవార్డును అందుకున్నారు. 2017లో తొమ్మిదో ర్యాంక్, 2018లో ఆరో ర్యాంక్‌లో ఉన్న తిరుపతి ఈ సారి 8వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. స్వచ్ఛ పోటీల్లో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టాప్ టన్లో నిలిచి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. గత ఏడాది తిరుపతి నగరం కన్నా మెరుగైన ర్యాంక్‌తో ముందున్న విశాఖపట్నం–3, విజయవాడ–5 నగరాలు ఈసారి దరిదాపుల్లో నిలవలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి నగరం మొదటి ర్యాంక్ కాగా, సౌత్ జోన్ లెవల్లో రెండో ర్యాంక్‌గా పరిగణించారు. మైసూ ర్ 3వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులను ఇండోర్, అంబికాపూర్, మైసూర్ సొంతం చేసుకున్నాయి. రాష్ట్రస్థాయిలో తిరుపతికి ఫస్ట్ ర్యాంక్ తిరుపతి నగరం రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 5 వేల మార్కులకు పోటీలు నిర్వహించగా తిరుపతి నగరం 4,024.61 మార్కులను సాధించింది. గత ఏడాది 95 ర్యాంక్‌లో ఉన్న చిత్తూరు 2,794.64 మార్కులతో 112 ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మదనపల్లి పట్టణం 2,411.66 మార్కులతో జాతీయస్థాయిలో 181, రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంక్‌ను దక్కించుకుంది. గత ఏడాది 3వ ర్యాంక్‌లో ఉన్న విశాఖపట్నం ఈసారి 3,744.09 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 23,రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. గత ఏడాది 3580 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విజయవాడ నగరం ఈసారి 3,882.46 మార్కుతో జాతీయ స్థాయిలో 12, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. మొత్తం మీద తిరుపతి స్వచ్ఛ కిరీటం దక్కించుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్రీ స్టార్ రేటింగ్ తిరుపతిని బిన్ ఫ్రీ (చెత్త కుండీలు లేని) నగరంగా ప్రకటించారు. ఈ నేపథ్యం తిరుపతి నగరంలో ఎక్కడా చెత్త కుండీలు లేకుండా చెత్త సేకరిస్తున్నారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 100 శాతం చెత్తను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరానికి 3 స్టార్ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని ప్రకటించుకుని ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నందున త్రీ స్టార్ నగరంగా ఎంపిక చేశారు. బెస్ట్ సిటీ ఇన్ సిటీజన్స్ ఫీడ్‌బ్యాక్ తిరుపతి సీనియర్ సిటీజన్స్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో బెస్ట్ నగరంగా నిలిచింది. ఈ మేరకు బెస్ట్ సిటీ ఇన్ సిటీజన్స్ ఫీడ్ బ్యాక్ కేటగిరిలో తిరుపతి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ బృందం పర్యటించి కార్పొరేషన్ ద్వారా అందుతున్న సర్వీసు, సేవల ఆధారంగా సిటీజన్స్ అభిప్రాయాన్ని సేకరించారు. 1,250 మార్కులను సంబంధించి అభిప్రాయాన్ని సేకరించగా 1,105.61 మార్కులు సాధించింది. ఈమేరకు తిరుపతి నగరానికి బెస్ట్ సిటీ ఇన్ సిటీజన్స్ ఫీడ్ బ్యాక్ అవార్డు దక్కింది. సెక్రటరీ మనోహర్, మున్సిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఆర్వో సేతుమాధవ్ శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. అభినందనలు జాతీయ స్థాయిలో తిరుపతి నగరం 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం సంతోషకరం. ఇందుకు సహకరించిన నగర వాసులు, స్వచ్ఛత పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన కమిషనర్, ఇతర అధికారులు, కార్మికులకు అభినందనలు. ఇది తిరుపతి ప్రజల విజయం. జాతీయ స్థాయిలో మరోసారి తిరుపతి నగరం తన పరపతిని పెంచుకుంది. మహా నగరాలు గట్టి పోటీ ఇచ్చినా తిరుపతి మంచి ర్యాంక్‌ను సాధించింది. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులుగా మారడం నగర అభివృద్ధికి మేలు చేయనుంది. – పీఎస్. ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ తిరుపతి ప్రజల విజయం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా మెరుగైన ర్యాంకు రావడం వెనుక నగరవాసుల సంపూర్ణ సహకారం ఎంతో ఉంది. ప్లాస్టిక్ నిషేధానికి, బిన్ రహితంగా మార్చడం, చెత్తపై సమరం ఇలా ఏ ప్రయోగం చేస్తున్నా నగర వాసులు సహకారం మరువ లేనిది. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి జాతీయ స్థాయిలో 8, రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం నగర ప్రజలకు గర్వకార ణం. ప్రజలు, వ్యాపారులు అందరి సహకారంతోనే ఈ అవా ర్డు దక్కింది. అందరం మరింత బాధ్యతగా వ్యవహరిద్దాం. –వి. విజయ్‌రామరాజు, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మన ర్యాంకు ఇదే..
సాక్షి, సిటీబ్యూరో : స్వచ్ఛసర్వేక్షణ్–2019 ర్యాంకింగ్ల్లో లక్ష జనాభాపైబడిన నగరాల్లో జీహెచ్ఎంసీకి 35వ స్థానం లభించింది. మొత్తం 4273 నగరాలతో జరిగిన పోటీలో ఈ ర్యాంకును కైవసం చేసుకుంది. గత సంవత్సరం 4041 నగరాలతో పోటీపడి 27వ స్థానం పొందగా, ఈసారి పెరిగిన నగరాలతోపాటు ర్యాంకు కూడా పెరిగింది. దేశంలోని ఇతర పెద్ద నగరాలైన ముంబై(49వ స్థానం), బెంగళూర్(210వ స్థానం), చెన్నై(61వ స్థానం)ల కంటే హైదరాబాద్ ముందంజలో నిలిచినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం మనకంటే ముందుండి 5వ స్థానంలో నిలిచింది. గ్రేటర్ ముంబై గత సంవత్సరం 18వ ర్యాంకు సాధించగా, ఈసారి 49వ ర్యాంకుకు పరిమితమైంది. చెన్నయ్ గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా 61వ ర్యాంకునే కైవసం చేసుకోవడం విశేషం. బెంగళూర్ ర్యాంక్ గత సంవత్సరం ఉన్న 194 నుంచి ఈసారి 210కి పెరిగింది. 2017లో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, గత సంవత్సరం నుంచి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. గత సంవత్సరం సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ తగ్గినందునే రావాల్సిన ర్యాంకు రాలేదని భావించి, సిటిజెన్ ఫీడ్‌బ్యాక్ కోసం ఈసారి ఎంతో ప్రచారం చేసినప్పటికీ, గత సంవత్సరం కంటే ప్రజల ఫీడ్‌బ్యాక్ తగ్గింది. గత సంవత్సరం ఈ అంశంలో 1400 మార్కులకు 942 మార్కులు సాధించగా, ఈసారి 1250 మార్కులకు 936 మార్కులు మాత్రమే లభించాయి. స్వచ్ఛ భారత్ బృందం సర్టిఫికేషన్‌కు ఈసారి 1250 మార్కులు కేటాయించగా, ఈ విభాగంలో మన నగరం 600 మార్కులు పొందింది. మొత్తం నాలుగు విభాగాల్లో వెరసి 5000 మార్కులకుగాను జీహెచ్ఎంసీ 3455 మార్కులు పొందింది. తగ్గిన మార్కుల శాతం.. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరానికి 2000 మార్కుల్లో 1355 మార్కులు (67.70శాతం), 2017లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2000 మార్కులకుగాను 1605 (80 శాతం) మార్కులు, 2018లో 4000 మార్కులకుగాను 3,092 మార్కులు (77.30శాతం) లభించగా ఈసారి 5000 మార్కులకుగాను 3455 (69 శాతం మార్కులు) మాత్రమే లభించాయి. ♦ ఈ సంవత్సరం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోని ఇతర నగరాలైన వరంగల్‌కు 81 ర్యాంకు, కరీంనగర్‌కు 99 వ ర్యాంకు లభించాయి. ♦ స్వచ్ఛ సర్వేక్షణ్ –2019లో మొత్తం నాలుగు విభాగాల్లో 5 వేల మార్కులకు మూల్యాంకనం చేయగా జీహెచ్ఎంసీకి 3,455 మార్కులు లభించాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలుపై నాలుగు విభాగాలకు వేర్వేరుగా 1250 మార్కుల వంతున కేటాయించారు. వీటిలో జీహెచ్ఎంసీ చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు 936 మార్కులు, సర్టిఫికేషన్ విభాగంలో అ 600మార్కులు , స్వచ్చ కార్యకమ్రాల అమలుపై స్వచ్ఛ భారత్ ప్రతినిధుల బృందం ప్రత్యక్ష పరిశీలనకు 1,117 మార్కులు లభించాయి. బృందం జీహెచ్ఎంసీ అధికారులతో జరిపిన సమావేశాలకు 802 మార్కులు లభించాయి. మెట్రో నగరాల్లో టాప్ ♦ స్వచ్ఛత కార్యక్రమాలో మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాదే టాప్‌లో ఉందని జీహెచ్ఎంసీ పేర్కొంది. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ ఇతర మెట్రో నగరాలైన ముంబై, బెంగళూర్, చెన్నయ్, కోల్‌కత్తాల కంటే ముందజలోఉందని, న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అంటే ఢిల్లీమొ త్తం కాదని పేర్కొంది. ♦ గత సంవత్సరం రాజధాని నగరాల్లో దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈసారి ఏ ప్రత్యేక అంశంలోనూ చోటు దక్కించుకోలేదు. ఈసారి జాతీయస్థాయిలో క్లీనెస్ట్, ఫాస్టర్ మూవర్, సిటిజెన్ ఫీడ్‌బ్యాక్, ఇన్నొవేటివ్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంశాల వారీగానూ ఆయా కార్పొరేషన్లను ఉత్తమమైనవిగా ఎంపిక చేయగా, హైదరాబాద్‌కు వాటిల్లో స్థానం లభించలేదు. -
సై... అంటే సరికాదు...
ఏ అంశంలోనైనా పోటీ పడాలంటే దానికి తగ్గ కసరత్తు ఉండాలి. కనీసం ప్రయత్నమైనా చేయాలి. కానీ ఇవేవీ లేకుండా పోటీలో ఉన్నామని చెబితే మాత్రం గెలుపు సాధ్యమవుతుందా... ఇప్పుడు విజయనగరం మునిసిపాలిటీ పరిస్థితి అలాగే ఉంది. స్వచ్ఛత సర్వేక్షణ్ –19కోసం దేశవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు పోటీపడుతున్నాయి. అందులో విజయనగరమూ ఉంది. కానీ ఇక్కడ ఆ పోటీకి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికా అమలు చేయడంలేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కాలువలు కంపుకొడుతున్నాయి. దుర్వాసన వెదజల్లుతూనే ఉంది. మరి పోటీలో ఉంటే ఇలాగేనా పారిశుద్ధ్యం ఉండేది అన్నదే నగరవాసుల సందేహం. విజయనగరం మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–2019 పోటీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోటీలో దేశంలోని అన్ని మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. ఇందులో విజయనగరం కూడా ఉంది. ఇప్పటికే మిగిలిన మున్సిపాలిటీలు పక్కా కార్యాచరణ రూపొందించుకుని పోటీకి సన్నద్ధమవుతున్నా యి. 2017లో 126వ ర్యాంక్, 2018లో 154వ ర్యాంకు దక్కించుకున్న విజయనగరం మున్సి పాలిటీ ఈ సారి ఏ స్థానాన్ని సాధిస్తుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. ఈ ఏడాది పోటీలోపాల్గొంటున్న మునిసిపాలిటీలు డాక్యుమెంటేషన్ ప్రక్రియతో పాటు దాని ఆధారంగా జరిగే క్షేత్ర స్థాయి పరిశీలనకు సమాయత్తం అవుతుండగా... విజయనగరం మున్సిపాలిటీ ఇదేదీ ప్రారంభమే కాలేదు. గత ఏడాది జనవరి 4 నుంచి మార్చి 4వ తేదీ వరకు పోటీలు నిర్వహించగా ఈ సారి మరింత కఠినతరం చేసిన కేంద్రం పోటీ గడువును కుదించింది. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 31వ తేదీ వరకే పరిశీలిస్తామని పేర్కొంది. గతంలో నాలుగు వేల మార్కులకు ఈ పోటీ నిర్వహించగా.. ప్రస్తుతం 5వేల మార్కులకు నిర్వహించనుంది. డాక్యుమెంటేషన్ ఆధారంగా నిర్వహించే క్షేత్ర స్థాయి పరిశీలనల అంశంలో తప్పుడు సమాచారం ఇస్తే మైనస్ మార్కులు అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 100శాతం డాక్యుమంటేషన్ పక్కాగా ఉండేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్‌లో బాగంగా దేశ వ్యాప్తంగా పరిశుభ్రత అమలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛత పోటీలు నిర్వహించి తద్వారా పరిశుభ్రమైన నగరాలుగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన జీవన విధానాన్ని అందించటమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తోంది. మెరుగైన స్వచ్ఛతను అమలు చేస్తున్న నగరాలకు అవార్డులు, రివార్డులు ఇవ్వడంతో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4 నుంచి 31 తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పట్టణంలో పర్యటించి స్వచ్ఛతను పరిశీలించనున్నారు. విజయనగరంలో ఇంకా వెనుకబాటే... 2019 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు సమాయత్తం అవుతున్న విజయనగరం మున్సిపాలిటీ ఇంకా పలు అంశాల్లో వెనుకబడే ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తే స్వచ్ఛత సాధ్యపడటంతో పాటు మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశాలున్నాయి. ప్రధానంగా ఓడీఎఫ్, ప్లాస్టిక్ నిషేధం, పందులు, కుక్కల నియంత్రణ, తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించటం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 5వేల మార్కులకు నిర్వహించే పోటీలో సీనియర్ సిటిజన్స్ ఫీడ్‌బ్యాక్‌కు 1250 మార్కులు, క్షేత్ర స్థాయి తనిఖీలకు 1250 మార్కులు, డాక్యుమెంటేషన్‌కు 1250 మార్కులు, సర్టిఫికేషన్‌కు 1250 మార్కులు ఇవ్వనున్నారు. ఎక్కడికక్కడే చెత్త నగరంలో ఎక్కడ చూసినా ఇంకా చెత్త కనిపిస్తూనే ఉంది. మురుగునీటి కాలువలు ఇంకా పూర్తిస్థాయిలో శుభ్రం చేయాల్సి ఉంది. ఓ వైపు వాటిని శుభ్రం చేస్తున్నా... పెండింగ్‌లో ఉన్న విస్తరణ పనులవల్ల ఎక్కడా స్వచ్ఛత కానరావడం లేదు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి వస్తారన్న ఆత్రంలో ఏవో అరకొర పనులు చేపట్టినా... ఆ తరువాత వాటిపై పెద్దగా శ్రద్ధ చూపించకపోవడంతో ఎక్కడా స్వచ్ఛత ఆనవాళ్లు కానరావడం లేదు. ఇదే పరిస్థితి సర్వే సమయానికీ కనిపిస్తే ఇక ర్యాంకులో మరింత వెనుకబడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. మెరుగైన ర్యాంక్ సాధనకు ప్రణాళిక స్వచ్ఛ సర్వేక్షణ్–2019 సర్వేలో మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మున్సిపాలిటీ తరఫున చిన్న చిన్న లోపాలను అధిగమించేలా చర్యలు చేపడుతున్నాం. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీలో విజయనగరం పట్టణాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టేలా ప్రయత్నం చేస్తాం. – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ -
స్వచ్ఛ ర్యాంకింగ్‌లో గ్రేటర్‌కు 27వ స్థానం
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో హైదరాబాద్ 27వ ర్యాంక్‌లో నిలిచింది. లక్ష జనాభాపైబడిన నగరాల్లో గ్రేటర్‌కు ఈ ర్యాంకు ప్రకటించారు. గతేడాది జనాభాతో సంబంధం లేకుండా 434 నగరాల్లో హైదరాబాద్ 22వ స్థానంలో నిలవగా, ఈసారి లక్ష జనాభా మించిన 500 నగరాలతో పోటీపడి 27వ స్థానంలో నిలిచింది. గతం కంటే ఈసారి మరింత ఉన్నత ర్యాంక్‌ను సాధించేందుకు ఎంతో కృషి చేసి, దేశంలోనే ఘనవ్యర్థాల నిర్వహణలో ఉత్తమ రాజధానిగా అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్.. స్వచ్ఛ ర్యాంకింగ్ల్లో మాత్రం పడిపోయింది. అయితే ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, కోల్కత్తా, చెన్నై కంటే ముందంజలోనే ఉండడం గమనార్హం. గత సంవత్సరం 29వ స్థానంలో నిలిచిన గ్రేటర్ ముంబై ఈసారి 18వ స్థానంలో నిలిచి, హైదరాబాద్ కంటే ముందుంది. తెలంగాణలోని ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కంటే జీహెచ్ఎంసీ ముందంజలో నిలిచింది. గతంలో చిన్న పట్టణాలు, పెద్ద నగరాలు అన్నింటికీ కలిపి స్వచ్ఛ ర్యాంకులు ప్రకటించగా, ఈసారి లక్ష జనాభా మించిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ప్రకటించింది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో జీహెచ్ఎంసీ ముందున్నా.. ప్రజల ఫీడ్‌బ్యాక్‌లో మార్కులు తగ్గినందున ఓవరాల్ ర్యాంక్ తగ్గింది. దీంతో ఈ సంవత్సరం ప్రజలను మరింత ఎక్కువగా భాగస్వాములను చేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రజాస్పందన తగ్గినందునే.. ప్రస్తుత 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం మూడు విభాగాలకు కలిపి 4,000 మార్కులకు నిర్వహించిన సర్వేలో జీహెచ్ఎంసీకి 3,083 మార్కులు వచ్చాయి. వీటిలో సేవల ప్రగతికి 1400 మార్కులకు 973 లభించగా, స్వచ్ఛతకు నగరవాసుల స్పందనకు కేటాయించిన 1400 మార్కుల్లో 942 మాత్రమే వచ్చాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు స్వచ్ఛ కార్యక్రమాలపై నేరుగా జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1200 మార్కులకు 1177 వచ్చాయి. 2016లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి 2000 మార్కుల్లో 1355 (67.70శాతం), 2017లో 1605 (80శాతం) మార్కులు, ప్రస్తుత 2018లో 4000 మార్కులకు 3,083 మార్కులు (77శాతం) లభించాయి. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల ర్యాంకులు.. గ్రేటర్ హైదరాబాద్‌కు 27వ స్థానం అనంతరం వరంగల్ కార్పొరేషన్‌కు 31వ స్థానం, సూర్యాపేట మున్సిపాలిటీ 45వ స్థానం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 73 స్థానంలోను నిలిచాయి. ఇప్పటి దాకా జరిగిన స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొన్న పట్టణాలు, గ్రేటర్ ర్యాంకు ఇలా.. సంవత్సరం పట్టణాలు జీహెచ్ఎంసీ 2015 476 275 2016 73 19 2017 434 22 2018 500 27 ఈసారి మొత్తం 4041 నగరాలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో పాల్గొనగా, లక్ష జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ర్యాంకులు ఇచ్చారు. దేశంలోని వివిధ కార్పొరేషన్ల ర్యాంకుల తీరిదీ.. నగరం 2017 2018 హైదరాబాద్ 22 27 గ్రేటర్ ముంబై 29 18 బెంగళూర్ 210 216 చెన్నై 235 100 ప్రజల భాగస్వామ్యం పెంచుతాం స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి మార్కులే వచ్చినప్పటికీ, కేవలం ప్రజా స్పందన మార్కులే తగ్గాయి. ఈ అనుభవంతో ఈ ఏడాది వారి భాగస్వామ్యం పెంచుతాం. గతేడాది ఐదు లక్షల మంది విద్యార్థులతో చైతన్య కార్యక్రమాలు నిర్వహించగా, ఈసారి పది లక్షల మందికి అవగాహన కల్పిస్తాం. అలాగే నగరంలోని నాలుగున్నర లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా భాగస్వాములను చేస్తాం. ఈ సంవత్సరం స్వచ్ఛ కార్యక్రమాలను జూన్ 5న పర్యావరణ దినోత్సవంనాడే ప్రారంభించాం. ఇందులో భాగంగా కాలనీలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు కూడా స్వచ్ఛ ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
ఇండోర్ ‘స్వచ్ఛత’ వెనుక తెలంగాణ బిడ్డ!
కలెక్టర్ నరహరి కృషితో నగరానికి దేశవ్యాప్త గుర్తింపు - సరికొత్త ఆలోచనలు.. వినూత్న విధానాలు.. - బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు బాలలతో ‘వానరసేన’ - బాలీవుడ్ సింగర్‌తో పాటలు పాడించి ప్రజల్లో అవగాహన - ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ సాక్షి, కరీంనగర్: ఇండోర్.. దేశంలోనే క్లీన్‌సిటీ! స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఫస్ట్ ర్యాంకు. పరిశుభ్రమైన రోడ్లు. మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన ఇండోర్ ఇంతలా మెరవడం వెనుక, దేశం దృష్టిని ఆకర్షించడం వెనుక ఉన్నది ఎవరో తెలుసా..? మన తెలంగాణ బిడ్డ! పేదింట్లో జన్మించి.. కష్టాల కడలి ఈది.. కలెక్టర్‌గా ఎదిగిన పరికిపండ్ల నరహరి. ప్రస్తుతం ఇండోర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఈయన తన వినూత్న ఆలోచనలతో ఇండోర్‌ను దేశంలోనే ‘స్వచ్ఛ’నగరంగా నిలిపారు. ఆయన సాధించిన విజయాలు, అందుకు పడ్డ శ్రమ ఆయన మాటల్లోనే.. చిన్నపిల్లలతో వానర సేన.. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ఆఫీసులో కూర్చుంటే వచ్చేది కాదు. గ్రామాల్లో చెరువు గట్టు, కాల్వలు, పొలాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించేందుకు శ్రమించాం. చిన్న పిల్లలతో వానరసేన ఏర్పాటు చేశాం. బయటకు చెంబు పట్టుకొని వెళ్లే వారిని పిల్లలే అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాల నిచ్చాయి. గ్రామాల్లో 100 శాతం ఓడీఎఫ్(బహిరంగ మల విసర్జన రహితప్రాంతం) పూర్తయ్యాక, జిల్లాలోని 8 మున్సిపాలిటీలపై దృష్టి పెట్టి అక్కడా సక్సెస్ అయ్యాం. దేశంలోనే ఓడీఎఫ్ ప్రకటించుకున్న రెండో జిల్లాగా గుర్తింపు తెచ్చుకున్నాం. చెత్తకు డోర్ టు డోర్.. స్వచ్ఛ భారత్‌లో భాగంగా 500 నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ృ2017లో మొద టి ర్యాంకు రావడానికి 100 శాతం ఓడీఎఫ్‌తో పాటు చెత్త సేకరణ, తరలింపు ఉపకరిం చింది. వీధుల్లో డస్ట్బిన్లు ఉంటే అందులో కంటే చుట్టుపక్కల ఉండే చెత్తే ఎక్కువ. దీంతో పూర్తిగా డస్ట్బిన్లను తొలగించాం. డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాం. ఇది సత్ఫలితాలినిచ్చింది. స్వచ్ఛతపై ఓ పాట రాయించి బాలీవుడ్ సింగర్ షాన్‌తో పాడించాం. జనం కట్టుకున్న టాయిలెట్లే ఎక్కువ ఓడీఎఫ్ కోసం ప్రభుత్వం 10 నుంచి 12 శాతం మాత్రమే టాయిలెట్లు కట్టిస్తే, ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకున్నవే 90 శాతం ఉన్నాయి. ఒక ఉద్యమంలా టాయిలెట్ల నిర్మాణం జరిగింది. నిరుపేదల ఇళ్లలో జన్మించే ఆడపిల్లల సంరక్షణ కోసం శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నేను ప్రవేశపెట్టిన లాడ్లీ లక్ష్మి యోజన సక్సెస్ అయింది. ఈ పథకాన్ని వివిధ పేర్లతో 12 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ‘బంగారు తల్లి’ పేరిట ప్రవేశపెట్టారు. నేను ప్రవేశపెట్టిన ప్రతి స్కీం జాతీయస్థాయిలో గుర్తింపు పొందడం సంతృప్తినిచ్చింది. నరహరి నేపథ్యమిదీ.. నరహరి తల్లిదండ్రులు పరికిపండ్ల సత్యనారాయణ, సరోజన. వీరి స్వగ్రామం వరంగల్ జిల్లా చింతగట్టు. 1966లో అక్కడి నుంచి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌కు వలస వచ్చారు. వీరికి ఆరుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. మూడో కుమారుడు నరహరి. సత్యనారాయణ దర్జీ పనితో కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను కష్టపడి చదివించారు. బసంత్‌నగర్‌లోని ఇండియా మిషన్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన నరహరి.. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. 2001లో సివిల్స్‌లో 78వ ర్యాంక్ సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్‌కు ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య భగవద్గీత మధ్యప్రదేశ్‌లోనే సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.