రాజ్యసభలో బిల్లు అడ్డుకుంటే వేటు తప్పదా?
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఆ బిల్లును నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా బిల్లు ఆమోదానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యులతోపాటు ప్రతిపక్షంలోని తృణమూల్, ఎస్పీ... తదితర పార్టీల సభ్యలు అడ్డు తగిలే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. రాజ్యసభకు వచ్చిన బిల్లు ఆమోదం పొందే క్రమంలో సభ్యులు ఎవరైన అడ్డంకులు సృష్టిస్తే మాత్రం వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని భావిస్తుంది. లోక్సభలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందేలా కాంగ్రెస్ పావులు కదుపుతుంది.